Tuesday, January 27, 2026

రోడ్డు పక్కన ఈ రాళ్లు గమనించారా.. ఏ రంగు రాయి దేనిని సూచిస్తుందంటే?

మనం అందరూ సాధారణంగా మన అవసరాల రీత్యా ఏదో ఒక సందర్భంలో అనేక పట్టణాలకి, ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మీరు గనక గమనించి ఉంటే రోడ్డు పక్కన కిలోమీటర్ లేదా నెంబర్ రాళ్లు నాటి ఉంటారు. ఆ రాళ్లలో నలుపు, పసుపు లేదా ఎరుపు, కాషాయం రంగులు ఎక్కువగా చూసుంటాము. వీటితో పాటు నీలం, పచ్చ, బూడిద, గోధుమ రంగు మైలురాళ్లు కూడా ఉంటాయి. అయిత ఆ రాళ్లు దేనికోసం నాటుతారు, ఆ రంగుల అర్థం ఏమిటి?, అనే విషయాలు చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసి ఉండచ్చు. అందరి అనుమానాలకు సమాధానంగా ఆ రాళ్ల సమాచారాన్ని కొంతవరకు తెలుసుకుందాం.

రాష్ట్రాలు, పట్టణాలు, ఊర్లు సరిహద్దులు తెలపడానికి మరియు ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో చెప్పడానికి, ఆ రోడ్డు ఏ రకమైనదో.. అంటే నేషనల్ రోడ్డు, రాష్ట్ర రోడ్డు, సిటీ రోడ్డు, గ్రామీణ రోడ్డు, రైల్వే రోడ్డు, ఎయిర్‌పోర్ట్ రోడ్డు, బ్రిడ్జిలు, పోర్ట్ లేదా హార్బర్లను సూచించడం కోసం ఈ రాళ్లను నాటుతారు. వీటిపైన తెలుపు రంగులో ఉన్న ప్రాంతంలో.. నలుపు రంగుతో కిలోమీటర్లు నెంబర్లు, ఊరి పేర్లు రెండు వైపులా రాస్తారు. ప్రయాణికులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

కాషాయపు రంగు

మైలురాయికిపై భాగంలో ఆరెంజ్ రంగు కింది భాగంలో తెలుపు రంగు పూసి ఉంటుంది. దీనిపైన ఊరి పేరు కిలోమీటర్లు రాసి ఉంటారు. ఈ రాళ్లను దానికి సంబంధించిన రోడ్డుని పంచాయితీ రాజ్ శాఖ చూసుకుంటుంది. ఈ రకం రంగు గ్రామీణ రోడ్డును సూచిస్తుంది. గ్రామాలను నగరాలతో కలపడం దీని యొక్క ఉద్దేశ్యం.

నలుపు రంగు

నలుపు రంగు రాయి పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. నగరాలు లేదా సిటీలలో మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పైభాగంలో నలుపు రంగు, కింది భాగంలో తెలుపు రంగును కలిగి ఉంటుంది. కిలోమీటర్లు, ఊరి పేరు రాసి ఉంటారు. ఈ రాళ్లు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. ఈ రోడ్లు నిర్వహణ మరియు పరిపాలన మొత్తం మున్సిపాలిటీ వాళ్లు చూసుకుంటారు. ఈ నలుపు రంగు రాళ్లు పట్టణాల రోడ్లను రాష్ట్రాల రోడ్లతో కలుపుతాయి.

ఆకుపచ్చ రంగు

రాష్ట్రాలు మరియు భవనాల శాఖ ఈ ఆకుపచ్చ రంగు కలిగిన రాళ్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. ఆ రోడ్డుకు సంబంధించిన మరమ్మత్తులను ఇతరత్ర కార్యక్రమాలను రాష్ట్ర, భవనముల మినిస్ట్రీ చూసుకుంటుంది. మైలురాయికి సగ భాగం పైన పచ్చ రంగు, కింద సగ భాగం తెలుపు పూసి ఉంటారు. ఈ రోడ్డు ఆ యొక్క రాష్ట్ర ముఖ్య పట్టణాలతో పాటుగా జాతీయ రహదారులను కూడా కలుపుతుంది.

పసుపు రంగు

ఈ పసుపు రంగు రాళ్లు దేశంలో ఉన్న రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య దారులను కలుపుతాయి. ఈ రోడ్లని జాతీయ రహదారులు అంటారు. వ్యాపార సంబంధమైన అవసరాల కొరకు, సరుకుల రవాణాకు చాలా బాగా ఉపయోగపడుతాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరమ్మత్తులు గానీ రహదారుల భద్రతకు సంబంధించిగానీ కేంద్ర మంత్రిత్వ రవాణా శాఖ మరియు రహదారులు చూసుకుంటుంది. పై భాగంలో పసుపు రంగు కింది భాగంలో తెలుపు రంగు పూసి ఉంటారు. కిలోమీటర్లు, ఊర్ల పేరు రాసి ఉంటారు. వీటిని నేషనల్ హైవేస్ అని పిలుస్తారు.

బూడిద రంగు

ఈ రంగు దేశంలో ఎక్కడైనా రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు నదులు, కాలవులు, రైల్వే ట్రాక్‌లపైన బ్రిడ్జిలు కట్టివుంటారు. ఆ వంతెనలను సూచించడానికి, ఇక్కడ వంతెన ఉంది అని ముందుగానే వాహనాదారులను హెచ్చరించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఆ బూడిద రంగు రాళ్లను నాటుతారు. ఇది మైలురాయి కాదు, దూరాన్ని తెలిపేది కూడా కాదు.

గోధుమ రంగు

ఈ గోధుమ రంగు రాయిని పోర్టులను గుర్తించడానికి నాటే రాయి. ఈ గోధుమ రంగు రాయి ఉంది అంటే అది ఓడలు, పెద్ద పెద్ద షిప్పులు ఉండే సముద్రం తీరం అని గమనించాలి. అంతర్జాతీయంగా దేశావిదేశాలతో వ్యాపారాలు చేయడానికి, సరుకును ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. దీనిని ఆ పోర్టుకు సంబంధించిన వాళ్లు లేదా ఆ తీర ప్రాంతం ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది.

నీలం రంగు

నీలం రంగు రాయి విమానాలకు వెళ్లే దారిని చూపిస్తుంది. విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో ఈ రాళ్ళను నాటుతారు. విమానం ఆకాశంలో ఎగురుతుంది కాబట్టి ఆకాశం నీలం రంగు లో ఉంటుంది గనుక ఆ ప్రాంతానికి వెళ్లే దారిలో నీలం రంగు రాళ్లను నాటుతారు. విమాన శాఖ వీటి యొక్క బాధ్యతను నిర్వహించడం జరుగుతుంది.

ఎరుపు రంగు

ఈ ఎరుపు రంగు కలిగిన రాళ్లను మనం ఎక్కువ సార్లు చూసి ఉంటాము. రైల్వే గేట్ వేసినప్పుడు అందరూ అక్కడ ఆగినప్పుడు రోడ్డు దగ్గర మనకు ఈ రాళ్లు కనిపిస్తాయి. అవి ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి అంటే అవి ప్రమాదాన్ని సూచిస్తాయి. వచ్చిపోయే ప్రయాణికులను అలర్ట్‌గా ఉండమని దాని యొక్క అర్థం. వీటిని రైల్వే శాఖ పర్యవేక్షణ చేస్తుంది.

ఆ విధంగా ఏయే రాయి ఎందుకు నాటుతారో, వాటి ఉపయోగాలు ఏమిటో చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాను. ఇవి మీ పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడచ్చు.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles