భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగిన బైకులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం ఈ కథనంలో ఐదు బెస్ట్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ బైకుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్
నింజా జెడ్ఎక్స్-4ఆర్ ధర రూ. 9.40 లక్షలు. ఇది కూడా అత్యుత్తమ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. 399 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్.. 80 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ బైక్.. 80 హార్స్ పవర్, 39 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది టీఎఫ్టీ డిస్‌ప్లే పొందుతుంది. స్విచబుల్ రైడింగ్ మోడ్స్ కూడా పొందుతుంది. రోజువారీ వినియోగానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కవాసకి జెడ్900
రూ. 9.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభిస్తున్న కవాసకి జెడ్900 బైక్.. 948సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 124 హార్స్ పవర్, 97.4 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్.. ఈ విభాగంలోని ఇతర బైకులకంటే కూడా పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ పొందుతుంది. మీరు పెట్టే డబ్బుకు తగిన ఫీచర్స్ ఈ బైకులో పొందవచ్చు. ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, యాంగ్యులర్ స్టైలింగ్ వంటివి ఉండటం వల్ల ఇది చాలా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది ఒక బెస్ట్ మోడల్ కావడం గమనార్హం.
హోండా సీబీ650ఆర్
సీబీ650ఆర్ బైక్ కూడా బ్రాండ్ యొక్క చెప్పుకోదగ్గ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ మోడల్. దీని ధర రూ. 10.30 లక్షలు. ఈ బైక్ ప్రత్యేకంగా మంచి రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. తద్వారా.. లాంగ్ రైడింగ్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగవు. సీబీఆర్650ఆర్ మాదిరిగానే.. సీబీ650ఆర్ బైకులో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇందులో 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్‌ప్లే, హోండా సెలక్టబుల్ టార్క్ కంట్రోల్, షోవా ఎస్ఎఫ్ఎఫ్ బీపీ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు ఈ-క్లచ్ సిస్టం వంటివి ఉన్నాయి.
కవాసకి నింజా జెడ్ఎక్స్-6ఆర్
నింజా జెడ్ఎక్స్-6ఆర్ మనం చెప్పుకుంటున్న ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగిన అత్యుత్తమ బైకులలో ఒకటి. దీని ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అద్భుతమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్.. ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, క్విక్‌షిఫ్టర్ మరియు 4.3 ఇంచెస్ టీఎఫ్టీ డిస్‌ప్లే మొదలైనవి పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
హోండా సీబీఆర్650ఆర్
సీబీఆర్650ఆర్ బైక్ కూడా మనం చెప్పుకుంటున్న బైకుల జాబితాలో ఒకటి. రూ. 11.16 లక్షల ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 649 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 95 హార్స్ పవర్ & 63 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, ఈ-క్లచ్ సిస్టం వంటివి పొందుతుంది. కాబట్టి రైడర్ గేర్లను మార్చడానికి, ఆపడానికి.. క్లచ్ లివర్ ఉపయోగించాల్సిన పనిలేదు. నగరంలో ప్రయాణించడానికి, లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.