32.2 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 32

‘తాప్సి’ గ్యారేజిలోని కళ్ళు చెదిరే కార్లు.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే!

0

Birthday Special Taapsee Pannu Expensive Car Collection: ప్రముఖ నటి ‘తాప్సి’ (Taapse Pannu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తాప్సి పన్ను.. ఆ తరువాత వీర, షాడో, మొగుడు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అతి తక్కువ కాలంలోనే సినీ ప్రపంచంలో గొప్ప పేరుతెచ్చుకున్న ఈమె ఖరీదైన కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతుంది. ఈ రోజు (ఆగష్టు 1) తాప్సి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందో.. వివరంగా తెలుసుకుందాం.

మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600

తాప్సి గ్యారేజిలో ఉన్న ఖరీదైన లగ్జరీ కార్లలో జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన ‘బెంజ్’ కంపెనీకి చెందిన ‘మేబ్యాక్ జీఎల్ఎస్ 600’ ఒకటి. సుమారు రూ. 3.5 కోట్లు ఖరీదైన ఈ కారు మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు ఈ కారుని ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

పల్లాడియం సిల్వర్ షేడ్‌లో ఉన్న మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 కారుని తాప్సి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ కారు నాప్పా లెదర్ అప్‌హోల్‌స్టరీ, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ మసాజింగ్ సీట్లు మరియు మరెన్నో విలాసవంతమైన ఇంటీరియర్‌ ఫీచర్స్ పొందుతుంది.

మేబ్యాక్ జీఎల్ఎస్ 600 కారు 4.0 లీటర్ వీ8 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 557 పీఎస్ పవర్ మరియు 730 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని 48వీ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ 22 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350 (Mercedes Benz GLE 350)

తాప్సీ పన్ను వద్ద మరో ఖరీదైన లగ్జరీ కారు ‘మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350’. దీని ధర రూ. 60 లక్షలు నుంచి రూ. 80 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారుపై తాప్సి పడుకున్న ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ఆమె మార్గరెట్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350 SUV 2.9 లీటర్ 6 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ పొందుతుంది. ఇది గరిష్టంగా 268 బిహెచ్‌పి పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్1 (BMW X1)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్1 కూడా తాప్సి గ్యారేజిలోని మరో ఖరీదైన కారు. బెంజ్ కారు కొనుగోలు చేయడానికి ముందు ఈమె ఈ కారునే ఎక్కువగా వినియోగించినట్లు సమాచారం. ఇక్కడ కనిపిస్తున్న తాప్సి బీఎండబ్ల్యూ ఎక్స్1 అనేది ఫస్ట్ జనరేషన్ కారు.

బీఎండబ్ల్యూ ఎక్స్1 కారులో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 105 Bhp పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 184 Bhp పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

జీప్ కంపాస్ (Jeep Compass)

అమెరికన్ కార్ల తయారీ సంస్థ ‘జీప్’ కంపెనీకి చెందిన కంపాస్ కూడా నటి తాప్సి గ్యారేజిలో ఉంది. 2019 జూన్ నెలలో కొనుగోలు చేసిన ఈ కారు అద్భుతమైన మెగ్నీసియో గ్రే యొక్క చాలా క్లాసీ షేడ్‌లో కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ఫోటోలను గమనించినట్లయితే ఇది బ్రాండ్ యొక్క టాప్ ఎండ్ మోడల్ అని తెలుస్తోంది.

Don’t Miss: సునీల్ శెట్టి మనసు దోచిన బుల్లి కారు! ధర చాలా తక్కువ..

జీప్ కంపాస్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. పెట్రోల్ వేరియంట్‌లు 1.4 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా 160 బిహెచ్‌పి పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వేరియంట్‌లలో 2.0 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 171 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కార్గిల్ యుద్ధ వీరుల గుర్తుగా.. ‘పరాక్రమ్ ఎడిషన్’: డిజైన్ చూస్తేనే దిల్ కుష్

0

TVS Ronin Parakram Edition Unveiled: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీగా పేరుపొందిన ఇండియాలో ఎప్పటికప్పుడు అధునాతన వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ టూ వీలర్ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) దేశీయ విఫలో సరికొత్త బైక్ ఆవిష్కరించింది.

రోనిన్ పరాక్రమ్ ఎడిషన్

టీవీఎస్ కంపెనీ భారతీయ విఫణిలో లాంచ్ చేసిన బైక్ ‘రోనిన్ పరాక్రమ్ ఎడిషన్’ (Ronin Parakram Edition). సంస్థ ఈ బైకును 25 సంవత్సరాల కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్దంగా ఆవిష్కరించింది. ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా భిన్నంగా అనేక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అయితే ఇంజిన్ మరియు పనితీరులో మాత్రం ఎటువంటి మార్పులు లేదు.

డిజైన్

కొత్త టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్ పొంది ఉండటం వల్ల చూడగానే రోనిన్ అని గుర్తించడం కొంచెం కష్టమైన పనే. అయితే నిశితంగా పరిశీలిస్తే ఇది రోనిన్ అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ మీద వెండి రంగులో, ఆలీవ్ గ్రీన్ కలర్ చూడవచ్చు. హెడ్‌లైట్ దగ్గర నుంచి ఫ్యూయెల్ ట్యాంక్ మధ్య భాగం వరకు జాతీయ జెండా (ఇండియన్ ఫ్లాగ్) కలర్స్ ఉండటం గమనించవచ్చు.

