Thursday, January 15, 2026

కోరుకున్నవాటిపై కొండంత డిస్కౌంట్స్!.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మెగా ఫెస్టివల్ సేల్

వినాయక చవితి ముగిసింది. దసరా (విజయదశమి) వచ్చేస్తోంది. ఆ వెంటనే దీపావళి కూడా రానుంది. ఈ పండుగ సీజన్ సమయంలో.. ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా?, నచ్చినవాటిని కొంత తక్కువ ధరలు ఎప్పుడు కొనేద్దామా అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసం.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు శుభవార్త చెప్పాయి.

ఫ్లిప్‌కార్ట్

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్.. పండుగ సీజన్ సమయంలో ‘బిగ్ బిలియన్ డేస్ 2025‘ ప్రకటించింది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన తేదీలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఫ్లిప్‌కార్ట్ హోమ్‌పేజీలో మాత్రం త్వరలో వస్తుందని కనిపించింది. పండుగ సమయంలో ఎంపిక చేసిన చాలా వస్తువుల మీద కంపెనీ భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తుంది. చాలామంది ప్రజలు కూడా ఈ ఆఫర్స్ కోసం ప్రతి ఏటా వేచి చూడటం ఆనవాయితీగా వస్తోంది.

అమెజాన్

ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025‘ పేరుతో డిస్కౌంట్స్ అందించడానికి సిద్ధమైంది. ఇది కూడా తేదీలను అధికారికంగా వెల్లడించలేదు. ఆఫర్స్ ప్రకటించడానికి 24 గంటల ముందు ప్రైమ్ సభ్యులకు యాక్సెస్ లభిస్తుంది. వీరు సాధారణ కస్టమర్ల కంటే ముందుగానే.. షాపింగ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఫ్లిప్‌కార్ట్ కూడా అందిస్తుంది.

వీటిపై భారీ తగ్గింపులు

ఈ కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్ సమయంలో అందించే ఆఫర్స్ ద్వారా.. ఎలక్ట్రానిక్స్.. ముక్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిమీద గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గూగుల్ పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 వంటివాటితో పాటు.. ఐఫోన్ 16 ధరలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఏడాది అతిపెద్ద షాపింగ్ ఈవెంట్ రానుంది. అద్భుతమైన ఆఫర్స్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మిస్ చేసుకోకండి.. ఉత్సాహంతో మీ షాపింగ్ అనుభూతిని పెంచుకోండి అని ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక వెబ్‌సైట్ పేజీలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. సంస్థ మంచి ఆఫర్స్ అందించనున్నట్లు చెప్పకనే చెబుతోందని అర్థమవుతోంది.

ఇదే వరుసలో అమెజాన్ కూడా చేరింది. ఈ సంవత్సరం కస్టమర్లు.. తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపరణాల మీద గొప్ప డీల్స్ పొందవచ్చు. వేగవంతమైన డెలివరీలను పొందటమే కాకుండా.. విలువ ఆధారిత చెల్లింపులు కూడా చేసుకోవచ్చు అని ఒక బ్లాగ్ కంపెనీ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది.

ఈ కామర్స్ కంపెనీల సీజనల్ జాబ్స్

పండుగ సమయంలో.. తమ కస్టమర్లకు చేరువలో ఉండటానికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ కూడా లక్షలాది సీజన్ ఉద్యోగుల కోసం మెగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నగరాల్లో వేగవంతమైన డెలివరీలు చేయడానికి ఈ రెండు కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. దీపావళి తరువాత కూడా సంక్రాంతి వస్తోంది. ఆ సమయంలో కూడా ఉద్యోగుల అవసరం ఉంటుంది. కాబట్టి జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇదో మంచి సదావకాశం. ఇది కొన్ని రోజులు తాత్కాలిక ఉద్యోగాన్ని అందిస్తుంది.

Himansh
Himansh
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here