30.2 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 46

New Launches For 2024: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు – ఇవే!

0

New Launches in 2024 Skoda To Volkswagen: 2023 మరి కొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన వాహనాలను మార్కెట్లో లాంచ్ చేసిన కంపెనీలు ఇప్పుడు వచ్చే ఏడాదిలో కొత్త కార్లను విడుదల చేయడానికి ఉవ్విల్లూరుతున్నాయి. ఈ కథనంలో 2024లో విడుదలకానున్న కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

స్కోడా సూపర్బ్ (Skoda Superb)

బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా నిలిచిపోయిన స్కోడా సూపర్బ్ 2024ప్రారంభంలో దేశీయ మార్కెట్లో మళ్ళీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఇందులో అప్డేటెడ్ 2.0 లీటర్ టీఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేయనుంది. ఈ కారు భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేయబడే అవకాశం లేదు. కాబట్టి సిబియూ మార్గం ద్వారా దిగుమతి అయ్యే అవకాశం ఉంటుంది.

లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్,360 డిగ్రీ కెమెరా, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడాప్టివ్ ఛాసిస్ కంట్రోల్ టెక్, యాక్టివ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ADAS వంటి కొత్త ఫీచర్‌లతో రానున్న ఈ కారు ధర సుమారు రూ. 50 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం.

స్కోడా ఎన్యాక్ ఐవీ (Skoda Enyaq iV)

దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న మరో స్కోడా కారు ‘ఎన్యాక్ ఐవీ’. ఇది వచ్చే ఏడాది మధ్య నాటికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 55 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎన్యాక్ ఐవీ అనేది భారతదేశంలో స్కోడా యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఆఫర్ అవుతుంది. ఇది కూడా CBU మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి అయ్యే అవకాశం ఉంది.

స్కోడా ఎన్యాక్ ఐవీ 77 కిలోవాట్ బ్యాటరీ కలిగి..కేవలం 6.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.

కొత్త స్కోడా కొడియాక్ (New Skoda Kodiaq)

2024 చివరి నాటికి రూ. 50 లక్షల ధర వద్ద విడుదలకానున్న కొత్త స్కోడా కొడియాక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా, పరిమాణంగా కొంత పెద్దదిగా ఉంటుంది. డైజిన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉందనున్న ఈ కారు ఎక్కువ బూట్ స్పేస్ పొందుతుందని సమాచారం.

 

కొత్త స్కోడా కోడియాక్ 2.0 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు మైల్డ్-హైబ్రిడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను కలిగి ఉంది. డీజిల్ ఆటోమేటిక్ పూర్తిగా 4×4 సిస్టమ్ ఎంపికను పొందుతుంది. అయితే ఇది ఏ పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌ను పొందుతుందనే దానిపై ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది CKD ద్వారా దిగుమతయ్యే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4 (Volkswagen iD.4)

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కార్ల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన ‘ఐడీ’ ఉంది. ఇది 2024 మధ్యలో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 55 లక్షల వరకు ఉండవచ్చు. ఐడీ.4 అనేది భారతదేశం కోసం ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేయనున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్. ఇది కూడా భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడే అవకాశం లేదు.కాబట్టి దీనిని కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4 కారులో ముందు యాక్సిల్‌లో ఒక ఎలక్ట్రిక్ మోటారు మరియు వెనుకవైపు ఒక ఎలక్ట్రిక్ మోటారును ఉంటుంది. ఈ రెండు కలిపి 299 హార్స్ పవర్ మరియు 460 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 480 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం.

Don’t Miss: దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..

కంపెనీ గత రెండేళ్లుగా భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతూనే ఉంది. మొత్తానికి సంస్థ వచ్చే ఏడాది నాటికి దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఇండియా 3.0 ప్లాన్‌తో తీసుకురాబడుతుందని సమాచారం.

మొన్న రూ. 5.8 కోట్లు.. నేడు రూ. 3.3 కోట్లు – ఖరీదైన కార్లు కొంటున్న పొలిటికల్ లీడర్!

0

Indian Politician Pramod Madhwaraj Buys Expensive BMW XM Video Viral: ఒకప్పుడు రాజకీయ నాయకులు నిరాడంబరంగా.. ప్రజాసేవలోనే తరించేవారు. కానీ రోజులు మారాయి, వారి జీవన విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఖరీదైన కార్లు, బంగళాలు వీరి జీవితంలో సర్వ సాధారణం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఓ రాజకీయ నాయకుడు రూ. కోట్లు విలువచేసే ఓ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం కర్ణాటకకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త ‘ప్రమోద్ మధ్వరాజ్’ (Pramod Madhwaraj) ఇటీవల రూ. 3.3 కోట్లు విలువైన జర్మన్ బ్రాండ్ ‘బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్’ (BMW XM) కొనుగోలు చేసారు. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

వీడియోలో గమనించినట్లయితే.. బీఎండబ్ల్యూ కారుని డీలర్‌షిప్ సిబ్బంది డెలివరీ చేయడం చూడవచ్చు. ఈ కారు డెలివరీని డీలర్‌షిప్ సిబ్బంది ఆయన నివాసంలోనే డెలివరీ చేశారు. నిజానికి చాలామంది సెలబ్రిటీలు, సినీ తారలు ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి కార్ల కొనుగోలు సాధారణ ప్రజలకు సాధ్యం కాదనే చెప్పాలి.

ప్రమోద్ మధ్వరాజ్‌కి డెలివరీ చేసిన కారు నిజానికి చాలా ప్రత్యేకమైన వాహనం. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్న బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎమ్ మోడల్. కంపెనీ గత ఏడాది అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది.

డిజైన్

చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు పెద్ద కిడ్నీ గ్రిల్‌తో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఉన్న కిడ్నీ గ్రిల్ నిజానికి ఇతర బీఎండబ్ల్యూ మోడళ్లలో మనం చూస్తున్నట్లుగానే ఒక ఇల్యూమినేషన్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ షార్ప్ మరియు ఎడ్జీగా కనిపిస్తుంది, ఇది చాలా స్పోర్టీ లుక్‌ని ఇస్తుంది.

ముందు భాగంలో పెద్ద ఎయిర్ ఇంటేక్ ఈ కారుకి మంచి డిజైన్ అందించడంలో సహాయపడుతుంది. సైడ్ ప్రొఫైల్ ఐఎక్స్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి 22 ఇంచెస్ వీల్స్ లభిస్తాయి, కస్టమర్లు 23 ఇంచెస్ అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

వెనుక భాగంలో ఎల్ ఆకారంలో ఉన్న ఆల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, నిలువుగా పేర్చబడిన ఎగ్జాస్ట్ టిప్స్ వంటి వాటితో పాటు వాటి చుట్టూ బ్లాక్ కలర్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ఎలిమెంట్‌లతో ఆకర్షణీయంగా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది.

ఫీచర్స్

కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెడ్ కలర్ ఎమ్ మోడ్ బటన్‌లు, యాంబియంట్ లైట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ADAS మొదలైన ఫీచర్స్ ఉంటాయి.

ప‌వ‌ర్‌ట్రైన్

బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 653 పీఎస్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ తారక్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

Don’t Miss: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు – ఇవే!

ఈ కారు ఈవీ మోడ్‌లో 88 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీనిని 2 వీల్ డ్రైవ్ లేదా 4 వీల్ డ్రైవ్ మోడ్‌లలో ఉపయోగించవచ్చు. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనం కాబట్టి, కారు సుమారు 62 kmpl అందిస్తుంది.

రోల్స్ రాయిస్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ రాజకీయ నాయకుడు

ప్రమోద్ మధ్వరాజ్ ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో రూ. 5.8 కోట్లు ఖరీదైన ‘రోల్స్ రాయిస్‌’ (Rolls Royce) కారుని కొనుగోలు చేశారు. నిజానికి రోల్స్ రాయిస్‌ను కలిగి ఉన్న భారతదేశంలో మొదటి రాజకీయ నాయకుడు ఇతడే అని తెలుస్తోంది.

ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న Land Rover కొత్త కారు – ధర ఎంతో తెలుసా?

0

Land Rover Launches Range Rover Sport SV: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘ల్యాండ్ రోవర్’ (Land Rover) ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కొత్త వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీ తన కస్టమర్ల కోసం కొత్త ఉత్పతులను లాంచ్ చేయడంలో భాగంగా.. ఇప్పుడు సరికొత్త ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ (Range Rover Sports) లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో సుమారు సంవత్సర కాలం కంటే ఎక్కువ రోజులుగా విక్రయించబడుతున్న ల్యాండ్ రోవర్ ఇప్పుడు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV పేరుతో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ. 2.11 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. డెలివరీలు మరో ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వేరియంట్స్ మరియు ధరలు (Variants And Price)
  • రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV – రూ. 2.80 కోట్లు
  • రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV ఆటోబయోగ్రఫీ – రూ. 2.11 కోట్లు

రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఇంజిన్ (Engine)

కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి8 ఇంజిన్ పొందుతుంది. ఇది 635 హార్స్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడి కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 290 కిమీ వరకు ఉంటుంది.

డిజైన్ (Design)

కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV మంచి డిజైన్ కలిగి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్ష్మ మార్పులను గమనించవచ్చు. ఇందులో విస్తృతంగా ఉండే ఫ్రంట్ అండ్ రియర్ ట్రాక్స్, పెరిగిన క్యాంబర్, కొత్త ఫ్రంట్ బంపర్ మరియు గ్రిల్ ట్రీట్‌మెంట్, సైడ్ స్కర్ట్స్ మరియు డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్‌లతో కూడిన రియర్ బంపర్ వంటివి ఉన్నాయి.