బైక్ యొక్క మడ్‌గార్డ్, క్నీ రెసెస్ మరియు సైడ్ ప్యానెల్ వంటివన్నీ ఆలివ్ గ్రీన్ కలర్ పొందుతాయి. ఇక్కడ కార్గిల్ యుద్దానికి సంబంధించిన సైనికుల చిత్రాలు చూడవచ్చు. బైక్ ఎడమవైపు కవర్ పసుపు రంగులో 99 సంఖ్యను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ రోనిన్ బైక్ మాదిరిగా కాకుండా.. సింగిల్ లెదర్ సీటు పొందుతుంది.

టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ యొక్క హ్యాండిల్ బార్ గ్రిప్‌లు కూడా లెదర్ ట్రీట్‌మెంట్‌ను పొందుతాయి. వెనుక కొంత కుదించబడి.. స్టెయిన్‌లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్ బైకులో ఉన్న మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ టైర్ల స్థానంలో నాబీ టైర్లు ఉన్నాయి. ఇండికేటర్లు బుల్లెట్ మాదిరిగా ఉండటం చూడవచ్చు. హెడ్‌లైట్ మీద చిన్న విండ్ స్క్రీన్ చూడవచ్చు.

ఇంజిన్

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లు టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ ఎలాంటి యాంత్రిక మార్పులను పొందదు. కాబట్టి ఈ బైక్ అదే 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి, 7750 rpm వద్ద 20.4 హార్స్ పవర్ మరియు 3750 rpm వద్ద 19.93 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరు కూడా స్టాండర్డ్ బైక్ మాదిరిగానే ఉంటుంది.

టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ యూఎస్డీ ఫోర్క్ మరియు ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. ఈ బైక్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కలిగి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. మొత్తం మీద ఈ బైక్ చూడగానే.. ఒక్క చూపుతోనే వాహన ప్రియులను ఆకర్షిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

విక్రయాలు

టీవీఎస్ కంపెనీ ఈ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ ఆవిష్కరించింది. కానీ ఇది ఎప్పుడు అమ్మకానికి వస్తుంది. ధర ఎంత ఉంటుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ బైక్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో.. అంటే పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నాము. అయితే స్టాండర్డ్ రోనిన్ బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాబట్టి ఈ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నాము. అయితే ధరలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Don’t Miss: హృతిక్ రోషన్ తండ్రి కొన్న కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..

దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ రోనిన్ బైక్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. ఈ సమయంలో రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ లాంచ్ మరింత మంది వాహన ప్రియులను ఆకర్షిస్తుంది. అయితే కంపెనీ ఈ ఎడిషన్‌ను ఎక్కువ సంఖ్యలో విక్రయించే అవకాశం లేదు, కాబట్టి ఎక్కువమంది ఈ బైకును కొనుగోలు చేసే అవకాశం లేదు.

హృతిక్ రోషన్ తండ్రి కొన్న కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..

0

Rakesh Roshan Buys New Mercedes Maybach S580: భారతదేశంలో విక్రయానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘మేబ్యాక్’ (Maybach) ఒకటి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ కారు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ కారును ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ‘రాకేష్ రోషన్’ కొనుగోలు చేశారు.

రాకేష్ రోషన్ కొనుగోలు చేసిన కారు ”వైట్ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్580”. ఈ సెడాన్ డెలివరీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ డీలర్.. రాకేష్ రోషన్‌కు గిఫ్ట్ అందించి, కారును డెలివరీ చేయడం చూడవచ్చు. ఈ ఫోటోలలో వైట్ కలర్ బెంజ్ కారును చూడవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్

దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్.. రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎస్580 మరియు ఎస్680. వీటి ధరలు వరుసగా రూ. 2.71 కోట్లు మరియు రూ. 3.43 కోట్లు (ఎక్స్ షోరూమ్). అయితే రాకేష్ రోషన్ కొనుగోలు చేసిన కారు ‘మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్580’ అని తెలుస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ సెడాన్ మంచి డిజైన్ కలిగి, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది నాటికే బ్లూ, ఓనికి బ్లాక్, ఎమరాల్డ్స్ గ్రీన్ మరియు వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. ముందు భాగంలో బ్రాండ్ లోగో ఉంటుంది. సైడ్ అండ్ రియర్ ప్రొఫైల్ అంతా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. 12.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వాటితో పాటు.. జీపీఎస్ న్యావిగేషన్, వాయిస్ కమాండ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు వైర్‌లెస్ ఛార్జర్ మొదలైనవి ఇందులో ఉంటాయి. ఇందులోని సీట్లు 19 మరియు 44 డిగ్రీల వరకు వంగుతాయి. లెగ్ రెస్ట్ కూడా ఇందులో లభిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా.. హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, సీట్ వెంటిలేషన్, వెనుక ప్రయాణికుల కోసం కాఫ్ మసాజర్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

బెంజ్ మేబ్యాక్ ఎస్580 మరియు ఎస్680 యొక్క పవర్‌ట్రెయిన్‌ విషయానికి వస్తే.. ఇవి రెండూ చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఎస్580 ఈక్యూ బూస్ట్‌తో కూడిన 4.0 లీటర్ వీ8 ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. ఇది 496 Bhp పవర్ మరియు 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం మరియు 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

