33.2 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 44

ఢిల్లీ వేదికపై కనిపించిన కొత్త Toyota కార్లు – పూర్తి వివరాలు

0

Toyota New Cars At Bharat Mobility Global Expo 2024: న్యూఢిల్లీలో జరుగుతున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024’ (Bharat Mobility Global Expo 2024) లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) ఐదు మోడళ్లను ప్రదర్శించింది. టయోటా ఇండియా ప్రస్తుతం పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, CNG మరియు డీజిల్ కార్లను విక్రయిస్తోంది. ఈ కథనంలో గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ఆవిష్కరించిన లేటెస్ట్ ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

టయోటా మిరాయ్ (Toyota Mirai)

భారత్ మొబిలిటీ షో 2024లో టయోటా యొక్క మిరాయ్ అందరి దృష్టిని ఆకర్శించింది. కంపెనీ యొక్క ఈ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. ఇది ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అమ్మకానికి ఉంది. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ సెడాన్ అధికారికంగా లాంచ్ అవ్వలేదు. కానీ గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉండటం వల్ల భారతదేశానికి కూడా దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కారుని ఢిల్లీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు.

ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Innova Hycross Flex Fuel)

ఢిల్లీ గ్లోబల్ ఎక్స్‌పో వేదికపై మేడ్ ఇన్ ఇండియా ఇన్నోవా హైక్రాస్ కూడా ప్రదర్శించారు. అయితే ఈవెంట్‌లో కనిపించిన ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్‌ను పొందుతుంది. ఇది స్టాండర్డ్ ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ మాదిరిగానే అదే 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌తో కూడా స్టాండర్డ్ మోడల్ వలె అదే స్థాయిలో పని చేయగలదు. ఈ కారు పెట్రోల్ మోడల్ కంటే కూడా తక్కువ హైడ్రోకార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది.

ఇక్కడ కనిపించే కారు బిఎస్6 ఫేజ్ II కంప్లైంట్ అని, ఇది 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌తో నడుస్తుందని టయోటా చెబుతోంది. కాబట్టి ఇందులో నుంచే వెలువడే ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ కావడం వల్ల ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ 60 శాతం ఈవీ మోడ్‌లో పనిచేస్తుంది, మిగిలిన 40 శాతం ఇథనాల్ శక్తితో పనిచేసే ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఇందులో 2.0 లీటర్, స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ వివిధ స్పార్క్ ప్లగ్‌లు, పిస్టన్ రింగ్ టాప్‌లు, అలాగే వాల్వ్ మరియు వాల్వ్ సీట్‌లను పొందుతుంది. ఇవన్నీ వాటర్ రెసిస్టెంట్ (నీటి నిరోధకత) కలిగి ఉండటం వల్ల కలిగి ఉంటుంది. ఇథనాల్‌పై నడుస్తున్నప్పుడు తుప్పు పట్టకుండా చేస్తుంది.

ఇథనాల్‌ సెన్సార్ ఇన్‌స్టాల్

టయోటా కంపెనీ తన ఉత్పత్తులలో హైడ్రోకార్బన్ ఉద్గారాలను మరింత తగ్గించడానికి ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో త్రీ వే క్యాటలిస్ట్ వంటి వాటిని చేర్చింది. అంతే కాకుండా ఇథనాల్‌తో సరైన పనితీరుకు సంబంధించి చేసిన అనేక మార్పుల్లో వాహనం యొక్క ఫ్యూయల్ ఫిల్టర్, ఫ్యూయల్ పంప్, అలాగే ఫ్యూయల్ లైన్‌లకు కూడా చేయబడ్డాయి, ఇప్పుడు ఇథనాల్ సెన్సార్ ఇన్‌స్టాల్ కూడా చేయబడింది.

Don’t Miss: ఒక్క చూపుతోనే ఫిదా చేస్తున్న బాలీవుడ్ సింగర్ కొత్త కారు – ఫోటోలు వైరల్

టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ మోడల్ మాత్రమే కాకుండా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రత్యేకంగా రూపొందించిన టయోటా హైలక్స్ ఎమర్జెన్సీ ట్రక్, హైరైడర్ CNG కూడా కనిపించాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షయనీయంగా ఉన్నాయి. భారతీయ మార్కెట్లో టయోటా యొక్క మొదటి ఈవీ వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో టయోటా కంపెనీ తన ఉనికిని నిరంతరం చాటుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను కొత్త టెక్నాలజీలను ఉపయోగించి మార్కెట్లో లాంచ్ చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని లేటెస్ట్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ధర ఎక్కువైనా అస్సలు వెనక్కి తగ్గని జనం – ఎగబడి మరీ కొనేస్తున్నారు!

0

Porsche India Records Sales In India 2023: భారతీయ మార్కెట్లో మహా అయితే టాటా కార్లో లేదా మహీంద్రా కార్లు మాత్రమే కొనుగోలు చేస్తారు, అన్యదేశ్య కార్లు ఎక్కువ ఖరీదు ఉండటం వల్ల కొనుగోలు చేయరు అనుకుంటే పొరపాటే. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి జర్మన్ లగ్జరీ కార్లు లంబోర్ఘిని వంటి ఇటాలియన్ కార్లు, వోల్వో వంటి స్వీడన్ బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

జర్మనీ కంపెనీ అయిన ‘పోర్స్చే’ (#Porsche) కార్ల అమ్మకాల్లో భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క 2023వ సంవత్సరంలో మాత్రమే పోర్స్చే కంపెనీ దేశీయ విఫణిలో ఏకంగా 914 కార్లను విక్రయించి ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అమ్మకాలు 2022లో 779 యూనిట్లు మాత్రమే, అంతకు ముందు ఏడాది.. అంటే 2021లో అమ్మకాలు 64 శాతం తక్కువ.

2022 అమ్మకాల కంటే 2021లో పోర్స్చే అమ్మకాలు 64 శాతం తగ్గాయి. 2023లో కూడా ఎక్కువగా అమ్ముడైన పోర్స్చే మోడల్ కారు టైకాన్ కావడం గమనార్హం. ఇది 113 యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఆ తరువాత 911 స్పోర్ట్స్ కూపే (65 యూనిట్ల అమ్మకాలు) మంచి అమ్మకాలు పొందింది.

2023 కంటే 2022లో పోర్స్చే అమ్మకాలు 17 శాతం తక్కువ. కంపెనీ ఇప్పటి వరకు భారతదేశంలో ఇన్ని కార్లను ఎప్పుడూ విక్రయించకపోవడం గమనార్హం. గత ఏడాది ఒక్క టైకాన్ మాత్రమే, పోర్స్చే కయెన్ మరియు మకాన్ కూడా మంచి అమ్మకాలను పొందాయి. మొత్తం మీద పోర్స్చే ఇండియాకు 2023 కలిసొచ్చిన సంవత్సరం అనే చెప్పాలి.

గత ఏడాది కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందిందని, ప్రతి మోడల్ కూడా మంచి సంఖ్యలో అమ్ముడైనట్లు పోర్షే ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ‘మనోలిటో వుజిసిక్’ అన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది (2024) కూడా కంపెనీ ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని, ఇది మా రిటైల్ నెట్‌వర్క్‌కు విస్తరించడంతో పాటు అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించడానికి మమ్మల్ని పోత్సహిస్తోందని అన్నారు.

2024లో ప్రథమార్థంలో పోర్షే ఇండియా పూణె మరియు హైదరాబాద్‌లలో రెండు కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిది డీలర్‌షిప్‌లు ఉన్నాయి. ఈ సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

పోర్స్చే మకాన్ ఈవీ (Porsche Macan EV)

కంపెనీ 2024 ప్రారంభంలోనే భారతీయ విఫణిలో రూ. 1.65 కోట్ల (ఎక్స్ షోరూమ్) కారును లాంచ్ చేసింది. డెలివరీలు 2024 రెండవ భాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మకాన్ టర్బో, మకాన్ 4 అనే రెండు ట్రిమ్లలో లభించే ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుందు.

పోర్స్చే మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లో 100 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 591 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక మకాన్ ఈవీ 4ట్రిమ్‌లో ఉన్న బ్యాటరీ 613 కిమీ రేంజ్ అందిస్తుంది. మాకాన్ మోడల్‌లు ప్రతి యాక్సిల్‌పై సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డ్యూయల్ పర్మనెంట్ సింక్రోనస్ మోటార్‌లను కలిగి ఉంటాయి.

Don’t Miss: ఒక్క చూపుతోనే ఫిదా చేస్తున్న బాలీవుడ్ సింగర్ కొత్త కారు – ఫోటోలు వైరల్

మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లోని మోటార్ 639 హార్స్ పవర్ మరియు 1130 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ కావడం గమనార్హం. ఇక మకాన్ 4 ట్రిమ్‌ కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

నిజానికి పోర్స్చే కార్లు అన్యదేశ్య వాహనాలైనప్పటికీ భారతదేశంలో మంచి ప్రజాదరణ పొందాయి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మరియు క్రికెటర్లు ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పటి రోజులతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో పోర్స్చే కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Range Rover Evoque Facelift: అదరగొడుతున్న రేంజ్ రోవర్ కొత్త కారు – ధర తెలుసా?

0

Range Rover Evoque Facelift Launched In India: ఇండియన్ మార్కెట్లో మరో కొత్త ల్యాండ్ రోవర్ లాంచ్ అయింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ల్యాండ్ రోవర్ కారు ధర, డిజైన్, బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

ల్యాండ్ రోవర్ కంపెనీ భారతీయ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ కొత్త కారు రేంజ్ రోవర్ ఎవోక్‌ (Range Rover Evoque Facelift) ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ లేటెస్ట్ కారు డైనమిక్ ఎస్ఈ అనే ఒక ట్రిమ్‌లో లభిస్తుంది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

రేంజ్ రోవర్ ఎవోక్ ఎక్స్టీరియర్ డిజైన్ (Range Rover Evoque Design)

మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇందులో రీడిజైన్ చేయబడిన గ్రిల్, ఎల్ఈడీ రన్నింగ్ ల్యాంప్ సిగ్నేచర్‌లతో కూడిన కొత్త సూపర్ స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త రెడ్ బ్రేక్ కాలిపర్‌లు మరియు అల్లాయ్ వీల్స్ కోసం కొత్త ట్విన్ 10 స్పోక్ డిజైన్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్ (Range Rover Evoque Colour Options)
  • కొరింథియన్ బ్రాంజ్
  • ట్రిబెకా బ్లూ
రేంజ్ రోవర్ ఎవోక్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్ (Range Rover Evoque Features)

కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో 11.4 ఇంచెస్ కర్వ్‌డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడినట్లు గమనించవచ్చు. రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్‌లో కొత్త గేర్ లివర్ కూడా చూడవచ్చు.

ఇందులో హీటెడ్ అండ్ కూల్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మరియు కొత్త ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎవోక్ ఇంజన్ (Range Rover Evoque Engine)

కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 247 హార్స్ పవర్ మరియు 365 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 201 హార్స్ పవర్ మరియు 430 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ఇందులోని రెండు ఇంజన్లు 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను బెల్ట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్‌తో పొందుతాయి. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇందులో ఎకో, కంఫర్ట్, గ్రాస్ గ్రావెల్ స్నో, మడ్ రట్స్, సాండ్, డైనమిక్ మరియు ఆటోమేటిక్ అనే ఏడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.

ప్రత్యర్థులు (Range Rover Evoque Rivals)

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆడి క్యూ5 , మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 మరియు వోల్వో ఎక్స్‌సి60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. కావున ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

Don’t Miss: BMW Z4 M40i: కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్

భారతీయ మార్కెట్లో రేంజ్ రోవర్ కార్లకు ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉండనే విషయం దాదాపు అందరికి తెలుసు. అయితే కంపెనీ కూడా దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. కొత్త కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ల్యాండ్ రోవర్ మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Rolls Royce Spectre: ఎలక్ట్రిక్ కార్లకు బాస్.. వచ్చేసింది! దీని రేటు ఎంతంటే?

0

Rolls Royce Spectre Launched: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బ్రిటీష్ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ (Rolls Royce) భారతదేశంలో స్పెక్టర్ (Spectre) లాంచ్ చేసింది. కంపెనీ నేడు ధరలు, బ్యాటరీ స్పెసిఫికేషన్స్, రేంజ్ వంటి వాటితో ఇతర వివరాలను కూడా అధికారికంగా వెల్లడించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్ (Rolls Royce Spectre Price & Bookings)

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.5 కోట్లు. ఇది కంపెనీ యొక్క మొట్ట మొదటి ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది కేవలం రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. దీని కోసం కంపెనీ ఈ రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు కూడా వేగంగా ప్రారంభమవుతాయి.

బ్యాటరీ, రేంజ్ (Rolls Royce Spectre Battery And Range)

కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ పెద్ద 102 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 575 Bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు 195 kW ఛార్జర్‌ ద్వారా 34 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేస్తుంది. అయితే 50 kW డీసీ ఛార్జర్ ద్వారా ఛార్జ్ కావడానికి 95 నిమిషాల సమయం పడుతుంది. సుమారు 2890 కేజీల బరువున్న ఈ కారు పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.

స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు రోల్స్ రాయిస్ యొక్క ఆల్ అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఇది యాక్టివ్ సస్పెన్షన్ మరియు ఫోర్ వీల్ స్టీరింగ్‌ కలిగి ఉంటుందని సమాచారం.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ డిజైన్ (Rolls Royce Spectre Design)

చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు మంచి సిల్హౌట్ మరియు డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. ఫాస్ట్‌బ్యాక్ టైల్‌తో పొడవైన బోనెట్ కలిగి ఉన్న ఈ కారు ముందు భాగంలో విశాలమైన గ్రిల్ పొందుతుంది. రాత్రిపూట మరింత ప్రకాశవంతంగా కనిపించడానికి ఇందులో 22 ఎల్ఈడీ లైట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏరో-ఆప్టిమైజ్డ్ 21-అంగుళాల వీల్స్ మరియు నిలువు LED టెయిల్ లైట్లు ఉన్నాయి.

Don’t Miss: BMW Z4 M40i: కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్

రోల్స్ రాయిస్ స్పెక్టర్ మూడు రేఖల ద్వారా వర్గీకరించబడుతుంది. అవి వాలుగా ఉండే రూఫ్‌లైన్, షోల్డర్ లైన్ మరియు బేస్ వద్ద ఒక వాఫ్ట్ లైన్. ఇక వెనుక భాగంలో ఫాస్ట్‌బ్యాక్ టెయిల్ మరియు గ్లాస్‌హౌస్‌ చూడవచ్చు. ఫాస్ట్‌బ్యాక్ రూఫ్ ప్యానెల్ అనేది ఏ పిల్లర్ నుంచి లగేజ్ కంపార్ట్‌మెంట్ వరకు విస్తరించి ఉంది. పరిమాణం పరంగా ఈ కారు 5475 మిమీ పొడవు, 2017 మిమీ వెడల్పును కలిగి ఉంటుంది.

స్పెక్టర్ ఇంటీరియర్ (Rolls Royce Spectre Interior)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎక్స్టీరియర్ మాదిరిగానే, ఇంటీరియర్ కూడా ఇప్పటికే ఉన్న రోల్స్ రాయిస్ మోడల్‌ల మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు పైకప్పుపై మాత్రమే అందించబడిన స్టార్‌లైట్ లైనర్ ఇప్పుడు డోర్ ప్యాడ్‌లలో కూడా కనిపిస్తుంది. ప్యాసింజర్ వైపున ఉన్న డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ ‘స్పెక్టర్’ నేమ్‌ప్లేట్‌తో ప్రకాశిస్తుంది. ఇందులో 5500 కంటే ఎక్కువ స్టార్స్ వంటి ఇల్యూమినేషన్‌ల క్లస్టర్‌తో చుట్టుముట్టబడింది. ఇంటీరియర్ బాడీ ప్యానెల్స్‌లో రియర్ సీట్లు కూడా పూర్తిగా కొత్తవి.

భారత్‌లో లాంచ్ అయిన రూ.1.65 కోట్ల ఎలక్ట్రిక్ కారు – పూర్తి వివరాలు

0

Porsche Macan EV Turbo launched In India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘పోర్స్చే’ (Porsche) భారతీయ మార్కెట్లో తన రెండవ ఎలక్ట్రిక్ కారు ‘మకాన్ ఈవీ’ (Macan EV)ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు కోసం బుకింగ్స్ కూడా స్పీవీకరించడం మొదలుపెట్టింది. అయితే ఈ కథనంలో పోర్స్చే మకాన్ ఈవీ ధరలు, డెలివెరీ డీటైల్స్ వంటి మరిన్ని వివరాలు చూసేద్దాం.

ధర (Porsche Macan EV Price)

పోర్స్చే కంపెనీ లాంచ్ చేసిన కొత్త మకాన్ ఈవీ ధర రూ. 1.65 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డెలివరీలు 2024 రెండవ భాగంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉంటుంది.

మకాన్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి మకాన్ టర్బో, మకాన్ 4. భారతీయ మార్కెట్లో కేవలం టర్బో ట్రిమ్ మాత్రమే లభించనున్నట్లు సమాచారం.

పోర్స్చే మకాన్ డిజైన్ (Porsche Macan EV Design)

డిజైన్ విషయానికి వస్తే.. కొత్త పోర్స్చే మకాన్ ఈవీ కొత్త హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌లు, వీల్స్ మరియు వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్‌ మరియు టెయిల్‌ల్యాంప్‌ వంటి వాటిని పొందుతుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు యాక్టివ్ ఫ్రంట్ ఫ్లాప్‌లు, అండర్ బాడీ కవర్లు మరియు అడాప్టివ్ రియర్ స్పాయిలర్‌ వంటివి పొందుతుంది.

పోర్స్చే మకాన్ ఫీచర్స్ (Porsche Macan EV Features)

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో మూడు స్క్రీన్‌లు ఉంటాయి. అవి 12.6 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.9 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ హబ్ మరియు 10.9 ఇంచెస్ ప్యాసింజర్ స్క్రీన్. ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్‌ప్లే కూడా ఇందులో లభించనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బూట్ స్పేస్ 540 లీటర్ల వరకు ఉంటుంది.

బ్యాటరీ అండ్ రేంజ్ (Porsche Macan EV Battery And Range)

పోర్స్చే మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లో 100 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 591 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక మకాన్ ఈవీ 4ట్రిమ్‌లో ఉన్న బ్యాటరీ 613 కిమీ రేంజ్ అందిస్తుంది. మాకాన్ మోడల్‌లు ప్రతి యాక్సిల్‌పై సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డ్యూయల్ పర్మనెంట్ సింక్రోనస్ మోటార్‌లను కలిగి ఉంటాయి.

మకాన్ ఈవీ టర్బో ట్రిమ్‌లోని మోటార్ 639 హార్స్ పవర్ మరియు 1130 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ కావడం గమనార్హం. ఇక మకాన్ 4 ట్రిమ్‌ కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

కొత్త పోర్స్చే మకాన్ ఈవీ 4 కొత్త ట్విన్-వాల్వ్ డంపర్‌లతో స్టీల్ సస్పెన్షన్‌పై నడుస్తుంది. అయితే మకాన్ టర్బో పోర్స్చే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్ మరియు వేరియబుల్ ఎలక్ట్రానిక్ డంపింగ్ కంట్రోల్‌తో మరింత అధునాతన ఎయిర్ సస్పెన్షన్ సెటప్‌ను పొందింది. మొత్తానికి ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

Don’t Miss: దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..

పోర్స్చే కార్లకు దేశీయ విఫణిలో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కంపెనీ కూడా కొత్త కార్లను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. కంపెనీ ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడం వల్ల వాహన ప్రియులు కూడా ఈ కార్ల మీద ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారు. కాగా కంపెనీ లాంచ్ చేసిన మకాన్ ఈవీ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అంతే కాకుండా మరింత మంది వాహన ప్రియులను ఆకర్శించడానికి కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై మనసుపడ్డ సెలబ్రిటీలు వీరే – ఇక్కడ చూడండి

0

Celebrities Royal Enfield Bikes Gul Panag To Kartik Aryan: భారతదేశంలో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) బైకులకున్న ఆదరణ మరియు డిమాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఈ బైకులను ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేశారు, చేస్తున్నారు. భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కలిగిన సెలబ్రిటీలు ఎవరు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గుల్ పనాగ్ (Gul Panag)

ప్రముఖ నటి గుల్ పనాగ్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కలిగి ఉన్న సెలబిటీలలో ఒకరు. గతంలో చాలా సందర్భాల్లో ఈమె కార్లు మరియు బైకులపై కనిపించింది. గుల్ పనాగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రా కాస్ట్ ఐరన్ మరియు క్లాసిక్ మోడళ్లను నడుపుతూ కనిపించిన వీడియోలు మరియు ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

వరుణ్ ధావన్ (Varun Dhawan)

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్, కరణ్ జోహార్ యొక్క “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్”లో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇటీవల, అతను ఆలివ్ గ్రీన్ కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 బైక్ రైడ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించాడు. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

జాన్ అబ్రహం (John Abraham)

ఖరీదైన కార్లు మరియు బైకులను ఎక్కువగా ఇష్టపడే జాన్ అబ్రహం వద్ద ఒక మాడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క 350 సీసీ AVL మాచిస్మో మోడల్ అని తెలుస్తోంది. ఇది ఆలీవ్ గ్రీన్ బాడీ, రీషేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్, రీపోజిషన్డ్ హ్యాండిల్ బార్ మరియు పొడవైన వీల్‌బేస్ వంటి వాటిని కలిగి ఉంది. ఈ బైక్ బుల్‌సిటీ కస్టమ్స్‌చేత కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

నానా పటేకర్ (Nana Patekar)

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కలిగి ఉన్న ప్రముఖ నటులలో ఒకరు నానా పటేకర్. ఈయన గతంలో చాలా సార్లు ముంబై వీధుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రైడ్ చేస్తూ కనిపించాడు. నానా పటేకర్ హెల్మెట్ లేకుండా కనిపించి.. తలకు రక్షణ కరువైందని వివరిస్తూ ఓ సినిమాను ప్రమోట్ చేసినట్లు కూడా తెలుస్తోంది తెలుస్తోంది.

ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapoor)

నటుడు ‘ఆదిత్య రాయ్ కపూర్’ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకులను ఎక్కువగా ఇష్టపడే సెలబ్రిటీల జాబితాలో ఒకరు. ఇతడు AVL ఇంజిన్ కలిగిన మాచిస్మో 500 కలిగిన 500 సీసీ బైక్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మాత్రమే కాకుండా ఇతర బ్రాండ్ మోటార్ సైకిల్స్ కూడా ఈయన గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ (Salman Khan)

కండల వీరుడు సల్లూ భాయ్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రేమికుడే. ఈయన సుజుకి మోటార్‌సైకిళ్లకు అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అయినప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైకుని కలిగి ఉన్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. ఇది మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్ వద్ద హయబుసా మరియు ఇంట్రూడర్‌ వంటి ఖరీదైన అన్యదేశ బైక్‌లు కూడా ఉన్నాయి.

కల్కి కోచ్లిన్ (Kalki Koechlin)

నటుడు కల్కి కోచ్లిన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో తన తండ్రితో కలిసి ఈశాన్య భారతదేశానికి సుమారు 40000 కిమీ పైగా రైడ్ చేశారు. ఈ ట్రిప్ సమయంలో వీరిద్దరూ ఏడు రాష్ట్రాలను అన్వేషించారు, ఇది ట్రావెల్ షో కూడా డాక్యుమెంట్ చేయబడింది. అంతే కాకుండా కల్కి ఇండియాలో ఉన్నప్పుడు ముంబై వీధుల్లో కూడా బైక్ రైడ్ చేసేవారని చెబుతారు.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

కార్తీక్ ఆర్యన్ (Kartik Aryan)

లంబోర్ఘిని వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్న కార్తీక్ ఆర్యన్ గ్యారేజిలో రెడ్ కలర్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్’ బైక్ కూడా ఉంది. ఈ బైకుని అతడు 2021లో కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. ఇతని వద్ద క్లాసిక్ బైక్ మాత్రమే కాకుండా హంటర్ 350కూడా ఉంది.

