26.2 C
Hyderabad
Tuesday, March 18, 2025
Home Blog Page 25

అనిల్ అంబానీ కొత్త ప్లాన్.. అన్నకు పోటీగా నయా బిజినెస్!

0

Anil Ambani Plans To Build Electric Cars in India: ప్రపంచం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరుగులు పెడుతున్న సమయంలో చాలా మంది ఈ రంగంలో అడుగుపెట్టి పురోగతి సాధించాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంలో ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ నేతృత్వంలోని ‘రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోని అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అంతే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు మరియు బ్యాటరీలు తయారు చేయడానికి మరియు రిటైల్ చేయడానికి కూడా పూనుకుంటోంది. దీనికోసం కంపెనీ ప్రత్యేకంగా బీవైడీ ఇండియా యొక్క మాజీ ఎగ్జిక్యూటివ్‌ను నియమించుకున్నట్లు సమాచారం.

కంపెనీ ఈవీ ఫ్యాక్టరీని నిర్మించడానికి అయ్యే ఖర్చు గురించి కూడా సాధ్యాసాధ్యాలను అన్వేషిస్తోంది. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే.. ఈ సదుపాయంలో ఏడాదికి 250000 వాహనాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ సామర్థ్యాన్ని 750000కు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇది వరకే చెప్పుకున్నట్లు అనిల్ అంబానీ ప్రారంభించబోయే కంపెనీ.. బ్యాటరీ రంగంలో అడుగు పెట్టే అవకాశం ఉంది. కంపెనీలో 10 గిగావాట్స్ బ్యాటరీలను తయారు చేసే అవకాశం ఉంది. దీనికోసం అయ్యే ఖర్చు గురించి కూడా సంబంధిత అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రారంభంలో 10 గిగావాట్స్ బ్యాటరీలను తయారు చేయడంతో మొదలుపెట్టి.. ఆ తరువాత మరో పదేళ్లలో 75 గిగావాట్స్ బ్యాటరీలను కంపెనీ తయారు చేయనుంది.

2005లో కుటుంబ వ్యాపారాలను విభజించుకుని ఎవరి వ్యాపారం వారు చూసుకోవడం ప్రారంభమైంది. ఆ తరువాత ఆనతి కాలంలోనే ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు. కానీ అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇప్పుడిప్పుడే అనిల్ అంబానీ బయటపడుతున్నాడు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను మరియు బ్యాటరీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. ముకేశ్ అంబానీ కూడా బ్యాటరీ తయారీ రంగంలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 10 గిగావాట్స్ బ్యాటరీ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే బిడ్ కూడా గెలుచుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. అన్నదమ్ములు మళ్ళీ వ్యాపారంలో పోటాపోటీగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అర్థమవుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ నాటికి ఈవీ తయారీ సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర భాగాలు తయారు చేస్తారు. కంపెనీ రిలయన్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ముందుకు సాగుతుంది. అయితే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇటీవల తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈవీ రంగంలో అడుగుపెడితే.. లాభాలను పొందుతుందా? మళ్ళీ నష్టాలను చవి చూస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఏవీ రంగం ప్రస్తుతం మంచి ఊపుమీద ఉంది కాబట్టి.. కొత్త వాహనాలను, ప్రజల అభిరుచికి తగిన వాహనాలను ప్రవేశపెడితే.. తప్పకుండా అనిల్ అంబానీ లాభాలను పొందే అవకాశం ఉంది.

అనిల్ అంబానీ ఎలక్ట్రిక్ కార్లు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఎలక్ట్రిక్ కార్ల మీద ఎక్కువ మక్కువ అని తెలుస్తోంది. దీని కారణంగానే ఈయన గ్యారేజిలో హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐయోనిక్ 5 మరియు బీవైడీ కంపెనీకి చెందిన సీల్ కార్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ కార్లలో ప్రయాణిస్తూ ఈయన కనిపించారు.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో 2023లో ప్రారంభమైంది. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధరలు కేవలం మొదటి 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తరువాత ధరలు రూ. 46.05 లక్షలకు చేరింది. ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దేశానికి రావడం చేత దీని ధరలు అధికంగా ఉన్నాయి. స్థానికంగా తయారయ్యే వాహనాల ధరలు మాత్రం కొంత తక్కువగా ఉంటాయి.

బీవైడీ కంపెనీకి చెందిన సీల్ ఎలక్ట్రిక్ కారు.. ఇటీవల కాలంలోనే అనిలా అంబానీ గ్యారేజిలో చేరినట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ ఇంట ఇటీవల జరిగిన ఫ్రీ-వెడ్డింగ్ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో విమానాశ్రయానికి ఈ కారులోనే వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి.

Don’t Miss: విజేతకు మహీంద్రా థార్ గిఫ్ట్: ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

సీల్ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే అనిల్ అంబానీ ఆర్కిటిక్ బ్లూ కలర్ కారును కొనుగోలు చేశారు. ఇది 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ సెటప్ పొందింది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 312 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 650 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ. 41.53 లక్షలు.

విజేతకు మహీంద్రా థార్ గిఫ్ట్: ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

0

Mahindra Rise Challenge For MBA Students: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఎంబీఏ విద్యార్థులు కోసం ‘మహీంద్రా రైజ్ ఛాలెంజ్’ (Mahindra Rise Challenge) పేరుతో ఓ పోటీ నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి లెజండరీ మహీంద్రా థార్ (Mahindra Thar) గిఫ్ట్‌గా ఇస్తుంది. ఇంతకీ ఈ పోటీ ఏంటి? ఎలా పాల్గొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో మీ కోసం..

మహీంద్రా కంపెనీ నిరవహిస్తున్న ఈ మహీంద్రా రైజ్ చాలేజ్ అనేది నాలుగు దశల్లో జరుగుతుంది. అవి రిజిస్ట్రేషన్, సీవీ (Curriculum Vitae), క్యాంపస్ రౌండ్ మరియు నేషనల్ ఫైనల్స్.

రిజిస్ట్రేషన్

మహీంద్రా నిర్వహిస్తున్న ఈ ఛాలెంజ్‌లో పాల్గొనటానికి రిజిస్ట్రేషన్ అనేది మొదటి దశ. పోటీలలో పాల్గొనే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాలేజ్ ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఒక విద్యార్ధి కేవలం ఒకసారి మాత్రమే పాల్గొనటానికి అర్హత కలిగి ఉంటారు. కాబట్టి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

సీవీ (Curriculum Vitae)

మహీంద్రా రైజ్ ఛాలెంజ్‌లో రెండో దశ సీవీ సంపించడం. అంటే ఇందులో పాల్గొనే విద్యార్ధి వారి బయోడేటా లేదా రెస్యూమ్ అందించాల్సి ఉంటుంది. ఈ రౌండులోనే ఒక పేజీలో ఓ సమస్యను.. దానికి పరిష్కారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

క్యాంపస్ రౌండ్

మహీంద్రా రైజ్ ఛాలెంజ్‌లో మూడోది క్యాంపస్ రౌండ్. ఇక్కడ పోటీలో పాల్గొనే విద్యార్థులు మహీంద్రా జ్యురీ కోసం ఐదు స్లయిడ్‌ల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి రెండో రౌండులో సమర్పించే ఒక సమస్య.. దానికి పరిష్కారం పత్రం కూడా ఉండాలి.

నేషనల్ ఫైనల్స్

మూడు రౌండ్లలో విజయం పొందినవారు నేషనల్ ఫైనల్స్ అనే రౌండుకు వెళ్తారు. ఇక్కడ షార్ట్‌లిస్ట్ చేయబడిన తరువాత మహీంద్రా గ్రూప్ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు విద్యార్థులు తమ కొత్త ఆలోచనలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా అన్నింట్లో విజయం సాధించినవారికి పాపులర్ ఆఫ్-రోడర్ ‘మహీంద్రా థార్’ గిఫ్ట్‌గా లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో గెలుపొందిన విజేత మహీంద్రా లీడర్స్ ప్రోగ్రామ్‌లో భాగం అవుతాడు.

ఇందులో ఎవరు పాల్గొనాలి

ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఎస్‌‌‌‌పీజేఐఎంఆర్ ముంబై, ఎఫ్ఎమ్ఎస్ ఢిల్లీ, జేబీఐఎమ్ఎస్ ముంబై, మరియు ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్‌పూర్‌లలోని మొదటి సంవత్సరం పూర్తి చేసిన ఎంబీఏ విద్యార్థుల కోసం మాత్రమే ఈ ఛాలెంజ్ నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి వీరు మాత్రమే ఈ ఛాలెంజ్‌లో పాల్గొనటానికి అర్హులని తెలుస్తోంది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్

పారిశ్రామిక దిగ్గజం ‘ఆనంద్ మహీంద్రా’ (Anand Mahindra) కూడా మహీంద్రా రైజ్ ఈవెంట్ గురించి ట్వీట్ చేశారు. ”ఇది ఒక వేట, విజేతలకు తక్షణం మహీంద్రా కొత్త కారు పొందవచ్చు. ఇందులో గెలిచే విజేతలు భవిష్యత్తుకు నాయకత్వం వహించేవారు”.. అని అన్నారు.

మహీంద్రా థార్ (Mahindra Thar)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ ఆఫ్-రోడర్లలో ‘మహీంద్రా థార్’ చెప్పుకోదగ్గ కారు. మహీంద్రా థార్ 3 డోర్స్ వెర్షన్లో లభిస్తోంది. కాగా కంపెనీ ఇప్పుడు 5 డోర్ వెర్షన్ రూపంలో ‘ మహీంద్రా రోక్స్’ పేరుతో లాంచ్ చేసింది. ఇది సాధారణ కారు కంటే కూడా కొంత విశాలంగా ఉంటుంది. దీని ధర రూ. 12.99 లక్షలు. కాగా మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్ ధర రూ. 11.35 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన మొదటి రోజు నుంచి.. ఇప్పటి వరకు కూడా విపరీతమైన అమ్మకాలు పొందుతూ.. ప్రత్యర్థులకు సైతం దడ పుట్టిస్తోంది. ఈ కారు అత్యద్భుతమైన డిజైన్ కలిగి ఉండటం వల్ల.. వాహన ప్రేమికులు చూడగానే ఆకర్షించబడతారు. అంతే కాకుండా ఇది వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

Don’t Miss: భారత్‌లో ఫస్ట్‌ డెలివరీ.. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారు ఇదే! ఇంకా స్పెషల్‌ ఏంటంటే?

మహీంద్రా థార్ కేవలం ఆన్ రోడ్ వినియోగదారులకు మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడ్ వినియోగదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 1,86,055 యూనిట్ల మహీంద్రా థార్ కార్లు విక్రయించబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ కారుకు ఎంత క్రేజు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

2024 హీరో డెస్టినీ 125 స్కూటర్ వచ్చేస్తోంది.. ఫోటోలు చూశారా!

0

2024 Hero Destini 125 Unveiled: ఆధునిక భారతదేశంలో ఆటోమొబైల్ రంగం సరికొత్త రంగులను పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త లేదా అప్డేటెడ్ వాహనాలు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ‘హీరో డెస్టినీ 125’ స్పెషల్ ఎడిషన్స్ మరియు ఇతర వేరియంట్స్ అన్నీ కూడా అప్డేట్స్ అందుకున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

వేరియంట్స్

సుమారు ఆరు సంవత్సరాల తరువాత హీరో డెస్టినీ 125 స్కూటర్.. ప్రస్తుత తరానికి కావలసిన విధంగా అప్డేట్ అయింది. అయితే ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. 2024 డెస్టినీ 125 స్కూటర్ వీఎక్స్, కాస్ట్ డిస్క్, జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

కలర్ ఆప్షన్స్

2024 హీరో డెస్టినీ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ మూడు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి ఎటర్నల్ వైట్, రీగల్ బ్లాక్ మరియు గ్రూవీ రెడ్ కలర్స్. హై-ఎండ్ మోడల్స్ అయిన జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్స్ మిస్టిక్ మెజెంటా (పింక్), కాస్మిక్ బ్లూ, ఎటర్నల్ వైట్, మరియు రీగల్ బ్లాక్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ స్కూటర్‌లలోని చాలా భాగాలు కాపర్ టోన్డ్ క్రోమ్ హైలెట్స్ చూడవచ్చు.

డిజైన్

కొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్ సిగ్నేచర్ హెచ్-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది. ఇండికేటర్స్ ఫ్రంట్ ఆప్రాన్‌లో ఉంటాయి. ఫ్యూయెల్ ట్యాంక్ అనేది సీటు కింద ఉంటుంది. పరిమాణం పరంగా కూడా హీరో డెస్టినీ 125 స్కూటర్ కొంత పెద్దగా మారింది. సీటు 785 మిమీ, వీల్‌బేస్ 57 మిమీ వరకు విస్తరించబడింది. అండర్ సీటు స్టోరేజ్ 19 లీటర్లు కాగా.. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు మాత్రమే.

ఫీచర్స్

2024 హీరో డెస్టినీ 125 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్, ఫ్రంట్ డ్రమ్ బ్రేక్, టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్, చిన్న ఎల్సీడీ ఇన్‌సెట్‌తో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బూట్ లాంప్ వంటివి పొందుతుంది. ఈ వేరియంట్ యొక్క వెనుక బ్రేక్ లివర్ మీద పార్కింగ్ బ్రేక్ లాక్ కూడా ఉంది. అయితే ఈ ఫీచర్ హై వేరియంట్‌లో లేదు.

ఇక హై-ఎండ్ వేరియంట్స్ జెడ్ఎక్స్ మరియు జెడ్ఎక్స్ ప్లస్ వేరియంట్స్ విషయానికి వస్తే.. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ స్పీడోమీటర్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, డిస్‌ప్లే కోడం 5 స్టెప్ బ్రైట్‌నెస్ కంట్రోల్.. హీరో యొక్క ఐ3ఎస్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీ, బ్యాక్‌రెస్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ లభిస్తాయి.

పవర్‌ట్రెయిన్

హీరో డెస్టినీ 125 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ అదే 124.6 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9 Bhp పవర్ మరియు 10.4 Nm టార్క్ అందిస్తుంది. అప్డేటెడ్ మోడల్ 59 కిమీ / లీటర్ మైలేజ్ అందిస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు లాంచ్ తరువాత తెలుస్తాయి. అయితే ఇది రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని మాత్రం స్పష్టమవుతోంది.

ధరలు

ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన అంశం ధరలు. 2024 హీరో డెస్టినీ 125 స్కూటర్ యొక్క ఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 80048మరియు ఎక్స్‌టెక్ వేరియంట్ ధర రూ. 86538 వరకు ఉంటుందని అంచనా. మొత్తం మీద త్వరలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న సెకండ్ జనరేషన్ హీరో డెస్టినీ 125 స్కూటర్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధర వద్ద లభిస్తుందని సమాచారం. అయితే ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

Don’t Miss: గణేష్ చతుర్థి ఆఫర్: ఈ స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఇంకా ప్రయోజనాలెన్నో

ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త 2024 హీరో డెస్టినీ 125 స్కూటర్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125 మరియు సుజుకి యాక్సెస్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా డెస్టినీ 125 స్కూటర్ కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము.

తండ్రికి కారు గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.. ఆనందంతో గంతులేసిన తల్లి – వీడియో వైరల్

0

Actor Prasad Oak Received BMW Car As a Gift From His Son: పిల్లలకు తల్లిదండ్రులు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇవ్వడం స్పెషల్. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా అలాంటి మరో సంఘటన తెరమీదకు వచ్చింది. ప్రముఖ మరాఠీ నటుడు ‘ప్రసాద్ ఓక్’కు తన కొడుకు సార్థక్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. ప్రసాద్ ఓక్ నవనీత్ మోటార్స్ అనే బీఎండబ్ల్యూ షోరూమ్‌కు రావడం చూడవచ్చు. ఆయన వెంట ఆయన భార్య కూడా వచ్చింది. ప్రసాద్ ఓక్, ఆయన భార్య, కొడుకు ముగ్గురూ డీలర్షిప్ చేరుకుంటారు. అక్కడ కారు కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేసిన తరువాత అక్కడి సిబ్బంది వారికి కారు తాళం అందిస్తారు. ఆ తరువాత ప్రసాద్ ఓక్.. ఆయన భార్య కారులో వెళ్తారు. ఇంతటితో వీడియో పూర్తవుతుంది.

కారు డెలివరీ చేసుకునే సమయంలో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేదు. ఈ వీడియోను ప్రసాద్ ఓక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కారు గిఫ్ట్ ఇచ్చిన కొడుక్కి.. ఆ తండ్రి ధన్యవాదాలు తెలిపారు. ఖరీదైన కారు గిఫ్ట్‌గా పొందిన ఆ తండ్రి కొంత భావోద్వేగానికి కూడా గురవ్వడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

వీడియో షేర్ చేస్తూ ప్రసాద్ ఓక్ కుమారుడు ఈ విధంగా పేర్కొన్నాడు. ”నేను చాలా గర్వపడుతున్నాను. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీ కోరికలన్నీ తీరుస్తాడు. జన్మదిన శుభాకాంక్షలు”. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

బీఎండబ్ల్యూ ఎక్స్1 (BMW X1)

భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్లలో బీఎండబ్ల్యూ యొక్క ఎక్స్1 కూడా ఒకటి. ఇక్కడ ప్రసాద్ ఓక్ పొందిన కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ క్లాసీ షేడ్‌లో ఉండటం చూడవచ్చు. ఇది హై-గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు బేజ్ ఇంటీరియర్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే ఈ కారు ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్ పొందింది. ముందు భాగంలో బ్రాండ్ లోగో, ఆకర్షణీయమైన రియర్ ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా చూడచక్కగా ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్1 కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్స్1 ఎస్‍డ్రైవ్ 18ఐ ఏం స్పోర్ట్ మరియు ఎక్స్1 ఎస్‍డ్రైవ్ వేరియంట్స్. అయితే ఇక్కడ ప్రసాద్ ఓక్ గిఫ్ట్‌గా పొందిన కారు ఏ వేరియంట్ అనేది ఖచ్చితంగా తెలియదు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.

పెట్రోల్ వేరియంట్ 1.5 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 134 బీహెచ్‌పీ పవర్ మరియు 230 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ యూనిట్. ఇది 147 బీహెచ్‌పీ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దేశీయ విఫణిలో పెట్రోల్ మోడల్ ధర రూ. 49.5 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్ ధర రూ. 52.5 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

బీఎండబ్ల్యూ కార్లకు ఎందుకంత డిమాండ్?

భారతదేశంలో ఎన్నెన్ని బ్రాండ్స్ ఉన్నా.. లగ్జరీ కారు అంటే ముందుగా గుర్తొచ్చేది బెంజ్, బీఎండబ్ల్యూ. చాలామంది ప్రముఖులు బెంజ్ లేదా బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనికి కారణం లగ్జరీ డిజైన్, లగ్జరీ ఫీచర్స్ కలిగి.. లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చని. ఈ కారణంగానే ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లోని చాలామంది సెలబ్రిటీలు ఈ బీఎండబ్ల్యూ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు ప్రసాద్ ఓక్ కూడా చేరిపోయారు.

Don’t Miss: గణేష్ చతుర్థి ఆఫర్: ఈ స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఇంకా ప్రయోజనాలెన్నో

బీఎండబ్ల్యూ కంపెనీ కూడా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్శించడమే కాకుండా, ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల తాజాగా హైడ్రోజన్ కార్లను ఆవిష్కరించింది. అంతే కాకుండా.. బీఎండబ్ల్యూ 320ఎల్‌డీ ఎమ్ స్పోర్ట్స్ ప్రో కారును రూ. 65 లక్షల ధర వద్ద లాంచ్ చేసింది. ఇలా బీఎండబ్ల్యూ తనదైన రీతిలో తన ఉనికిని చాటుకుంటోంది.

గణేష్ చతుర్థి ఆఫర్: ఈ స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఇంకా ప్రయోజనాలెన్నో

0

Ola Electric Ganesh Chaturthi Special Offers: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) దేశీయ విఫణిలో ఎస్1, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ వంటి మోడల్స్ లాంచ్ చేసి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లను పెంచుకోవటానికి ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ‘వినాయక చవితి’ పండుగను పురస్కరించుకుని ఎంపిక చేసిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద ప్రత్యేక డిస్కౌంట్స్ ప్రకటించింది.

ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న ఈ తగ్గింపులలో.. అదనపు ప్రోత్సాహకాలు మరియు బ్యాంకింగ్ ప్రమోషన్స్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ అవకాశం ఈ రోజుతో (సెప్టెంబర్ 7) ముంగుస్తుందని తెలుస్తోంది. కంపెనీ ఈ వ్యవధిని మళ్ళీ పెంచుతుందా? లేదా అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఎస్1 ప్రో (S1 Pro)

ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ప్రో స్కూటర్ మీద రూ. 5000 తగ్గింపును అందిస్తుంది. ఈ అవకాశం కర్ణాటక, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, జైపూర్, నాగ్‌పూర్, నాసిక్, కలకత్తా మరియు చండీగఢ్ వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఎస్1 ఎక్స్ మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ (S1 X and S1 X+)

ఓలా ఎస్1 ఎక్స్ (4 కిలోవాట్ వేరియంట్) మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ల మీద కంపెనీ రూ. 5000 తగ్గింపు అందిస్తుంది. ధరల తగ్గింపు తరువాత ఈ స్కూటర్ ధరలు వరుసగా రూ. 96999 మరియు రూ. 89999 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ తగ్గింపులు దేశ్యవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. ఎస్1 ప్రో మాదిరిగా పరిమితులు లేదు.

ఎక్స్‌ఛేంజ్ బోనస్ (Exchange Bonus)

ధరల తగ్గింపు మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ తన పాత టూ వీలర్స్ మీద ఎక్స్‌ఛేంజ్ బోనస్ ప్రకటించింది. దీనికింద రూ. 12000 ప్రయోజనాలను పొందవచ్చు. ఎస్1 ఎక్స్ (4 కిలోవాట్) ఎంచుకునే వారు రూ. 8000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఇతర ప్రయోజనాలలో యాక్ససరీస్ మీద 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధీకృత డీలర్షిప్ లేదా ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

బ్యాంకింగ్ ప్రమోషన్స్

ఓలా ఎలక్ట్రిక్ అదనపు ప్రయోజనాల కింద.. వివిధ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇందులో యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‍సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి. అంతే కాకుండా వన్ కార్డు క్రెడిట్ కార్డు వినియోగదారులు తొమ్మిది నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఈఎంఐ ప్లాన్‌లను ఎంచుకున్నప్పుడు రూ. 5000లకు పరిమితం చేయబడిన 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఐడీఎఫ్‍సీ బ్యాంక్ జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను అందిస్తుంది. అర్హత కలిగిన కస్టమర్లకు 6.99 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది. కస్టమర్లలకు కావలసిన ప్రయోజనాలను అందించడానికి కంపెనీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఇలాంటి ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. ఈ కంపెనీ దాదాపు ప్రతి పండుగకు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తూ ఉంటుంది. ఈ తరహాలోనే ఇప్పుడు కూడా ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది.. ఈ రోజు ముగుస్తుంది. బహుశా కంపెనీ ఈ అవకాశాన్ని పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా త్వరలో రాబోయే దసరా, దీపావళికి కూడా కంపెనీ మరిన్ని ఆఫర్స్ అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Don’t Miss: బంపరాఫర్.. కొత్త కారు కొనుగోలుపై రూ.2 లక్షల డిస్కౌంట్: పూర్తి వివరాలు చూడండి

నిజానికి భారతదేశంలో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ.. కంపెనీ నేడు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ ముందుకు సాగుతోంది.

బంపరాఫర్.. కొత్త కారు కొనుగోలుపై రూ.2 లక్షల డిస్కౌంట్: పూర్తి వివరాలు చూడండి

0

Tata Motors 2024 September Discounts On Electric Cars in India: పాఠకులకు ముందుగా వినాయక చవితి శుభాకంక్షలు. భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలు కొనడానికి ముందడుగు వేస్తారు. అలంటి వాటికి టాటా మోటార్స్ (Tata Motors) గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కార్ల మీద కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ అందించడం కూడా మొదలు పెట్టేసింది. ఇక్కడ ఈ కథనంలో టాటా మోటార్స్ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనే వివరాలు చూసేద్దాం.. రండి.

టాటా మోటార్స్ ఈ నెలలో (సెప్టెంబర్ 2024) టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ కొనుగోలుపైన మాత్రమే డిస్కౌంట్స్ అందించడం స్టార్ట్ చేసింది. ఈ డిస్కౌంట్స్ 2023 మోడల్‌లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ నెల 30 లోపల కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి.

నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)

2024 సెప్టెంబర్ నెలలో టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసేవారు గరిష్టంగా రూ. 2.03 లక్షల డిస్కౌంట్ లేదా ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్స్ అనేవి ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా 2023 నెక్సాన్ ఈవీలకు కొనుగోలు చేసేవారు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందుతారు.

భారతదేశంలో నెక్సాన్ ఈవీ ధరలు రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారు 30 కిలోవాట్ మరియు 40.5 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. ఇవి రెండూ వరుసగా 275 కిమీ మరియు 390 కిమీ రేంజ్ అందిస్తాయి. దేశీయ విఫణిలో ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ400 మరియు రాబోయే ఎంజీ విండ్సర్ అనే కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)

ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ యొక్క 2023 టియాగో ఈవీ కొనుగోలుపై కస్టమర్ రూ. 65000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే టియాగో ఈవీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. డిస్కౌంట్స్ లేదా తగ్గింపులు మీరు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.

టాటా టియాగో ఈవీ ధరలు ఇండియాలో రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.89 లక్షల మధ్య ఉన్నాయి. ఇది నెక్సాన్ ఈవీ మాదిరిగానే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. ఒకటి 24 కిలోవాట్బ్ బ్యాటరీ. ఇది 275 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక రెండో బ్యాటరీ 19.2 కిలోవాట్ యూనిట్. ఇది ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 221 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

పంచ్ ఈవీ (Tata Punch EV)

టాటా మోటార్స్ యొక్క అత్యంత సురక్షితమైన కారు మరియు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఉత్తమ మోడల్ ‘పంచ్ ఈవీ’ ఈవీ కొనుగోలుపైన కూడా కంపెనీ రూ. 30000 వరకు తగ్గింపులు అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మీరు ఎంచుకునే వేరియంట్ను బట్టి ఉంటుంది. ఈ తగ్గింపులు 2023 మోడల్ కొనుగోలుపైన మాత్రమే లభిస్తాయి.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమమకాలు పొందుతున్న టాటా పంచ్.. ప్రస్తుతం పెట్రోల్, CNG మరియు ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. పంచ్ ఈవీ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులో 35 కిలోవాట్ బ్యాటరీ 365 కిమీ రేంజ్ మరియు 25 కిలోవాట్ బ్యాటరీ 265 కిమీ రేంజ్ అందిస్తాయని ధృవీకరించబడింది.

Don’t Miss: డీకే శివకుమార్ కాలేజ్ డేస్ బైక్ ఇదే!.. ఓ లుక్కేసుకోండి

Note: భారతదేశంలో టాటా మోటార్స్ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తగ్గింపులు నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి ఈ నెలలో టాటా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే సమీపంలోని కంపెనీ యొక్క అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

డీకే శివకుమార్ కాలేజ్ డేస్ బైక్ ఇదే!.. ఓ లుక్కేసుకోండి

0

DK Shivakumar College Days Yezdi Roadking Bike: బైక్ లేదా కారు అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి పనికొచ్చే ఒక యంత్రం మాత్రమే కాదు. అదొక జ్ఞాపకం, ఇంకా చెప్పాలంటే ఒక ఎమోషన్. చాలామంది తాము కాలేజీలకు వెళ్లిన బైకులు లేదా ఫస్ట్ బైకును ఇప్పటికి కూడా జ్ఞాపకార్థంగా తమవద్దే ఉంచుకున్నారు. ఇలాంటి సెంటిమెంట్ కేవలం సాధారణ ప్రజల జీవితాల్లో మాత్రమే కాకుండా.. ప్రముఖుల జీవితాల్లో కూడా ఉంటాయి. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ బైక్ ఫోటోలు షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షేర్ చేసిన పోస్టులో గమనిస్తే యెజ్డీ బైక్ చూడవచ్చు. ఇది చూడటానికి కొత్తగా కనిపిస్తున్నప్పటికీ.. డీకే శివకుమార్ కాలేజ్ డేస్ సమయంలో ఉపయోగించిన బైక్ అని తానే స్వయంగా పేర్కొన్నారు. నిజానికి ఇది రీస్టోర్డ్ బైక్. డీకే శివకుమార్ రిస్టోర్ బైక్ పక్కన నిలబడి ఉండటం, బైక్ కిక్ స్టార్ట్ చేయడం వంటివి గమనించవచ్చు. ఇవన్నీ డీకే శివకుమార్ నివాసంలో జరిగినట్లు తెలుస్తోంది.

డీకే శివకుమార్ ఏమన్నారంటే?

