ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌పై డైరెక్టర్ హింట్: బాలయ్యతో పోటీ తప్పదా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్‘ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాపులర్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన సినిమా ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. కాబట్టి వీరి కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతే కాకుండా నటి శ్రీలీల, రాశీఖన్నా ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తుండటం మరో ప్లస్ పాయింట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.

పరోక్షంగా డైరెక్టర్ క్లారిటీ..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.. 2025 డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడమే తన లక్ష్యం అంటూ.. డైరెక్టర్ హరీష్ శంకర్.. ఓ సందర్భంలో పేర్కొన్నారు. అయితే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయాన్ని నిర్మాతలే చూసుకుంటారని అన్నారు. కాగా ఈ సినిమా.. బహుశా డిసెంబర్‌లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చేసారు.

హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తుంటే.. డిసెంబర్‌లోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ డేట్ మిస్ అయితే రిలీజ్ ఎప్పుడనే దానిపై చిత్ర బృందమే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ సినిమా కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది.. రిలీజ్ తరువాత తెలుస్తుంది.

ఇక పొతే పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అంతే మరికొన్ని రోజుల్లోనే చిత్ర బృందం సినిమాను రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఓజీ సినిమా రిలీజ్ కానున్నట్లు వస్తున్న పుకార్ల కారణంగా.. నటసింహం బాలయ్య నటించిన ‘అఖండ 2‘ రిలీజ్ వాయిదా పడింది. మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, బాలయ్య మధ్య పోటీ తప్పదా?

ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్ నెలలోనే రిలీజ్ అవుతున్నట్లు వస్తున్న పుకార్ల కారణంగా.. బాలకృష్ణ అఖండ 2.. అప్పుడు కూడా వాయిదా పడుతుందా?, అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమయితే బాలయ్య బాబు, కళ్యాణ్ బాబు సినిమాల మధ్య పోటీ తప్పదేమో అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు పోటీపడుతున్న సమయంలో ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ రిలీజ్ జనవరి 9కి చేరింది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. మొత్తం మీద మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి.. సినిమాలు పోటీని అంతగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Leave a Comment