ఇక ఎస్680 విషయానికి వస్తే.. ఇది 6.0 లీటర్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 604 Bhp పవర్ మరియు 900 Nm మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం మరియు 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

హృతిక్ రోషన్ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా గతంలో మేబ్యాక్ ఎస్600 కొనుగోలు చేశారు. ఇది కూడా అదే వైట్ కలర్ పొందింది. ఈ సెడాన్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 6.0 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 Bhp పవర్ మరియు 830 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Don’t Miss: కల్కి 2898 ఏడీ: ‘బుజ్జి’ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు

రాకేష్ రోషన్

1970 నుంచి సుమారు 84 చిత్రాలలో ఈయన కనిపించారు. ఈయన దర్శకత్వంలో చాలా చిత్రాలు ‘కే’ ప్రారంభమై గొప్ప హిట్స్ కొట్టాయి. ఇందులో ఖుద్గర్జ్, కహో నా, క్రిష్, కోయి మిల్ గయా భారీ హిట్ సాధించాయి. కహోనా సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అనేక అవార్డులను పొందారు. మొత్తం మీద బాలీవుడ్ చిత్ర సీమలో రాకేష్ రోషన్ ఒక మెరుపు మెరిశారు.

సెలబ్రిటీల మనసు దోచిన ఒకే బ్రాండ్ బైక్ ఇదే!.. ఫోటోలు చూశారా?

0

Jawa And Yezdi Owners of India: సెలబ్రిటీలందరూ కేవలం కార్లను మాత్రమే కొనుగోలు చేస్తారు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఎక్కువ భాగం వీరు కార్లను కొనుగోలు చేసినప్పటికీ.. అప్పుడప్పుడు తమకు నచ్చిన బైకులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఆలా కొనుగోలు చేసినవారిలో మహేంద్ర సింగ్ ధోని, రాజ్ కుమార్ రావు, గుల్ పనాగ్, రుతురాజ్ గైక్వాడ్, ఉన్ని ముకుందన్ మరియు కైలాష్ కేర్ ఉన్నారు. నిజానికి వీరి పేర్లు మాత్రమే ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. వీరందరూ ఒకే బ్రాండ్ బైక్ కొనుగోలు చేశారు. ఇంతకీ వీరు కొనుగోలు చేసిన బైక్ బ్రాండ్ ఎదనుకుంటున్నారా? అయితే ఇది చావాల్సిందే..

మహేంద్ర సింగ్ ధోని

ఇండియా క్రికెటర్.. కెప్టెన్ కూల్‌గా పిలువబడే ఎంఎస్ ధోని గ్యారేజిలో లెక్కకు మించిన కార్లు, బైకులు ఉన్నాయి. అందులో ఒకటి జావా మోటార్‌సైకిల్ (Jawa Motorcycle) కంపెనీకి చెందిన 42 బాబర్ (42 Bobber). ఈ బైక్ సాధారణ జావా 42 బాబర్ బైక్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇది కస్టమైజ్ సీటు కలిగి, గోల్డెన్ పిన్‌స్ట్రైప్‌లతో కూడిన జాడే / బాటిల్ గ్రీన్ కలర్ పొందుతుంది.

జావా 42 బాబర్ బైక్ 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 29.5 బీహెచ్‌పీ పవర్ & 32.74 న్యూటన్ మీటర్ టార్క్ డెలివరీ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ ధర రూ. 2.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 35 మిమీ టెలిస్కోపిక్ పోర్క్, వెనుకవైపు మోనోషాక్‌తో జతచేయబడి ఉంటుంది. ధోని గారేజీలో పురాతన వాహనాలు కూడా ఉన్నట్లు సమాచారం.

రాజ్ కుమార్ రావు

బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు ఇటీవల సరికొత్త జావా యెజ్డీ రోడ్‌స్టర్ బైకును కంపెనీ నుంచి గిఫ్ట్‌గా పొందారు. ఇది కూడా కస్టమైజ్డ్ బైక్. దీనిని రాజ్ కుమార్ రావు యొక్క ‘గన్స్ అండ్ గులాబ్స్’ సిరీస్ గుర్తుగా కంపెనీ అందించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. ఈ బైక్ ముదురు గోధుమ రంగులో ఉండటం చూడవచ్చు.

జావా యెజ్డీ రోడ్‌స్టర్ బైక్ గన్స్ అండ్ గులాబ్స్ లోగోలను పొందుతుంది. ఇందులో బాబర్ బైక్ యొక్క అదే 334 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 28 బీహెచ్‌పీ పవర్, 29.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ యొక్క ప్రారంభ ధర రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్).

గుల్ పనాగ్

ప్రముఖ నటి, మోడల్ గుల్ పనాగ్.. వద్ద కూడా జావా 42 బైక్ ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఈ బైక్ రైడ్ చేస్తూ ఈమె కనిపించారు. ఈ బైక్ లైమ్ కలర్ పొంది ఉండటం ఫోటోలలో చూడవచ్చు. ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్ మీద జెండా రంగులు ఉండటం చూడవచ్చు.

నటి గుల్ పనాగ్ ఈ బైక్ ఫ్యూయెల్ క్యాప్ మీద తన పేరును, పుట్టిన సంవత్సరాన్ని వేయించుకున్నట్లు సమాచారం. ఈ బైక్ 293 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 27.3 పీఎస్ పవర్, 27.05 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

రుతురాజ్ గైక్వాడ్

ఎంఎస్ ధోని మాత్రమే కాకుండా మరో భారతీయ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా జావా 42 బాబర్ బైక్ కలిగి ఉన్నారు. రుతురాజ్ జావా బైక్ వైట్ కలర్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో బైక్ డెలివరీ వంటి వాటిని చూడవచ్చు.

ఉన్ని ముకుందన్

కార్లు మరియు బైకుల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన ప్రముఖులలో ప్రముఖ మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ఒకరు. ఈ కారణంగానే ఈయన వద్ద అనేక కార్లు, బైకులు ఉన్నాయి. ఇందులో జావా పెరాక్ బైక్ కూడా ఉంది. ఇది క్లాసీ మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది.

సుమారు రూ. 2.49 లక్షల (ఎక్స్ షోరూమ్) ఖరీదైన ఈ బైక్ 334 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 30.64 పీఎస్ పవర్ మరియు 32.74 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సింగిల్ సీటు కలిగిన ఈ బైక్ బార్ ఎండ్ మిర్రర్స్, చిన్న ఎగ్జాస్ట్, పొట్టిగా ఉన్న మడ్‌గార్డ్ వంటివి ఈ బైకులో ఉన్నాయి.

Don’t Miss: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

కైలాష్ ఖేర్

బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ కూడా జావా పెరాక్ బైక్ కలిగి ఉన్నారు. ఈయన స్వరకర్త అయినప్పటికీ.. భారతీయ జానపదం, సూపీ సంగీతం వంటి వాటిలో దిట్ట. అయితే ఈయన ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. కాబట్టి ఈయన తనకు నచ్చిన జావా బైక్ కొనుగోలు చేశారు. ఈ బైక్ మాత్రమే కాకుండా.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.

‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

0

Allu Arjun Mitsubishi Pajero in Push 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలుసు. ఇక ‘పుష్ప 2’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు (డిసెంబర్ 4) రిలీజ్ అయింది. విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే మూడు సార్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా నిర్వహించారు.

సుకుమార్ దర్శకత్వంలో విడుదలకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీ వల్లి (రష్మిక మందన్న) నటిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్, ఫహద్ ఫాసిల్ ప్రధాన పత్రాలు పోషిస్తున్న ఈ మూవీ సినిమా కోసం ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ భారీ బడ్జెట్ కేటాయించింది. తాజాగా అనసూయ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్లల్లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ మాత్రమే కాకుండా.. పాటలకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. ఇకపోతే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఉపయోగించే కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకీ ఈ కారు పేరు ఏంటి? దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్లలో కనిపించిన కారు పేరు ‘మిత్సుబిషి పజెరో’ (Mitsubishi Pajero). ఇది జపాన్ కంపెనీకి చెందిన కారు. ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు ప్రస్తుతం అక్కడక్కడా అరుదుగా కనిపిస్తోంది.

‘మిత్సుబిషి పజెరో’ చరిత్ర

1934లో జపాన్ ప్రభుత్వం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ కారు.. తరువాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఆ తరువాత 1978లో పజెరో II పేరుతో పరిచయమైనప్పటికీ.. 1981 టోక్యో మోటార్ షోలో మొదటి ఉత్పత్తిని ప్రదర్శించారు. 1982 నుంచి ఇది అమ్మకాలని మార్కెట్లోకి వచ్చేసింది. ఇలా మార్కెట్లోకి మిత్సుబిషి పజెరో అడుగుపెట్టింది.

మిత్సుబిషి పజెరో ప్రారంభంలో గొప్ప అమ్మకాలను సాధించగలిగింది. ఆ తరువాత ఇది ల్యాండ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది. ఆ తరువాత అమ్మకాలు కొంత మందగించడం మొదలైంది. ఆ తరువాత కాలక్రమంలో ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. దీంతో 2021లో ఈ కారు ఉత్పత్తి నిలిచిపోయింది. నాలుగు తరాలు మార్కెట్లో మనుగడ సాగించిన ఈ కారు ఎంతోమంది వాహన ప్రేమికులకు ఇష్టమైన మోడల్.

ధర

దేశీయ మార్కెట్లో మిత్సుబిషి పజెరో విక్రయానికి లేదు. కానీ ఇది భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న సమయంలో దీని ధర రూ. 18 లక్షల కంటే ఎక్కువని సమాచారం. అయితే ఇప్పుడు ఈ కారు ‘మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్’ పేరుతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. దీని ధర రూ.28 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉంది.

Also Read: పుష్ప 2 విడుదలకు ముంచే.. లగ్జరీ కారు కొనేసింది: దీని రేటెంతో తెలుసా?

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు.. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. మిత్సుబిషి పజెరో సెవెన్ సీటర్ కారు. ఇది కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఇందులో ఉండేవి. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉండటం వల్ల.. ఈ కారు వాహన వినియోగదారులు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేది.

మిత్సుబిషి పజెరో రోజు వారీ వినియోగనికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కంపెనీ దీనికి తగిన విధంగా ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ అందించింది. కాబట్టి దీంతో ఆఫ్-రోడింగ్ ప్రియులు ఆఫ్-రోడింగ్ అనుభూతిని పొందవచ్చు. అన్ని విధాలా అనుకూలంగా ఉండే ఈ కారు కేవలం.. ప్రత్యర్థులను తట్టుకోలేక అమ్మకాల్లో వెనుక పడింది. ఈ కారణంగానే దీని ఉత్పత్తి నిలిచిపోయింది.

మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్

నాలుగు తరాలు ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచిన మిత్సుబిషి పజెరో.. ఆధునిక హంగులతో పజెరో స్పోర్ట్స్ రూపంలో థాయిలాండ్, ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా దేశాల్లో అమ్ముడవుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మిత్సుబిషి కంపెనీకి చెందిన కార్లు భారతదేశంలో విక్రయానికి లేదు. బహుశా కంపెనీ రాబోయే రోజుల్లో కూడా మనదేశంలో కార్లను లాంచ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

ఆదిపురుష్ సీత (కృతి సనన్) వద్ద ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా! ఫోటోలు చూశారా?

0

Famous Actress Kriti Sanon Luxury Car Collection: అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్ర సీమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి ‘కృతి సనన్’ (Kriti Sanan). నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబు సరసన నటించి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈమె 1990 జులై 27న జన్మించారు. ఆదిపురుష్ సినిమాలో సీతగా ప్రేక్షకులను మెప్పించిన కృతి సనన్ పుట్టిన రోజు నేడే. ఈ సందర్భంగా కృతి సనన్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందో? ఇక్కడ చూసేద్దాం..

సినిమాల్లో నటించడం అభిరుచిగా కలిగిన కృతి సనన్.. విలాసవంతమైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగానే ఈమె గ్యారేజిలో ఆడి కంపెనీకి చెందిన క్యూ7, బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ 320డీ మరియు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకిన్ చెందిన మేబ్యాచ్ జీఎల్ఎస్600 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం.

ఆడి క్యూ7 (Audi Q7)

సినీ పరిశ్రమలో ఎక్కువమంది తారలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న ఆడి కార్లలో క్యూ7 కూడా ఒకటి. జర్మన్ బ్రాండ్ అయిన ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించే ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ ఆడి క్యూ7 కారు నటి కృతి సనన్ గ్యారేజిలో కూడా ఉంది.

విలాసవంతమైన ఫీచర్స్ కలిగిఆన్ ఈ కారులో.. ముంబై వీధుల్లో కృతి సనన్ పలు మార్లు కనిపించినట్లు చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రూ. 88.66 లక్షల నుంచి రూ. 97.84 లక్షల (ఎక్స్ షోరూమ్) ఖరీదైన ఈ కారు 2996 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5200 – 6400 rpm వద్ద 335.25 Bhp పవర్ మరియు 1370 – 4500 rpm వద్ద 500 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ.

బీఎండబ్ల్యూ 3 సిరీస్ 320డీ (BMW 3 Series 320D)

కృతి సనన్ ఉపయోగించే కార్లలో మరొకటి బిఎండబాలయు కంపెనీకి చెందిన 3 సిరీస్ 320డీ. రూ. 48 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు సూపర్ డిజైన్, డైనమిక్ పర్ఫామెన్స్ అందిస్తుంది. అద్భుతమైన కంఫర్ట్ అందించే ఈ కారు లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు సిరీ మరియు హైవే డ్రైవింగ్ వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ 3 సిరీస్ 320డీ కారు 1995 సీసీ 4 సిలిండర్ ఇన్‌లైన్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 188 Bhp పవర్ మరియు 1750 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 235 కిమీ/గం. ఈ కారు కృతి సనన్ ఫేవరేట్ కారు అని తెలుస్తోంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 (Mercedes Maybach GLS600)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యొక్క మేబ్యాచ్ జీఎల్ఎస్600 కూడా కృతి సనన్ గ్యారేజిలో ఉంది. ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). కృతి సనన్ గ్యారేజిలో ఇదే అత్యంత ఖరీదైన కారు అని తెలుస్తోంది. విలాసవంతమైన డిజైన్, విలాసవంతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారులో కూడా కృతి సనన్ పలుమార్లు కనిపించింది.

Don’t Miss: భారత్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!.. అనంత్ అంబానీకి అరుదైన కారు గిఫ్ట్

మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 కారు 3982 సీసీ 8 సిలిండర్ 4 వాల్వ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 550 Bhp పవర్, 2500 rpm వద్ద 770 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. విలాసవంతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

కృతి సనన్ సినీ ప్రపంచం

నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై.. అక్కినేని నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాలో కూడా నటించింది. ఆ తరువాత ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ఈమె 2021 రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ చలన చిత్ర అవార్డు దక్కించుకుంది. అంతే కాకుండా అనేక ఇతర ప్రతిష్టాత్మక అవార్డులను సైతం ఈమె దక్కించుకుంది.

ఆరు నెలల్లో లక్ష మంది కొనేశారు!.. ఎందుకింత డిమాండ్ తెలుసా?

