సుకన్య సమృద్ధి డబ్బు మధ్యలో తీసుకోవచ్చా: రూల్స్ ఇవే!

Sukanya Samruddhi Yojana Withdrawal Rules: ‘సుకన్య సమృద్ధి యోజన’ (Sukanya Samruddhi Yojana) భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం, ఇది అమ్మాయిల జీవితంలో ఆర్థిక భద్రతను కల్పించడానికి రూపొందించబడింది. ఈ పథకం ద్వారా.. జన్మించిన ప్రతి ఆడపిల్లకూ బ్యాంకు ఖాతా ప్రారంభించి, డబ్బు పొదుపు చేసుకోవడానికి చేయడానికి మంచి మార్గం అందించవచ్చు. అయితే.. ఈ ఖాతాలో డబ్బులను పూర్తిగా తీసుకోవడం కొంత కాలం తర్వాత మాత్రమే సాధ్యం.

విత్‌డ్రా గురించి

ప్రస్తుతం.. సుకన్య సమృద్ధి ఖాతా నుంచి పూర్తి డబ్బులు 21 సంవత్సరాల తర్వాత మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. కానీ కొన్నిసార్లు, 18 సంవత్సరాలు పూర్తి చేసిన లేదా 10వ తరగతి పాస్ అయిన అమ్మాయి, ఖాతాలోని మొత్తంలో 50% డబ్బులను ఉపసంహరించుకోవచ్చు.

డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?

18 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు లేదా 10వ తరగతి పాస్ అయినప్పుడు, అప్పటివరకు సేవ్ చేసిన డబ్బులో 50% వరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు.ఈ డబ్బును చదువు లేదా పెళ్లి కోసం మాత్రమే వినియోగించుకోవాలి.

విత్‌డ్రా చేసుకునే విధానం

విత్‌డ్రా అనేది ఒక ప్రత్యేక విధానం ద్వారా జరుగుతుంది. అమ్మాయి అవసరాన్ని బట్టి, తన బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌ను సంప్రదించి, విత్‌డ్రా డాక్యుమెంట్లను తీసుకోవాలి.

అన్ని ఖాతాలకు ఈ నియమాలు వర్తిస్తుందా?

‘సుకన్య సమృద్ధి’ పథకం, పోస్ట్ ఆఫీసు.. కొన్ని బ్యాంకులలో అందుబాటులో ఉంది. ఈ ఖాతా.. సాధారణంగా 21 సంవత్సరాల తరువాత, పిల్లలు తమ సంపూర్ణ నిల్వలను తీసుకునే హక్కు పొందుతారు. కానీ.. విద్య, పెళ్లి వంటి ముఖ్యమైన అవసరాల కోసం ముందే 50% డబ్బులను ఉపసంహరించుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన గురించి

సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది బాలికల భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక చిన్న పొదుపు పథకం. ఈ పథకం ప్రధానంగా అమ్మాయిల విద్య మరియు వివాహ ఖర్చుల కోసం దీర్ఘకాలిక సేవింగ్స్‌ను ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ బాలిక పేరుతో ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టబడింది.

ఈ ఖాతాను 10 సంవత్సరాల లోపు వయస్సు గల బాలికల కోసం తెరవవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా రెండు బాలికల కోసం ఖాతాలు అనుమతించబడతాయి (ప్రత్యేక పరిస్థితుల్లో మూడవది కూడా అనుమతించవచ్చు, ఉదాహరణకు జంటలు). కనీసంగా సంవత్సరానికి ₹250 జమ చేయాలి, గరిష్టంగా ₹1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ రేటు ఉంటుంది, ఇది సాధారణంగా ఇతర సేవింగ్స్ పథకాల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఈ పథకం యొక్క ముఖ్యమైన ప్రయోజనం పన్ను రాయితీలు. పెట్టుబడిపై, వడ్డీపై మరియు మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది (EEE ప్రయోజనం). ఖాతా 21 సంవత్సరాల తరువాత లేదా బాలిక 18 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగితే ముందుగానే మూసుకోవచ్చు. అలాగే, బాలిక 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ఉన్నత విద్య కోసం ఖాతా నుండి కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చు.

Also Read: