Hyderabad Vijayawada Toll Price Cut: NH-95 హైవేపై టోల్ ఫీజు తగ్గింపు – యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ ఫీజు పెంపు!

Hyderabad Vijayawada Toll Price Cut: హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రయాణించే వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. NH-65 జాతీయ రహదారిపై టోల్ రుసుము తగ్గించడం వల్ల ప్రయాణ ఖర్చు కొంతవరకు తగ్గనుంది. ముఖ్యంగా తరచుగా ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరంగా మారనుంది.

ఈ నిర్ణయం ఏప్రిల్ 1న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో కొన్ని వాహనాల కేటగిరీలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. అన్ని వాహనాలకు కాకుండా ఎంపిక చేసిన వర్గాలకు మాత్రమే ఈ ప్రయోజనం కల్పించడం గమనార్హం.

టోల్ రుసుము తగ్గింపు నిర్ణయం రవాణా రంగంపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కమర్షియల్ వాహనాలకు ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. సరుకు రవాణా ఖర్చులు తగ్గే అవకాశముంది.

ఏ వాహనాలకు టోల్ తగ్గింపు(Hyderabad Vijayawada Toll Price Cut)?

ఈ టోల్ తగ్గింపు ప్రధానంగా త్రీ యాక్సిల్ కమర్షియల్ వాహనాలు, కార్లు, జీపులు, వ్యాన్‌లకు వర్తిస్తుంది. రోజువారీగా ఈ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అన్ని వాహనాలకు ఈ తగ్గింపు వర్తించదు. కొన్ని కేటగిరీలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఇతర వాహనదారులకు మార్పు ఉండదు.

ఏ టోల్ ప్లాజాల్లో అమలు?

ఈ నిర్ణయం పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో అమలులోకి వచ్చింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో ఇవి ముఖ్యమైన టోల్ పాయింట్లు కావడం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులకు ఈ ప్రయోజనం అందనుంది.

ఈ మార్గం రెండు ప్రధాన నగరాలను కలుపుతుండటంతో రవాణా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల టోల్ తగ్గింపు నిర్ణయం ప్రయాణికులకు కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది.

వాహనదారులకు ఎంత లాభం?

టోల్ రుసుము రూ.5 చొప్పున తగ్గించినప్పటికీ, తరచుగా ప్రయాణించే వారికి ఇది గణనీయమైన ఆదా అవుతుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు, కమర్షియల్ డ్రైవర్లు దీన్ని లాభంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ నిర్ణయం భవిష్యత్తులో మరిన్ని మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడం వల్ల పరోక్షంగా వినియోగదారులకు కూడా లాభం కలగవచ్చు.

పెరిగిన యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ పాస్ ఫీజు

ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ పాస్ ఫీజును పెంచుతున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెల్లడించింది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఫీజును రూ.75 పెంచింది. దీంతో ఇప్పుడు యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ పాస్ కోసం రూ.3075 చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇది వినియోగదారులపై కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది.

యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ పాస్ అనేది ఎక్కువగా హైవేల మీద ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి సారి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. వాహనదారులు టోల్ గేట్ ద్వారా ముందుకు సాగవచ్చు. ప్రారంభంలో ఈ పాస్ కోసం రూ.3000 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు దీనికోసం మరో 75 రూపాయలు అదనంగా చెల్లించాలన్నమాట.