‘త్రిష బయటకు వస్తేనే సమస్యలు’.. నటుడు పార్తిబన్

చెన్నైలో జరిగిన ఒక అవార్డు కార్యక్రమం అనంతరం.. తమిళ సినీ పరిశ్రమలో కొత్త వివాదం మొదలైంది. ప్రముఖ నటుడు & దర్శకుడు R Parthiban చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రముఖ నటి Trisha Krishnan గురించే కావడంతో విషయం సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది.

నటీనటుల గురించి గురించి పార్తిబన్

అవార్డు కార్యక్రమంలో Parthibanను.. గతంలో కలిసి పనిచేసిన నటీనటుల గురించి మాట్లాడమని నిర్వాహకులు కోరారు. ఆ సమయంలో స్క్రీన్‌పై Trisha ఫోటో కనిపించగానే ఆయన చేసిన పదప్రయోగం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. కాగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

కొన్ని రోజులుగా Trisha పేరు వార్తల్లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా నటుడు & రాజకీయ నాయకుడు Vijayతో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో Parthiban చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి కారణమయ్యాయి.

పార్తిబన్ వ్యాఖ్యలు!

చెన్నైలో జరిగిన అవార్డు కార్యక్రమంలో R Parthiban తన ప్రసంగంలో పలు నటీనటుల గురించి మాట్లాడారు. ఆ సమయంలో స్క్రీన్‌పై Trisha చిత్రం కనిపించగానే ఆయన ఆమె Ponniyin Selvan సినిమాలో చేసిన Kundavai పాత్రను ప్రస్తావించారు. ఈ Kundavai కొన్ని రోజులు ఇంట్లోనే కూర్చోవడం మంచిది. బయటకు వస్తే చాలా సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు అనవసరంగా వ్యక్తిగత విషయాలను ప్రస్తావించినట్లుగా ఉన్నాయని కొందరు విమర్శించారు.

వివాహ వేడుకలో త్రిష – విజయ్

ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ వివాహ వేడుకలో Trisha Krishnan & Vijay కలిసి కనిపించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. వ్యాపారవేత్త, సినీ నిర్మాత Kalpathi S Suresh కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఈ ఇద్దరూ హాజరయ్యారు. ఈ వేడుకకు వారిరువురు ఒకే సమయంలో రావడం, కొత్త దంపతులతో కలిసి ఫోటోలు దిగారు. తరువాత కార్యక్రమం నుంచి వెళ్లినట్లు అక్కడ ఉన్నవారు పేర్కొన్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది.

సంగీత విడాకుల పిటిషన్

Vijay భార్య Sangeetha Sornalingam చెంగల్పట్టు కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో వివాహ బంధం రద్దు చేయాలని, శాశ్వత భరణం ఇప్పించాలని & నివాస హక్కు కోరినట్లు సమాచారం. పిటిషన్‌లో Vijay ఒక నటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే ఆ నటిని కూడా కేసులో రెండో ప్రతివాదిగా చేర్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఏప్రిల్ 20న కోర్టు విచారణ చేపట్టనుంది.

స్పందించిన విజయ్

ఈ వివాదాలపై కొద్ది రోజుల పాటు మౌనం పాటించిన Vijay, మార్చి 7న జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా స్పందించారు. ఆయన పార్టీ Tamilaga Vettri Kazhagam నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ”ఇటీవల జరుగుతున్న ఆరోపణల గురించి చెబుతూ.. ