26.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 7

రూ.40 లక్షల కారులో వచ్చి.. రూ.21 లక్షల బైక్ కొన్న మహిళ: వైరల్ వీడియో

0

Woman Arrives in Luxury Car and Buys BMW R 1300 GS Bike: వంటింటికి మాత్రమే ఆడవాళ్లు పరిమితం అనే రోజులు పోయాయి. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆధునిక కాలంలో వాహనాలను నడిపే మహిళల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో చాలామంది ఖరీదైన కార్లను, బైకులను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇటీవల ఓ మహిళ ఖరీదయిన బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గమనిస్తే.. ఒక మహిళ బీఎండబ్ల్యూ 3 సిరీస్ కారులో రావడం చూడవచ్చు. ఆమె బీఎండబ్ల్యూ మోటోరాడ్ షోరూంలో ‘బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్’ అడ్వెంచర్ బైక్ కొనుగోలు చేసింది. బైక్ కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన తరువాత.. బైక్ పక్కన నిలబడి పోజులిస్తుంది. ఆ తరువాత బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.

బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్

భారతదేశంలోని అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ‘బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్’ (BMW R 1300 GS) కూడా ఒకటి. ఈ బైక్ ధర రూ. 21.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ గత ఏడాదే మార్కెట్లో లాంచ్ అయింది. ఇది లైట్ వైట్, ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ మరియు ఆప్షన్ 719 ట్రముంటానా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అయితే.. ఆ మహిళ కొనుగోలు చేసిన బైక్ ట్రిపుల్ బ్లాక్ వేరియంట్ అని తెలుస్తోంది.

చూడటానికి అత్యద్భుతంగా ఉన్న.. బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్, ముందు నుంచి భారీగా కనిపిస్తుంది. స్పోక్డ్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగిన ఈ బైక్ ఎలక్ట్రానిక్ విండ్ స్క్రీన్, బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, సెంటర్ స్టాండ్ మరియు ప్రో రైడింగ్ మోడ్స్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.

బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బేస్ వేరియంట్ లేదా లైట్ వైట్ వేరియంట్ మినహా.. అన్ని ఇతర వేరియంట్లు టూరింగ్ ప్యాకేజ్ పొందుతాయి. ఈ ప్యాకేజీలో పన్నీర్ మౌంట్స్, క్రోమ్డ్ ఎగ్జాస్ట్ హెడర్ పైపులు, అడాప్టివ్ హెడ్‌లైట్, నకిల్ గార్డ్ ఎక్స్‌టెండర్‌లు మరియు జీపీఎస్ కోసం మౌంట్ వంటివి ఉన్నాయి. అయితే ట్రిపుల్ బ్లాక్ వేరియంట్ మాత్రమే.. అడాప్టివ్ రైడ్ హైట్ ఫీచర్‌ను ఆప్షన్‌గా పొందుతుంది. టాప్ ఎండ్ 719 ట్రాముంటానా వేరియంట్ యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫ్రంట్ కొలిషన్ వార్ణింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఖరీదైన బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులో 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 145 Bhp పవర్ మరియు 149 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. సుమారు 237 కేజీల బరువున్న ఈ బైక్ 19 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. కాబట్టి లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ బైక్స్ కలిగిన సెలబ్రిటీలు

నిజానికి బీఎండబ్ల్యూ బైకులు అడ్వెంచర్ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అడ్వెంచర్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది తమిళ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). ఇతని వద్ద ‘బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్’ (BMW R 1250 GS) బైక్ ఉంది. గతంలో చాలా సార్లు అజిత్ కుమార్ ఈ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు.

Also Read: ఈ కార్లనే ఎగబడి కొనేస్తున్నారు.. కొత్త ఏడాదిలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే!

నటుడు అజిత్ కుమార్ మాత్రమే కాకుండా.. మలయాళ నటి ‘మంజు వారియర్’ (Manju Warrier) కూడా ‘బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్’ బైక్ కలిగి ఉంది. ఓ సందర్భంలో ఈ బైకుపై ఆమె ఆఫ్ రోడింగ్ కూడా చేశారు. ఈ బైక్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 18.8 లక్షలు (ఎక్స్ షోరూమ్).

అజిత్ కుమార్, మంజు వారియర్ వద్ద మాత్రమే కాకుండా షాహిద్ కపూర్, జాన్ అబ్రహం, అర్షద్ వర్షి, విజయ్ సేతుపతి, నాగ చైతన్య, ఆర్ మాధవన్ మరియు కునాల్ కెమ్ము వంటి ప్రముఖ సినీతారల వద్ద కూడా ఈ బీఎండబ్ల్యూ బ్రాండ్ బైక్ ఉంది. దీన్ని బట్టి చూస్తే.. బీఎండబ్ల్యూ బైకులకు ఎక్కువమంది సెలబ్రిటీ అభిమానులనే చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by KUN BMW Motorrad (@kunbmwmotorrad)

ఈ కార్లనే ఎగబడి కొనేస్తున్నారు.. కొత్త ఏడాదిలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే!

0

Car Sales in 2025 January: 2024లో సజావుగా సాగిన కార్ల అమ్మకాలు.. 2025లో కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. జనవరిలో కూడా పలు కంపెనీలు మంచి సంఖ్యలో కార్లను విక్రయించాయి. మారుతి సుజుకి, ఎంజీ మోటార్ మరియు టయోటా కంపెనీలు అమ్మకాల్లో దూసుకెళ్లాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ కథనంలో ఏ బ్రాండ్ కార్లు ఎన్ని అమ్ముడయ్యాయో వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి (Maruti Suzuki)

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి 2025 జనవరిలో దేశీయ విఫణిలో 1,73,599 ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ఈ సేల్స్ 2024 జనవారితో పోలిస్తే 4 శాతం ఎక్కువ. మినీ కార్ల అమ్మకాల్లో కంపెనీ కొంత నత్తనడకగానే ముందుకు సాగింది. 2024తో పోలిస్తే ఈ అమ్మకాలు కూడా 10 తక్కువని తెలుస్తోంది. కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 7.4 శాతం పెరిగాయి. యుటిలిటీ వాహనాల సేల్స్ కూడా 4.92 శాతం పెరిగింది. ఎగుమతులు 27100 కావడం గమనార్హం. మొత్తం మీద భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది.

హ్యుందాయ్ (Hyundai)

దేశంలో అత్యధిక కార్లను విక్రయించిన కార్ల కంపెనీల జాబితాలో హ్యుందాయ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ గత నెలలో 65,603 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య అంతకు ముందు ఏడాదితో (2024 జనవరి) పోలిస్తే 3 శాతం తక్కువ (67,615 యూనిట్లు). దేశీయ అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ.. ఎగుమతులు కొంత పెరిగాయి. కంపెనీ 2025 జనవరిలో 11600 కార్లను ఎగుమతి చేసింది. ఈ సంఖ్య 2024 జనవరితో పోలిస్తే 10.47 శాతం ఎక్కువ. కాగా కంపెనీ జనవరి ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో క్రెటా ఈవీ లాంచ్ చేసింది. కాబట్టి అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

టాటా మోటార్స్ (Tata Motors)

భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా గత నెలలో కొంత ఆశాజనక అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఈవీ అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. జనవరి 2025లో కంపెనీ విక్రయించిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 48,316 యూనిట్లు. ఈ సంఖ్య 2024 జనవారితో పోలిస్తే 11 శాతం తక్కువ. అంటే ఆ సమయంలో మార్కెట్లో అమ్ముడైన కార్ల సంఖ్య 53,663 యూనిట్లు.

టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ 25 శాతం తగ్గింది. 2025 జనవరిలో కంపెనీ 5240 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ అమ్మకాలు 2024 జనవరిలో 6,979 కావడం గమనార్హం. ఎగుమతులు కూడా 40 శాతం తగ్గాయి. మొత్తం మీద గత నెలలో ఎక్కువ కార్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టాటా మోటార్స్ మూడో స్థానంలో నిలిచింది.

టయోటా (Toyota)

ఇక టయోటా యొక్క అమ్మకాల విషయానికి వస్తే.. ఈ కంపెనీ జనవరిలో 29371 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ సేల్స్ 23197 యూనిట్లు. అంటే కంపెనీ సేల్స్ 2025లో 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎగుమతులు కూడా కొంత పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor)

ఎంజీ మోటార్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సంస్థతో జత కట్టిన తరువాత విపరీతంగా పెరిగాయి. కంపెనీ 2025 జనవరిలో 4455 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ సేల్స్ 2024 జనవరితో పోలిస్తే.. 256 శాతం ఎక్కువ. ఈవీ అమ్మకాలు కూడా 70 శాతం పెరిగాయి. కంపెనీ ఎప్పటికప్పుడు తన అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే జనవరి ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో పలు కొత్త కార్లను ఆవిష్కరించింది. కాబట్టి ఎంజీ మోటార్ అమ్మకాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra)

దేశీయ దిగ్గజం మహీంద్రా కంపెనీ జనవరి 2025లో 18 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అంటే సంస్థ గత నెలలో 50659 కార్లను విక్రయించింది. ఎగుమతులతో కలిపి ఈ అమ్మకాలు 52,306 కావడం గమనించదగ్గ విషయం. మహీంద్రా కంపెనీ ఇటీవల బీఈ 6 మరియు ఎక్స్ఈవీ 9ఈ అనే ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇవి చూడటానికి కొత్తగా అనిపించడమే కాకుండా.. సేఫ్టీలో కూడా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. కాబట్టి ఈ కార్ల సేల్స్ మొదలైన తరువాత మహీంద్రా అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

కియా మోటార్స్ (Kia Motors)

భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. 5 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ గత నెలలో 25,025 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో సోనెట్, కారెన్స్ మరియు సెల్టోస్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు కార్ల అమ్మకాలు వరుసగా.. 7194, 5522 మరియు 6470 యూనిట్లుగా ఉన్నాయి.

Also Read: సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ధర ఎంతో తెలుసా?

హోండా (Honda)

భారతదేశంలో హోండా అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2024 జనవరి కంటే 2025 జనవరిలో కంపెనీ సేల్స్ 7 శాతం తగ్గాయి. గత నెలలో సంస్థ 12304 కార్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు 7325 యూనిట్లు అని తెలుస్తోంది. ఎగుమతులు మాత్రం కొంత పెరుగుదలను నమోదు చేశాయి. హోండా జనవరి 2025లో 4979 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది. 2024 జనవరిలో కంపెనీ ఎగుమతి చేసిన కార్లు 4531 మాత్రమే.

మనసులో మాట చెప్పిన అనసూయ.. వారు కమిట్మెంట్ అడిగారు: ఎంతో కోల్పోయా..

0

Star Heroes and Directors Ask To Commitment Anasuya Comments: అనుసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే బుల్లితెర నటి నుంచి వెండితెర నటిగా ఎదిగిన ఈమె.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో సైతం ప్రముఖ పాత్రలలో నటిస్తూ, ఎంతోమంది అభిమానుల మనసు దోచేస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఒకప్పుడు సాక్షి టీవీలో పని చేసిన అనసూయ.. తరువాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చి.. తన ఫోకస్ మొత్తాన్ని సినిమాల మీదనే ఉంచేసింది. అయితే ఈమె అప్పుడప్పుడు చేసే కొన్ని వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ట్రోలర్లు కూడా ఈమెను చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

శృంగారం.. బేసిక్ నీడ్

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. ప్రస్తుత సినీ రంగంలో ఉన్న పరిస్థితుల గురించి వెల్లడించింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ’20 లేదా 25 ఏళ్ళ యువకులు 35 ఏళ్ల మహిళలను ఇష్టపడుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది’ అని చెప్పాడు. దానికి స్పందిస్తూ.. అందులో తప్పేముంది. తిండి, నిద్ర మాదిరిగానే శృంగారం కూడా ప్రాధమిక అవసరం అని అనసూయ చెప్పింది. అయితే శృంగారమనేది బహిరంగం కాదని కూడా స్పష్టం చేసింది.

ఇక తన డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతూ.. తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అని, మా వాళ్లకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని చెప్పించి. ఇద్దరు పిల్లల తల్లి ఇలాంటి డ్రెస్ వేసుకుందేంటి? అంటుంటారు. నేను బికినీ వేసుకుంటా.. లేకుంటే బట్టలిప్పుకు తిరుగుతా? అది నా ఇష్టం. అయితే చూసేవాళ్ల దృష్టిని తప్పుబట్టరు, నన్ను ఎందుకు తప్పుపడతారు అని అనసూయ వెల్లడించింది. నా పని నేను చేసుకుంటూ పోతా? ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని క్లారిటీ ఇచ్చింది.

కమిట్మెంట్ అడిగారు

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, డైరెక్టర్లు తనను కమిట్మెంట్ అడిగారని.. వారికి నో చెప్పడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని అనసూయ ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమా అనేది రంగుల ప్రపంచం.. అక్కడున్నవారు చాలా అందంగా తయారవుతారు. దీంతో ఎదుటివారికి ఆకర్షణ ఎక్కువ. తనకు 9వ తరగతి నుంచే ప్రపోజల్స్ స్టార్ అయ్యాయని చెప్పింది. అప్పటి నుంచే ఎదుటివారికి ఎలా నో చెప్పాలో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే.. సున్నితంగా నాకు అలాంటి భావన లేదని చెప్పేస్తాను అని కూడా అనసూయ వెల్లడించింది.

పుష్ప సినిమాలో తన నెగెటివ్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. తాను ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తానని చెప్పింది. అంతే కాకుండా పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన గురించి చెబుతూ.. అది ఎవరూ కావాలని చేయలేదని చెప్పింది. సినిమా చూడటానికి వెళ్లారు, అనుకోకుండా ఆ ఘటన జరిగింది. అది ఎంతోమందిని బాధకు గురి చేసిందని కూడా చెప్పింది.

ఆడి కారు గిఫ్ట్?

ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వస్తుంటాయి. నాకు ఎవరో ఆడి కారు గిఫ్ట్ ఇచ్చినట్లు నేను కూడా చూసాను. కానీ నాకు అది ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు. నేను, మా ఆయన కాస్తపై ఈఎంఐ కట్టి దానిని కొనుగోలు చేసాము. కరోనా ముందే ఈఎంఐ పూర్తి చేసాము. నేను ఎవరి దగ్గరా ఏమి ఆశించను, నా డబ్బు ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టను అని అనసూయ చెప్పింది. ఇక పుష్ప 2 సినిమా తరువాత, ఇంకా రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పింది. అయితే మొత్తం మీద అనసూయ వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీ అయిపోయింది.

Also Read: పెళ్లి గురించి చెప్పిన జాన్వీ కపూర్.. నాకు కూడా అక్కడే అంటున్న ఖుషి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. చాలా గొప్ప వ్యక్తి అని, సినిమా షూటింగ్ సమయంలో కూడా బుక్స్ చదువుతుంటారని చెప్పింది. ఇప్పుడు రాజకీయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని అనసూయ చెప్పింది. మొత్తం మీద ఇటీవల ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలన్నీ అనసూయ బయటకు చెప్పేసింది.

సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ధర ఎంతో తెలుసా?

0

Ultraviolette F77 Super Street launched: బెంగళూరుకు చెందిన వాహన తయారీ సంస్థ ఆల్ట్రావయొలెట్ (Ultraviolette) మార్కెట్లో మ్యాక్ 2 యొక్క ఏర్గోనామిక్ వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త బైక్ పేరు ‘ఎఫ్77 సూపర్ స్ట్రీట్’ (F77 Super Street). ఈ బైక్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎలా ఉన్నాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

వేరియంట్స్ & ధరలు

కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ వేరియంట్ మరియు రీకాన్ వేరియంట్. వీటి ధరలు వరుసగా.. రూ. 2.99 లక్షలు, రూ. 3.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం ఈ రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి 1న ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

డిజైన్ మరియు ఫీచర్స్

ఒక్క చూపుతోనే.. వాహన ప్రేమికులను ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ పొడవు, వెడల్పుగా ఉంటుంది. సరికొత్త హ్యాండిల్ బార్ మరియు ఫుట్‌పెగ్ వంటివి ఇందులో చూడవచ్చు. హెడ్‌లైట్, లెయిల్ లైట్ మరియు సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ బైక్ కొత్త కౌల్, 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. 10 లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఈ బైకులో ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ బైక్ యూఎస్డీ ఫ్రంట్ పోర్క్స్, వెనుక మోనోశాక్ ఉన్నాయి. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

బ్యాటరీ అండ్ రేంజ్

ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైక్.. అత్యంత శక్తివంతమైన 10.3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 30 కేడబ్ల్యు మోటరుకి అనుసంధానించబడి ఉంటుంది. ఇది 40.2 హార్స్ పవర్ మరియు 100 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 211 కిమీ (స్టాండర్డ్) 323 కిమీ (రీకాన్) రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 155 కిమీ కావడం గమనార్హం.

Also Read: ఇది కదా బైక్ అంటే.. రేటు అక్షరాలా రూ.21.20 లక్షలండోయ్

సుమారు 207 కేజీల బరువున్న కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైక్ బరువు.. స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువే. అయితే ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుందని సమాచారం. కాబట్టి ఇది తప్పకుండా వాహన ప్రేమికులను ఆకర్షిస్తుందని.. మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

కలర్ ఆప్షన్స్

కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది. అవి టర్బో రెడ్, ఆఫ్టర్ బర్నర్ ఎల్లో, స్టెల్లార్ వైట్ మరియు కాస్మిక్ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న వేళ ఈ బైక్ మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.

వచ్చేసింది.. సరికొత్త కియా సిరోస్: 4 వేరియంట్స్, 8 కలర్ ఆప్షన్స్.. ఇంకా ఎన్నో..

0

Kia Syros Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) ఎట్టకేలకు ‘సైరోస్’ (Syros) కారు ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.

వేరియంట్స్ & ధరలు

  • హెచ్‌టీకే: రూ. 9 లక్షలు
  • హెచ్‌టీఎక్స్ (ఓ): రూ. 10 లక్షలు
  • హెచ్‌టీఎక్స్ ప్లస్: రూ. 11.50 లక్షలు
  • హెచ్‌టీఎక్స్: రూ. 13.30 లక్షలు

డిజైన్

భారతదేశంలో లాంచ్ అయిన కొత్త కియా సైరోస్.. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడటానికి ఈవీ9, ఈవీ5 మరియు ఈవీ3 వంటి మోడళ్లకు సమానంగా ఉంటుంది. ఈ కారు యొక్క ముందు భాగంలో.. నిలువుగా పేర్చబడిన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. అంతే కాకుండా పెద్ద ఎయిర్ డ్యామ్.. మధ్యలో కొంత విభజించబడి ఉంటుంది. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన.. సిరోస్ కారు ప్లాట్ రూఫ్‌లైన్, పొడవైన గ్లాస్‌హౌస్.. వీల్ ఆర్చ్ చుట్టూ క్లాడింగ్ వంటివి పొందుతుంది. వెనుకవైపు విండ్‌స్క్రీన్ అంచున టెయిల్ ల్యాంప్ ఉండటం చూడవచ్చు. బంపర్ క్లాడింగ్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కలర్ ఆప్షన్స్

కొత్త కియా సిరోస్ కారు ఎనిమిది రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి అరోరా బ్లాక్ పెర్ల్, ఫ్రాస్ట్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, ఇంపీరియర్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, ప్యూటర్ ఆలివ్ మరియు స్పార్క్లింగ్ సిల్వర్. ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా మరియు ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉంటాయి.

ఫీచర్స్

కియా సిరోస్ సెంటర్ కన్సోల్‌లో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో క్లైమేట్ కంట్రోల్ కోసం 5 ఇంచెస్ స్క్రీన్ కూడా లభిస్తుంది. టూ స్పోక్ స్టీరింగ్ వీల్ బ్రాండ్ లోగో పొందుతుంది. ఏసీ వెంట్స్ డాష్‌బోర్డ్ పొడవునా విస్తరించి ఉన్నాయి.

నాలుగు సీట్లకు వెంటిలేషన్, యాంబియంట్ లైటింగ్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన రిక్లైనింగ్.. రెండవ వరుసలో స్లైడింగ్ సీట్లు, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ ఫంక్షన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు 8 స్పీకర్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టం వంటి మరెన్నో ఫీచర్స్ కియా సిరోస్ కారులో ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. కియా సిరోస్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

పవర్‌ట్రెయిన్

కొత్త కియా సిరోస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 హార్స్ పవర్ మరియు 172 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇక 1.5 లీటర్ ఫోర్ సిలినాద్ర డీజిల్ ఇంజిన్ 116 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తాయని సమాచారం.

బుకింగ్స్ & డెలివరీ

2024లో మార్కెట్లో అడుగుపెట్టిన కియా సిరోస్ కారు.. త్వరలోనే విక్రయానికి రానుంది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ నెలలో (ఫిబ్రవరి) ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Also Read: నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్: ఫిదా చేస్తున్న డిజైన్ & ధర ఎంతంటే?

ప్రత్యర్థులు

మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కియా సిరోస్ కారు.. ఇప్పటికే దేశీయ విఫణిలో విక్రయానికి ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, స్కోడా కైలాక్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

Budget 2025-26: బడ్జెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

0

Interesting Facts About Indian Budget: భారతదేశానికి స్వాతంత్యం వచ్చే వరకు బడ్జెట్ అనే మాట వినిపించలేదు. ఎందుకంటే.. బ్రిటీష్ వారు చేసిందే చట్టం, చెప్పిందే వేదం కాబట్టి. స్వాతంత్యం వచ్చిన తరువాత.. దేశ ఆర్ధిక వ్యవస్థను అంచనా వేయడానికి 1947 నవంబర్ 26న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రవేశపెట్టిన కేవలం మూడు నెలలకే.. అంటే 1948 ఫిబ్రవరి 28న దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా మొట్టమొదటి వార్షిక బడ్జెట్ వెలువడింది. ‘ఆర్‌కే షణ్ముఖం శెట్టి’ దీనిని ప్రవేశపెట్టారు. ఆ తరువాత బడ్జెట్ యధావిధిగా ప్రవేశపెడుతూనే వస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ రోజు (2025 ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి ‘నిర్మలా సీతారామన్’ (Nirmala Sitharaman) యూనియన్ బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2025 బడ్జెట్ అనేది మోదీ ప్రభుత్వంలో సీతారామన్ ప్రవేశపెడుతున్న 8వ బడ్జెట్. అంటే ఈమె 8సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న మాట.

మొత్తం మీద బడ్జెట్ 2025-26ను నిర్మల సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే భారత బడ్జెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.. వచ్చేయండి.

భారతదేశంలో మొట్ట మొదటి బడ్జెట్ ఎప్పుడంటే..

ప్రారంభంలో చెప్పుకున్నట్లు భారతదేశంలో బడ్జెట్ అనేది స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రారంభమైంది. మొట్ట మొదటి బడ్జెట్‌ను అప్పటి ప్రధాని ‘జవహర్‌లాల్ నెహ్రు’ ఆధ్వర్యంలో ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. దీనిని ప్రధానంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశం యొక్క ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రవేశపెట్టారు. కాబట్టి ఇందులో చెప్పుకోదగ్గ ప్రతిపాదనలు ప్రవేశపెట్టలేదు.

బడ్జెట్ చదివిన ప్రధానమంత్రులు

సాధారణంగా ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టేది.. కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి. కానీ ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటివరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రు (1958 బడ్జెట్), ఇందిరా గాంధీ (1970 బడ్జెట్) మరియు రాజీవ్ గాంధీ (1987 బడ్జెట్). వీరు మాత్రమే ప్రధాన మంత్రులు అయినప్పటికీ.. స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.

అతి చిన్న బడ్జెట్ & సుదీర్ఘమైన బడ్జెట్

బడ్జెట్ గురించి తెలిసిన చాలామందికి బడ్జెట్ చరిత్రలో అతి చిన్న మరియు సుదీర్ఘ బడ్జెట్ ఏదని తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి భారతదేశ బడ్జెట్ చరిత్రలో అత్యంత చిన్న బడ్జెట్ 1977లో హిరూభాయ్ పటేల్ ప్రవేశపెట్టింది. ఆయన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నిడివి కేవలం 800 పదాలతో మాత్రమే. ఇదే అప్పటి బడ్జెట్.. ఇప్పటి వరకు ఇదే అతి చిన్న బడ్జెట్ అని తెలుస్తోంది.

యూనియన్ బడ్జెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్‌ను 2020లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ఏకంగా రెండు గంటల నలభై నిముషాల పాటు బడ్జెట్ ప్రసంగించారు. ఇప్పటి వరకు అదే అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్. కాగా ఈ రోజు (శనివారం) ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ను సంబంధిత వ్యక్తులు లేదా సీతారామన్ అనే వ్యక్తి ఎంత సమయం బడ్జెట్ గురించి ప్రస్తావిస్తారు తెలియాల్సి ఉంది.

పేపర్‌లెస్ బడ్జెట్

నిజానికి ప్రారంభం నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు.. పేపర్లను చూసి చదివేవాళ్ళు. కానీ మొదటిసారి 2021లో పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ చరిత్రలోనే ఓ నూతన అధ్యాయం. పేపర్ వ్యర్దాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పేపర్‌లెస్ బడ్జెట్ కొనసాగుతోంది.

బడ్జెట్ సమయంలో మార్పు

ప్రారంభంలో బడ్జెట్ అనేది సాయంత్రం 5 గంటల సమయానికి ప్రారంభించేవారు. కానీ ఇది అంత సమంజసంగా లేదని.. 1999లో యాశ్వంత్ సిన్హా.. బ్రిటీష్ పార్లమెంట్ షెడ్యూల్ విధానానికి స్వస్తి పలికి.. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. అప్పటి నుంచి బడ్జెట్ ఎప్పుడైనా.. 11 గంటలకు ప్రారంభిస్తున్నారు.

బడ్జెట్ ప్రెజెంటేషన్ తేదీ

2017లో కేంద్రం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మార్చారు. అంటే బడ్జెట్ తేదీని ఇంకా ముందుకు మార్చేశారు. కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 ప్రారంభమయ్యేలోపు ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన అన్ని పార్లమెంటరీ ఆమోదాలు పూర్తయ్యేలా ఈ మార్పు చేయడం జరిగింది. అప్పటి నుంచి కొత్త విధానమే ముందుకు సాగుతోంది.

రైల్వే బడ్జెట్ విలీనం

2017లో మొదటిసారి రైల్వే బడ్జెట్‌ను.. కేంద్ర బడ్జెట్‌లో చేర్చారు. ఆర్ధిక నిర్వహణను క్రమబద్దీకరించడానికి మాత్రమే కాకుండా.. రైల్వేకు సంబంధించిన నిధులలో కూడా పారదర్శకతను పెంచడానికి ఈ విధానం అవలంబించారు. అప్పటి నుంచి రైల్వే బడ్జెట్‌ను.. కేంద్ర బడ్జెట్‌లోనే ప్రవేశపెడుతున్నారు.

బ్లాక్ బడ్జెట్

భారత్ – పాకిస్తాన్ యుద్ధం వల్ల.. మనదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దాదాపు 550 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ కనిపించింది. దీనినే ‘బ్లాక్ బడ్జెట్’ అన్నారు. అంతే కాకుండా బొగ్గు గనులను కూడా జాతీయం చేశారు. ఇవన్నీ 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో జరిగాయి. అప్పుడు బడ్జెట్‌ను ‘యశ్వంతరావు చవాన్’ ప్రవేశపెట్టారు.

ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రులు

బడ్జెట్‌ను ఎక్కువసార్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల జాబితాలో మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఈయన 1962 నుంచి 1969 వరకు ఏకంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తరువాత పి చిదంబరం ‘తొమ్మిది సార్లు’, నిర్మలా సీతారామన్ ‘ఎనిమిది సార్లు’ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Also Read: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!: భారీగా పెరిగిన గోల్డ్ రేటు

2025 బడ్జెట్ ప్రత్యేకం

ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు ఎలా ఉన్నా.. ఈ రోజు (2025 పిబ్రవరి 1) ప్రవేశపెట్టనున్న బడ్జెట్, భారతదేశ అభివృద్ధిని లేదా వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టనున్నారు. 2030నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలనే ఉద్దేశ్యం ప్రధానం. కాబట్టి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఒకేసారి నాలుగు స్కూటర్లు లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్: ధరలు ఎలా ఉన్నాయంటే..

0

Ola Electric Gen 3 S1 Scooters Launched: భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) దేశీయ విఫణిలో ఎట్టకేలకు జెన్ 3 పేరుతో ఒకేసారి నాలుగు స్కూటర్లను లాంచ్ చేసింది. ఇవి చూడటానికి చాలా సింపుల్‌గా ఉండటమే కాకుండా.. రైడర్లకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ జెన్ 3 స్కూటర్లు

•ఎస్1 ఎక్స్: రూ. 79,999
•ఎస్1 ఎక్స్ ప్లస్: రూ. 1.08 లక్షలు
•ఎస్1 ప్రో: రూ. 1.15 లక్షలు
•ఎస్1 ప్రో ప్లస్: రూ. 1.55 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా)

ఎస్1 ఎక్స్ (S1 X)

కంపెనీ లాంచ్ చేసిన నాలుగు స్కూటర్లలో ఇది బేస్ మోడల్. ఇది మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 2 కిలోవాట్ బ్యాటరీ (108 కిమీ), 3 కిలోవాట్ బ్యాటరీ (176 కిమీ), 4 కిలోవాట్ బ్యాటరీ (242 కిమీ). అయితే ధర అనేది మీరు ఎంచుకున్న బ్యాటరీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటి ధరలు వరుసగా రూ. 79,999 (2 కిలోవాట్ బ్యాటరీ), రూ. 89,999 (3 కిలోవాట్ బ్యాటరీ) మరియు రూ. 99,999 (4 కిలోవాట్ బ్యాటరీ). మూడు వేరియంట్స్ చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ రేంజ్ అనేది వేరుగా ఉంటుంది.

ఎస్1 ఎక్స్ ప్లస్ (S1 X+)

ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన మరో స్కూటర్ ‘ఎస్1 ఎక్స్ ప్లస్’. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. 4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ. 1.08 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో 242 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛానల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ టెక్నాలజీ వంటి వాటితో పాటు.. సరికొత్త మూవ్ఓఎస్ 5 సాఫ్ట్‌వేర్ పొందుతుంది. ఇది బ్లూ, రెడ్, బ్లాక్, గ్రే మరియు వైట్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఎస్1 ప్రో (S1 Pro)

కంపెనీ లాంచ్ చేసిన మరో స్కూటర్ ఎస్1 ప్రో. ఇది 3 కిలోవాట్ మరియు 4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ వరుసగా 176 కిమీ రేంజ్ మరియు 242 కిమీ రేంజ్ అందిస్తాయి. వీటి ధరలు రూ. 1.15 లక్షలు, రూ. 1.35 లక్షలు (ధరలు ఎక్స్ షోరూమ్). ఇవి ఎస్1 ఎక్స్ మోడల్‌ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. కాగా ఇందులో టచ్‌స్క్రీన్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే లభిస్తుంది.

Also Read: పెళ్లి గురించి చెప్పిన జాన్వీ కపూర్.. నాకు కూడా అక్కడే అంటున్న ఖుషి

ఎస్1 ప్రో ప్లస్ (S1 Pro+)

ఈ ఎస్1 ప్రో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ బ్యాటరీ మరియు 5.3 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.55 లక్షలు, రూ. 1.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). 4 కిలోవాట్ బ్యాటరీ.. ఒక సింగిల్ ఛార్జితో 242 కిమీ రేంజ్ అందిస్తే.. 5.2 కిలోవాట్ బ్యాటరీ సింగిల్ ఛార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ రిమ్ డెకాల్స్ మరియు అల్యూమినియం పిలియన్ గ్రాబ్ రైల్ వంటివి పొందుతుంది.

బుకింగ్స్ & డెలివరీ వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన సరికొత్త స్కూటర్ల కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఆసక్తి కలిగిన కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారికి డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాగా కంపెనీ బ్యాటరీ మీద వారంటీ కూడా అందిస్తుంది. మొత్తం మీద ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో ఆదరణ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి కూడా సన్నద్ధమైంది. ఇది కూడా త్వరలోనే మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

వచ్చేస్తోంది ఓలా సరికొత్త స్పోర్ట్ బైక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు

0

Ola Electric Sports Bike: భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ ఇంతకు ముందే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఈ బైకుకు సంబంధించిన ఫోటోలను సంస్థ సీఈఓ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వయంగా షేర్ చేసిన ‘ఓలా యారోహెడ్ బైక్’ కాన్సెప్ట్ ఫోటోలను గమనిస్తే.. పసుపు రంగులో చూడటానికి అద్భుతంగా కనిపించే స్పోర్ట్స్ బైక్ కనిపిస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. రైడింగ్ చేయడానికి త్వరలో వచ్చేస్తున్నాయి అని పేర్కొన్నారు. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. సంబరపడిపోతున్నారు. నాకు ఇలాంటిదే రెడ్ కలర్ బైక్ కావాలని.. ఒకరు కామెంట్ చేశారు. అయితే ఈ బైక్ ఎన్ని రంగులలో అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని సీఈఓ వెల్లడించలేదు.

బాణం గుర్తుతో..

భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే.. బాణం గుర్తు వంటి ఆకారం చూడవచ్చు. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో హెడ్‌లైట్, సైడ్ ఇండికేటర్, విశాలమైన హ్యాండిల్ బార్ మొదలైనవి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఇది తప్పకుండా బైక్ ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉందని అర్థమవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ ఉత్పత్తిని ప్రారంభించేసింది. కాబట్టి డెలివరీలు కూడా ఏడాదిలోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము.

సరికొత్త డిజైన్.. యువతను ఆకట్టుకునే స్టైల్ పొందిన ఈ స్పోర్ట్ బైక్.. కంపెనీ యొక్క గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ బైకులు కూడా మోటార్‌సైకిల్స్ విభాగంలో కూడా తప్పకుండా ఓ హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉందనిపిస్తోంది. అయితే ఈ బైక్ గురించి చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఫీచర్స్

త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్న సరికొత్త ఓలా ఎలక్ట్రిల్ స్పోర్ట్ బైక్.. అధునాతన ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇందులో మూవ్ఓఎస్ 5 (MoveOS 5) ఉండనుంది. అంతే కాకుండా ఇది న్యావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, రోడ్ ట్రిప్ మోడ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. వీటితో పాటు ఇది స్మార్ట్ ఛార్జింగ్, స్మార్ట్ పార్క్, వాయిస్ అసిస్టెంట్‌తో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం అలర్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బైక్ వినియోగదారులకు చాలా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయని స్పష్టమవుతోంది.

ఓలా సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైక్ లాంచ్ చేసిన తరువాత.. మార్కెట్లో రెవోల్ట్ ఆర్‌వీ 400, కబీరా స్కూటర్స్ కేఎమ్ 3000 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ బైక్ స్పెసిఫికేషన్స్ మరియు ధరకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడించాల్సి ఉంది. అంతే కాకుండా ఈ బైక్ రేంజ్ గురించి కూడా కంపెనీ ప్రస్తావించాల్సి ఉంది. మొత్తం మీద ఈ బైక్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని మాత్రం స్పష్టమవుతోంది.

అంచనా ధర

కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త స్పోర్ట్స్ బైక్ ధర రూ. 1.50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. ఆన్ రోడ్ ధర రూ. 20000 ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. కాగా ఖచ్చితంగా ధరల గురించి తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ చేసిన అన్ని వాహనాల కంటే.. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన బైక్ చాలా భిన్నంగా మరియు ఆకర్షణీయంగా ఉంది.

Also Read: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!: భారీగా పెరిగిన గోల్డ్ రేటు

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్.. భారతీయ మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ప్రారంభం నుంచి గొప్ప అమాంకాలతో ముందుకు దూసుకెళ్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఈ బైక్ లాంచ్ చేస్తే, అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. అంతే కాకుండా కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనిని కంపెనీ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

సామాన్యులకు దూరమవుతున్న బంగారం!: భారీగా పెరిగిన గోల్డ్ రేటు

0

Reason For Gold Price Hike and Today Rate: గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బంగారం దిగుమతి మీద ట్యాక్స్ భారీగా తగ్గింది. ఆ సమయంలో గోల్డ్ రేటు కూడా గణనీయంగా తగ్గింది. కాగా ఈ రోజు (జనవరి 29) చూస్తే.. పసిడి రేటు రూ. 83వేలకు చేరువలో ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. బంగారం ధర అతి తక్కువ కాలంలో రూ. 1 లక్షకు చేరుతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

జనవరి 29న బంగారం ధరలు (Gold Price) మరోసారి భారీగా పెరిగాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,950 వద్ద, 24 క్యారెట్ల ధర రూ. 82,850 వద్ద ఉంది. నిన్నటి వరకు రూ. 75,100 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 81,930 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద బంగారం రేటు.. ఒక్క సారిగా రూ. 850 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 920 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగింది. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.