ఇంటీరియర్ (Interior)

రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SV ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇంటిగ్రేటెడ్ హెడ్ నియంత్రణలతో కూడిన కొత్త సీట్లు మరియు స్టీరింగ్ వీల్ కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. డ్రైవ్ మోడ్‌ను యాక్టివేట్ చేయడానికి ఇందులో బటన్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మిగిలిన చాలా ఫీచర్స్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV

దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త రేంజ్ రోవర్ PHEV 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ కలిగి 38.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. మొత్తం సిస్టం 460 హార్స్ పవర్ మరియు 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 225 కిమీ కావడం గమనార్హం.

Don’t Miss: BMW Z4 M40i: కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV 7 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా ఐదు గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ఇందులోని 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ వేరియంట్లో డిజిటల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, వెంటిలేషన్ మరియు మసాజ్‌తో కూడిన 22 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

ప్రత్యర్థులు (Rival)

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ SV భారతీయ మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆడి ఆర్ఎస్ క్యూ8 మరియు ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి ఇతర సూపర్ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే రేంజ్ రోవర్ స్పోర్ట్ PHEV వేరియంట్‌కు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు.

కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం – ఈ కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్

0

Tata Motors Discounts: 2023 సంవత్సరాంతంలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎంపిక చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్ల మీద మంచి బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ కథనంలో ఆ డిస్కౌంట్స్ వివరాలు వివరంగా తెలుసుకుందాం.

టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్స్ ఈ నెలలో టాటా టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీ మోడల్స్ కొనుగోలు మీద మాత్రమే లభిస్తాయి. ఈ ఆఫర్స్ కేవలం ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే డిసెంబర్ 31 లోపల ఈ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేవారు ఈ ఆఫర్ పొందవచ్చు.

టిగోర్ ఈవీ (Tata Tigor EV)

టాటా మోటార్స్ యొక్క అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు ‘టిగోర్ ఈవీ’ కొనుగోలు మీద రూ. 1.10 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. అంటే కొనుగోలుదారులు ఈ కారుని ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ. 1.10 లక్షల తగ్గింపు పొందవచ్చు. టిగోర్ ఈవీ అన్ని వేరియంట్ల మీద రూ. 50000 వరకు ఎక్స్చేంజ్ బోనస్‌, రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక కార్పొరేట్ ప్రయోజనాల కింద్ రూ. 10000 తగ్గింపుని పొందవచ్చు.

దేశీయ మార్కెట్లో టాటా టిగోర్ ఈవీ ధరలు ప్రస్తుతం రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య ఉన్నాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారులో 26 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇందులోని పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ 75 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)

టియాగో ఈవీ కొనుగోలుపైనా టాటా మోటార్స్ రూ. 77,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. టియాగో ఈవీ యొక్క ఏమికా చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 15000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. అయితే ఈ కారు కొనుగోలుపైనా ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ అనేది లభించదు. కానీ కస్టమర్లు దీనిపైన రూ. 55,000 వరకు గ్రీన్ బోనస్‌ పొందవచ్చు. అంతే కాకుండా రూ. 7000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లు లభిస్తాయి.

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో ఈవీ ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 12.04 లక్షల మధ్య ఉన్నాయి. మీడియం రేంజ్ మరియు లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో ఉండే టియాగో ఈవీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

టాటా టియాగో మీడియం రేంజ్ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 250 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ 61 హార్స్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. లాంగ్ రేంజ్ మోడల్ ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 315 కిమీ పరిధిని అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 74 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Don’t Miss: కేవలం 660 మందికి మాత్రమే ఈ Audi కారు.. ఎందుకంటే?

కంపెనీ అందించే ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలుదారుడు దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

భారత్‌లో అడుగెట్టిన కొరియన్ బ్రాండ్ కారు – ఫిదా చేస్తున్న డిజైన్ & ఫీచర్స్

0

Kia Sonet Facelift Revealed In India: అనేక టీజర్ల తరవాత సౌత్ కొరియా కార్ బ్రాండ్ ‘కియా మోటార్స్’ (Kia Motors) దేశీయ విఫణిలో కొత్త ‘సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌’ను (Sonet Facelift) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బుకింగ్స్ (Bookings)

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా.. కాస్మెటిక్ అప్‌డేట్‌లను మరియు ఇతర అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

ఎక్స్టీరియర్ డిజైన్ (Exterior Design)

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ పరిమాణం పరంగా దాని అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో పెద్ద ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటి వాటితో పాటు.. ఫ్రంట్ బంపర్ కూడా రీడిజైన్ చేయబడిన స్కిడ్ ప్లేట్‌లతో సరికొత్తగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి.

సైడ్ ప్రొఫైల్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బాడ్ కూడా ఉంటుంది. ఇది సి ఆకారంలో ఉన్న టెయిల్ లైట్‌లను అనుసంధానిస్తుంది. బంపర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ కూడా కొత్తగా కనిపిస్తాయి.

