మాగ్నైట్ ఎస్‌యూవీతోనే కాలం నెట్టుకొస్తున్న నిస్సాన్ కంపెనీ.. ఎట్టకేలకు గ్రావైట్ పేరుతో కాంపాక్ట్ ఎంపీవీ లాంచ్ చేసింది. రెనాల్ట్ కంపెనీ మాదిరిగా సీఎంఎఫ్ ఏ ప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కారు.. అత్యాధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ కారు ధరలు ఎలా ఉన్నాయి?, ఇతరత్రా వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ధరలు & బుకింగ్స్
నిస్సాన్ కంపెనీ లాంచ్ చేసిన గ్రావైట్ కారు ప్రారంభ ధర రూ.5.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ ధర మొదటి 5000 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంతే కాకుండా.. మొదటి 5000 బుకింగ్‌లకు మొదటి ఐదేళ్ల పాటు ఉచితంగానే సర్వీస్, అప్‌గ్రేడ్ ప్రయోజనాలు లభిస్తాయి. సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.
గ్రావైట్ కారు చూడటానికి చాలా వరకు ట్రైబర్ మాదిరిగా ఉంటుంది. హెడ్‌లైట్‌లలో విభిన్నమైన డీఆర్ఎల్ సిగ్నేచర్ పొందుతుంది. ప్రత్యేకంగా కనిపించే వీల్ డిజైన్.. సీ షేప్ సిల్వర్ ఇన్సర్ట్‌లతో రీడిజైన్ చేయబడిన బంపర్స్, బోనెట్ & టెయిల్‌గేట్ మీద గ్రావైట్ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉండటం చూడవచ్చు. హనీకూంబ్ గ్రిల్ ఉంటుంది. డిజైన్ చూడటానికి ఆకట్టుకునే విధంగా ఉందని మాత్రమే అర్థమవుతోంది.
కలర్ ఆప్షన్స్
నిస్సాన్ గ్రావైట్ ఫారెస్ట్ గ్రీన్, ఒనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, స్నో వైట్, మెటాలిక్ గ్రే అనే రంగులలో లభిస్తుంది. కాగా కంపెనీ దీనిని లిమిటెడ్ రన్ లాంచ్ ఎడిషన్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 1001 యూనిట్లకు మాత్రమే పరిమితం. ఇది సీ షేప్ ఇన్సర్ట్‌లకు ఆరంజ్ కలర్ యాక్సెంట్స్, సైడ్ వైట్ టైర్ ప్రింట్ డెలాక్స్ పొందుతుంది.
ఫీచర్స్ జాబితా
ఇంటీరియర్ విషయానికి వస్తే.. నిస్సాన్ గ్రావైట్ 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ డిజైన్ చాలా సరళంగా ఉంటుంది. త్రీ స్పోక్ ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్స్, స్టోరేజ్ స్పేస్ మొదలైనవి ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మధ్య భాగంలో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, యాంబియంట్ లైటింగ్, జేబీఎల్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ కూడా ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. గ్రావైట్ ఎంపీవీ ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ ఏసీ వెంట్స్, పార్కింగ్ సెన్సార్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉన్నాయి.
ఇంజిన్ వివరాలు ఇవే
నిస్సాన్ గ్రావైట్ 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 72 హార్స్ పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 19.3 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. ఆటోమాటిక్ వేరియంట్ 19.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కంపెనీ దేనిని త్వరలనే సీఎన్‌జీ రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.