spot_img
Sunday, February 8, 2026
HomeSportsపూర్తయిన నిశ్చితార్థం: స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!

పూర్తయిన నిశ్చితార్థం: స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!

-

టీమిండియా క్రికెటర్.. మహిళా వరల్డ్ కప్ విజేత జట్టులోని ముఖ్యమైన ప్లేయర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంచి. ఇప్పటికే తాను ప్రేమించిన పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్థం జరిగినట్లు కూడా ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పెళ్లి ఎప్పుడంటే?

సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో గమనించినట్లయితే.. స్మృతి మంధాన జిమ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ రాగానే సన్నిహితులు.. పాటలు పాడటం ప్రారంభించారు. ఇందులో జెమిమా రోడ్రిగ్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి మాత్రమే కాకుండా శ్రేయంకా పాటిల్ కూడా ఉన్నారు. వీడియో చివరలో.. తన వెలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ.. నిశ్చితార్థం జరిగినట్లు ఆమె చూపించడం కనిపిస్తుంది.

2019లో ప్రారంభమైన వీరి ప్రేమ త్వరలో జరగనున్న పెళ్లితో ఒక్కటికానున్నారు. అంతకంటే ముందు.. ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించిన తరువాత పలాష్ కూడా ట్రోఫీ పట్టుకుని.. మంధానతో కలిసి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. వివాహానికి ముందు బెస్ట్ గిఫ్ట్ అని పేర్కొన్నారు. ఇది నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. కాగా వీరి వివాహం మరో రెండు రోజుల్లో (నవంబర్ 23) జరుగుతుందని సమాచారం.

స్మృతి మంధాన

1996 జులై 18న జన్మించిన స్మృతి మంధాన, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ బ్యాటర్. వన్ డే, టీ20 మ్యాచ్‌లలో ఈమె పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు వన్ డే మ్యాచ్‌లలో 5322 రన్స్, టీ20 మ్యాచ్‌లలో 3982 రన్స్ సాధించింది. దీంతో త్వరగా 5000 పరుగు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. ఐసీసీ మహిళల క్రికెట్ ఆఫ్ ది ఇయర్ కూడా సొంతం చేసుకుంది.

2024లో అత్యధిక పరుగులు తీసిన ప్లేయర్ కూడా మంధాన కావడం గమనార్హం. భారత ప్రభత్వం అందించే గౌరవ అర్జున అవార్డును కూడా దక్కించుకుంది. ఈమె క్రికెట్ ఆడుతూనే.. అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈమె మొత్తం ఆస్తి రూ. 33 కోట్ల కంటే ఎక్కువ అని అంచనా. మరోవైపు మంధాన మహిళల ప్రీమియర్ లేహ్ చరిత్రలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచారు. ఎందుకంటే ఈమెను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఉమెన్స్ టీమ్) వేలంలో రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది.

పలాష్ ముచ్చల్?

బహుశా ఈ పేరు కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఈయన ఒక సింగర్, ప్రొడ్యూసర్, నటుడు కూడా. బాలీవుడ్ దిగ్గజ నటుల సినిమాలలో పాటలు పాడారు. ఈయన అక్క పలాక్ ముచ్చల్ కూడా సింగర్. ఈమె సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి నటుల సినిమాల్లో పాటలు పాడి.. గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు.

పలాష్ ముచ్చల్ టీ-సిరీస్, జీ-మ్యూజిక్ కంపెనీ & పాల్ మ్యూజిక్ కోసం 40 కంటే ఎక్కువ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈయన రిక్షా అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. కాగా ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్, రుబీనా దిలైక్ నటించిన అర్ధ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన నికర విలువ రూ. 20 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts