సోషల్ మీడియాలో అనేకమంది ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటారు. ఈ విధంగా చేసే వాళ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. కరోనా సమయం నుంచి ఈ ట్రెండ్ సర్వసధారణం అయిపోయింది. అయితే విడుదలైన పాటలన్నీ కూడా పాపులర్ అవ్వవు. అందులో కొన్ని మాత్రమే సంగీత అభిమానులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా పాడుకునే అంత ప్రాచుర్యం పొందుతాయి.
ఎవరీ నాగదుర్గ?
ఒకప్పుడు ఆడియో పాటలని రిలీజ్ చేసేవారు. అప్పుడు ఆ పాటకి సాహిత్యం అందించిన వారు లేదా పాడిన గాయకుడు & సంగీత దర్శకుడు పేరు తెచ్చుకునేవాళ్లు. సింగర్ ద్వారా పాట ప్రజల్లోకి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఏ పాటని విడుదల చేసిన కూడా వీడియో షూటింగ్ చేసి దానిని ఏదో ఒక కొరియోగ్రపర్ పెట్టుకుని లోకల్‌గా డ్యాన్స్ పట్ల ఆసక్తి కలిగిన కొంత మందితో ఆ పాటకు డాన్స్ చేయించి వీడియో రూపంలో విడుదల చేస్తున్నారు. అందువల్ల ఆ పాట చేసిన అందరికంటే డాన్స్ చేసిన లేదా అందులో నటించిన వ్యక్తులే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఆ కోవలో అత్యంత ఆదరణ పొందిన డాన్సర్ లేదా నటి నాగదుర్గ.
ఫోక్ సాంగ్స్ నుంచి.. సినిమాల వరకు
నాగదుర్గ ఇప్పటి వరకు చేసిన పాటల్లో ఫెయిల్యూర్ అయినవి ఏవి అంతగా లేవు. ఎందుకో తెలీదు ఆమె చేసిన పాటలన్నీ దాదాపుగా విజయవంతం అవుతూనే ఉన్నాయి. కొత్త కొత్తలో అంతగా లేని పాపులారిటీ.. ఈ రోజు సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేసే వరకు వెళ్లగలిగింది.
చిన్నప్పటి నుంచి తనకి డాన్స్ అంటే ఇష్టం. వాళ్ల అమ్మ డాన్సర్ కావడంతో నాగదుర్గ కూడా ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి అది ఉపయోగపడింది. తన 14వ ఏట నుంచే ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు యూట్యూబ్‌లో చిన్న చిన్నగా పాటలు చేయడంతో ఆమె ప్రయానాన్ని మొదలు పెట్టి.. ఈ రోజు కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చే స్థాయికి నాగదుర్గ ఎదిగింది. సొంతంగా ఒక డాన్స్ అకాడమీని కూడా నడుపుతోంది. దానిద్వారా ఎంతోమంది కాళాకారులను తయారు చేస్తోంది.
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నాగదుర్గ పాటలు
2020 కరోనా సమయంలో చేసిన పాట “తిన్నతీరం పడుతలే లేకున్నా తీరం పడుతలే ” అనే పాట మంచి ఆదరణ పొందింది. ఆ తరువాత కూడా చాలా వీడియో సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఆ జాబితాలో.. ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి, దారిపొంటోస్తుండు, నా పేరే ఎల్లమ్మ అనేవి ఉన్నాయి. ఇప్పుడు పేరుగల్ల పెద్దిరెడ్డి… అనే పాట ట్రెండ్ అవుతోంది.
ఫోక్ సాంగ్స్ విషయం పక్కన పెడితే.. నాగదుర్గ కలివి వనం అనే సినిమాలో కూడా నటించింది. సాధారనంగా నాగదుర్గ భరతనాట్యం నేపథ్యం కలిగినప్పటికీ.. ఫోక్ సాంగ్స్ వైపు వచ్చి మంచి హిట్స్ కొట్టి సక్సెస్ అయింది. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి సాంగ్స్ విడుదల చేయనుంది, ఏ సినిమాల్లో నటించనుందనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తం మీద రానున్న రోజుల్లో మరింత సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.