spot_img
Monday, February 9, 2026
HomeAutomobileపండుగ పూట బజాజ్ కొత్త స్కూటర్ లాంచ్: రూ.91399 మాత్రమే!

పండుగ పూట బజాజ్ కొత్త స్కూటర్ లాంచ్: రూ.91399 మాత్రమే!

-

సంక్రాంతి పండుగ పూట.. బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన చేతక్ ఫ్యామిలీలో ‘సీ25’ పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది దాని విభాగంలో అత్యంత సరసమైన స్కూటర్ అని తెలుస్తోంది. ఈ కథనంలో చేతక్ సీ25 ధర, రేంజ్ వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

తక్కువ ధరలో..

బజాజ్ ఆటో లాంచ్ చేసిన చేతక్ సీ25.. ధర రూ. 91399 (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న సీ2501 30 మరియు 35 సిరీస్‌ల తక్కువ రేటులో అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా సీ25 అనేది మొట్టమొదటి హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు కలిగిన చేతక్ మోడల్.

చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్లోని 2.2 కిలోవాట్ మోటార్ మంచి అవుట్‌పుట్ అందిస్తుంది. ఇందులోని 2.5 కిలోవాట్ బ్యాటరీ 113 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కిమీ కావడం గమనార్హం. ఈ స్కూటర్ 750 వాట్స్ ఆఫ్-బోర్డ్ ఛార్జర్ ద్వారా.. 2 గంటల 25 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటల 45 నిముషాలు.

మునుపటి అదే డిజైన్!

డిజైన్ విషయానికి వస్తే.. బజాజ్ కొత్త చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. మెటల్ బాడీ షెల్ పొందుతుంది. దాదాపు ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నపటికీ ఫ్రంట్ ఆఫ్రాన్ కొంత అప్డేట్ చేయబడి ఉంటుంది. అంతే కాకుండా కౌలింగ్‌లోని హెడ్‌ల్యాంప్‌లతో పాటు ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సైడ్ ప్యానెల్ కూడా అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. వెనుక చుట్టూ.. 30, 35 సిరీస్‌ల ట్విన్ లైట్ క్లస్టర్‌లను సింగిల్ ఎడ్జ్ టు ఎడ్జ్ యూనిట్ ద్వారా భర్తీ చేశారు.

సస్పెన్షన్ కూడా మార్చి ఉండటం గమనించవచ్చు. సీ25 ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్స్ ఉన్నాయి. 30 మరియు 35 సిరీస్‌లు, అదే సమయంలో ముందు భాగంలో లీడింగ్ లింక్ సెటప్ మరియు వెనుక భాగంలో మోనోషాక్‌ను కలిగి ఉన్నాయి. మునుపటి మోడల్స్ మాదిరిగానే అదే డిస్క్ బ్రేక్స్ ఉండటం చూడవచ్చు.

ఫీచర్స్ ఇలా..

ఇక చివరగా ఫీచర్స్ విషయానికి వస్తే.. సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ బీఆర్ఎల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్, రెండు రైడ్ మోడ్స్, గైడ్ మీ హోమ్ లైట్స్ మరియు మ్యూజిక్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్కూటర్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.

మంచి అమ్మకాలు పొందుతుందా?

ప్రస్తుతం చాలామంది.. తమ రోజువారీ వినియోగానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగానే పలు కంపెనీలు ఎప్పటికప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే చేతక్ అమ్మకాలతో మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ ఆటో.. ఇప్పుడు మరో స్కూటర్ లాంచ్ చేయడంతో.. పండుగ సమయంలో మరింత మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. దీని ధర కూడా కొంత తక్కువ కావడం అనేది.. ఎక్కువమందిని ఆకట్టుకోవడానికి మరింత ఆస్కారం ఉంది.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts