కలియుగంలో తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలు ఉన్నారు, బిడ్డలను పట్టించుకోని తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే ఏదో ఒకమూల, ఎక్కడో ఒక దగ్గర ఇప్పటికీ.. తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే సంఘటలు వెలుగులోకి వస్తున్నాయి. అలంటి ఘటనే ఇటీవల తెరమీదకు వచ్చింది. దీని పూర్వాపరాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
కుమార్తె కోసం..
చండీగఢ్ ప్రాంతానికి ఒక పేద రైతు.. తన కుమార్తె కోరిక తీర్చడానికి గొప్ప సాహసమే చేశారు. రోజంతా కష్టపడితేగానీ బువ్వ దొరకని పరిస్థితుల్లో ఉండే.. వారి కుటుంబంలో, తన కుమార్తె ఒకరోజు తనకు ఒక స్కూటర్ కావాలని కోరింది. కూతురు అడిగిందనే కారణంతో.. ఆ రోజు నుంచే డబ్బు (చిల్లర నాణేలు) కూడబెట్టడం మొదలు పెట్టాడు. సరిగ్గా ఆరు నెలలు పోగుచేసాడు.
రూ. 40వేల విలువైన నాణేలు
రైతు పోగు చేసిన నాణేలను.. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక షోరూంకు తీసుకెళ్లి, సిబ్బంది ముందు పోసి తాను స్కూటర్ కొనాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అదంతా అక్కడి సిబ్బందికి ఆశ్చర్యం కలిగించింది. కాని తన కుమార్తె కోసం.. ఆ రైతు చేసిన పనికి అక్కడంతా ఫిదా అయిపోయారు. దీంతో ఆయన తెచ్చిన నాణేలను లెక్కబెట్టడం ప్రారంభించారు. మొత్తం రూ. 40వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే స్కూటర్ కొనడానికి మిగిలిన డబ్బును లోన్ (ఈఎంఐ) రూపంలో చెల్లిస్తామని చెప్పారు. దీనికి అక్కడి సిబ్బంది అంగీకరించడం మాత్రమే కాకుండా.. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేశారు.
ఉప్పొంగిన ఆనందం
పేద రైతు కూడబెట్టిన డబ్బు తీసుకుని.. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో కట్టించుకోవడానికి ఒప్పుకుని షోరూం సిబ్బంది తన కుమార్తెకు హోండా యాక్టివా స్కూటర్ తాళాలను అందించారు. స్కూటర్ తన జీవితంలోకి రావడంతో.. ఆ అమ్మాయి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇది చూసిన తండ్రి (రైతు) మరింత ఆనందపడ్డారు. కాగా ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తరువాత పండుగ ఆఫర్ కింద వారికి ఒక మిక్సర్ గ్రైండర్ కూడా గిఫ్ట్‌గా లభించింది. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్లారు.
నిజానికి పిల్లల కళ్ళలో ఆనందం చూడటానికి.. చాలామంది తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. బిడ్డల భవిష్యత్తే, వారి ఆనందమే వీరి ఆనందంగా భావిస్తారు. చరిత్రలో వెతికినా.. బిడ్డల చేతిలో మోసపోయిన తల్లిదండ్రులు చాలామందే కనిపిస్తారు. కానీ తల్లిదండ్రుల చేతిలో మోసపోయిన బిడ్డలు ఎక్కడ కనిపించరు అంటే? అదేమీ అతిశయోక్తి కాదు. కానీ పరిస్థితులు.. మారిపోయాయి. బంధాలు బలహీనమైపోయాయి.
హోండా యాక్టివా గురించి
ఇక హోండా యాక్టివా విషయానికి వస్తే.. ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్. ఈ స్కూటర్ ప్రారంభ ధరలు ప్రస్తుతం రూ. 95,961 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఇది మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. రోజువారీ వినియోగానికి, సిటీ ప్రయాణాలను కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మల్టిఫుల కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల.. కొనుగోలుదారులు తమకు నచ్చిన వేరియంట్ ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ సుమారు మూడు కోట్ల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో దీనికున్న డిమాండ్ స్పష్టంగా అర్థమైపోతుంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.