కలర్ ఆప్సన్స్ (Colour Options)

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎనిమిది మోనోటోన్ కలర్స్, రెండు డ్యూయెల్ టోన్ కలర్స్, ఒక మాట్ ఫినిషింగ్ పెయింట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్యూటర్ ఆలివ్ కలర్ ఆప్సన్ అనేది పూర్తిగా కొత్త కలర్ ఆప్షన్ కావడం గమనార్హం.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్లు (Interior Design & Features)

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలో కూడా ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, పెద్ద సెంట్రల్‌గా మౌంటెడ్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం వంటి ఉన్నాయి. ఇవన్నీ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషన్ కంట్రోల్ మాదిరిగా ఉపయోగపడతాయి. ట్రాక్షన్ అండ్ డ్రైవ్ మోడ్‌ల కోసం రెండు వరుసల టోగుల్‌లతో పాటు క్లైమేట్ కంట్రోల్ సమాచారాన్ని ప్రదర్శించడానికి దిగువన కొత్త చిన్న స్క్రీన్ ఉంటుంది.

కంపెనీ ఈ కారులోని సీట్ల కోసం కొత్త అపోల్స్ట్రే అందించింది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ADAS ఫీచర్ లభిస్తుంది. కాబట్టి ఈ కారులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటివి ఉంటాయి.

ఇవి మాత్రమే కాకుండా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ప్రామాణికంగా లభిస్తాయి. హై స్పెక్ వేరియంట్స్ కార్నర్ ల్యాంప్స్, ఫోర్-వే పవర్డ్ డ్రైవర్ సీటు మరియు బ్లైండ్-వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరాను పొందుతాయి.

పవర్‌ట్రెయిన్ డీటైల్స్ (Powertrain Details)

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ అదే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. కాబట్టి పనితీరు కూడా దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్, 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.

Don’t Miss: దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..

వేరియంట్‌లు & అంచనా ధర (Variants & Expected Price)

కొత్త కియా సోనెట్ టెక్ లైన్, జీటీ లైన్ మరియు ఎక్స్-లైన్ వేరియంట్‌లలో అందించబడుతోంది. ఈ లేటెస్ట్ కారు ధరలు రూ. 7.79 లక్షల నుంచి రూ. 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. అధికారిక ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.

ప్రత్యర్థులు (Rivals)

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ , మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ మరియు ఇతర కాంపాక్ట్ SUVలకు ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉండనుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టాటా కార్ల కొనుగోలుపై అద్భుతమైన ఇయర్ ఎండ్ ఆఫర్స్.. తప్పక తెలుసుకోండి!

0

Tata Motors Year End Offers 2023: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ (Tata Motors) 2023 ముగియనున్న సందర్భంగా.. 2024 రానున్న తరుణంలో కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి మరియు తమ అమ్మకాలను పెంచుకోవడానికి ‘ఇయర్ ఎండ్ ఆఫర్స్’ (Year End Offers) పేరిట మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనికి సంబంధిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా హారియర్ (Tata Harrier)

హారియర్ కొనుగోలుపైన టాటా మోటార్స్ రూ. 1.50 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇటీవల విడుదలైన కొత్త హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ సేల్స్ కోసం ఇప్పటికే ఉన్న ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ ఖాళీ చేయడానికి ఈ ఆఫర్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్లో లభిస్తున్న హారియర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 5 సీటర్, ఎంజీ హెక్టర్, జీప్ కంపాస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా సఫారి (Tata Safari)

సఫారీ SUV మీద కూడా కంపెనీ రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. హారియర్ మాదిరిగానే కొన్ని టాటా డీలర్‌షిప్‌లు కూడా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ సఫారి యొక్క అమ్ముడుపోని స్టాక్‌లను విక్రయించడానికి ఈ ఆఫర్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. సఫారీ కూడా హారియర్ తరహాలోనే అదే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఆల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టిగోర్ (Tata Tigor)

టిగోర్ కొనుగోలు మీద కంపెనీ రూ. 65000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ మోడల్ CNG వెర్షన్ మీద రూ. 55000 తగ్గింపు లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 86 హార్స్ పవర్ అందిస్తుంది.

టాటా టిగోర్ CNG మోడల్ 70 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు హోండా అమేజ్, మారుతి సుజుకి డిజైర్ మరియు హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

టియాగో (Tata Tiago)

టాటా మోటార్స్ తన టియాగో కొనుగోలుపైన రూ. 60000 వరకు తగ్గింపుని అందిస్తుంది. ఈ డిస్కౌంట్ కేవలం పెట్రోల్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. CNG మోడల్ మీద రూ. 50000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఇది కూడా ఉత్తమ ఫీచర్స్ కలిగిన ఈ మోడల్ దేశీయ విఫణిలో మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఆల్ట్రోజ్ (Tata Altroz)

టాటా కంపెనీ ఆల్ట్రోజ్ కొనుగోలు చేసేవారికి రూ. 45000 డిస్కౌంట్ అందిస్తుంది. పెట్రోల్, డీజిల్ మరియు CNG మోడల్స్ మీద ఈ తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్, 1.5 డీజిల్ మరియు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. టాటా ఆల్ట్రోజ్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనొ, హ్యుండై ఐ20 మరియు టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

రతన్ టాటా మీద చెయ్యేసి మాట్లాడేంత చనువుందా! ఎవరితడు?

