బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ వరకు వెళ్లి.. టైటిల్ విన్నర్ కాకపోయినా, ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తాజాగా తన అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఇందులో బిగ్‌బాస్ హౌస్‌లో తన అనుభవాలను చెబుతూనే.. ప్రియురాలి గురించి కూడా వెల్లడించారు.
బిగ్‌బాస్ ప్రయాణం
105 రోజుల తన బిగ్‌బాస్ ప్రయాణం.. ఎన్నో నేర్పింది. ఎందోమంది మనస్తత్వాలను తెలుసుకునేలా చేసింది. ప్రేక్షకులను నవ్వించాలనే నేను బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాను. అనుకున్నట్లుగానే.. ప్రేక్షకులను నవ్వించాను. నేను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాను అని ఇమ్ము వెల్లడించారు. బయట తనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నపటికీ.. తాను నామినేషన్‌కు వెళ్లకపోవడం ఒక తప్పిదం అని, అలాగే తన అభిమానుల్లో చాలామందికి ఓటింగ్ ఎలా వేయాలో ఎలియకపోవడం కూడా తనకు మైనస్ అయ్యిందని అన్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే.. తన ప్రియురాలి గురించి చెప్పిన ఇమ్మాన్యుయేల్, బయటకు వచ్చిన తరువాత ఆమెను కలిశారు. ఆమె చేయి పట్టుకున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆమె ఎవరు?, ఆమెకు సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలను బయటపెట్టలేదు. అమ్మాయి ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా చేసినట్లు ఇమ్ము చెప్పారు.
అప్పుడే పెళ్లి
పెళ్లి ఎప్పుడు, ప్రియురాలిని ఎప్పుడు పరిచయం చేస్తావు అనే ప్రశ్నకు.. బదులిస్తూ, తన ప్రియురాలి చదువు పూర్తయిన తరువాత పెళ్లి ఉంటుందని, అప్పుడే తనను అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. ఇకపోతే.. తాను డాక్టర్ చదువుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద ఇమ్ము.. త్వరలోనే ఓ ఇంటివాడు అవుతాడని చెబుతున్నాడు. దీంతో చాలామంది అభిమానులు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఆలా మొదలైంది లవ్..
ఒకరోజు నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక పెద్ద మెసేజ్ వచ్చింది. అందులో నా కామెడీ బాగుంటుందని ఉంది. నేను ఆ సందేశానికి థాంక్యూ అని రిప్లై ఇచ్చను. తరువాత అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్ అడిగింది. నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆలా మొదలైంది ప్రేమ అని ఇమ్ము చెప్పారు.
తాను డాక్టర్ కోర్సు చేస్తోందని, తనకు నేనే ముందుగా లవ్ ప్రపోజ్ చేశాను. మొత్తానికి ఆమె కూడా నా ప్రేమను అంగీకరించింది. తరువాత ఇంట్లోవాళ్లకు కూడా ఆమెను పరిచయం చేశాను. ఇప్పటి వరకు ఆమె నా నుంచి ఏమీ ఆశించకుండానే ప్రేమించింది. అందం, డబ్బు చూసి ప్రేమించే అమ్మాయిలున్న ఈ రోజుల్లో.. నన్ను నన్నుగా ప్రేమించే అమ్మాయి దొరకడం నా అదృష్టం అని ఇమ్ము చెప్పారు.
ఇమ్మాన్యుయేల్ జర్నీ..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన ఇమ్మాన్యుయేల్.. తన కామెడీతో ఎంతోమందిని నవ్వించగలిగాడు. అలా పాపులర్ అయిన ఇమ్మాన్యుయేల్.. జబర్దస్త్ కో యాక్టర్ వర్షతో కెమిస్ట్రీతో మరింత పాపులర్ అయ్యారు. కామెడీ షో చూసే చాలామంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ అదంతా కేవలం స్కిట్ కోసం మాత్రమే చేశామని ఇమ్ము క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పుడు తన అసలైన ప్రియురాలి గురించి చెప్పారు.
బిగ్‌బాస్ రెమ్యునరేషన్
టాప్ 5 కంటెస్టెంట్స్ జాబితాలో ఒకరుగా నిలిచిన ఇమ్మాన్యుయేల్.. వారానికి రూ. 2.6 లక్షల చొప్పున 15 వారాలకు సుమారు రూ. 42 లక్షలు రెమ్యునరేషన్ పొందినట్లు సమాచారం. సీజన్ విన్నర్ కాకపోయినా.. చాలామంది అసలైన విన్నర్ ఇమ్ము అంటూ సపోర్ట్ చేశారు. దీనికి కారణం ఇమ్ము అందరినీ నవ్వించడం మాత్రమే కాకుండా.. అన్ని టాస్కుల్లో బాగా ఆడారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.