భారతదేశంలో బంగారం ధరలు ఎక్కడ ఎలా ఉన్నా.. ఢిల్లీలో మాత్రం మరింత ఎక్కువగా ఉంది. జనవరి 28 మంగళవారం రూ. 75250 వద్ద ఉన్న 22 క్యారెట్ల బంగారం రేటు.. ఈ రోజు (జనవరి 29) రూ. 76100కు చేరింది. అదే విధంగా రూ. 82080 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 83000కు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ఈ రోజు వరుసగా రూ. 850 మరియు రూ. 920 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలోనే ఎక్కువని స్పష్టమవుతోంది.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు

ఒకప్పుడు (2000వ సంవత్సరం) రూ. 4400 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ఈ రోజు రూ. 82వేలు దాటేసింది. అంటే ఎన్ని రేట్లు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం కొనుగోలుదారులు పెరగడమనే తెలుస్తోంది. ప్రత్యేకించి మన దేశంలో పండుగలకు, పబ్బాలకు.. పెళ్లిళ్లకు, పేరంటాలకు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దీంతో బంగారానికి డిమాండ్ క్రమంగా పెరిగింది.

అవసరాలకు కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే.. బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ పొదుపు చేసేవారు మరో ఎత్తు. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న బంగారం మీద పెట్టుబడి పెడితే.. తప్పకుండా లాభాలు వస్తాయని భావిస్తున్నారు. ఇది కూడా బంగారం డిమాండును విపరీతంగా పెంచేస్తోంది. దీంతో దేశంలో బంగారం నిల్వలు తగ్గుతున్నాయి. ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సుంకాలు కూడా భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఇది బంగారం కొనుగోలు చేసేవారిపైన ప్రభావం చూపుతోంది. ఇవన్నీ కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

బంగారం బాటలోనే వెండి

గోల్డ్ రేటు మాదిరిగానే.. వెండి ధర కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో కేజీ వెండి ధర రూ. 1,04,000 వద్ద ఉంది. అంటే ఒక గ్రామ్ వెండి రేటు అక్షరాలా 104 రూపాయలన్నమాట. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. సిల్వర్ రేటు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ కారణాలు

బంగారం కొనుగోళ్లు.. గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతుంటే, పసిడి రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. అమెరికాలో జరిగిన ఎన్నికలు, రష్యా మరియు ఉక్రెయిన్ యుద్దాలు వంటివి కూడా.. పరోక్షంగా బంగారం రేటు పెరగడానికి కారణమవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ కారణాలు కొంత సద్దుమణిగినప్పటికీ.. దేశంలో గోల్డ్ కొనేవారి సఖ్య పెరుగుతూనే ఉంది.

Also Read: 2024లో ఎక్కువమంది గూగుల్‌లో వీటి కోసమే సెర్చ్ చేశారు

బడ్జెట్ 2025 ప్రభావం

ఇప్పుడే బంగారం రేటు రూ. 83000 వద్ద ఉంది. ఇక శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) యూనియన్ బడ్జెట్ 2025 (Union Budget 2025) ప్రవేశపెట్టనున్నారు. ఇందులో బంగారం మీద ట్యాక్స్ లేదా దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. బంగారం ధరలు కొంత వరకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళా ట్యాక్స్ పెరిగితే.. బంగారం సామాన్య ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇక బంగారం ధరలు పెరుగుతుందా? లేదా తగ్గుతుందా? అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్: ఫిదా చేస్తున్న డిజైన్ & ధర ఎంతంటే?

0

Tata Nexon Red Dark Edition Launched: అమ్మకాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ సిఎన్‌జీ (Nexon CNG).. ఎట్టకేలకు రెడ్ డార్క్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ & ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘టాటా నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్’ (Tata Nexon CNG Red Dark Edition) మూడు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి క్రియేటివ్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ప్లస్ పీఎస్ మరియు ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్. వీటి ధరలు వరుసగా రూ. 12.7 లక్షలు, రూ. 13.7 లక్షలు మరియు రూ. 14.5 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కారు ధర సాధారణ సిఎన్‌జీ కారు కంటే రూ. 20,000 ఎక్కువ.

డిజైన్

పేరుకు తగ్గట్టుగానే నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్.. రెడ్ అండ్ డార్క్ కలర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి కారులో అక్కడక్కడా.. రెడ్ కలర్ యాక్సెంట్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఎక్స్‌టీరియర్ మొత్తం కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. రెడ్ లెథెరెట్ అపోల్స్ట్రే, రెడ్ స్టిచ్చింగ్ మరియు పియానో బ్లాక్ ఇంటీరియర్ వంటివి ఈ కారులో చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త టాటా నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ యొక్క ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ పొందుతుంది. కాబట్టి ఇచ్చి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 10.20 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్స్, రియర్ ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎల్ఈడీ లైట్స్ మరియు వివిధ భాషలకు సపోర్ట్ చేసే పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ డీటెయిల్స్

నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఇంజిన్ మరియు పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ కారులో 1అదే .2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సిఎన్‌జీతో నడుస్తున్నప్పుడు.. 100 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న టాటా నెక్సాన్ 2017లో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అనేక అప్డేట్స్ పొందుతూ.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జీ రూపాల్లో అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఆధునిక హంగులతో సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అడుగు పెట్టింది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుంది భావిస్తున్నాము.

ఇండియాలో నెక్సాన్ సేల్స్

భారతదేశంలో టాటా నెక్సాన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల కంటే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది, కాబట్టి మరిన్ని అమ్మకాలు నెక్సాన్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో నెక్సాన్ ఈవీ అమ్మకాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Also Read: ఐదు లక్షల మంది కొన్న ఏకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

నిజానికి కొంతమంది ఉన్న వాహనాలనే కొంత భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా అప్పుడప్పుడు సరికొత్త ఎడిషన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త రెడ్ డార్క్ ఎడిషన్ కూడా స్టాండర్డ్ సిఎన్‌జీ కారుకు కొంత భిన్నంగా కనిపిస్తుంది.