0

Shantanu Naidu Relationship With Ratan Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా (Ratan Tata) గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలామందికి తెలుసు. అయితే అంతటి వ్యాపార దిగ్గజానికే టెక్నాలజీ పాఠాలు నేర్పే ఓ కుర్రాడి గురించి బహుశా తెలియకపోవచ్చు. ఇంతకీ అతడెవరు, అతనికి రతన్ టాటాకు ఉన్న సంబంధం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రతన్ టాటా అసిస్టెంట్, ఆఫీసులో డిప్యూటీ జనరల్ మేనేజర్ విధులు నిర్వహించే 28 ఏళ్ల ‘శంతను నాయుడు’ (Shantanu Naidu) 83 సంవత్సరాల వయసున్న రతన్ టాటాకు మంచి మిత్రుడు కూడా. ఇతడు ఏకంగా మూడు స్టార్టప్‌లను విజయవంతంగా నడుపుతున్నట్లు సమాచారం.

రతన్ టాటా వయసేమిటి, ఈ కుర్రాడి వయసేమిటి? వారి మధ్య స్నేహం ఏమిటని కొందరికి అనుమానం రావొచ్చు. కానీ ఇద్దరు మనుషులు ఆలోచనలు కలిస్తే, దృక్పథాలు ఒకటైతే ఆ సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి నిదర్శనమే రతన్ టాటా మరియు శంతను నాయుడు.

నిజానికి వీరిరువురి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ వీరి మాటలు, వీరి ముచ్చట్లు చాలా రసవత్తరంగా ఉంటుంది. వీరి మధ్య ఉన్న బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వారి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ఖచ్చితంగా నిర్థారిస్తారు.

కేవలం వ్యాపారంలో మాత్రమే కాకుండా సామాజిక సేవలో కూడా తరిస్తున్న రతన్ టాటా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడేంత చనువు ఎవరికైనా ఉంది అంటే తప్పకుండా అది శంతను నాయుడు అనే చెప్పాలి. మూగ జీవాల సంరక్షణలో మొదలైన వీరి పరిచయం నేడు మంచి స్నేహంగా మారింది.

వీరిద్దరూ ఎప్పుడూ సేవా కార్యక్రమాలు గురించి చర్చిస్తూ, ఈమెయిల్స్ ద్వారా అభిప్రాయాలూ పంచుకునేవారు. రతన్ టాటాను సోషల్ మీడియాకు పరిచయం చేసింది కూడా శంతను నాయుడే. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, హ్యాష్ టాగ్స్, ఎమోజి వంటి వాటిని ఉపయోగించడం కూడా ఇతడే నేర్పించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రతన్ టాటాకు వ్యాపార నిర్వహణ సంబమైన సలహాలు కూడా ఇస్తుంటాడు.

శంతను నాయుడు మోటోపాస్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటూనే, పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అతడు చదువుకునే కార్నెల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకలకు రతన్ టాటా హాజరయ్యాడు. ఆ తరువాత శంతను ఇండియా వచ్చిన తరువాత రతన్ టాటా ఆహ్వానం మేరకు బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరాడు.

వయసురీత్యా చిన్నవాడైనా.. ఆలోచనలో మాత్రం పెద్దవాడే అంటూ రతన్ టాటా గతంలో కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. కరోనా సమయంలో రతన్ టాటా నిర్వహించిన అనేక కార్యక్రమాలను శంతను దగ్గరుండి చూసుకున్నాడు.

శంతను నాయుడు పరిచయం

రతన్ టాటాకు శంతను నాయుడికి పరిచయం ఎలా ఏర్పడిందని చాలామందికి అనుమానం వచ్చి ఉండవచ్చు. నిజానికి ఒకరోజు శంతను ఆఫిస్ నుంచి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుక్క ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూసి చలించిపోయాడు. దీంతో మరోసారి ఇలాంటి సంఘటన జరగకూడదని స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్టులు తయారు చేసి వాటికి అమర్చాడు.

Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

కుక్క మేడలో రేడియం బెల్టు ఉండటం వల్ల వాహనాల లైటింగ్ పడినప్పుడు అవి మెరిసేవి, ఆ సందర్భంలో వాహనాలు ఆపడం లేదా నెమ్మదిగా వెళ్లడం చేసేవారు. ఇవి చూసిన ప్రజలు కూడా వారికి ఇలాంటి బెల్టులు కావాలని అడిగారు, కానీ అతని వద్ద వాటి తయారీకి అంత డబ్బు లేకపోవడంతో తండ్రి సలహాతో టాటా ఇండస్ట్రీస్ వారికి సందేశం పంపించాడు.

