Details of PM Narendra Modi Travelled Train Force One in Ukraine: అలనాడు భారతదేశ కీర్తి ప్రతిష్టలను స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఈ నాడు దేశ ప్రధాని ‘నరేంద్ర మోదీ’ ఆ బాధ్యత తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దేశమైన, ఏ ఖండమైన దేశ ఖ్యాతిని తెలియజేయడానికి.. ఆర్థిక పరమైన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఓ సమర్ధవంతమైన నాయకుడు ఎవరు అంటే? దీనికి సమాధానం తప్పకుండా ‘మోదీ’ అనే చెప్పాలి.
గతంలో కూడా భారత ప్రధానులు తమదైన రీతిలో దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నించారన్న విషయం కూడా మనం మరచిపోకూడదు. అయితే నేడు ఆధునిక ప్రపంచం పరుగులు పెడుతున్న వేళ భారత్ ఎదుగుదలకు అలుపెరుగని శ్రామికుడై మోదీ శ్రమిస్తున్నారు. ఇది అందరికి తెలిసిన నిజం.
దేశం అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మరో దేశం కష్టాల్లో ఉందంటే కూడా వారికి మొదట గుర్తొచ్చేది భారత్. బర్మా ప్రధాని కష్టంలో ఉన్నప్పుడు ఇండియా ఆశ్రయమిచ్చింది. ఉక్రెయిన్ దేశంలో శాంతి కొరవడిన సందర్భంలో ప్రధానమంత్రి కదలి వెళ్లారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన తరువాత ఆ దేశంలో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ కావడం గమనించదగ్గ విషయం మరియు గర్వించదగ్గ విషయం.
రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి మోదీ కదలి వెళ్లారు. నిజానికి ఒక దేశ ప్రధాని మరో దేశం వెళ్లారు అంటే.. అక్కడ దాదాపు విమానాల్లో లేదా హెలికాఫ్టర్లలో తిరుగుతారు. కానీ మోదీ రైలులో (ట్రైన్) ప్రయాణించారు. మోదీ ప్రయాణించిన రైలు పేరు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ (Train Force One).
”ట్రైన్ ఫోర్స్ వన్” విశేషాలు
శాంతి నెలకొల్పడానికి ఉక్రెయిన్ వెళ్లిన మోదీ ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రయాణించారు. ఈ రైలులో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటివారు కూడా ప్రయాణించారు. దేశాధ్యక్షులు ప్రయాణానికి కేటాయించే ఈ ట్రైన్ విలాసవంతంగా ఉంటుంది.
ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో పెద్ద టేబుల్స్, ఖరీదైన సోఫా, వాల్ మౌంటెడ్ టీవీ వంటి వాటితో పాటు.. నిద్రపోవడానికి కూడా కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో రష్యా యుద్ధం ప్రారంభమైన తరువాత.. భారతదేశం నుంచి వెళ్లిన ఓ సీనియర్ నాయకుడు నరేంద్ర మోదీ. ఈ రైలులో మోదీ ప్రయాణం 20 గంటలు కావడం గమనించదగ్గ విషయం. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అంతర్జాతీయ దౌత్య పర్యటనకు ఎక్కువగా ఈ రైలునే ఉపయోగిస్తారని తెలుస్తోంది.
వాస్తవానికి క్రిమియాలోని పర్యాటకుల కోసం 2014లో ఈ రైలును నిర్మించారు. ఆ తరువాత దీనిని వీఐపీల కోసం కేటాయించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తరువాత విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఈ ట్రైన్ డీజిల్ ఇంజిన్ ద్వారా నడుస్తోంది. దీనిని కేవలం దేశాధినేతల ఉపయోగానికి మాత్రమే ప్రత్యేకించి ఏర్పాటు చేశారు.
మోదీ ఉక్రెయిన్ పర్యటనలో కీలక విషయం
నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనలో.. ఆ దేశ ప్రధానిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. యుద్ధం విషయం భారత్ ఎప్పుడూ తటస్థంగా ఉండదని.. ఇండియా ఎప్పుడూ శాంతి వైపు ఉంటుందని మోదీ ప్రకటించారు. మోదీ చేసిన వ్యాక్యలు ప్రపంచ దేశాలను ఆకర్శించాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం నరేంద్ర మోదీని కొనియాడింది.
భారతదేశంలో ప్రధాని కోసం ఉపయోగించే కారు
మన దేశంలో ప్రధాన మంత్రి ప్రయాణించడానికి కట్టుదిట్టమైన భద్రతలతో కూడిన వాహనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. శత్రువుల భారీ నుంచి ప్రధాన మంత్రిని కాపాడటానికి, బాంబులు వంటి వాటి నుంచి కూడా రక్షించబడటానికి కారులో కావలసిన అన్ని సౌకర్యాలు ఆ కార్లలో ఉంటాయి.
Don’t Miss: నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!
ఇక విమానాల విషయానికి వస్తే.. ప్రధాన మంత్రి ప్రయాణించడానికి ప్రత్యేక విమానాలు కూడా ఉంటాయి. దీన్నిబట్టి చూస్తే దేశ ప్రధానికి ఎంత రక్షణ కల్పిస్తారనేది స్పష్టంగా అర్థమైపోతుంది. మన దేశంలో మాత్రమే కాకుండా దేశాధినేతలకు విదేశాల్లో కూడా పటిష్టమైన భద్రత అందిస్తారు. ఎందుకంటే దేశాధినేతల బాధ్యత మొత్తం ఆ దేశం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రధానమంత్రులకు భద్రత చాలా అవసరం, కల్పిస్తారు కూడా.