Dhurandhar 2 Script Was Copied: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘ధురంధర్ 2’.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్‌గా నిలుస్తోంది. మొదటి భాగం లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను ఈ సీక్వెల్ ఇప్పటికే దాటేసి, త్వరలోనే రూ.1500 కోట్ల క్లబ్లో చేరబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రణ్వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ మేకింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇలా అంతా కలిపి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిపాయి.
తెరపైకి కాపీరైట్ సమస్య
పెద్ద సినిమాలపై కథ కాపీ ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో తరచూ చర్చకు దారి తీస్తుంది. ముఖ్యంగా ముంబై వంటి ప్రధాన సినీ కేంద్రంలో ఇలాంటి వివాదాలు నిర్మాతలు, దర్శకులు, రచయితల మధ్య నమ్మకంపై ప్రభావం చూపుతాయి. ఈ కేసు చట్టపరంగా ముందుకు వెళ్తే, భవిష్యత్తులో కథ రిజిస్ట్రేషన్, కాపీరైట్ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
“కథ నాదే” – సంతోష్ కుమార్ ఆరోపణలు
కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్ మీడియాతో మాట్లాడుతూ ‘ధురంధర్ 2’ కథ పూర్తిగా తనదేనని పేర్కొన్నారు. “2023లో ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. సినిమా చూసిన తర్వాత నా కథను కాపీ చేసినట్లు స్పష్టంగా అర్థమైంది” అని ఆయన చెప్పారు. సంతోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
2023లోనే రిజిస్ట్రేషన్ – సాక్ష్యాలు ఉన్నాయని క్లెయిమ్
సంతోష్ కుమార్ ప్రకారం.. ఈ కథను 2023 నవంబర్‌లో అధికారికంగా రిజిస్టర్ చేయించారని తెలిపారు. జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలకు కథను పంపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా హీరోగా ఆదిత్య రాయ్ కపూర్‌ను తీసుకుని సినిమా చేయాలని అప్పట్లో ప్లాన్ చేశానని కూడా చెప్పారు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా మూవీ యూనిట్‌పై కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు సంతోష్ .
నా కథను చెడగొట్టారు
“నేను కేవలం వినోదం కోసం మాత్రమే రాసుకున్న ఈ కథను.. వారు పూర్తిగా రాజకీయంగా మార్చేశారు. అదే నాకు చాలా ఎక్కువ బాధ కలిగిస్తోంది” అని సంతోష్ కుమార్ అన్నారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని, రచయితలకు సరైన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.
ధురంధర్ 2 సక్సెస్ మధ్య వివాదం
ఇక మరోవైపు ‘ధురంధర్ 2’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. భారీ వసూళ్లతో పాన్ ఇండియా మార్కెట్‌ను దుమ్మురేపుతోంది. ఈ వివాదం మధ్య కూడా సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడుతుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ముంబైలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
స్పందించని సినిమా యూనిట్!
ఈ ఆరోపణలపై మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో కీలకం. ఒకవేళ చట్టపరమైన పోరాటం ప్రారంభమైతే, ఈ వివాదం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీలో కాపీరైట్, కథ రక్షణ వంటి అంశాలు మరోసారి ముందుకు రావడం ఖాయం.
Also Read: పెద్ది సినిమా రిలీజ్ వాయిదాపై.. రామ్ చరణ్ క్లారిటీ!
శౌర్య వర్ధన్ – నేను సబ్ ఎడిటర్‌గా MarthaTelugu వెబ్సైట్లో పనిచేస్తున్నాను. సినిమాకు సంబంధించిన వార్తలు రాయడం నా ప్రత్యేకత. టాలీవుడ్, బాలీవుడ్ మొదలైన రంగాల వార్తలు, రివ్యూలు విశ్లేషించి రాయగలను. చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.