ఆ తరువాత కంపెనీ నుంచి ఆహ్వానం లభించింది. శంతను ముంబై వెళ్లిన తరువాత ఆ ప్రాజెక్టుకి కంపెనీ వారు కూడా ఒకే చెప్పేసారు. దీంతో మోటోపాస్ అనే స్టార్టప్ ప్రారంభించాడు. ప్రస్తుతం వృద్ధుల కోసం గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

భారత్‌లో మొదటి కారు లాంచ్ చేసిన లోటస్ – ధర తెలిస్తే దడ పుడుతుంది!

0

Lotus Eletre SUV Launched In India: ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ‘లోటస్’ (Lotus) ఈ రోజు భారతీయ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతూనే తన మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ‘ఎలెట్రే’ (Eletre) SUV లాంచ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన ఈ కారు ధర, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లోటస్ ఎలెట్రే ధర రూ. 2.55 కోట్లు. ప్రస్తుతానికి ఈ కంపెనీకి మన దేశంలో డీలర్షిప్ లేదు కావున ఢిల్లీలోని బెంట్లీస్‌ను రిటైల్ చేస్తున్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ద్వారా విక్రయాలు సాగిస్తుంది. అయితే కంపెనీ 2024 ప్రారంభం నాటికి ఢిల్లీలో రిటైలర్లను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత దేశవ్యాప్తంగా మరిన్ని షోరూమ్‌లు ప్రారంభిస్తుంది.

లోటస్ ఎలెట్రే ఎక్స్టీరియర్ డిజైన్

కొత్త లోటస్ ఎలెట్రే క్యాబ్ ఫార్వర్డ్ స్టాన్స్, పొడవాటి వీల్‌బేస్, చిన్న ఫ్రంట్ మరియు రియర్ ఓవర్‌హాంగ్‌లతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులోని చాలా ఎలిమెంట్స్ కంపెనీ యొక్క ఇతర కార్ల నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇండియన్ రోడ్లకు అనుకూలంగా ఉండటానికి 22 ఇంచెస్ 10 స్పోక్ వీల్‌ పొందుతుంది. ఈ కారు ఎలక్ట్రిక్ మోడల్ కావున ఇందులో యాక్టివ్ ఫ్రంట్ గ్రిల్‌ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కూడా చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఈ SUV వెడల్పు అంతటా విస్తరించి ఉండే రిబ్బన్ లైట్ చూడవచ్చు. ఇది వీల్ ఆర్చ్‌ల నుంచి ఎయిర్ అవుట్‌లెట్‌లలోకి వంగి ఉంటుంది. కార్బన్ ఫైబర్, త్రీ స్టేజ్ డిప్లోయబుల్, స్ప్లిట్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వెనుక భాగంలో చక్కగా విలీనం చేయబడి ఉంటుంది. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల మంచి పనితీరుని అందిస్తుంది.

లోటస్ ఎలెట్రే ఇంటీరియర్ అండ్ ఫీచర్స్

లేటెస్ట్ లోటస్ ఎలెట్రే కారు మంచి డిజైన్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 15.1 ఇంచెస్ ల్యాండ్‌స్కేప్-ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీనిని కంపెనీ ‘లోటస్ హైపర్ OS’ అని పిలుస్తుంది. ఇక్కడ గమనించినట్లతే డ్యాష్‌బోర్డ్ రెండుగా విభజించబడి వెనుకవైపు స్ప్లిట్ స్పాయిలర్ డిజైన్‌ను అనుకరిస్తుంది. దాని క్రింద, డాష్‌బోర్డ్ యొక్క పూర్తి వెడల్పుతో లైట్ బ్లేడ్ ఉంది. ఈ ఫీచర్ ఉండటం వల్ల ఫోన్ కాల్ వస్తే అది ఫ్లాష్ అవుతుంది.

దానికి కింది భాగంలో లోటస్ మూడు వేర్వేరు స్క్రీన్‌లతో కూడిన ‘రిబ్బన్ ఆఫ్ టెక్నాలజీ’ ని పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు బదులుగా, డ్యాష్‌బోర్డ్‌కు ఇరువైపులా 30 మిమీ స్ట్రిప్ ఉంది, అది కారు గురించి కావలసిన చాలా సమాచారం అందిస్తుంది. మూడవ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే.

కారులోని అన్నింటినీ డిజిటల్‌గా లేదా వాయిస్ కమాండ్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు, కానీ కొన్ని HVAC కంట్రోల్స్ మాత్రం టోగుల్ స్విచ్‌లను కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో స్మార్ట్‌ఫోన్ యాప్, 5G డేటా కంపాటిబిలిటీ మరియు ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు కూడా ఉంటాయి.

