కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీల్ ప్రాంచైజీ తన ఆటగాళ్ల జాబితా నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు అధికారికంగా తొలగించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం పెద్ద చర్చనీయాంశం అయింది. ఎటువంటి గాయాలు గానీ లేదా ఫిట్నెస్ విషయలో గాని ఆటతీరులో గానీ.. ఎక్కడా సమస్యలు లేవు.
రాజకీయ, సామాజిక వివాదాలు
భారతదేశం & బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల మధ్యలో ముదురుతున్న రాజకీయ, సామాజిక వివాదాలే ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ తప్పించడానికి కారణం అవ్వడమే తీవ్ర దుమారం రేపుతోంది. ఇందుకు బదులుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం మార్చిలో జరగబోయే ఐపీల్ ప్రసారాలను వారి దేశంలో నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. తరువాత రాబోయే టీ20 వరల్డ్ కప్ ఇండియాలో మేము ఆడబోమని అక్కడ నుంచి వేదికను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఈ పరిణామాలన్నీ ఇలా ఉంటే కేకేఆర్‌కు ముస్తాఫిజుర్ స్థానంలో అంత బలమైన ప్లేయర్ ఎవరు దొరుకుతారు అనేదే ఆసక్తిగా మారింది.
కేకేఆర్‌కు ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి పేస్ బౌలర్ స్థానాన్ని భర్తీ చేయడం అనేది కొంచం కష్టతరమైన పనే, అయినప్పటికీ ఇది తప్పనిసరి. ఇప్పుడు కేకేఆర్ టీంలో ఆల్రెడీ ఉన్న బౌలింగ్ లైనప్‌లో పేసర్స్, స్పిన్నర్స్ విషయానికి వస్తే.. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి మంచిగా ఆరితేరిన ఆటగాళ్ల జాబితానే ఉంది. ఇక వీళ్లకు తోడు మొన్నటి ఐపీల్ వేలంలో 18 కోట్ల రూపాయలకు కొనుగోలుచేయబడిన మరొక పేసర్ మతీష పతిరణ ఎలాగూ టీంలో ఉన్నాడు. వీరిలో ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సొలంకి, ఆకాష్ దీప్ అనే స్పీడ్ బౌలింగ్ వేయగలిగే వారు ఉన్నారు.
ముస్తాఫిజుర్ స్థానంలో..
ఇతను అంతర్జాతీయ ఆటగాడు కాబట్టి మళ్లీ ఆ స్థానంలో ఇంకో అంతర్జాతీయ ఆటగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని చాలా పేర్లే వినిపించాయి. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయేట్టి, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గట్ అటకిన్షన్, ఆఫ్గనిస్తాన్.. ఫాస్ట్ బౌలర్స్ ఫజల్హక్ ఫారుఖీ & నవీన్ ఉల్ హక్ ఇంకా రిచర్డ్ గ్లీసన్ లాంటి వారి పేర్లు కూడా ప్రచారం వచ్చాయి. అయితే వీరేవరిని పరిగణలోకి తీసుకోలేదు. దక్షిణాఫ్రికా కు చెందిన “డువాన్ జాన్సన్”ని తీసుకోనున్నారనే వార్త సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతానికి ఇతను ఏ ఐపీల్ టీంలోనూ భాగంగా లేడు. ఇతడు ఆల్‌రౌండర్ కుడి చేతి బ్యాటింగ్, ఎడమచేతితో 140 కిలోమీటర్లు వేగంతో ఫాస్ట్ బౌలింగ్ వేయగలిగే ఆటగాడు. కాబట్టి ముస్తాఫిజుర్ స్థానాన్ని డువాన్ జాన్సన్‌తో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆటగాళ్లందరికి కూడా ఆటతీరులో ఎవరి ప్రత్యేకత వారికుంటుంది.
కొలకతా నైట్ రైడర్స్ ఆటగాళ్ల జాబితా..
➢అజింక్య రహనే
➢రింకు సింగ్
➢మనీష్ పాండే
➢అంగక్రిష్ రఘువంశీ
➢రోమన్ పావెల్
➢రాహుల్ త్రిపాఠీ
➢సునీల్ నరైన్
➢రమణ్ దీప్ సింగ్
➢అన్కుల్ రాయ్
➢కామెరన్ గ్రీన్
➢రచిన్ రవీంద్
➢వరుణ్ చక్రవర్తి
➢హర్షిత్ రాణా
➢వైభవ్ అరోరా
➢ఉమ్రాన్ మాలిక్
➢మతీష పతిరణ
➢ప్రశాంత్ సొలంకి
➢ఆకాష్ దీప్
➢కార్తిక్ త్యాగి
➢సార్థక్ రంజన్
➢దక్ష్ కమ్ర
➢పిన్ అలెన్
➢తేజస్వి సింగ్
➢టిమ్ సీఫెర్డ్
➢ముస్తఫిజుర్ స్థానంలో తీసుకునే ప్లేయర్ (డువాన్ జాన్సన్)
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






