ఇండియన్ మార్కెట్లో రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకులు ఉన్నాయి. రూ. కోటి రూపాయల ధర వద్ద లభించే బైకులు ఉన్నాయి. అయితే కొంతమంది.. ఎక్కువ పర్ఫామెన్స్ ఇచ్చే రూ. రెండు లక్షల ధర వద్ద లభించే 5 బెస్ట్ బైకులు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్
ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే బైకుల జాబితాలో బజాజ్ చెప్పుకోదగ్గ బ్రాండ్. ఇందులో ‘పల్సర్ ఎన్ఎస్400జెడ్’ ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.92 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇది 373 సీసీ ఇంజిన్ ద్వారా.. 43 హార్స్ పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి పనితీరును అందించే.. సరసమైన బైకులలో ఎన్ఎస్400జెడ్ ఒకటి కావడం గమనార్హం. ఇది మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది 33 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.
హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్
రూ. రెండు లక్షల ధర వద్ద లభించే బైకులలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ఒకటి. దీని ధర రూ. 1.76 లక్షలు. ఈ బైక్ 250 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 30 హార్స్ పవర్.. 25 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 3.25 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే.. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది.
ట్రయంఫ్ స్పీడ్ టీ4
రూ. 1.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 31 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అద్భుతమైన లైటింగ్ సెటప్, బ్రేకింగ్, సస్పెన్షన్ వంటివన్నీ ఈ బైకులో ఉన్నాయి. ఇది 30 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ బైక్.. రోజువారీ వినియోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200
రూ. 1.22 లక్షల ధర వద్ద లభించే బజాజ్ ఆటోకు చెందిన పల్సర్ ఎన్ఎస్200 బైక్ ఎక్కువమంది యువకులకు ఇష్టమైన బైక్. ధర తక్కువ మాత్రమే కాకుండా.. ఇది మంచి డిజైన్, రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుంది. ఇందులో 199.5 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 24.5 హార్స్ పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 10.98 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సిలరేషన్) అవుతుంది. 36 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు.
అపాచీ ఆర్టీఆర్ 200 4వీ
టీవీఎస్ కంపెనీ చెందిన అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 197.75 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.8 హార్స్ పవర్, 17.25 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెయిన్, అర్బన్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్ 37 మిమీ యూఎస్డీ ఫోర్క్, హైడ్రోఫార్మ్డ్ హ్యాండిల్ బార్ వంటివి పొందుతుంది. మొత్తం మీద ఇది సరసరమైన బైక్ మాత్రమే కాదు.. రైడింగ్ చేయడానికి అత్యుత్తమమైన బైక్ కూడా.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.