ఈ కారులో వైర్‌లెస్ ఛార్జింగ్, 12 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 15 స్పీకర్ డాల్బీ అట్మోస్ మరియు కేఈఎఫ్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, కాన్ఫిగర్ చేయదగిన యాంబియంట్ లైటింగ్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లు మరియు లైడార్ టెక్నాలజీ ఆధారంగా ADAS ఫీచర్లు ఉన్నాయి.

లోటస్ ఎలెట్రే పవర్‌ట్రెయిన్, రేంజ్ అండ్ బ్యాటరీ

ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్ మరియు ఎలెట్రే ఆర్. ఇవి మూడు రెండు పవర్‌ట్రెయిన్‌ల ఎంపికలతో లభిస్తాయి. మొదటి రెండు వెర్షన్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్ మోటార్ సిస్టమ్‌ కలిగిన గరిష్టంగా 600 కిమీ రేంజ్ అందిస్తాయి. ఇక మూడవ మోడల్ ఎలెట్రే ఆర్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే డ్యూయల్-మోటార్ సెటప్‌తో పాటు 2 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కలిగి గరిష్టంగా 490 కిమీ రేంజ్ అందిస్తాయి. టార్క్ గణాంకాలు వరుసగా 710 ఎన్ఎమ్ మరియు 985 ఎన్ఎమ్.

Don’t Miss: ధర ఎక్కువైనా అస్సలు వెనక్కి తగ్గని జనం – ఎగబడి మరీ కొనేస్తున్నారు!

కొత్త ఎలెట్రే, ఎలెట్రే ఎస్ కార్లు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అయితే.. ఎలెట్రే ఆర్ మాత్రం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి. దీని టాప్ స్పీడ్ గంటకు 258 కిమీ కావడం గమనార్హం. లోటస్ మూడు వేరియంట్‌లు 112 కిలోవాట్ బ్యాటరీని పొందుతాయి. ఇది ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఇది స్టాండర్డ్ 22 కిలోవాట్ AC ఛార్జర్‌ పొందుతుంది.

పండుగ సీజన్‌లో ఖరీదైన కార్లు కొన్న సెలబ్రిటీలు – నీతా అంబానీ నుంచి పూజ హెగ్డే వరకు..

0

Celebrities Who Bought New Expensive Cars This Festive Season: దసరా మరియు దీపావళి వచ్చిందంటే చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులో సాధార ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటారు. ఈ పండుగ సీజన్‌లో ఇటీవల ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఎవరు? వారు కొనుగోలు చేసిన కార్లు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సోనమ్ కపూర్ ల్యాండ్ రోవర్ (Sonam Kapoor Land Rover)

ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇటీవల ఓ ఖరీదైన ల్యాండ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ధర సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఈమె 5 డోర్స్ కలిగిం 110 వేరియంట్ కొనుగోలు చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.

అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 300 Bhp పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ ల్యాండ్ రోవర్ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.

అనిల్ కపూర్ మెర్సిడెస్ బెంజ్ (Anil Kapoor Mercedes Benz)

నటుడు అనిల్ కపూర్ కొనుగోలు ఇటీవల ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘ఎస్ 580 4మ్యాటిక్’ (S 580 4Matic) కొనుగోలు చేసాడు. దీని ధర రూ. 2.69 కోట్లు (ఎక్స్ – షోరూమ్). దీనిని ముంబైకి చెందిన మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. డెలివరీ తీసుకునే సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2022 ప్రారంభంలో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారు 4.0 లీటర్ బై టర్బో వి8 మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి 496 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది.

శ్రద్దా కపూర్ లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా (Shraddha Kapoor Lamborghini Huracan Tecnica)

నటి శ్రద్ధా కపూర్ కొనుగోలు పండుగ సీజన్‌లో కొనుగోలు చేసిన కొత్త కారు ‘లంబోర్ఘిని’ (Lamborghini) కంపెనీకి చెందిన ‘హురాకాన్ టెక్నికా’ (Huracan Tecnica). దీని ధర రూ. 4.04 కోట్లు. ఈ కారుకి సంబంధించిన ఫోటోలను పూజ చౌదరి తన ఇన్స్టా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

హురాకాన్ టెక్నికా 5.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజిన్ కలిగి 8000 rpm వద్ద 631 Bhp పవర్ మరియు 6500 వద్ద 565 న్యూటన్ మీటర్ టార్క్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ మరియు 9.1 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ వరకు ఉంది.

Don’t Miss: తాప్సీ గ్యారేజీలో ఖరీదైన కార్లు.. బాలీవుడ్‌కు వెళ్లి బాగానే సంపాదించిందే!

నీతా అంబానీ రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ (Nita Ambani Rolls Royce Cullinan Black Badge)

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇటీవల రూ. 8.2 కోట్ల (ఎక్స్ షోరూమ్) ఖరీదైన రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ కారులో కనిపించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారుని ముఖేష్ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 ఇంజిన్ కలిగి 600 Bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పూజ హెగ్డే ల్యాండ్ రోవర్ (Pooja Hegde Land Rover)

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన పూజ హెగ్డే.. ఆ తరువాత ముకుంద, మహర్షి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించింది. ప్రస్తుతం టాలీవుడ్ రంగంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినీ రంగంలో కూడా తనదైన రీతిలో దూసుకెళ్తున్న ఈ అమ్మడు ఇటీవల రూ. 4 కోట్లు ఖరీదైన ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్’ (Land Rover Range Rover) కొనుగోలు చేసింది.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. పూజ హెగ్డే ఏ ఇంజిన్ ఆప్షన్ కారును కొనుగోలు చేసిందో తెలియదు, కానీ 3.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ మరియు 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ యూనిట్. ఈ రెండు ఇంజిన్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి.

వారెవ్వా.. ఏమి కారండి బాబు! 60 కలర్ ఆప్షన్స్ – అంతకు మించిన ఫీచర్స్..

0

Bentley Flying Spur Hybrid India Launched : భారతీయ మార్కెట్లో కేవలం సాధారణ కార్లకే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంజ్, ఆడి, లెక్సస్ వంటి వాటితో పాటు బెంట్లీ కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. తాజాగా బెంట్లీ కంపెనీ ఒక హైబ్రిడ్ కారుని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు ధరల వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Price)

ఇండియన్ మార్కెట్లో విడుదల కొత్త ‘బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్‌’ (Bentley Flying Spur Hybrid) ధర రూ. 5.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది బెంట్లీ యొక్క మొత్తం పోర్ట్‌ఫోలియోలో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కలిగిన కారు.

ఇంజిన్ (Engine)

బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్‌ 2.9 లీటర్ ట్విన్ టర్బో వి6 ఇంజిన్ కలిగి ఎలక్ట్రిక్ మోటరుతో జత చేయబడి ఉంటుంది. దీని గరిష్ట పరిధి 805 కిమీ. ఈ హైబ్రిడ్ కారు 544 హార్స్ పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గంటకు 41 కిమీ వేగంతో ఏకంగా 805 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఎక్ట్సీరియర్ అండ్ ఇంటీరియర్ (Exterior & Interior)

కొత్త బెంట్లీ హైబ్రిడ్ కారు ఏకంగా 60 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ముల్లినర్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్ కోసం దాని బ్లాక్‌లైన్ స్పెసిఫికేషన్‌ను అందిస్తోంది. కావున ఇది గ్రిల్, విండో సరౌండ్‌లు, హెడ్‌లైట్ సరౌండ్‌లు, డోర్ ట్రిమ్‌లు మరియు హ్యాండిల్స్‌తో పాటు ఎగ్జాస్ట్ పైపులు మరియు ఫ్లయింగ్ బి మస్కట్ వంటి క్రోమ్ ట్రిమ్‌లకు బ్లాక్-అవుట్ ఉంటుంది.

బెంట్లీ లేటెస్ట్ కారు హైబ్రిడ్ మోడల్ అని గుర్తించడానికి ఇందులో బూట్ లిడ్‌పై ‘హైబ్రిడ్’ బ్యాడ్జ్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తం మీద ఈ కారు చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. బెంట్లీ ఐదు స్టాండర్డ్ మరియు 10 ఆప్షనల్ కలర్ ఆప్షన్‌లతో అపోల్స్ట్రే కోసం 15 కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. డాష్‌బోర్డ్ కోసం ఎనిమిది వెనీర్ ఎంపికలను అందిస్తుంది. అంతే కాకుండా బెంట్లీ సీట్లపై కాంట్రాస్ట్ స్టిచింగ్, పైపింగ్ వంటివి కూడా ఉంటాయి.

Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బెంట్లీ 2024 నాటికి మరిన్ని హైబ్రిడ్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికీ ఫ్లయింగ్ స్పర్ మరియు బెంటెగా వంటివి హైబ్రిడ్ వేరియంట్లలో విడుదలయ్యాయి. కావున రానున్న రోజుల్లో కాంటినెంటల్ జీటీ హైబ్రిడ్ కారుగా అవతరించనుంది. 2025 నాటికి కాంటినెంటల్ జీతే హైబ్రిడ్ కారుగా విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా కంపనీ 2030 నాటికి తన పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కలిగి ఉంటుందని తెలిపింది.

ప్రత్యర్థులు (Rivals)

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్ ప్రపంచ వ్యాప్తంగా మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్580ఈ (Mercedes-Maybach S580e) కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది. కానీ భారతీయ మార్కెట్లో ప్రస్తుతానికి ఈ ధర వద్ద సరైన ప్రత్యర్థులు లేదు. అయితే స్టాండర్డ్ ఫ్లయింగ్ స్పర్ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ (రూ. 2.69 కోట్లు – రూ. 3.40 కోట్లు) మరియు రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6.95 కోట్లు – రూ. 7.95 కోట్లు) వంటి వాటితో పోటీపడుతుంది.