0

Hyundai Creta Facelift Crossed One Lakh Unit Sales: దేశంలో అందరికి సుపరిచయమైన వాహన తయారీ సంస్థ ‘హ్యుందాయ్’ (Hyundai) మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వాహన ప్రియులకు దగ్గరవుతున్న విషయం విదితమే. ఎంతలా ప్రజలకు దగ్గరవుతోందంటే.. కొన్ని రోజులకు ముందు భారతీయ విఫణిలో అడుగుపెట్టిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఏకంగా 1 మందికి చేరువయ్యంది. దీన్ని బట్టి చూస్తే హ్యుందాయ్ కంపెనీకి ఉన్న ఆదరణ స్పష్టంగా అర్థమైపోతోంది.

ఆరు నెలల్లో 1 లక్ష యూనిట్ల సేల్స్

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కేవలం 6 నెలల్లో లక్ష యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. ఇది అమ్మకాల్లో కంపెనీ సాధించిన అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. సంస్థ నెలకు సగటున 15000 క్రెటా కార్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024 మార్చి నెలలో కంపెనీ గరిష్టంగా 16458 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. జూన్ నెలలో కూడా హ్యుందాయ్ ఏకంగా 16293 యూనిట్ల క్రెటాలను విక్రయించింది.

కంపెనీ రోజుకు సగటున 550 యూనిట్ల హ్యుందాయ్ క్రెటా కార్లను విక్రయించింది. ఇప్పటికి కూడా క్రెటా కారు కోసం 10 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటూనే.. క్రెటా అమ్మకాల్లో గణనీయంగా వృద్ధి చెందింది అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

మొత్తం 11 లక్షల యూనిట్లు

భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీ మొత్తం 11 లక్షల క్రెటా కార్లను విక్రయించింది. ఇందులో సాధారణ క్రెటా కార్ల అమ్మకాలు 10 లక్షలు కాగా.. ఫేస్‌లిఫ్ట్ అమ్మకాలు 1 లక్ష యూనిట్లు. గత ఫిబ్రవరిలో క్రెటా 10 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కాగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ అమ్మకాలు ఇప్పుడు 1 లక్ష యూనిట్లకు చేరుకుంది. మొత్తం మీద క్రెటా 11 లక్షల సేల్స్ సాధించగలిగింది.

క్రెటా మాత్రమే కాదు

హ్యుందాయ్ క్రెటా మాత్రమే కాకుండా.. ఎక్స్‌టర్ మరియు మారుతి ఫ్రాంక్స్ వంటివి కూడా అమ్మకాల్లో లక్ష మైలురాయిని చేరుకున్నాయి. ఎక్స్‌టర్ లక్ష యూనిట్ల అమ్మకాలను పొందటానికి 12 నెలలు, ఫ్రాంక్స్ లక్ష యూనిట్ల అమ్మకాలు పొందటానికి 10 నెలల సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇండియన్ మార్కెట్లో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

క్రెటా విజయానికి కారణం

భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రియులకు ఇష్టమైన కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ హ్యుందాయ్ యొక్క క్రెటా. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. క్రెటా కారు పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద డిజిటల్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా మరియు ఏడీఏఎస్ (అడ్వాన్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటివి పొందుతుంది. ఇవన్నీ ప్రయాణాన్ని మరింత హుందాగా మారుస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ధరలు రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉంటుంది. ఇది కూడా క్రెటా అమ్మకాలు పెరగటానికి పెద్ద కారణామనే చెప్పాలి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను పొందుతుంది.

Don’t Miss: రూ.5.49 లక్షలకే మారుతి ఇగ్నీస్ కొత్త ఎడిషన్.. పూర్తి వివరాలు ఇక్కడ

క్రెటాలోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు సీవీటీ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇక 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 160 పీఎస్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా అద్భుతమైన డిజైన్ కలిగి, వాహనదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలను పొందుతోంది. ఇప్పటికి కూడా క్రెటా యొక్క 33000 ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారును డెలివరీ చేసుకోవడానికి కనీసం 10 వారాలు ఎదురు చూడాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది.

రూ.5.49 లక్షలకే మారుతి ఇగ్నీస్ కొత్త ఎడిషన్.. పూర్తి వివరాలు ఇక్కడ

0

Maruti Ignis Radiance Edition Launched in India: ఇండియన్ మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన మారుతి ఇగ్నీస్ (Maruti Ignis) ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఎడిషన్ పేరు ‘రేడియన్స్’ (Radiance) ఎడిషన్. ఇది ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సరసమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

ధర

మారుతి సుజుకి రేడియన్స్ ఎడిషన్ ప్రారంభ ధరలు రూ. 5.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కొత్త వేరియంట్‌‌ను సిగ్మా, జీటా, అల్పా అనే మూడు ట్రిమ్‌లలో అందిస్తుంది. అయితే వేరియంట్ వారీగా ధరలు వెల్లడికావాల్సి ఉంది. కాగా ఇది దాని స్టాండర్డ్ ఎడిషన్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొంది ఉంటుంది.

అడిషినల్ యాక్ససరీస్ & ధరలు

మారుతి ఇగ్నీస్ రేడియన్స్ ఎడిషన్‌లో అడిషినల్ యాక్ససరీస్ లభిస్తాయి. సిగ్మా ట్రిమ్‌లో వీల్ కవర్లు, డోర్ వైజర్స్, క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. వీటి కోసం అదనంగా రూ. 3650 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అల్పా, జీటా ట్రిమ్‌లలో అడిషినల్ యాక్ససరీస్ పొందటానికి రూ. 9500 చెల్లించాలి. ఇందులో సీట్ కవర్లు, కుషన్లు, డోర్ క్లాడింగ్, డోర్ వైజర్ మొదలైనవన్నీ ఉన్నాయి.

డిజైన్

కొత్త మారుతి ఇగ్నీస్ రేడియన్స్ ఎడిషన్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ ఎడిషన్ మాదిరిగానే కనిపిస్తుంది. అంతే కాకుండా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకూండా పెద్దగా గమనించాల్సిన మార్పులు లేదు. కాబట్టి అదే హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, మరియు బ్రాండ్ లోగో వంటివి ఉండటం గమనించవచ్చు. ఇవన్నీ చూపరులను ఆకర్శించడంలో ఉపయోగపడతాయి.

ఫీచర్స్

ఇక రేడియన్స్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా ఆశాజనకమైన అప్డేటెడ్ ఫీచర్స్ ఏమీ లేదు. కాబట్టి అదే క్యాబిన్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఏసీ వెంట్స్ వంటివి ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ సమయంలో ప్రయాణికులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా యాంత్రికంగా కూడా ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి రేడియన్స్ ఎడిషన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని స్పష్టమవుతోంది.

ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మారుతి సుజుకి ఇగ్నీస్ రేడియన్స్ ఎడిషన్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, సిట్రోయెన్ సీ3 వంటి వాటికీ మాత్రమే కాకుండా బ్రాండ్ యొక్క వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ మరియు బాలెనొ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రేడియన్స్ వేరియంట్ అనేది తక్కువ ధర వద్ద లభిస్తోంది, కాబట్టి మంచి అమ్మకాలను పొందవచ్చని భావిస్తున్నాము.

భారతదేశంలో మారుతి సుజుకి ప్రయాణం

మారుతి సుజుకి కంపెనీ జపనీస్ బ్రాండ్ అయినప్పటికీ ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ. 1981లో మారుతి ఉద్యోగ లిమిటెడ్‌గా ప్రారంభమైన కంపెనీ 1982లో హర్యానాలోని గురుగ్రామ్‌లో తన మొదటి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రారంభం నుంచే భారీ వృద్ధి సాధిస్తూ ముందుకెళ్లిన ఈ కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. భారతీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో 2022 నాటికి 42 శాతం వాటాను కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే మారుతి సుజుకి ఎంత వేగంగా తన ఉనికిని చాటుకుందో అర్థం చేసుకోవచ్చు.

Don’t Miss: బాలీవుడ్ హీరోయిన్ కొరియన్ బ్రాండ్ కారు.. దీని ధర తెలిస్తే షాకవుతారు!

ప్రారంభంలో మారుతి 800 కారును లాంచ్ చేసి సంచలన అమ్మకాలు పొందిన మారుతి సుజుకి ప్రస్తుతం స్విఫ్ట్, బాలెనొ, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఆల్టో కే10, డిజైర్, ఎర్టిగా, జిమ్నీ, వ్యాగన్ ఆర్, ఎక్స్ఎల్ 6, సెలెరియో, ఎస్-ప్రెస్సో మరియు ఈకో వంటి కార్లను విక్రయిస్తూ ఉంది. ఇవన్నీ భారతీయ మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ.. వాహన ప్రియులను ఆకర్శించడంలో విజయం సాధిస్తున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ కొరియన్ బ్రాండ్ కారు.. దీని ధర తెలిస్తే షాకవుతారు!

0

Bollywood Actress Akansha Ranjan New Kia EV6: సినీ తారలు కొత్త కార్లను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. చాలామంది సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు వారికి నచ్చిన కార్లను కొనేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి ‘ఆకాంక్ష రంజాన్ కపూర్’ (Akansha Ranjan Kapoor) సౌత్ కొరియా బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. నటి ఈ కారుతో కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నటి ఆకాంక్ష రంజన్ కొనుగోలు చేసిన కారు కియా మోటార్స్ యొక్క ఈవీ6 ఎలక్ట్రిక్ కారు అని తెలుస్తోంది. జిమ్ వెలుపల కారు దగ్గర ఈమె కనిపించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కారు ఆపిన తరువాత రోడ్డు దాటే సమయంలో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

కియా ఈవీ6 (Kia EV6)

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి కియా ఈవీ6. ఇది అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే నటి ఆకాంక్ష రంజన్ కొనుగోలు చేసిన కారు తెలుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, బ్రాండ్ లోగోతో కూడిన స్లొపింగ్ బానెట్ వంటివి పొందుతుంది. ఇవన్నీ కారుకు ప్రీమియం డిజైన్ ఇవ్వడంలో ఉపయోగపడతాయి.

చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన కియా ఈవీ6 4695 మిమీ పొడవు, 1890 మిమీ వెడల్పు మరియు 1550 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా, కంఫర్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. చూడటానికి హ్యాచ్‌బ్యాక్‌గా అనిపించినా.. ఇది పరిమాణంలో పెద్దగానే ఉంటుంది. ఈ కారు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు యొక్క వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 14 స్పీఎకర్ మెరిడియన్ సౌండ్ సిస్టం, 60 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్, సరౌండ్ వ్యూ కెమెరా మొదలైనవి ఉంటాయి. ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఏడీఏఎస్ వంటి లేటెస్ట్ టెక్నలజీ కూడా ఉంటుంది.