Hyundai: సంచలన ధర వద్ద లాంచ్ అయిన ‘క్రెటా ఫేస్‌లిఫ్ట్’ – పూర్తి వివరాలు

0

Hyundai Creta Facelift Launched In India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ‘హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌’ (Hyundai Creta Facelift) దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైంది. మార్కెట్లో విడుదలైన కొత్త క్రెటా వేరియంట్స్, ధరలు, డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఏడూ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 11 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 20 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఐదు ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలతో లభించే ఈ 2024 మోడల్ మొత్తం 19 వేరియంట్లలో లభిస్తుంది.

డిజైన్ (Hyundai Creta Facelift Design)

కోట్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ దాదాపు కొత్త డిజైన్ కలిగి ఉన్నట్లు ఇక్కడ గమనించవచ్చు. ముందు భాగంలో పారామెట్రిక్ వివరాలతో కూడిన పెద్ద గ్రిల్ ఉంటుంది. దీని వెడల్పు అంతటా కూడా ఎల్ఈడీ లైట్ ఉండటం చూడవచ్చు. స్ప్లిట్ సెటప్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్, సీక్వెన్షియల్ ఇండికేటర్‌లు ఇక్కడ చూడవచ్చు.

రియర్ ఫ్రొపైల్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఫుల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లలో యాంగ్యులర్ రూపాన్ని పొందుతుంది. వెనుక మొతం ఎల్ఈడీ లైట్ బార్ ఉండటం చూడవచ్చు. అల్లాయ్ వీల్స్ కూడా చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ (Hyundai Creta Facelift Interior Design)

2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త అప్‌డేట్‌తో డ్యాష్‌బోర్డ్‌ పొందుతుంది. కాబట్టి ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను పొందుతుంది. అంతే కాకుండా హ్యుందాయ్ ఆల్కజార్ నుంచి తీసుకున్న 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా గమనించవచ్చు. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం కంట్రోల్స్ దిగువన ఉన్న సెంటర్ కన్సోల్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. బూట్ స్పేస్ 433 లీటర్ల వరకు ఉంటుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ (Hyundai Creta Facelift Interior Features)

కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారులో గమనించదగ్గ విషయం ఫీచర్స్.. ఇందులో కంఫర్ట్ అండ్ సౌకర్యవంతమైన ఫీచర్లలో పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆన్‌బోర్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, టూ స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సీట్ బ్యాక్‌రెస్ట్, వెనుక సీటు హెడ్‌రెస్ట్‌ల కోసం దిండ్లు మరియు వెనుక సన్‌షేడ్‌లు ఉన్నాయి.

ఇందులోని 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లే చాలా స్పష్టంగా ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా అద్భుతంగా ఉంటుంది. బోస్ సౌండ్ సిస్టమ్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ADAS ఫీచర్లలలో భాగంగానే ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్టాప్ అండ్ గోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

ఇంజిన్ (Hyundai Creta Facelift Engine)

క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్న ఏకైక ప్రధాన యాంత్రిక మార్పు ఏమిటంటే, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 160 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 115 హార్స్ పవర్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా ఇవన్నీ కూడా చాలా ఉత్తమంగా ఉంటాయి.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

ప్రత్యర్థులు (Hyundai Creta Facelift Rivals)

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, టొయోట హైరైడర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

షాట్‌గన్ 650 లాంచ్ చేసిన Royal Enfield – ఇక ప్రత్యర్థులకు చుక్కలే..

0

Royal Enfield Shotgun 650 Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) మార్కెట్లో తన కొత్త ‘షాట్‌గన్ 650’ (Shotgun 650) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధరలు రూ. 3.59 లక్షల నుంచి రూ. 3.73 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

మార్కెట్లో విడుదలైన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ఇంటర్‌సెప్టర్ 650’ (రూ. 3.03 లక్షల నుంచి రూ. 3.31 లక్షలు) కంటే ఎక్కువ ధరను కలిగి ఉంది. అయితే ఇది కంపెనీ యొక్క ‘సూపర్ మీటియోర్ 650’ (రూ. 3.64 లక్షల నుంచి రూ. 3.94 లక్షలు) కు దగ్గర ధరను కలిగి ఉంటుంది.

ధరలు & కలర్ ఆప్షన్స్ (Shotgun 650 Price And Colours)
  • షీట్‌మెటల్ గ్రే – రూ. 3.59 లక్షలు
  • ప్లాస్మా బ్లూ – రూ. 3.701 లక్షలు
  • డ్రిల్ గ్రీన్ – రూ. 3.70 లక్షలు
  • స్టెన్సిల్ వైట్ – రూ. 3.73 లక్షలు

నిజానికి కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కస్టమ్ బైక్ బిల్డింగ్ స్పేస్ నుంచి ప్రేరణ పొందటం వల్ల.. ఇతర సాధారణ బైకుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇది సూపర్ మీటియోర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ చాలా తేడాలను గమనించవచ్చు.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బైక్ 18 ఇంచెస్ వీల్స్ మరియు 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అయితే మీటియోర్ మాత్రం 19 ఇంచెస్ మరియు 16 ఇంచెస్ వీల్స్ కలిగి ఉన్నాయి. సీటు 740 మిమీ వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.8 లీటర్ల వరకు ఉంటుంది. కావున లాంచ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇంజిన్ (Shotgun 650 Engine)

షాట్‌గన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 648 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 హార్స్ పవర్ మరియు 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మొత్తం గ్లోస్ బ్లాక్‌లో పెయింట్ చేయబడి ఉండటం గమనించవచ్చు. ఇది కంపెనీ బైకులతో చెప్పుకోదగ్గ అప్డేట్ అని తెలుస్తోంది.

ఇక్కడ కనిపించే చిత్రాలలో గమనించినట్లైతే.. బైకులో ఒకే సీటు ఉండటం గమనించవచ్చు, కానీ రైడర్ తనకు కావాలనుకుంటే రెండవ సీటుని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వెనుక ర్యాక్‌లో లగేజీ కోసం కూడా అమర్చుకోవచ్చు.

ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులో దాదాపు అన్ని భాగాలు మెటల్‌తో తయారు చేయబడ్డాయి. ఈ కారణంగానే ఈ బైక్ బరువు 240 కేజీల వరకు ఉంటుంది. దీంతో భారతీయ మార్కెట్లో అత్యంత బరువైన రెండవ బైకుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 నిలిచింది. అయితే ఇప్పటికే మీటియోర్ ఎక్కువ బరువున్న బైకుగా ప్రధమ స్థానంలో నిలిచింది. మీటియోర్ బరువు 241 కేజీలు కావడం గమనార్హం. షాట్‌గన్ 650 బైక్ 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 300 మీమీ రియర్ డిస్క్ పొందుతుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ప్రామాణికంగా లభిస్తుంది.

Don’t Miss: Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై మనసుపడ్డ సెలబ్రిటీలు వీరే – ఇక్కడ చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు దేశీయ మార్కెట్లో ఉన్న ప్రధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా గొప్ప ప్రజాదరణ పొందున్న ఈ బ్రాండ్ క్రమంగా ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లాంచ్ చేసింది. ఈ బైక్ ఒక్క చూపుతోనే వాహన ప్రేమికుల మనసు దోచేలా రూపొందించబడి ఉంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తప్పకుండా మార్కెట్లో తన హవా చూపిస్తుందని భావిస్తున్నాము.

తక్కువ ధరలో కొత్త ‘ఆస్టర్’ లాంచ్ – హడలిపోతున్న ప్రత్యర్థులు

0

2024 MG Astor Launched In India: ఆధునిక ఫీచర్లతో లాంచ్ అయిన ‘ఎంజీ మోటార్’ (MG Motor) యొక్క ‘ఆస్టర్’ (Astor) ఇప్పుడు కొత్త హంగులతో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ కారు ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ధర & వేరియంట్స్ (MG Astor Price & Variants)
  • స్ప్రింట్ (Sprint) – రూ. 9.98 లక్షలు
  • షైన్ (Shine) – రూ. 11.68 లక్షలు
  • సెలెక్ట్ (Select) – రూ. 12.98 లక్షలు
  • షార్ప్ ప్రో (Sharp Pro) – రూ. 14.41 లక్షలు
  • సావీ ప్రో (Savvy Pro) – రూ. 17.90 లక్షలు

దేశీయ విఫణిలో లాంచ్ అయిన 2024 ఎంజీ ఆస్టర్ ప్రారంభ ధర రూ. 9.98 (ఎక్స్ షోరూమ్). టాప్ మోడల్ ధర రూ. 17.98 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

ఐదు ట్రిమ్‌లలో లభించే కొత్త 2024 ఎంజీ ఆస్టర్ యొక్క స్ప్రింట్ వేరియంట్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సెలెక్ట్, షార్ప్ ప్రో మరియు సావీ ప్రో అనే మూడు వేరియంట్స్ పెట్రోల్ CVT మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంటాయి.

డిజైన్ మరియు ఫీచర్స్ (MG Astor Design & Features)

కొత్త ఎంజీ ఆస్టర్ కారు చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఎంట్రీ-లెవల్ ఆస్టర్ స్ప్రింట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటితో పాటు ఆటో డిమ్మింగ్ IRVM వంటివి ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడల్ స్ప్రింట్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఆస్టర్ కొత్త కారు ఇప్పుడు కనెక్టెడ్ కార్ ఫీచర్లతో ఐ-స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ అప్డేట్ కూడా పొందుతుంది.

ఇంజిన్ (MG Astor Engine)

డిజైన్ మరోయు ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులకు లోను కాదు. కాబట్టి ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 110 హార్స్ పవర్ మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

అదే సమయంలో ఇందులోని 1.3 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 140 హార్స్ పవర్ మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ మాత్రమే పొందుతుంది.

ప్రత్యర్థులు (MG Astor Rivals)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఎంజీ ఆస్టర్ కారు కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దీంతో అమ్మకాల పరంగా ఆస్టర్ కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: Mercedes Benz: రూ.50.50 లక్షల కారు లాంచ్ చేసిన బెంజ్ కంపెనీ – పూర్తి వివరాలు

భారతదేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ఎంజీ మోటార్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తనదైన రీతిలో ప్రజాదరణ పొందిన ఈ కారు సరసమైన ఎంజీ కామెట్ ఈవీ లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఆస్టర్ కొత్త మోడల్ విడుదలతో మరింత మంది కొనుగోలుదారులను ఆకర్శించడానికి సన్నద్ధమయింది. ఈ కొత్త మోడల్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

భారత్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ లేటెస్ట్ మోడల్స్ లాంచ్ – ధరలు ఎలా ఉన్నాయంటే?

0

Mahindra XUV400 Pro Launched: భారతీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఇప్పటికే XUV400 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి  అంమ్మకాలను పొందుతోంది. అయితే రానున్న సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ‘XUV400 ప్రో’ మోడల్స్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్ల ధరలు, బుకింగ్ వివరాలు, డెలివరీ వంటి వాటికి సంబంధించిన మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్, బ్యాటరీ, ఛార్జర్ మరియు ధరలు (Variants and Price ) 
  • XUV400 EC Pro – 34.5 కిలోవాట్ బ్యాటరీ – 3.3 kW AC ఛార్జర్ – రూ. 15.49 లక్షలు
  • XUV400 EL Pro – 34.5 కిలోవాట్ బ్యాటరీ – 7.2 kW AC ఛార్జర్ – రూ. 16.74 లక్షలు
  • XUV400 EL Pro – 39.5 కిలోవాట్ బ్యాటరీ – 7.2 kW AC ఛార్జర్ – రూ. 17.49 లక్షలు
బుకింగ్స్ మరియు డెలివరీ (Bookings and Delivery)

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా XUV400 ఈవీ మోడల్ బుకింగ్స్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరి 01 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుతం కంపెనీ వెల్లడించిన ధరలు 2024 మే 31 వరకు మాత్రమే వర్తిస్తాయి.

డిజైన్ మరియు ఫీచర్స్ (Design and Features)

కొత్త మహీంద్రా XUV400 ఈవీ డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు నెబ్యులా బ్లూ కలర్‌ ఆప్షన్లో లభిస్తుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొత్త 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఏసీ వెంట్స్ అవుట్‌గోయింగ్ మోడల్‌లో మాదిరిగా సైడ్‌లో కాకుండా కింద ఉండటం గమనించవచ్చు. ఇది మాత్రమే కాకుండా HVAC కంట్రోల్ కూడా మధ్యలో ఉన్నాయి.

లోపల ఇంటీరియర్ మొత్తం బ్లాక్ అండ్ లేత గోధుమరంగులో డ్యూయల్ టోన్ థీమ్‌లో కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ కూడా కొత్త ఫ్లాట్-బాటమ్ యూనిట్, అయితే ఇన్‌స్ట్రుమెంట్ బినాకిల్ మాత్రం మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ, అనలాగ్ డయల్స్ స్థానంలో సరికొత్త 10.25 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్ ఉంది.

2024 మహీంద్రా XUV400 ఈవీలో 7.0 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇంటర్‌ఫేస్ మాత్రమే కాకుండా ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అలెక్సా కనెక్టివిటీ, రియర్ USB పోర్టులు మరియు రియర్ ఏసీ వెంట్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, 360 డిగ్రీ కెమెరాలు వంటివి ఉన్నాయి.

బ్యాటరీ అండ్ రేంజ్ (Battery and Range)

కొత్త మహీంద్రా XUV400 ఈవీ యాంత్రికంగా ఎటువంటి మార్పులకు గురి కాలేదు, కాబట్టి ఇందులో అదే 34.5 కిలోవాట్ బ్యాటరీ, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఉన్నాయి. ఇవి వరుసగా 375 కిమీ మరియు 456 కిమీ రేంజ్ అందిస్తాయని తెలుస్తోంది. EC ప్రో మోడల్ 3.3 kW ఛార్జర్ మాత్రమే పొందుతుంది, EL ప్రో వేరియంట్లు 39.4 kW బ్యాటరీ పొందుతుంది. ఈ రెండు మోడల్స్ 150 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ పొందుతాయి.

Don’t Miss: Mercedes Benz: రూ.50.50 లక్షల కారు లాంచ్ చేసిన బెంజ్ కంపెనీ – పూర్తి వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా కార్లకు భారతదేశంలో ఓ ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అత్యద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా మహీంద్రా కార్లలో నిక్షిప్తమై ఉంటాయి. కాగా ఇప్పటికే విపరీతమైన అమ్మకాలు పొందుతున్న మహీంద్రా XUV400 ఈవీను ప్రో వేరియంట్ రూపంలో విడుదల చేయడం వల్ల కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి ద్రుష్టిని ఆకర్శించగలదని భావిస్తున్నాము. కాబట్టి ఈ మోడల్ తప్పకుండా ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందగలదని ఆశిస్తున్నాము.