భారత స్టార్ క్రికెటర్ Virat Kohli సోషల్ మీడియాలో చేసిన ఒక ‘లైక్’ ఓ పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన మోడల్ LizLaz ఫొటోపై కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేయడం, తర్వాత అన్‌లైక్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా ఈ వివాదంపై స్పందించిన లిజ్లాజ్ సంచలన ఆరోపణలు చేశారు.
కొంతమంది జర్నలిస్టులు తనను సంప్రదించి కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలని ఒత్తిడి తెచ్చారని, అందుకోసం డబ్బు కూడా ఆఫర్ చేశారని లిజ్లాజ్ వెల్లడించారు. అయితే డబ్బు లేదా ప్రచారం కోసం కోహ్లీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వివాదం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా అభిమానులు, నెటిజన్లు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లిజ్లాజ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన LizLaz.. కొంతమంది మీడియా ప్రతినిధులు తనను సంప్రదించారని తెలిపారు. “విరాట్ కోహ్లీ గురించి చెడుగా మాట్లాడాలని నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. అతనిపై లేని పోని ఆరోపణలు చేయమని డబ్బు కూడా ఆఫర్ చేశారు” అని ఆమె వెల్లడించారు.
అయితే తాను అలాంటి పనులు చేయనని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. “డబ్బు కోసం లేదా పాపులారిటీ కోసం ఎవరి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఆసక్తి నాకు లేదు” అంటూ లిజ్లాజ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కోహ్లీ అభిమానులు లిజ్లాజ్ నిజాయితీని ప్రశంసిస్తుండగా, కొందరు ఈ వివాదంపై మరింత సమాచారం బయటకు రావాలని కోరుతున్నారు.
కొద్ది రోజుల క్రితం కూడా ఈ వివాదంపై స్పందించిన LizLaz, కోహ్లీ తన ఫొటోకు లైక్ చేయడం మొదట తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.
“ముందు విరాట్ కోహ్లీ నా ఫొటోని లైక్ చేసినప్పుడు చాలా సంతోషించాను. తర్వాత ఆ పోస్ట్‌ను ఆయన అన్‌లైక్ చేశారు. ఒక్క లైక్ సోషల్ మీడియాలో ఇంత పెద్ద స్టోరీ అవుతుందని ఊహించలేదు” అని పేర్కొన్నారు. అలాగే కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ తనకు బాధ కలిగించిందని చెప్పారు. “ఆ లైక్ వెనక అతనికి దురుద్దేశం లేదు. కానీ సోషల్ మీడియాలో చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు” అని లిజ్లాజ్ వివరించారు.
LizLaz భారత క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌లంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే Royal Challengers Bengaluru జట్టుకు తాను వీరాభిమానినని చెప్పారు.
విరాట్ కోహ్లీ తన ఫొటోను లైక్ చేయడం గర్వంగా అనిపించిందని కూడా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే స్టార్ క్రికెటర్ నుంచి వచ్చిన స్పందన తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు. ఆమె వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. “కోహ్లీపై అనవసర వివాదాలు సృష్టించకూడదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లైక్ వంటి చిన్న విషయం ఎంత పెద్ద చర్చకు దారితీస్తుందో నెటిజన్లు చర్చిస్తున్నారు.
సెలబ్రిటీల సోషల్ మీడియా కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉండటంతో చిన్న విషయాలు కూడా వైరల్ అవుతున్నాయని సోషల్ మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. విరాట్ కోహ్లీ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న క్రీడాకారుల విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ వివాదంపై Virat Kohli అధికారికంగా స్పందించలేదు. అయితే లిజ్లాజ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చాయి.
Also read:పాక్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు (వీడియో)
హిమాన్షు – నేను MarthaTelugu వెబ్సైట్లో ఒక సంవత్సర కాలంగా పనిచేస్తున్నాను. నాకు ప్రత్యేకించి స్పోర్ట్స్ వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన నేను.. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.
