Maruti Jimny Rs.2.30 Lakh Discount in This Festive Season: పండుగ సీజన్‌లో ఓ మంచి ఆఫ్-రోడర్ కొనుగోలు చేయాలనుకునే వారికి పెద్ద శుభవార్త. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ‘మారుతి సుజుకి జిమ్నీ’ (Maruti Suzuki Jimny) కొనుగోలుపై ఏకంగా రూ. 2.30 లక్షల ఆఫర్ అందుబాటులో ఉంది. దీపావళికి ఈ కారు కొనాలని చూసేవారు ఇక త్వరపడే సమయం ఆసన్నమైంది.
భారతీయ విఫణిలో మారుతి జిమ్నీ ఆల్పా మరియు జీటా అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. చూడటానికి థార్ కంటే కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే మారుతి జిమ్నీ ప్రారంభంలో మంచి అమ్మకాలను పొందగలిగింది.
ఆఫర్ వివరాలు
దీపావళి పండుగ సీజన్‌లో మారుతి జిమ్నీ జీటా, ఆల్పా ట్రిమ్‌ల మీద రూ. 80000 తగ్గింపు లభిస్తుంది. అంతే కాకుండా జీటాపై రూ. 95000, ఆల్పా ట్రిమ్ మీద రూ. 1.50 లక్షల స్పెషల్ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ బహుశా అక్టోబర్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
మారుతి సుజుకి జిమ్నీ కారులో కే15బీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 105 పీఎస్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది. ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ ఆధారంగా నిర్మితమైన ఈ ఆఫ్ రోడర్ అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
జిమ్నీ డిజైన్ & ఫీచర్స్
మారుతి జిమ్నీ సింపుల్ డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జసబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్, ఆటోమేటెడ్ హెడ్‌ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్ వంటి వాటితో పాటు హార్డ్ టాప్, డ్రిప్ రైల్స్, క్లామ్‌షెల్ బానెట్ మరియు టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటివి ఉన్నాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. మారుతి జిమ్నీ హెచ్‌డీ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆర్కమిస్ సరౌండ్ సౌండ్ సిస్టం, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది.
సేఫ్టీ ఫీచర్స్
డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. మారుతి జిమ్నీ అత్యాధునిక మరియు వాహన వినియోగదారులకు ఎంతగానో అవసరమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ లిమిటెడ్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటివెన్నో ఉన్నాయి.
నిజానికి భారతదేశంలో మారుతి జిమ్నీ గొప్ప అంచనాల మధ్య లాంచ్ అయింది. అయితే ప్రారంభంలో కొంత ఆశాజనక అమ్మకాలను నమోదు చేసినప్పటికీ.. ప్రస్తుతం దీని అమ్మకాలు అంత గొప్పగా లేకపోవడం గమనార్హం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జిమ్నీ పరిమాణంలో థార్ కంటే చిన్నదిగా ఉండటమే కాకుండా.. ధర కూడా థార్ కంటే ఎక్కువే. పనితీరు మంచిగానే ఉన్నప్పటికీ.. థార్ దీని కంటే ఉత్తమ పనితీరును అందిస్తుందని ధృవీకరించబడింది.
జిమ్నీలో అందరికీ ఇష్టమైనది కలర్ ఆప్షన్స్ అనే చెప్పాలి. కంపెనీ దీనిని మల్టీ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. కాబట్టి కస్టమర్లకు తమకు నచ్చిన రంగు జిమ్నీని ఎంచుకోగలుగుతున్నారు. ధర కొంత ఎక్కువే అయినప్పటికీ.. దీనికి తగిన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Don’t Miss: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!.. 650 సీసీ విభాగంలో మరో బైక్ ఇదే..
ప్రస్తుతం కంపెనీ పండుగ సమయంలో మరింత మంచి కస్టమర్లను ఆకర్శించడానికి ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కారణంగా జిమ్నీ మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. జిమ్నీ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 12.74 లక్షలు కాగా, టాప్ మోడల్ ధరలు రూ. 14.95 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి.