24.7 C
Hyderabad
Sunday, March 16, 2025
Home Blog Page 31

టాటా సరికొత్త ఎలక్ట్రిక్ కారు ‘కర్వ్’ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

0

Tata Curvv EV Launched in India: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా కర్వ్ ఈవీ’ (Tata Curvv EV) దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఆధునిక హంగులతో.. అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ కర్వ్ ఈవీ లాంచ్‌తో మరింత వృద్ధి చెందనుంది.

వేరియంట్స్ & ధరలు (Variants and Price)

భారతీయ విఫణిలో లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 21.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

డిజైన్ (Design)

టాటా కర్వ్ ఈవీ క్లోజ్డ్ గ్రిల్ ఉంటుంది. ముందు భాగంలో బ్రాండ్ లోగో ఉన్న ప్రదేశంలోనే ఛార్జింగ్ పోర్ట్ ఉండటం గమనించవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, హై మౌంటెడ్ స్పాయిలర్ మొదలైనవన్నీ కూడా ఇక్కడా చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి.

ఇంటీరియర్ ఫీచర్స్ (Interior Features)

టాటా కర్వ్ ఈవీ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 9 స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టం, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ లోగోతో.. 4 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటివి వన్నీ ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా.. ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరీఫైర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి మరెన్నో అప్డేటెడ్ ఫీచర్స్ టాటా కర్వ్ ఈవీలో ఉన్నాయి.

బ్యాటరీ మరియు రేంజ్ (Battery & Range)

టాటా కర్వ్ ఈవీ యొక్క క్రియేటివ్, అకాంప్లిష్డ్ మరియు అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్స్.. 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 502 కిమీ రేంజ్ అందిస్తుంది. అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ వేరియంట్స్ 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. ఇవి ఒక సింగిల్ చార్జితో 585 కిమీ రేంజ్ అందిస్తాయని ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడింది.

కర్వ్ ఈవీ 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ కావడం గమనార్హం. 55 కిలోవాట్ బ్యాటరీ కలిగిన టాటా కర్వ్ 167 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. 45 కిలోవాట్ బ్యాటరీ కలిగిన టాటా కర్వ్ 150 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండు 215 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఈవీ 70 కేడబ్ల్యు లేదా అంతకంటే ఎక్కువ డీసీ ఛార్జర్ ద్వారా 40 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జర్ ద్వారా 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 150 కిమీ ప్రయాణించగలిగే ఛార్జ్ చేసుకుంటుందని తెలుస్తోంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)

టాటా మోటార్స్ అంటేనే సేఫ్టీ.. కాబట్టి కంపెనీ యొక్క ఇతర వేరియంట్స్ మాదిరిగానే టాటా కర్వ్ కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణికులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి కూడా ఉన్నాయి. వీటితో పాటు 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

Don’t Miss: గేమ్ చేంజర్ నటి ‘కియారా అద్వానీ’ ఉపయోగించే కార్లు ఇవే.. మీకు తెలుసా?

ప్రత్యర్థులు (Rivals)

కొత్త టాటా కర్వ్ ఈవీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఎంజీ జెడ్ఎస్ ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దీంతో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ400 మరియు నెక్సాన్ ఈవీ వంటి వాటికీ కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే టాటా కర్వ్ అమ్మకాల పరంగా దేశీయ విఫణిలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

గేమ్ చేంజర్ నటి ‘కియారా అద్వానీ’ ఉపయోగించే కార్లు ఇవే.. మీకు తెలుసా?

0

Game Changer Actress Kiara Advani Car Collection: ‘భరత్ అనే నేను’ సినిమాలో తెలుసు చిత్ర సీమకు పరిచయమైన ‘కియారా అద్వానీ’ (Kiara Advani) ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తోంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. సినిమాల్లో నటించడమే కాకుండా ఈమెకు ఖరీదైన కార్లపై కూడా మక్కువ ఎక్కువే. ఈ కారణంగానే ఈమె ఖరీదైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తోంది.

కియారా అద్వానీ ఉపయోగించే కార్లు

ఆడి ఏ8ఎల్

నటి కియారా అద్వానీ ఉపయోగించే కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ ఆడి కంపెనీకి చెందిన ఏ8ఎల్ (Audi A8L). ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 1.34 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు 2995 సీసీ ఇంజిన్ కలిగి 500 Nm టార్క్, 344 Bhp పవర్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 270 కిమీ కావడం గమనార్హం.

మంచి డిజైన్ కలిగిన ఈ కారు హీట్ ఫంక్షనాలిటీ, యాంబియంట్ లైటింగ్, కూల్ బాక్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంమ్ సిస్టమ్ సిస్టం, డ్రైవర్ ఇన్ఫర్మేషన్స్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్స్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ220డీ

కియారా అద్వానీ గ్యారేజిలోని మరో కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ‘ఈ220డీ’ (Mercedes Benz E220D). రూ. 71.79 లక్షల ఖరీదైన ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1993 సీసీ ఇంజిన్ 3800 rpm వద్ద 192 Bhp పవర్ మరియు 1600 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 7.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 240 కిమీ.

బీఎండబ్ల్యూ ఎక్స్5

కియారా అద్వానీ ఉపయోగించే కార్లలో మరో ఖరీదైన కారు ‘బీఎండబ్ల్యూ ఎక్స్5’ (BMW X5). దీని ధర రూ. 77.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 2993 సీసీ డీజిల్ ఇంజిన్ మరియు 2998 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 282 Bhp పవర్, 520 Nm టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 375 Bhp పవర్ మరియు 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బీఎండబ్ల్యూ 530డీ

జర్మన్ బ్రాండ్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ యొక్క మరో కారు 530డీ కూడా కియారా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 74.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 4000 rpm వద్ద 261 Bhp పవర్, 2000 rpm వద్ద 620 Nm టార్క్ అందిస్తుంది. భారతదేశంలోని చాలామంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఇది మంచి డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

సాధారణ ప్రజల మాదిరిగానే సెలబ్రిటీలకు కూడా కార్లు, బైకులపైన మక్కువ ఎక్కువ. అయితే సాధారణ ప్రజల మాదిరిగా కాకుండా వీరు కొంత ఖరీదైన మరియు విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇందులో ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ వంటివి మాత్రమే కాకుండా రోల్స్ రాయిస్, బెంట్లీ, మసెరటి వంటి మరెన్నో అన్యదేశ్య బ్రాండ్స్ ఉన్నాయి. వీటిని సాధారణ ప్రజల కంటే కూడా సెలబ్రిటీలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం వీటి ధర భారీగా ఉండటమే అని తెలుస్తోంది.

Don’t Miss: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

ఇటీవల కాలంలో చాలామంది సినీ నటులు, బుల్లితెర నటులు కూడా వారిని రేంజ్‌కు తగ్గట్టుగా కార్లను కొనుగోలు చేశారు. అయితే రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు తెలుసు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ మాత్రమే కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లంబోర్ఘిని కార్లు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ మొదలైనవారు కలిగి వున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ ‘ఓనం ఎడిషన్’ కార్లు: కేవలం 100 మందికే..

0

Volkswagen Taigun and Virtus Onam Edition Launched in India: జర్మనీ కార్ల తయారీ సంస్థ ‘ఫోక్స్‌వ్యాగన్’ (Volkswagen) ఇప్పటికే భారతీయ విఫణిలో వర్టస్ మరియు టైగన్ కార్లను విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు ఈ కార్లను ‘ఓనం ఎడిషన్’ (Onam Edition) రూపంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. అయితే ఈ కార్లు ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే ఓనం పండుగ రానున్న సందర్భంగా కంపెనీ ఈ కార్లను విడుదల చేసింది.

ధర

ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేసిన టైగన్ ఓనం ఎడిషన్ ధరలు రూ. 14.08 లక్షల నుంచి రూ. 15.63 లక్షలు. కాగా వర్టస్ ఓనం ఎడిషన్ ధరలు రూ. 13.57 లక్షల నుంచి రూ. 14.87 లక్షల మధ్య ఉన్నాయి. ఓనం ఎడిషన్స్ కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఈ కారు విక్రయానికి ఉండవని తెలుస్తోంది.

100 మందికి మాత్రమే

కేరళ రాష్ట్రంలో విక్రయానికి రానున్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ ఓనం ఎడిషన్స్ కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే వీటిని వంద మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి పూర్తిగా బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ రాబోయే ఓనం పండుగను పురస్కరించుకుని ఈ కార్లను లాంచ్ చేయడమే కాకుండా.. కేరళ రాష్ట్రంలో కొత్తగా ఆరు టచ్ టచ్‌పాయింట్‌లను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని కూడా కంపెనీ జరుపుకుంది.

ఓనం ఎడిషన్లు కేరళలో మాత్రమే అందుబాటులో ఉంటాయి మరియు ఉత్పత్తి ఒక్కొక్కటి 100 యూనిట్లకు పరిమితం చేయబడుతుంది. రెండు మోడల్‌లు పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, డ్యూయల్-టోన్ హార్న్ మరియు పుడిల్ ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్‌లను పొందుతాయి.

ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ ఓనం ఎడిషన్.. టైగన్ జీటీ వేరియంట్ ఆధారంగా, వర్టస్ ఓనం ఎడిషన్.. వర్టస్ హైలైన్ ఆధారంగా రూపొందించబడినట్లు స్పష్టమవుతోంది. కాబట్టి డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేదు. ధరల్లో కూడా ఎటువంటి మార్పులు లేకపోవడం గమనార్హం.

ఇప్పటికే చెప్పుకున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ఓనం ఎడిషన్స్ ఒక్కొక్కటి 100 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ రెండు ఎడిషన్స్ యొక్క గ్రిల్ క్రోమ్ బిట్ పొందుతుంది. మిగిలిన భాగం మొత్తం నలుపు రంగులోనే ఉంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయెల్ టోన్ హార్న్ వంటివి ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్‌లో టీఎస్ఐ బ్యాడ్జ్ రూపంలో అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి.

డిజైన్ మరియు ఫీచర్స్

టైగన్ ఓనం ఎడిషన్ 17 ఇంచెస్ క్యాసినో అల్లాయ్ వీల్స్, 8 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు నలుపు రంగులోనే ఉంటాయి.

ఇక ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఓనం ఎడిషన్ విషయానికి వస్తే.. టైగన్ ఓనం ఎడిషన్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇందులో సన్‌రూఫ్ లేదని తెలుస్తోంది. ఈ ఎడిషన్ డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా నలుపు రంగులోనే ఉంటాయు. ఈ రెండు ఎడిషన్స్ తప్పకుండా వాహన ప్రేమికులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

ఇంజిన్

ఫోక్స్‌వ్యాగన్ ఓనం ఎడిషన్స్ కేవలం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజిన్ 113 బీహెచ్‌పీ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా దాదాపు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నాము.