కాలేజీ రోజులు బైక్ క్రేజ్ అనేది సర్వసాధారణం. నా కాలేజీ రోజుల్లో ఈ బైక్ తెగ వాడేసాను. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇది నిర్జీవ దశలో ఉంది. దీనిని వింటేజ్ బైక్ ప్రేమికుడు సుప్రీత్.. మళ్ళీ కొత్తదానిలా రూపొందించారు. ఈ బైక్ ఎన్నో జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకుతెస్తుంది. అని డక్ శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

యెజ్డీ రోడ్‌కింగ్ (Yezdi Roadking)

దశాబ్దాల ముందు టూ వీలర్ విభాగంలో సంచలనం సృష్టించిన ‘యెజ్డీ రోడ్‌కింగ్’ చాలామందికి ఇష్టమైన బైక్. ఇది ఐడియల్ బ్రాండ్ జావా లిమిటెడ్ చేత తయారు చేయబడింది. 1970లలో యెజ్డీ బైక్ భారతీయ మార్కెట్లో ప్రవేశించింది. అప్పట్లోనే అమ్మకాల్లో ఓ మెరుపు మెరిసిన ఈ బైక్ యువకులకు ఇష్టమైన మోడల్‌గా ప్రసిద్ధి చెందింది.

సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ అనుకూలమైన సీటు, క్రోమ్ ఎగ్జాస్ట్ మరియు టియర్ డ్రాప్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందినట్లు తెలుస్తోంది. డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ మీద నిర్మించబడిన ఈ బైక్ నిర్వహణకు కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఈ కారణంగానే చాలామంది రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ వంటి వాటికి విరివిగా ఉప్పగించేవారు.

యెజ్డీ రోడ్‌కింగ్.. 250 సీసీ సింగిల్ సిలిండర్ టూ స్ట్రోక్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18 బీహెచ్‌పీ పవర్ మరియు 24 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ కూడా ఎయిర్ కూల్డ్ అండ్ ట్విన్-ఫోర్డ్ ఎగ్జాస్ట్ సిస్టం కలిగి ఉంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందించేది. అప్పట్లో ఈ బైక్ కేవలం కిక్ స్టార్ట్ ఆప్షన్ మాత్రమే పొందింది. సెల్ఫ్ స్టార్టింగ్ అనేది ఉండేది కాదు.

ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. ఈ రెండూ కూడా బైక్ రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉండేవి. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందించేవి. ఈ బైక్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పొందింది. కాబట్టి ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉండేది. ఇవన్నీ యువకులను ఈ బైక్ తెగ ఆకర్శించింది. అమ్మకాల్లో కూడా ఇది ఆశాజనకంగానే ఉండేది.

Don’t Miss: భారత్‌లో ఫస్ట్‌ డెలివరీ.. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారు ఇదే! ఇంకా స్పెషల్‌ ఏంటంటే?

పాతకాలపు బైకులపై ఎందుకంత క్రేజు

డీకే శివకుమార్ మాత్రమే కాకుండా.. చాలామందికి పాతకాలపు బైకులంటే చాలా ఇష్టం. ఇందులో మహేంద్ర సింగ్ ధోని వంటి వారు కూడా ఉన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా రీస్టోర్డ్ బైకులు విరివిగానే అందుబాటులో ఉన్నాయి. దశాబ్దాల కాలం గడిచిపోయినా.. వీటిపైన ఉన్న మక్కువ తగ్గిపోకుండా ఉండటానికి కారణం వాటితో వారికున్న అనుభందం అనే చెప్పాలి. మన మధ్యలో కూడా ఇలాంటి పాతకాలపు బైకులను కలిగి ఉన్నవారు చాలామందే ఉంది ఉంటారు.

భారత్‌లో ఫస్ట్‌ డెలివరీ.. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారు ఇదే! ఇంకా స్పెషల్‌ ఏంటంటే?

0

Lamborghini First Revuelto Delivery: భారతీయ రోడ్ల మీద ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన కారును చూసుంటారు. అతి తక్కువ ధరకే లభించే కారును చూసుంటారు. ఇందులో దేశీయ, విదేశీయ బ్రాండ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు.. ఇక్కడ కనిపిస్తున్న కారు వాటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఈ కలర్ ఆప్షన్ కారును బహుశా మునుపెన్నడూ.. చూసి ఉండరు. దీని ధర ఏకంగా రూ. 10 కోట్లు వరకు ఉందని సమాచారం. అంతే కాకుండా ఇది భారతదేశంలో మొట్ట మొదటి ”లంబోర్ఘిని రెవెల్టో” కూడా.. ఇంకెందుకు ఆలస్యం ఈ కారు గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.. వచ్చేయండి.

మొదటి కారు డెలివరీ

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘిని’ (Lamborghini) భారతదేశంలో తన మొట్ట మొదటి ‘రెవెల్టో’ (Revuelto) డెలివరీ చేసింది. బెంగళూరులోని బ్రాండ్ డీలర్ ద్వారా కంపెనీ చెన్నైవాసికి డెలివరీ చేసినట్లు సమాచారం. నిజానికి కంపెనీ ఈ కారు డెలివరీలను 2023 చివరిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డెలివరీ ఆలస్యమైంది.

దేశీయ మార్కెట్లో లంబోర్ఘిని రెవెల్టో కారు ప్రారంభ ధర రూ. 8.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). దీనిని ప్రత్యేకంగా దిగుమతి చేసుకోవాలి, కాబట్టి ఆన్ రోడ్ ధర రూ. 10 లక్షలకు చేరుతుంది. దీంతో భారతీయ విఫణిలో ఇదే అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారుగా నిలిచింది. కంపెనీ ఈ కారును భారతదేశానికి లిమిటెడ్ ఎడిషన్‌గా పరిచయం చేసింది. అంటే కొంతమందికి మాత్రమే ఈ కారును విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి బ్యాచ్ మొత్తం అమ్ముడయ్యాయి.

ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్

భారతదేశంలో డెలివరీ చేయబడిన ఈ కొత్త లంబోర్ఘిని రెవెల్టో కారు వియోలా బెస్ట్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. క్యాబిన్ ఊదా రంగులో ఉంటుంది. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆకర్షణీయమైన కలర్ లంబోర్ఘిని కారును చూడవచ్చు. ఈ ఫోటోలు చూసిన చాలామంది తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

లంబోర్ఘిని రెవెల్టో కారు.. 2022లో నిలిపివేయబడింది బ్రాండ్ యొక్క అవెంటడోర్ కారుకు వారసుడు. అయితే రెవెల్టో అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. కేవలం 2.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 350 కిమీ/గం కావడం గమనించదగ్గ విషయం.

ఇంజిన్ వివరాలు

రెవెల్టో కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేయబడి 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులోని హైబ్రిడ్ సెటప్ కలిసి మొత్తం హార్స్ పవర్ 1015 వద్ద, టార్క్ 807 వద్ద ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో 3.8 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ద్వారా 10 కిమీ రేంజ్ పొందవచ్చు.

డిజైన్ విషయానికి వస్తే.. లంబోర్ఘిని రెవెల్టో కారు చాలా సూక్ష్మమైన బాడీ లైన్స్, ప్యానల్స్, సిల్హౌట్ ఉన్నాయి. వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, టెయిల్ లాంప్, హాయ్ మౌంటెడ్ హెక్సాగోనల్ ఎగ్జాస్ట్, 20 ఇంచెస్ ఫ్రంట్ వీల్స్ మరియు వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. సిజర్ డోర్స్ సాధారణ బ్రాండ్ కార్ల మాదిరిగానే ఉన్నాయి. మొత్తం మీద ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉందని స్పష్టంగా అర్థమైపోతోంది.

Don’t Miss: నటి ‘త్రిష’ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా?.. అన్నీ లగ్జరీ బ్రాండ్స్ గురూ!

ప్రత్యర్థి

ఫీచర్స్ విషయానికి వస్తే.. లంబోర్ఘిని రెవెల్టో కారు.. మూడు పెద్ద స్క్రీన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 8.4 ఇంచెస్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, రెండు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మూడు 9.1 ఇంచెస్ ప్యాసింజర్ డిస్‌ప్లే. సెంటర్ కన్సోల్‌లోని బటన్స్ ఫైటర్ జెట్‌లో చూసిన విధంగా ఉన్నాయి. ఇక ఏసీ వెంట్స్.. సీటింగ్ పొజిషన్ మొదలైనవన్నీ వాహన వినియోగదారులకు అనుకూలంగానే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని రెవెల్టో.. ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడెల్ (రూ. 7.5 కోట్లు, ఎక్స్ షోరూమ్) కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

నటి ‘త్రిష’ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా?.. అన్నీ లగ్జరీ బ్రాండ్స్ గురూ!

0

Famous Actress Trisha Krishnan Car Collection: తెలుగు చిత్ర సీమలో.. అగ్ర కథానాయకిల (హీరోయిన్) జాబితాలో పరిచయమే అవసరం లేని పేర్లలో ఒకటి నటి ‘త్రిష’ (త్రిష కృష్ణన్). అటు తెలుగు, ఇటు తమిళ భాషల సినిమాల్లో నటిస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ‘వర్షం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత బుజ్జిగాడు, స్టాలిన్ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు తాజాగా విడుదలైన.. నటుడు విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాలో కూడా త్రిష ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు.

సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. నటి త్రిషకు లగ్జరీ కార్లను వినియోగించడం పట్ల కూడా ఎక్కువ మక్కువ ఉంది. ఈ కారణంగానే ఈమె మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ మరియు బీఎండబ్ల్యూ రీగల్ వంటి కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం.

బీఎండబ్ల్యూ ఎస్ క్లాస్ (BMW S Class)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ (BMW)కు చెందిన ‘ఎస్ క్లాస్’ కారు నటి త్రిష గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1.77 కోట్ల నుంచి రూ. 1.88 కోట్ల మధ్య ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

నిజానికి ఈ కారు 350 డీ మరియు 450 4 మ్యాటిక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని 2925 డీజిల్ ఇంజిన్ 282 Bhp పవర్, 500 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఇది 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5 Series)

నటి త్రిష కృష్ణన్ గ్యారేజిలోని మరి జర్మన్ బ్రాండ్ కారు బీఎండబ్ల్యూ 5 సిరీస్. ఈ మోడల్ ధర దేశీయ విఫణిలో రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). త్రిష వద్ద ఉన్న ఈ బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు నలుపు రంగులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది ఇష్టపడే రంగులలో ఇది ఒకటి. ఈ రంగు అంటే త్రిషకు చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈ కలర్ కారును కొనుగోలు చేసి ఉండొచ్చని భావిస్తున్నాము.

చోట చక్కని డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు 1998 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 255 బ్రేక్ హార్స్ పవర్ (Bhp) మరియు 400 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 6.5 సెకన్లలో గంటకు 0 – 100 కిమీ వేగవంతం అవుతుంది. డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ లగ్జరీ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque)

ఎక్కువ మంది సెలబ్రిటీలకు ఇష్టమైన మరియు ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి రేంజ్ రోవర్ ఎవోక్. దీని ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కారు నటి త్రిష గ్యారేజిలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇది సాధారణంగా రోడ్డు ప్రయాణానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ కారుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణంగానే చాలా మంది ప్రముఖులు ఈ కారును ఎగబడిమరీ కొనుగోలు చేస్తుంటారు.

రేంజ్ రోవర్ ఎవోక్ 1997 సీసీ పెట్రోల్ మరియు 1998 సీసీ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందింది. త్రిష కొనుగోలు చేసిన మోడల్ ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంది అనేది స్పష్టంగా తెలియడం లేదు. పెట్రోల్ ఇంజిన్ 201 Bhp, 365 Nm టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 247 Bhp పవర్, 430 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Don’t Miss: ఇప్పటికే 5000 మంది కొనేశారు!.. మైలేజ్ చూస్తే మీరూ కొనేస్తారు

బీఎండబ్ల్యూ రీగల్ (BMW Regal)

నటి త్రిష గ్యారేజిలోని మరో బీఎండబ్ల్యూ కారు రీగల్. బహుశా ఈ మోడల్ గురించి చాలా మందికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఇది మార్కెట్లో పాపులర్ మోడల్. ఈ కారు కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. బీఎండబ్ల్యూ రీగల్ కారు ధర కూడా ఎక్కువనే తెలుస్తోంది.

