యువత కోసం.. కొత్త ప్రయోగం: మనసును హత్తుకునే సాంగ్

పాటకంటే ముందు.. వీడియో ప్రారంభంలో డైరెక్టర్ మారి సెల్వరాజ్ కొన్ని పవర్‌ఫుల్ పదాలు కనిపిస్తాయి. సినిమాలోని ప్రతి పాటకు ముందు అలాగే వేశారు ఆయన. అంటే ఆయన మాటల ద్వారా చెప్పాలి అనుకున్నదాన్ని ముందుగానే చెబుతున్నారు అన్నమాట. ఈ పాటకి ముందు ఇలా రాశారు.

నేనెక్కడికి నుండి వస్తున్నానో నీకు తెలుసు, ఎందుకు వస్తున్నానో కూడా నీకు తెలుసు, నేనక్కడికి వస్తే ఏమవుతుందో నీకు తెలుసు అందుకే.. నువ్వు ఆ తలుపులు మూసేశావు.. కానీ, నా తలపుల శక్తిలో వాటిని తెరిపిస్తా చూడు…” అంటూ వీడియో మొదట్లో రాశారు.

సరికొత్త ర్యాప్ సాంగ్

ఇంక సాంగ్ విషయానికి వస్తే ఒకప్పుడు యువత స్లో మెలోడీ పాటల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడు అలా లేదు.. ర్యాప్ సాంగ్ అంటే చాలు యువత ఈ రోజుల్లో బాగా కనెక్ట్ అయిపోతున్నారు. చాలామంది అటువంటి పాటలకు మాత్రమే కాకుండా.. ఆ పాటలు పాడే గాయకులకు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. దాంతో ఎంతోమంది ర్యాప్ సింగర్స్ బయటకి వచ్చారు. వచ్చి వాళ్ళవాళ్ళ ప్రతిభకు తగినట్టుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పా. రంజిత్ ఏకంగా ఒక గ్రూప్‌తో ర్యాప్ సాంగ్స్ మ్యూజిక్ బ్యాండ్ పెట్టించారు. అది తమిళనాడులోనే కాకుండా దేశం నలుమూలల బాగా పాపులర్ అయింది. అదంతా ఒకెత్తు అయితే ఈ ర్యాప్ పాడే వాళ్లలో అత్యంత ఆదరణ పొంది.. భారీ విజయాలను కైవసం చేసుకున్న ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారు. వారే తమిళనాడుకు చెందిన అరివు మరియు కేరళకు చెందిన వేదన్.

ఆ ఇద్దరు..

వేదన్, అరివు ఇద్దరు కూడా మొదట వ్యక్తిగతంగా ఆల్బమ్ చేసుకునే వాళ్లు. ఆ తరువాత అనేక చోట్ల షోస్ చేయడం ప్రారంభించారు. వీరు ఎక్కడ షో ఏర్పాటు చేసిన కూడా దాదాపు కొన్ని లక్షల మంది అభిమానులు స్వచ్చందంగా గుమిగూడతారు. చాలామంది ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న వాళ్ళే షో ఆర్గనైజ్ చేసి వీరిని ఆహ్వానిస్తారు. ఆ స్థాయికి ర్యాపర్స్ ఎదిగారు. ర్యాప్ సాంగ్స్ చాలా మంది పాడుతారు.. కానీ వీరికి వచ్చినంత సక్సెస్ ఎవరికీ రాలేదు. దీనికి కారణం కేవలం పాడటం మాత్రమే కాదు ఏదో తెలియని ప్రత్యేక ట్యాలెంట్ అనే చెప్పాలి.

వారిరువురు ఒక గొప్ప ప్రత్యేకమైన ఐడియాలాజి సొంతం చేసుకున్నారు. వీరి పాటల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ వ్యవస్థ ఇలా అనేక అంశాలతో పాటు.. సమాజంలో ఉండే అణిచివేతలు, వెలివేతలు, అవమానాలు వీటిని అన్నిటిని ఎదిరించే ఒక కసితో కూడిన తెగింపును వారు యువతకు, సమాజానికి అందిస్తారు. అందుకే వేదన్ & అరివు ఇద్దరికీ వారి సొంత రాష్ట్రాల్లోనే కాకుండా దేశం దాటిన అభిమానం వారి వశం అయిందని చెప్పొచ్చు. అటువంటి ర్యాప్ సింగర్స్ ఇద్దరితో కలిపి బైసన్ సినిమా కోసం డైరెక్టర్ మారి సెల్వరాజ్ రచించిన రెక్క రెక్క అనే ఒక ప్రత్యేకమైన ర్యాప్ సాంగులు తమిళంలో వీరితోనే పాడించారు. అది అతి తక్కువ కాలంలోనే.. అత్యంత ప్రేక్షకాదరణ పొంది “బైసన్” సినిమాను ఒకరేంజ్​కు తీసుకుని వెళ్ళింది. అటువంటి పాటని ఇప్పుడు మన తెలుగు వెర్షన్ హద్దే లేని వేగం పెట్టి అనే టైటిల్ పెట్టి విడుదల చేశారు.

యువతను ఆకట్టుకుంటోంది

పాటలోని పదాల అర్థం, సారాంశం వేరే లెవెల్‌లో ఉన్నాయి. యువతను అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఎగిరి గంతేసి పరిగెత్తి ఏదో ఒకటి సాధించి తీరాలి అనే కసిని ఈపాట క్రియేట్ చేస్తున్నది. “హద్దెలేని వేగం పట్టి, ఒంటరిగా పోరాడగా అడ్డేలేదు నీకు ఇంక సాగరా, కదలరా ఇది కల కాదు, భయానికి నువ్వు బలి కావు, మార్చరా నీ తలరాత చెలరేగరా ఓ కసితోని” అని బైసన్ పాట గూస్బమ్స్ తెప్పిస్తున్నది . తెలుగులో అక్టోబర్ 24న సినిమా రిలీజ్ అవుతున్నది.