Don’t Miss: రూ. లక్షల ఆఫర్స్.. కొత్త కారు కొనుగోలుకు ఇదే మంచి సమయం

ఫోక్స్‌వ్యాగన్ ఆగష్టు డిస్కౌంట్స్

కంపెనీ ఈ నెలలో తన టైగన్, వర్టస్ మరియు టిగువాన్ కార్ల మీద అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలను పొందాలనుకుంటే ఈ కార్లను ఈ నెల చివరిలోపే కొనుగోలు చేయాలి. అంటే సంస్థ అందించే ఆఫర్స్ కేవలం ఆగష్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ అందించే ఆఫర్స్ లేదా బెనిఫీట్స్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

రూ. లక్షల ఆఫర్స్.. కొత్త కారు కొనుగోలుకు ఇదే మంచి సమయం

0

Car Discounts in 2024 August: పండుగ సీజన్ రాబోతోంది. కొత్త కారు కొనాలని చాలామందికి ఉంటుంది. అయితే డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ వంటివి ఉంటే బాగుంటుందని కూడా అనుకుంటారు. అనుకున్న విధంగానే పలు కంపెనీలు ఈ నెలలో (ఆగష్టు) అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించాయి. ఇందులో హోండా (Honda), మారుతి సుజుకి (Maruti Suzuki), హ్యుందాయ్ (Hyundai), ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్స్ ఇస్తుందో.. వివరంగా ఇక్కడ తెలుసుకోండి.

హోండా ఎలివేట్

కంపెనీ తన ఎలివేట్ కారు మీద రూ. 65000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫీట్స్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఉంటాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు కార్పోరేట్ బెనిఫీట్స్ ఉంటాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హోండా ఎలివేట్ ధరలు రూ. 11.91 లక్షల నుంచి రూ. 16.51 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి పొందుతుంది.

హోండా సిటీ

దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హోండా సిటీ కారు మీద కూడా కంపెనీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపైన ఏకంగా రూ. 88000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే అప్డేట్ చేయడానికి ముందు కారు కొనుగోలు చేసినవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అప్డేట్ తరువాత మార్కెట్లో విక్రయానికి ఉన్న కారు కొనుగోలుపైన రూ. 68000 మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కారు 121 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.

హోండా సిటీ హైబ్రిడ్

సిటీ హైబ్రిడ్ కారు మీద రూ. 78000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 విలువైన కాంప్లిమెంటరీ 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది. రూ. 19 లక్షల ఖరీదైన ఈ కారుకు ప్రధాన ప్రత్యర్థులు ఎవరూ లేరు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. ఇవన్నీ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి. ఇది 126 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా అమేజ్

2024 ఆగష్టు నెలలో హోండా అమేజ్ కారు మీద భారీ తగ్గింపులు లభిస్తాయి. వీఎక్స్ మరియు ఎలైట్ వేరియంట్ల మీద రూ. 96000, ఎస్ వేరియంట్ మీద రూ. 76000, ఎంట్రీ లెవెల్ ‘ఈ’ వేరియంట్ కొనుగోలుపై రూ. 66000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హోండా అమేజ్ 90 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ మరియు సీవీటీ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.

ఫోక్స్‌వ్యాగన్

హోండా కంపెనీ మాత్రమే కాకుండా ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా ఈ నెలలో ఆఫర్స్ అందిస్తోంది. ఇందులో టైగన్, వర్టస్ మరియు టిగువాన్ వంటివి ఉన్నాయి. టైగన్ కొనుగోలు మీద గరిష్టంగా రూ. 1.87 లక్షలు, వర్టస్ కొనుగోలుపైన రూ. 70000, టిగువాన్ కొనుగోలు మీద రూ. 1.5 లక్షల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ బెనిఫీట్స్ ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

మారుతి సుజుకి

గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, బాలెనొ, ఇగ్నీస్, సియాజ్, ఎక్స్ఎల్6 మరియు జిమ్నీ కొనుగోలు మీద మారుతి సుజుకి ఈ నెలలో ప్రయోజనాలను అందిస్తుంది. గ్రాండ్ విటారా మీద రూ. 1.03 లక్షలు, ఫ్రాంక్స్ కొనుగోలు మీద రూ. 83000, బాలెనో కొనుగోలు మీద గరిష్టంగా రూ. 50000, ఇగ్నీస్ కారుపై రూ. 52100, సియాజ్ మీద రూ. 45000, ఎక్స్ఎల్6 కొనుగోలుపైన రూ. 35000 మరియు జిమ్మీ కారుపై రూ. 2.5 లక్షల ప్రయోజనాలు లభిస్తాయి.

Don’t Miss: సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్‌ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

టాటా మోటార్స్

ఇండియన్ బ్రాండ్ టాటా మోటార్స్ కూడా తన నెక్సాన్, సఫారీ, హారియార్, టియాగో, టిగోర్ మరియు పంచ్ కార్ల్ కొనుగోలుపైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ నెలలో నెక్సాన్ కొనుగోలుపైన ఎంచుకునే వేరియంట్‌ను బట్టి రూ. 16000 నుంచి రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తాయి. సఫారీ కొనుగోలుపై రూ. 70000 నుంచి రూ. 1.40 లక్షలు, హారియార్ మీద రూ. 1.20 లక్షలు, టియాగో మరియు టిగోర్ కొనుగోలు మీద వరుసగా రూ. 60000, రూ. 55000 డిస్కౌంట్ లభిస్తుంది. టాటా పంచ్ కారు కొనుగోలుపైన రూ. 18000 మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది.