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు కంప్లిట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా మన దేశంలో విక్రయించబడుతున్నాయి. కాబట్టి దీని ధరలు రూ. 64.11 లక్షల నుంచి రూ. 69.35 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉన్నాయి. ధరల పరంగా ఈ కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇక కియా ఈవీ6 బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ కారు 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్లలో లభిస్తుంది. ఆర్డబ్ల్యుడీ వెర్షన్ 229 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఏడబ్ల్యుడీ వెర్షన్ 325 పీఎస్ పవర్, 605 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే నటి ఆకాంక్ష రంజన్ ఏ వేరియంట్ కొనుగోలు చేసిందో ఖచ్చితంగా వెల్లడి కాలేదు.

Don’t Miss: రోజువారీ ప్రయాణానికి బెస్ట్ స్కూటర్లు.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్

కియా ఈవీ6 కారు 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 528 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ 350 కేడబ్ల్యు డీసీ ఛార్జర్‌ ద్వారా 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. 53 కేడబ్ల్యు ఛార్జర్ ద్వారా 73 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది 22 కేడబ్ల్యు వాల్ బాక్స్ ఛార్జర్ కూడా పొందుతుంది.

ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కలిగి ఉన్న ప్రముఖులు

నటి ఆకాంక్ష రంజన్ మాత్రమే కాకుండా.. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, మలయాళీ నటుడు మోహన్ లాల్, అక్కినేని నాగార్జున భార్య అమల కూడా ఈ కియా ఈవీ6 కార్లను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కియా ఈవీ6 కారు మీద సెలబ్రిటీలకు ఎంత మక్కువో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కారు కొనుగోలుపైన కంపెనీ ఈ నెలలో (జులై) భారీ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు సమాచారం.

రోజువారీ ప్రయాణానికి బెస్ట్ స్కూటర్లు.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్

0

Best Scooters For Daily Use in India: ఆధునిక కాలంలో బతుకు బండి నడవాలన్నా.. తప్పకుండా బండి (వెహికల్) ఉండాల్సిందే!. ఈ రోజుల్లో కార్లు మరియు బైకులు ప్రజల జీవన విధానంలో ఓ భాగమైపోతున్నాయి. దీంతో చాలామంది నడిచి వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చిన్న దూరాలకు కూడా వాహనాలను ఉపయోగించే స్థితికి చేరుకున్నారు. చిన్న దూరాలకు కూడా వాహనాలు ఉపయోగించడం బాగానే ఉంది. కానీ ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేస్తే.. రోజువారీ ఉపయోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ కథనంలో రోజువారీ వినియోగానికి సరసమైన ధర వద్ద లభించే స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

హీరో డెస్టినీ 125

నిజానికి రోజువారీ ఉపయోగానికి ఉత్తమైన స్కూటర్లు ఏవి అంటే.. అందులో తప్పకుండా డెస్టినీ 125 ఉండాల్సిందే. రూ. 81728 నుంచి రూ. 87518 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇది 124.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 9.12 పీఎస్ పవర్ మరియు 10.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

హీరో డెస్టినీ 125 స్కూటర్ 50 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బూట్ లాంప్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో డిస్క్ బ్రేక్స్ మరియు డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. 10-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్‌లెస్ టైర్‌లు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

హోండా యాక్టివా 125

భారతదేశంలో ఎక్కువ అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో చెప్పుకోదగ్గది హోండా యాక్టివా 125. రూ. 83084 నుంచి రూ. 92257 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.3 పీఎస్ పవర్ మరియు 10.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

హోండా యాక్టివా 125 స్కూటర్ 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తాయి. ఈ స్కూటర్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. 109 కేజీల బరువున్న ఈ స్కూటర్ 5.3 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఇది అన్ని విధాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125

రూ. 82586 నుంచి రూ. 94082 (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ కూడా రోజువారీ ఉపయోగానికి బెస్ట్ స్కూటర్. ఇందులో 124 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.7 పీఎస్ పవర్ మరియు 10 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి డిజైన్ కలిగిన ఈ స్కూటర్, ఆధునిక కాలంలో రోజువారీ ఉపయోగానికి కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, సెమీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్, సుజుకి రైడ్ కనెక్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ రైడింగ్ సమయంలో ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ స్కూటర్ డిస్క్ బ్రేక్ మరియు డ్రమ్ బ్రేక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో టెలిస్కోపిక్ పోర్క్ కూడా ఉంటుంది.

Don’t Miss: ఇండియాలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. దీని గురించే తెలిస్తే షాకవుతారు!

పైన చెప్పుకున్న బైకులు మాత్రమే కాకుండా.. ఇతర బైకులు కూడా ఉన్నాయి. కాబట్టి రోజువారీ వినియోగానికి ఓ మంచి స్కూటర్ కావాలనుకునే వ్యక్తులు తమకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. దీనికోసం మీ సమీపంలోని వెహికల్ డీలర్షిప్ లేదా వెబ్‌సైట్‌లలో కూడా తనిఖీ చేయవచ్చు. ఇందులో ఎక్కువ ధర వద్ద లభించే స్కూటర్లు, సరసమైన ధర వద్ద లభించే స్కూటర్లు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. అయితే ఏ స్కూటర్ కావాలనే విషయాన్ని కొనుగోలుదారు నిర్ణయించుకోవాలి.