ఇప్పటికే 5000 మంది కొనేశారు!.. మైలేజ్ చూస్తే మీరూ కొనేస్తారు

0

Bajaj Freedom 125 CNG Sales 5000 Units in 2 Months: పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉండే భారతీయ మార్కెట్లో ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) సీఎన్‌జీ బైకును లాంచ్ చేసిన వాహన చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పలికింది. దేశీయ విఫణిలో ‘ఫ్రీడమ్ 125’ (Freedom 125) పేరుతో లాంచ్ అయిన ఈ సరికొత్త సీఎన్‌జీ ఇప్పటికే 5000 యూనిట్ల సేల్స్ దాటింది. వాహన చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన ఈ బైక్ అమ్మకాల్లో కూడా ఆశాజనకంగానే దూసుకెళ్తోంది.

5000 యూనిట్ల సేల్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కంపెనీ బజాజ్ ఫ్రీడమ్ 125 బైకుని 5000 మందికి విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రారంభంలో గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రాంతాల్లో మాత్రమే డెలివరీలు ప్రారంభించిన కంపెనీ ఆ తరువాత దేశ వ్యాప్తంగా డెలివరీలు మొదలుపెట్టింది. పూణేలో మొదటి బైక్ డెలివరీ చేసింది.

2024 సెప్టెంబర్ 5 ఉదయం 7గంటల వరకు మొత్తం 5018 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు వాహన్ డేటా ద్వారా తెలిసింది. జులై చివరి రెండు వారాల్లో కంపెనీ 276 యూనిట్ల సేల్స్ మాత్రమే చేయగలిగింది. ఆగష్టులో ఈ సంఖ్య 4019కి చేరింది. సెప్టెంబర్ మొదటి నాలుగు రోజుల్లో 637 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇలా మొత్తం మీద కంపెనీ 5000 కంటే ఎక్కువమందికి ఈ బైకును విక్రయించి అమ్మకాల్లో కూడా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. పెట్రోల్ బైకుల విక్రయాలతో పోలిస్తే.. ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ, సీఎన్‌జీ విభాగంలో కొత్తగా అడుగెట్టి ఇంతమంది వాహన ప్రియులను ఆకర్శించిందంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ సేల్స్ మొదటి కొన్ని వారాల్లోనే మూడంకెల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకంటే ప్రారంభంలో ఈ సేల్స్ గుజరాత్, మహారాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్కడ సీఎన్‌జీ మౌలిక సదుపాయాలు విరివిగా ఉన్నాయి. ఆ తరువాత విక్రయాలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించడంతో.. సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఆగష్టు 15 తరువాత బజాజ్ ఫ్రీడమ్ 125 సేల్స్ ఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో సహా మొత్తం 77 పట్టణాలకు మరియు నగరాలకు వ్యాపించాయి. ఇందులో టైర్ 2 మరియు టైర్ 3 నగరాలూ ఉన్నాయి.

నిజానికి మహారాష్ట్రలో బజాజ్ ఫ్రీడమ్ 125 డెలివరీలు జులై 18 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ బైక్ గురించి సుమారు 30000 కంటే ఎక్కువమంది విచారణ జరిపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బజాజ్ ఫ్రీడమ్ 125 బైకుకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. రెండు.. మూడు నెలల్లో 10000 యూనిట్ల నుంచి 2025 ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి 30000 నుంచి 40000 యూనిట్లకు పెంచే యోచనలో కంపెనీ నిమగ్నమై ఉంది.

సీఎన్‌జీ బైక్ సేల్స్ తగ్గడానికి కారణం

భారతదేశంలో పెట్రోల్ బైకులకున్నంత డిమాండ్.. సీఎన్‌జీ బైకులకు లేదు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి చాలా ప్రాంతాల్లో సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్స్ లేకపోవడం. రెండు సీఎన్‌జీ విభాగంలో బైకులు ఎక్కువగా లేకపోవడం. ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ విభాగంలో మొట్టమొదటి బైక్. ఈ విభాగంలో బైకులు ఎక్కువ సంఖ్యలో లాంచ్ అయినప్పుడే.. ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో మొత్తం 7000 సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్య 13000 స్టేషన్లకు చేరుతుందని అంచనా. ఇండియాలో 500 పట్టణాల్లో 335 పట్టణాలలో సీఎన్‌జీ అందుబాటులో ఉందని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ పేర్కొన్నారు.

Don’t Miss: కియా గ్రావిటీ ఎడిషన్స్.. ముచ్చటగా మూడు కార్లు: పూర్తి వివరాలు

సీఎన్‌జీ బైకులను ఎందుకు కొనాలి

పెట్రోల్ బైకులతో పోలిస్తే.. సీఎన్‌జీ బైకుల నిర్వహణ ఖర్చు తక్కువ. అంతే కాకుండా పెట్రోల్ కంటే కూడా సీఎన్‌జీ ధర కూడా తక్కువే. అంతే కాకుండా మైలేజ్ కూడా సీఎన్‌జీ బైక్ ఎక్కువగా అందిస్తుంది. ఇవన్నీ సీఎన్‌జీ బైక్ కొనుగోలు చేయొచ్చు అనటానికి కారణాలు. ప్రస్తుతం బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ట్యాంక్స్ కలిగి ఉంది. ఇందులోని 2 కేజీల సీఎన్‌జీతో 200 కిమీ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్.. 130 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇవన్నీ గమనిస్తే.. పెట్రోల్ బైకులకంటే కూడా సీఎన్‌జీ ఓ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.