గమనిక: వివిధ కంపెనీలు అందిస్తున్న డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి, ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారు ఖచ్చితమైన డిస్కౌంట్స్ లేదా బెనిఫీట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ యొక్క అధీకృత డీలర్షిప్ సందర్శించవచ్చు. అంతే కాకుండా ఈ ప్రయోజనాలు ఈ నెల చివరి వరకు, స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కారు రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

0

Sunny Leone Stunning Car Collection: సన్నీలియోన్ (Sunny Leone).. అంటే చాలామందికి ఓ సినీనటిగా లేదా శృంగార తారగా మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ ఈమె ఒక ఆటోమొబైల్ ఔత్సాహికురాలు కూడా.. ఈ కారణంగానే ఈమె గ్యారేజిలో అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి.

మసెరటీ ఘిబ్లీ నెరిస్సిమో (Maserati Ghibli Nerissimo)

సన్నీలియోన్ గ్యారేజిలోని ఖరీదైన కార్లలో ఒకటి మసెరిటీ కంపెనీకి చెందిన ‘ఘిబ్లీ నెరిస్సిమో’ ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కారును సన్నీలియోన్ 2017లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈమె అమెరికాను సందర్శించిన సమయంలో మసెరటీ ఘిబ్లీ నెరిస్సిమో కొనుగోలు చేశారు. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 450 యూనిట్లు మాత్రమే విక్రయించింది. అంతే ఈ కారు కేవలం 450 మంది మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం.

స్పెషల్ ఎడిషన్ అయిన మసెరటీ ఘిబ్లీ నెరిస్సిమో కారును కంపెనీ అమెరికా, కెనెడాలలో మాత్రమే విక్రయించినట్లు సమాచారం. ఈ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇది 3.0 లీటర్ ట్విన్ టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 345 నుంచి 404 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మసెరటీ క్వాట్రోపోర్టే (Maserati Quattropote)

సన్నీలియోన్ గ్యారేజిలోని మరో మసెరటీ బ్రాండ్ కారు క్వాట్రోపోర్టే. సుమారు రూ. 1.74 కోట్ల విలువైన ఈ కారు విలాసవంతమైన ఫీచర్స్ పొందుతుంది. చూడగానే ఆకర్షించబడే ఈ కారు అత్యద్భుతమైన డిజైన్ పొందుతుంది. దీనిని ఈమె 2014లో కొనుగోలు చేసినట్లు సమాచారం. క్వాట్రోపోర్టే కారులో కంపెనీ 4691 సీసీ ఇంజిన్ పొందుపరిచింది. ఇది 440 హార్స్ పవర్ మరియు 490 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 270 కిమీ కావడం గమనార్హం.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ కూడా ఆమె తన అమెరికన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. ఇది బీఎండబ్ల్యూ 7 సిరీస్ యొక్క టాప్ మోడల్. దీని ధర రూ. 1.93 కోట్లు అని తెలుస్తోంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

సన్నీలియోన్ గ్యారేజిలోని బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ 3.0 లీటర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. నిజానికి భారతీయ మార్కెట్లో కూడా ఈ మోడల్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు కూడా ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

ఆడి ఏ5 (Audi A5)

గ్లోబల్ మార్కెట్లో అత్యుత్తమ ప్రజాదరణ పొందిన ఆడి కంపెనీ యొక్క కార్లను సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు పాపులర్ నటి సన్నీ లియోన్ గ్యారేజిలో కూడా ఉంది. సన్నీలియోన్ ఆడి ఏ5 ధర రూ. 72 లక్షలు.

గ్లోబల్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన ఈ ఆడి ఏ5 కారు 2.0 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 252 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మెర్సిడెస్ జెఎల్350డీ (Mercedes JL350D)

సన్నీలియోన్ గ్యారేజిలోని మరో లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ యొక్క జెఎల్350డీ. ఈ జర్మన్ బ్రాండ్ కారు ధర రూ. 70 లక్షల వరకు ఉంది. లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 1950 సీసీ 4 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 192 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 16.1 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఇది కేవలం ఏడు నిమిషాల.. ఎనిమిది సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. పనితీరుపరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

Don’t Miss: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

ఎంజీ గ్లోస్టర్ (MG Gloster)

భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన ఎంజీ మోటార్స్ యొక్క గ్లోస్టర్ కూడా సన్నీ లియోన్ గ్యారేజిలో ఉంది. ఈమె కేవలం మసెరటీ కార్లను మాత్రమే కాకుండా ఎంజీ గ్లోస్టర్ కారును కలిగి ఉన్నారు. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది 2.0 లీటర్ సింగిల్ టర్బో డీజిల్ ఇంజిన్ (163 పీఎస్ పవర్ మరియు 375 న్యూటన్ మీటర్ టార్క్) మరియు 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ (218 హార్స్ పవర్ మరియు 480 న్యూటన్ మీటర్ టార్క్) పొందుతుంది.

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బైకులు ఇవే..

0

Upcoming Bikes Arriving in India 2024 August: 2024 మొదలై దాదాపు ఏడు నెలలు కావొస్తోంది. ఎట్టకేలకు ఎనిమిదో నెల కూడా వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభమ నుంచి అనేక బైకులు, కార్లు దేశీయ విఫణిలో లాంచ్ అయ్యాయి. ఈ నెలలో కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, ఓలా ఎలక్ట్రిక్ బైక్, బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మరియు ట్రయంఫ్ డేటోనా 660 వంటివి ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)

భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ నెలలో (2024 ఆగష్టు) అప్డేటెడ్ క్లాసిక్ 350 బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఆగష్టు 12న అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ బైక్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ కొత్త కలర్ ఆప్షన్స్, అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. స్టాండర్డ్ బైకులో ఉన్న అదే ఇంజిన్ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఇది 349 సీసీ సింగిల్ సిలిండర్ జే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే బ్రాండ్ యొక్క హంటర్ 350, బుల్లెట్ 350 మరియు మీటియోర్ 350 వంటి వాటిలో కూడా ఉంటుంది. ఇంజిన్ 6100 ఆర్‌పీఎమ్ వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్ & 4000 ఆర్‌పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

బీఎస్ఏ గోల్డ్ స్టార్ (BSA Gold Star)

ఈ నెలలో లాంచ్ అయ్యే బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్ బీఎస్ఏ గోల్డ్ స్టార్. ఇది ఆగస్టు 15న.. అంటే భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 652 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 45 బీహెచ్‌పీ పవర్ మరియు 55 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

1990లలో దేశీయ మార్కెట్ల ఎంతో ప్రజాదరణ పొందిన ఈ బైక్ లేటెస్ట్ రెట్రోల్ డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇది పీరియడ్ కరెక్ట్ పెయింట్ మరియు క్రోమ్ బిట్స్ పొందుతుంది. మొత్తం మీద ఇది చాలా అద్భుతంగా.. రైడర్ల రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.

ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్, వెనుక ట్విన్ స్ప్రింగ్ స్వింగ్ ఫ్రేమ్ ఉంటాయి. ఈ బైక్ వైర్ స్పోక్ వీల్స్ కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో యొక్క రెండు చివర్లలో ఒకే డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఏబీఎస్ అనేది ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 3 లక్షల నుంచి రూ. 3.3 లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నాము.

ఓలా ఎలక్ట్రిక్ బైక్ (Ola Electric Bike)

ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే లాంచ్ చేసింది. కానీ మొదటిసారి దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే కంపెనీ పలు బైకులను పరిచయం చేసింది, కానీ ఇందులో ఒకటి మాత్రమే ఆగష్టు 15న లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీని సీఈఓ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ ప్రతి ఏటా ఆగష్టు 15న ఏదో ఒక ఉత్పత్తిని లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏట సరికొత్త మోటార్‌సైకిల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బైక్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. ఇది 100 సీసీ నుంచి 125 సీసీ మధ్య విభాగంలో లాంచ్ అవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ట్రయంఫ్ డేటోనా 660 (Triumph Daytona 650)

ఆగష్టు 2024లో లాంచ్ అయ్యే మరో బైక్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ యొక్క డేటోనా 660. నిజానికి ఈ బైక్ దేశీయ మార్కెట్లో రెండు నెలల క్రితమే లాంచ్ అయి ఉండాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ ఈ నెలకు మార్చడం జరిగింది. కాబట్టి ఈ బైక్ ఈ నెలలోనే అధికారికంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నాము. ఈ బైక్ కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.

Don’t Miss: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ తెలుసా? ఇవి పాటించకుంటే ఇబ్బందులు తప్పవు

కొత్త డేటోనా 660 బైక్ ట్రైడెంట్ 660 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది స్పోర్టీ డిజైన్, మంచి రైడింగ్ పొజిషన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 660 సీసీ ఇంజిన్ కలిగి 11250 rpm వద్ద 95 Bhp పవర్ మరియు 8250 rpm వద్ద 69 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర రూ. 10 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంటుందని సమాచారం. అయితే అధికారికంగా ధరలు వెల్లడికావాల్సి ఉంది.

ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ తెలుసా? ఇవి పాటించకుంటే ఇబ్బందులు తప్పవు

0

Do You Know About New Fastag Rules: జాతీయ రహదాలు లేదా హైవేలమీద ప్రయాణించే వాహనాలు తప్పకుండా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. గతంలో ట్యాక్స్ కట్టడానికి.. టోల్ గేట్ దాటడానికి ఎక్కవ సమయంలో వేచి ఉండాల్సి వచ్చేది. దీనిని సులభతరం చేయడానికి, టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకువచ్చింది. ప్రస్తుతం అన్ని వాహనాలు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు (ఆగష్టు 1 నుంచి) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ సిస్టంలో కొన్ని కీలక చేసింది. వాటిని వాహనదారులు తప్పకుండా తెలుసుకోవాలి.

ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపుల కోసం కొత్త మార్గదర్శకాలు

👉విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్ అనేది తప్పకుండా వాహనం యొక్క విండ్‌షీల్డ్ మీదనే అతికించి ఉండాలి. ఈ నియమం ఉల్లంగిస్తే డబుల్ టోల్ ఫీజు వసూలు చేయబడుతుంది. అంటే వాహనదారుడు రెట్టింపు డబ్బు చెలాయించాల్సి ఉంటుంది.

ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌షీల్డ్‌ మీద కాకుండా ఎక్కడైనా వాటికిస్తే టోల్ గేట్ వద్ద సమయం వృధా అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాహనదారులు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాల్సిందే.

