ఏడు మంది ప్రయాణికులు హాయిగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే 7 సీటర్ కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం విఫణిలో చాలా 7 సీటర్ కార్లు ఉన్నాయి. అయితే చాలామంది వాహన ప్రేమికులు కోరుకునేది మాత్రం కొంత తక్కువ ధర వద్ద అందుబాటులో ఉండే కార్లను. కాబట్టి ఈ కథనంలో బెస్ట్ సెవెన్ సీటర్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.
నిస్సాన్ గ్రావైట్
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన 7 సీటర్ కార్ల జాబితాలో నిస్సాన్ గ్రావైట్ ఒకటి. దీని ధరలు రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.94 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. చూడటానికి కొంత ట్రైబర్ మాదిరిగా ఉండే ఈ కారు సీఎంఎఫ్ ఏప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రెనాల్ట్ ట్రైబర్
ట్రైబర్ ఎంపీవీ కూడా బెస్ట్ 7 సీటర్ కారు. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.6 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో కూడా మూడు వరుసల సీట్లు ఉంటాయి. సీట్లు స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్. ఇందులోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 72 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. అత్యుత్తమ డిజైన్ కలిగిన ఈ కారు, అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది.
మహీంద్రా బొలెరో
దేశీయ వాహన తయారీ సంస్థ కూడా మన దేశంలో సరసమైన 7 సీటర్ కారును విక్రయిస్తోంది. దాని పేరు మహీంద్రా బొలెరో. దీని ప్రారంభ ధర 7.99 లక్షల రూపాయలు. లెదర్ అపోల్స్ట్రే, రీఫ్రెష్డ్ క్యాబిన్, వెంటిలేషన్ కోసం మెష్ సీటు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ పరిమాణం 17.8 సెం.మీ.
మహీంద్రా బొలెరో నియో
మరో 7 సీటర్ మహీంద్రా కారు బొలెరో నియో. దీని ధరలు రూ.8.69 లక్షల నుంచి రూ.10.94 లక్షల మధ్య ఉన్నాయి. మంచి సీటింగ్ పొజిషన్ కలిగిన ఈ కారు డిజైన్ బాగుంటుంది. ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు కావలసినన్ని ఉంటాయి. కుషనింగ్ కూడా దృఢంగా ఉంది. అయితే లోపల స్థలం కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది కొంత పెద్ద కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మారుతి సుజుకి ఎర్టిగా
రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల మధ్య ధర వద్ద లభించే మారుతి సుజుకి ఎర్టిగా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ, సరసమైన బైక్. నిజానికి 7 సీటర్ విభాగంలో ప్రత్యర్థులకు ఈ కారు గట్టి పోటీ కూడా ఇస్తోంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 103 పీఎస్ పవర్, 139 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు అద్భుతంగా ఉంటుంది.
పైన చెప్పుకున్న కార్లు మాత్రమే కాకుండా కియా కారెన్స్, మహీంద్రా స్కార్పియో ఎన్, టయోటా రూమియన్, టాటా సఫారీ, హ్యుందాయ్ ఆల్కజార్, బీవైడీ ఈమ్యాక్స్ 7, టయోటా ఫార్ట్యూనర్, ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఇన్నోవా హైక్రాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కూడా ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిఫెండర్, బీఎండబ్ల్యు ఎక్స్7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్, లెక్సస్ ఎల్ఎమ్ వంటివి ప్రీమియం 7 సీటర్ కార్ల విభాగంలో ఉన్నాయి.
శౌర్య వర్ధన్ – నేను సబ్ ఎడిటర్‌గా MarthaTelugu వెబ్సైట్లో పనిచేస్తున్నాను. సినిమాకు సంబంధించిన వార్తలు రాయడం నా ప్రత్యేకత. టాలీవుడ్, బాలీవుడ్ మొదలైన రంగాల వార్తలు, రివ్యూలు విశ్లేషించి రాయగలను. చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.
