ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త హెలికాప్టర్‌కు మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది పాత హెలికాప్టర్ కంటే కూడా ఎక్కువ సేఫ్టీగా ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి ఇదివరకు.. బెల్ హెలికాప్టర్ వాడేవారు. ఈ హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండకపోవడం వల్ల, సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లాలంటే.. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేవారు. ఆ తరువాత గమ్యాన్ని చేరుకున్న తరువాత.. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త హెలికాప్టర్ వినియోగిస్తుండటంతో.. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఇంటి దగ్గర నుంచే చేరుకోవాల్సిన ప్రాంతానికి వెళ్తున్నారు. దీని వల్ల సమయం కూడా చాలా ఆదా అవుతోంది.
సీఎం వినియోగానికి ఉపయోగిస్తున్న హెలికాప్టర్ ‘ఎయిర్‌బస్ హెచ్ 160‘ మోడల్. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ హెలికాప్టర్లో పైలెట్ కాకుండా.. మరో ఆరుమంది వెళ్ళవచ్చు. ఈ హెలికాప్టర్‌నే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ప్రత్యేక ఫీచర్స్.. సేఫ్టీ అని చెబుతున్నారు. అయితే.. ఏపీ సీఎం కొత్త హెలికాఫ్టర్ వినియోగిస్తున్నారు అనే మాట.. వాస్తవమా?, అవాస్తవమా?, అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్
నిజానికి ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్ ధర రూ. 150 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తుంది. ప్రపంచంలోనే.. టెక్నాలజీ పరంగా ఎక్కువ అభివృద్ధి చెందిన మోడల్ ఇదే అని చెబుతారు. ఈ విభాగంలో మంచి సౌకర్యాన్ని అందించడమే కాకుండా.. ఎక్కువ సేఫ్టీ కూడా అందిస్తుంది. ఇది 800 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని సమాచారం. ఈ హెలికాప్టర్ గంటకు 255 కిమీ వేగంతో వెళ్తుంది. ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ హెలికాప్టర్ ఖర్చు 15 శాతం తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్ మంచి వీఐపీ సీటింగ్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా.. వెనుక భాగంలో ట్విన్ స్టెబిలైజర్ డిజైన్ పొందుతుంది. దీనిని బైప్లేన్ స్టెబిలైజర్ అని కూడా పిలుస్తారు. 68 పేటెంట్ టెక్నాలజీలను కలిగి ఉన్న ఈ హెలికాప్టర్.. ఎలక్ట్రిక్ ల్యాండింగ్ గేర్ కూడా పొందుతుంది. దీనిని సొంత వినియోగానికి మాత్రమే కాకుండా, అత్యవసర వైద్య సేవల సమయంలో, రెస్క్యూ వంటి సమయంలో కూడా ఉపయోగిస్తారు.
లేటెస్ట్ టెక్నాలజీ హెలికాప్టర్
హెచ్160 అనేది.. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన పౌర హెలికాప్టర్. ఇది అత్యున్నత స్థాయి కార్యచరణ అందించడంతో పాటు.. భద్రతను కూడా అందిస్తుంది. సాధారణంగా ఇలాంటి హెలికాప్టర్లను బిలియనీర్లు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ మోడల్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన మొదటి ఫ్యామిలీ.. అంబానీ కుటుంబమే. కంపెనీ ఈ హెలికాప్టర్ల డెలివరీలను 2025లో ప్రారంభించారు.
భారతదేశంలో రాజకీయ నాయకులు.. తమ పాలనలో హెలికాప్టర్లను ఉపయోగించడం సర్వ సాధారణం. పనులను వేగవంతం చేయడానికి, గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడానికి హెలికాప్టర్లు ఉపయోగిస్తారు. తమ కాన్వాయ్‌లో కూడా హైఎండ్ కార్లను ఉపయోగిస్తారు. వీటన్నిటిలో కూడా పటిష్టమైన భద్రత ఉంటుంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.