👉కేవైసీ పూర్తి చేయాలి

ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించే వాహనదారులు తప్పకుండా కేవైసీ పూర్తి చేసి ఉండాలి. మూడు నుంచి ఐదు సంవత్సరాలా మధ్య ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నవారికి ఈ రూల్ వర్తిస్తుంది. కేవైసీ పూర్తి చేయడానికి చివరి గడువు 2024 అక్టోబర్ 31. కస్టమర్లు ఫాస్ట్‌ట్యాగ్ సేవను నిరంతరం ఉపయోగించుకోవడానికి ఈ కేవైసీ తప్పనిసరి. ఫాస్ట్‌ట్యాగ్ పేరుతో జరుగుతున్న మోసాలకు కూడా ఇది అడ్డుకట్ట వేస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ పూర్తి చేయకపోతే.. బ్లాక్ లిస్టింగ్ చేయబడుతుంది. ఈ విషయం వాహనవినియోగదారులు లేదా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

👉ఐదేళ్ల కంటే ముందు ఫాస్ట్‌ట్యాగ్ లేదా పాత ఫాస్ట్‌ట్యాగ్ మార్చేయాలి

5 సంవత్సరాల కంటే ఎక్కువ పాత ఫాస్ట్‌ట్యాగ్స్ మార్చేయాలి. వాటి స్థానంలో కొత్త వాటిని అతికించాలి. కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కోసం అప్లై చేసుకుంటే.. పాత ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. అప్పుడు పాతది పనిచేయదు, దాని స్థానంలో కొత్తవి ఉపయోగించాలి. ఇది మళ్ళీ ఐదు సంవత్సరాలు పనికొస్తుంది.

👉90 రోజుల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్

మీరు కొత్త కారు కొన్నట్లయితే.. కొనుగోలు చేసిన 90 రోజులు లేదా మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఫాస్ట్‌ట్యాగ్ అందించే సంస్థలు డేటాబేస్‌లను ధ్రువీకరించడం మరియు అప్డేట్ చేయడం వంటివి చేస్తాయి. కాబట్టి వాహనాదరూ ఖచ్చితమైన వివరాలను అందించేలా చూసుకోవాలి. గతంలో మొబైల్ నెంబర్ లింక్ చేసేవారు. కానీ ఇకపైన ఫాస్ట్‌ట్యాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ఛాసిస్ నెంబర్‌తో అనుసంధానించబడుతుంది. ఓకే ఫాస్ట్‌ట్యాగ్‌ను చాలా వాహనాల్లో ఉపయోగించకుండా చూడటానికి ఇది ఉపయోగపడుతుంది.

👉మొబైల్ నెంబర్‌కు కనెక్ట్ చేయాలి

ఇదివరకే చెప్పుకున్నట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ను మొబైల్ నెంబర్‌తో కనెక్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు అవసరమైన అప్డేట్స్ చేస్తూ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ టోల్ గేట్ వద్ద వేగంగా టోల్ చెల్లించడానికి సహాయపడతాయి. కాబట్టి ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించేవారు తప్పకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలి.

త్వరలో జీపీఎస్ టెక్నాలజీ

టోల్ ఫీజును వసూలు చేయడానికి జీపీఎస్ టెక్నాలజీని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఇప్పటికే ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇది విజయవంతమైంది. కాబట్టి ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని మరిన్ని హైవేల మీద ఈ టెక్నాలజీ సాయంతోనే టోల్ వసూలు చేస్తారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ ట్యాక్స్ చెల్లించడానికి వాహనదారుల ఎక్కడా వాహనం ఆపుకోవాల్సిన అవసరం లేదు.

Don’t Miss: వచ్చేసింది ఫ్రెంచ్ బ్రాండ్.. టాటా కారుకు సరైన ప్రత్యర్థి ‘సిట్రోయెన్ బసాల్ట్’: ధర ఎంతో తెలుసా?

ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకం తీసుకువచ్చింది. దీని ద్వారా ఎవరైనా రోడ్డుమీద గాయపడితే లేదా ఇతర ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఉచిత చికిత్సను అందిస్తారు. అస్సాంలో ఈ పథకం అమలు చేయడం ప్రారంభించినట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

వచ్చేసింది ఫ్రెంచ్ బ్రాండ్.. టాటా కారుకు సరైన ప్రత్యర్థి ‘సిట్రోయెన్ బసాల్ట్’: ధర ఎంతో తెలుసా?

0

Citroen Basalt Debuts in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఎట్టకేలకు తన కొత్త ఎస్‌యూవీ ‘బసాల్ట్’ (Basalt)ను అధికారికంగా భారతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కారు ఎలాంటి హంగు, ఆర్బాటం లేకుండానే మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీ ధరలను సంస్థ ఆగష్టు 7న ప్రకటించనుంది.

డిజైన్

ఈ ఏడాది మార్చిలో కనిపించిన ప్రొడక్షన్ స్పెక్ మోడల్ మాదిరిగానే.. బసాల్ట్ ఉంది. అయితే ఇక్కడ ఓ చిన్న చేంజ్ ఏమిటంటే? బాడీ క్లాడింగ్ స్కెచ్‌లో కనిపించినట్లు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌కు బదులుగా.. మ్యాట్ ప్లాస్టిక్ ఫినిషింగ్ పొందుతుంది. ఈ కారు డిజైన్ కొంత సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ మాదిరిగా అనిపిస్తుంది. అయితే కొన్ని భిన్నమైన ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ముందు భాగంలో క్రోమ్ లైన్డ్ లోగో, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ చూడవచ్చు. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి.

