భారతదేశంలో పాస్‌పోర్ట్‌లు ఇన్ని రకాలున్నాయా?: తెలిస్తే మైండ్ బ్లోయింగ్ అంతే!

పాస్‌పోర్ట్.. ఈ పదం దాదాపు అందరికీ సుపరిచయమే. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఇదొక గుర్తింపు. కాబట్టి విదేశీయానం చేయాలనుకునే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ఒక్కో దేశం ఒక్కోరకమైన పాస్‌పోర్ట్ జరీ చేస్తుంది. అయితే మన దేశం (ఇండియా) నాలుగు రంగులలో పాస్‌పోర్ట్ జారీ చేస్తుందని బహుశా.. కొంతమందికి తెలుసుండదు. ఈ కథనంలో వివిధ రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల గురించి తెలుసుకుందాం.

ముదురు నీలం రంగు పాస్‌పోర్ట్

అందరికీ తెలిసిన.. చాలామంది చూసిన పాస్‌పోర్ట్ ఇది. దీనిని సాధారణ పాస్‌పోర్ట్ అని కూడా అంటారు. మనదేశం నుంచి వ్యక్తిగత పనుల కోసం వెళ్లేవారికి, వ్యాపారం, విద్య లేదా విహారయాత్రలకు వెళ్లేవారికి ఈ పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు. ఇది భారత జాతీయతకు రుజువుగా పనిచేస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని ఆమోదించాయి. కాబట్టి ఎక్కువమందికి భారత ప్రభుత్వం ఈ రకమైన పాస్‌పోర్ట్ జారీ చేస్తుంది.

మెరూన్ పాస్‌పోర్ట్ లేదా డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్

నిజానికి ఈ రంగు పాస్‌పోర్ట్ గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఇలాంటి పాస్‌పోర్ట్‌లను.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతస్థాయి దౌత్య పదవులలో ఉన్నవారికి మాత్రమే జారీ చేస్తుంది. ఏ మెరూన్ కలర్ పాస్‌పోర్ట్‌తో కొన్ని ప్రత్యేకమైన అధికారులు కూడా లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. ఈ పాస్‌పోర్ట్ కలిగిన వారికి పటిష్టమైన భద్రత లభిస్తుంది.

వైట్ పాస్‌పోర్ట్ లేదా అధికారిక పాస్‌పోర్ట్

ఈ రంగు పాస్‌పోర్ట్‌లను కూడా ఎక్కువమంది చూసి ఉండరు. అయితే ఈ పాస్‌పోర్ట్‌లను అధికారిక విధుల కోసం.. విదేశాలకు వెళ్లే వ్యక్తుల కోసం లేదా ప్రభుత్వ అధికారుల కోసం భారత ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో అధికారిక వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే అధికారులు ఉన్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రకమైన పాస్‌పోర్ట్‌లను అధికారిక ప్రయోజనాల కోసం మాత్రమే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు.

ఆరంజ్ పాస్‌పోర్ట్ లేదా ఈసీఆర్ పాస్‌పోర్ట్

నారింజ రంగు పాస్‌పోర్ట్‌లను.. విదేశాల్లో పనిచేసే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా జారీ చేస్తారు. విద్యార్హత తక్కువగా ఉండే వారు ఇలాంటి పాస్‌పోర్ట్‌లను పొందుతారు. ఈ పాస్‌పోర్ట్‌లతో విదేశాల్లో పనిచేయాలనుకునే వారు.. అదనపు పౌరసత్వ తనిఖీలను చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు తెలిసిందా.. భారతదేశం ఎన్ని రంగులలో పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తుందో. ముదురు నీలం, నారింజ, మెరూన్, తెలుగు రంగు పాస్‌పోర్ట్‌లలో.. ఒక్కోదానికి ఒక్కో అధికారులు ఉంటాయి. అంతే కాకుండా ఇవన్నీ వ్యక్తుల పాత్రలను, ప్రయాణ వర్గాన్ని సూచిస్తాయి. అయితే సాధారణ పౌరుల నుంచి ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తల వరకు పాస్‌పోర్ట్‌ల రంగు ప్రయాణ ఉద్దేశ్యాన్ని చెబుతుంది.

పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారు, పాస్‌పోర్ట్ ఎలా పొందాలి?, కావాల్సిన డాక్యుమెట్స్ ఏమిటి?, ఎవరిని సంప్రదించాలి?, ఎలా పొందాలి?, వంటి ఇతరత్రా వివరాల గురించి అవగాహన పెంచుకోవాలి. లేకుంటే థర్డ్ పార్టీలను సంప్రదించి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా మోసపోయినవాళ్ల సంఖ్య చాలానే ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు తప్పకుండా పాస్‌పోర్ట్ గురించి తెలుసుకోవాలి.

Leave a Comment