ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నివాసం వద్ద కొత్త లగ్జరీ కారు కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఈ 53 (Mercedes-AMG CLE 53) అనే కొత్త మోడల్ బ్లాక్ కలర్ లగ్జరీ కారు క్యారియర్ ట్రక్కులో తీసుకువచ్చి ఇంటి ముందు దింపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది.
లగ్జరీ ప్రీమియం కారును ట్రక్కు నుంచి జాగ్రత్తగా దిగుతున్న సమయంలో అక్కడికి చాలామంది అభిమానులు చేరుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో Mercedes-AMG CLE 53 కారు గురించి అభిమానుల ఆరా తీస్తున్నారు.
ఈ కారు ఎవరిదన్నది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా, చాలా మంది అభిమానులు మాత్రం ఇది అల్లు కుటుంబంలో ఇటీవల జరిగిన పెళ్లికి సంబంధించిన ప్రత్యేక గిఫ్ట్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
అల్లు అర్జున్ ఇంటి వద్ద కనిపించిన లగ్జరీ కారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో Mercedes-AMG CLE 53 బ్లాక్ కలర్ లగ్జరీ కారు క్యారియర్ ట్రక్కులో హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు కనిపిస్తుంది. ట్రక్కు నుంచి కారును చాలా జాగ్రత్తగా కిందికి దించుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కొత్త కారుకు సంబంధించిన ఈ ఘటన జరిగిన ప్రదేశం Hyderabadలోని అల్లు అర్జున్ నివాసం వద్దనే అని అభిమానులు చెబుతున్నారు. కారు అక్కడికి వచ్చిన వెంటనే చాలా మంది అభిమానులు, ఆసక్తిగా చూసేందుకు చేరుకున్నారు. కొందరు అభిమానులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ వీడియోలు కేవలం కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. ప్రత్యేకంగా Allu Arjun Mercedes-AMG CLE 53 కారు గురించి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
అల్లు సిరిష్కు పెళ్లి గిఫ్ట్ అనే ఊహాగానాలు
నటుడు అల్లు శిరీష్ & నయనిక పెళ్లికి ఈ గిఫ్ట్ ఇచ్చి ఉంటారని.. అభిమానుల మధ్య మరో ఆసక్తికర విషయం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు Mercedes-AMG CLE 53 కారు అల్లు సిరిష్కు పెళ్లి సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ అయి ఉండొచ్చని ఊహిస్తున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన విషయాలను గురించి అల్లు కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఈ కారు ఎవరిది అనే క్లారిటీ లేదు.
ఒకే రోజు రెండు ముఖ్యమైన వేడుకలు
ఇటీవల అల్లు కుటుంబంలో రెండు ముఖ్యమైన వేడుకలు ఒకే రోజున జరగడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. మార్చి 6 తేదీ అల్లు కుటుంబానికి ఎప్పటి నుంచో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అల్లు అర్జున్ & స్నేహ రెడ్డిల 15వ పెళ్లి రోజు. అదే రోజు అల్లు శిరీష్ & నయనిక పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి తేదీని నిర్ణయించే సమయంలో జ్యోతిష్యం, వేయిక మొదలైనవన్నీ చూసే నిర్ణయించినట్లు సమాచారం.
View this post on Instagram
సెలబ్రిటీలతో అల్లు కుటుంబ వేడుకలు
అల్లు సిరిష్ వివాహ వేడుకలు హైదరాబాద్‌లో మార్చి 6న ఘనంగా జరిగాయి. ముఖ్యంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు Allu Studiosలో నిర్వహించబడినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో Ram Charan, Nani, Rana Daggubati, Ravi Teja, Akkineni Nagarjuna వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఇక అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా Allu Arjun సోషల్ మీడియాలో తన భార్యతో కలిసి తీసుకున్న ఫోటోలను పంచుకున్నారు. “Happy Anniversary, Cutie. 15 years of togetherness” అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది.
Also Read: పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చు?: క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.