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ యొక్క వీల్ ఆర్చ్‌ల మీద స్క్వేర్డ్ ఆఫ్ క్లాడింగ్, రెండు వైపులా ఒక పించ్డ్ విండోలైన్ మరియు బూట్ లిడ్ వరకు సాగిన రూఫ్ లైన్ వంటివి చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్ 17 ఇంచెస్ అల్లవ్ వీల్స్ పొందుతుంది. వెనుక చిన్నగా ఉన్న టెయిల్ గేట్, 3డీ ఎఫెక్ట్ హాలోజన్ టెయిల్ లాంప్ మరియు బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఛంకీ డ్యూయెల్ టోన్ బంపర్ చూడవచ్చు. మొత్తానికి డిజైన్ చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది.

కలర్ ఆప్షన్స్ మరియు డైమెన్షన్

దేశీయ విఫణిలో అడుగెట్టిన కొత్త సిట్రోయెన్ బసాల్ట్ మొత్తం ఐదు సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, గార్నెట్ రెడ్ మరియు కాస్మో బ్లూ. ఇందులోని రూప్ మాత్రం బ్లాక్ కలర్ పొందుతుంది.

పరిమాణం పరంగా కూడా బసాల్ట్ ఉత్తమగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ వీల్‌బేస్ 2651 మిమీ వరకు ఉంటుంది. ఇది సీ3 ఎయిర్‌క్రాస్ వీల్‌బేస్ కంటే కూడా 20 మిమీ తక్కువ. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ బసాల్ట్ యొక్క ఇంటీరియర్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. సీ3 ఎయిర్‌క్రాస్ నుంచి తీసుకున్న డ్యాష్‌బోర్డ్, మాన్యువల్ ఏసీ వెంట్స్ మీద డిజిటల్ రీడౌట్, టోగుల్ స్విచ్‌లు, ఆటో ఏసీ ఫంక్షన్‌తో కూడా బటన్స్ అన్నీ కూడా ఇక్కడ గమనించదగ్గ అప్డేట్స్. అంతే కాకుండా పెద్ద ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు రీడిజైన్ చేయబడిన కాంటౌర్డ్ రియర్ హెడ్‌రెస్ట్‌ వంటివి ఉన్నాయి. ఈ కారులో బూట్ స్పేస్ 470 లీటర్ల వరకు ఉంది. ఇంకా రూప్ మరియు సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వద్ద ఏసీ వెంట్స్ ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 10.25 ఇంచెస్ మౌంటెడ్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు 15 వాట్స్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కూడా ఇందులో ఉంటుంది. అయితే బసాల్ట్ సన్‌రూఫ్ ఫీచర్ కోల్పోతుంది.

ఇంజిన్

కొత్త బసాల్ట్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మొదటి ఇంజిన్ 81 బీహెచ్‌పీ పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 18 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది.

ఇక రెండో ఇంజిన్ టర్బో పెట్రోల్ విషయానికి వస్తే.. ఇది 108 బీహెచ్‌పీ పవర్ మరియు 195 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను పొందుతుంది. మాన్యువల్ వేరియంట్ 19.5 కిమీ మైలేజ్, ఆటోమాటిక్ వేరియంట్ 18.7 కిమీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.

సేఫ్టీ ఫీచర్స్

ముఖ్యంగా తెలుసుకోవలసిన అంశం సేఫ్టీ ఫీచర్స్. సిట్రోయెన్ బసాల్ట్ యొక్క అన్ని వేరియంట్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది.

Don’t Miss: తక్కువ ధర & ఎక్కువ మైలేజ్.. వచ్చేసింది ‘హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ’

ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన సిట్రోయెన్ బసాల్ట్ దాని విభాగంలో గట్టి పోటీని ఎదుటర్కోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా టాటా కర్వ్ ఎస్‌యూవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి కార్లకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ బసాల్ట్ ఎస్‌యూవీ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 10 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉండొచ్చని సమాచారం.

తక్కువ ధర & ఎక్కువ మైలేజ్.. వచ్చేసింది ‘హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ’

0

Hyundai Grand i10 Nios CNG launched in India: దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు మరియు సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తమ వాహనాలను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో ‘హ్యుందాయ్’ (Hyundai) కంపెనీ ‘గ్రాండ్ ఐ10 నియోస్’ (Grand i10 Nios) కారును సీఎన్‌జీ విభాగంలో లాంచ్ చేసింది.

ధర (Price)

హ్యుందాయ్ కంపెనీ తన ఎక్స్‌టర్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసిన తరువాత.. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌ను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 7.75 లక్షల నుంచి రూ. 8.30 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది.

కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ మాగ్మా మరియు స్పోర్ట్స్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది రెండు సీఎన్‌జీ సిలిండర్లను పొందుతుంది. కాబట్టి బూట్ స్పేస్ ఎక్కువగా లభిస్తుంది. అయితే ధర మాత్రం సింగిల్ సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్ కలిగిన కారు కంటే రూ. 7000 ఎక్కువ. కాగా పెట్రోల్ వేరియంట్ కంటే కూడా ఇది రూ. 97000 ఎక్కువని తెలుస్తోంది.

డిజైన్ మరియు ఫీచర్స్ (Design And Features)

కొత్త ఐ10 నియోస్ సీఎన్‌జీ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది సీఎన్‌జీ కారు అని తెలియడానికి కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. అయితే ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ మాగ్మా మరియు స్పోర్ట్స్ వేరియంట్స్ అదే ఫీచర్స్ పొందుతాయి. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు డ్రైవర్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.

ఇంజిన్ (Engine)

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు 69 హార్స్ పవర్ మరియు 95 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్‌తో నడుస్తున్నప్పుడు 83 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఈ కారు డ్యూయెల్ సెటప్ సిలిండర్ పొందుతుంది కాబట్టి బూట్ స్పేస్.. సాధారణ కారులో మాదిరిగానే ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సీఎన్‌జీ కార్లలో డ్యూయెల్ సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్ కలిగిన ఏకైక కారు టాటా టియాగో. దీని ధరలు రూ. 6.60 లక్షలు నుంచి రూ. 8.35 లక్షల మధ్య ఉన్నాయి. అయితే నియోస్ సీఎన్‌జీ మోడల్ దేశీయ మార్కెట్లో వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ, సెలెరియో సీఎన్‌జీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరగటానికి కారణం ఇదే..

ఇండియన్ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరగటానికి ప్రధాన కారణం మైలేజ్ అనే చెప్పాలి. ఉదాహరణకు ఒక పెట్రోల్ కారు ఒక లీటరుకు 20 కిమీ మైలేజ్ అందిస్తుంది అనుకుంటే.. సీఎన్‌జీ కారు ఒక కేజీ సీఎన్‌జీతో 25 కిమీ నుంచి 28 కిమీ మైలేజ్ అందిస్తుంది. అంతే కాకుండా పెట్రోల్ ధరతో పోలిస్తే.. సీఎన్‌జీ ధర కొంత తక్కువే. ఈ కారణంగా ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’: రేటెంతో తెలుసా?

ఇది మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ కార్ల నుంచి వచ్చే ఉద్గారాల పరిమాణం కూడా తక్కువే. ఇవి వాతావరణంలో కాలుష్య తీవ్రతను కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో దేశంలో ఫ్యూయెల్ కార్లు కనుమరుగయ్యే సూచనలువీటి స్థానంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ కార్లే రాజ్యమేలే అవకాశం ఉందిని నిపుణులు చెబుతున్నారు.

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’: రేటెంతో తెలుసా?

0

Nissan X-Trail Launched in India: వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ ఎక్స్-ట్రైల్’ (Nissan X-Trail) ఎట్టకేలకు భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటి వరకు కేవలం ఒక కారును మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్.. ఇప్పుడు మరో కారును విక్రయించడానికి సిద్ధమైంది.

ధర (price)

సుదీర్ఘ నిరీక్షణ తరువాత నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ఎక్స్-ట్రైల్ ప్రారంభ ధర రూ. 49.92 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది. ఆ కారణంగానే ఈ ఎస్‌యూవీ ధర కొంత ఎక్కువగా ఉంది.

డిజైన్ (Design)

చూడగానే ఆకర్శించబడే నిస్సాన్ కొత్త కారు ఎక్స్-ట్రైల్ వీ-మోషన్ గ్రిల్ పొందుతుంది. దీనికి చివర హెడ్‌లైట్స్ ఉన్నాయి. వాటికి కింద డీఆర్ఎల్ చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్ 20 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. వెనుక వైపు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ మరియు టెయిల్ ల్యాంప్ సెట్ ఉంది. మొత్తం మీద డిజైన్ ఆధునిక కాలంలో వాహన ప్రియులను ఆకర్శించే విధంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

ఫీచర్స్ (Features)

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ అనేది 7 సీటర్ కాన్ఫిగరేషన్ మోడల్. అంటే ఇది 7 సీటర్ కారు. కాబట్టి క్యాబిన్ విశాలంగా ఉంటుంది. లోపల మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంటుంది. ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

ఎక్స్-ట్రైల్ అనేది 7 సీటర్ రూపంలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఈ కారు యొక్క రెండో వరుసలో 40/20/40 స్ప్లిట్ ఫోల్డింగ్, స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదే విధంగా మూడో వరుసలో 50/50 స్ప్లిట్ ఫోల్డింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వాహన అవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇంజిన్ (Engine)

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ వేరియబుల్ కంప్రెషన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది 4800 rpm వద్ద 161 Bhp పవర్ మరియు 2800 – 3600 rpm వద్ద 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 13.7 కిమీ / లీటర్ మైలేజ్ అందిస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)

నిస్సాన్ యొక్క కొత్త ఎక్స్-ట్రైల్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందించడంలో ఉపయోగపడతాయి. వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్స్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి.

ప్రత్యర్థులు (Rivals)

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner), స్కోడా కొడియాక్ (Skoda Kodiaq), జీప్ మెరిడియన్ (Jeep Meridian) మరియు ఎంజీ గ్లోస్టర్ (MG Gloster) వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఈ కారు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.

Don’t Miss: ‘తాప్సి’ గ్యారేజిలోని కళ్ళు చెదిరే కార్లు.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే!

నిస్సాన్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో మాగ్నైట్ కారును విజయవంతంగా విక్రయిస్తోంది. ఈ తరుణంలో సంస్థ మరో కారును ఎక్స్-ట్రైల్ పేరుతో లాంచ్ చేసింది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కార్లను లాంచ్ చేసే అవకాశం ఉందని.. మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని కూడా ఆశిస్తున్నాము.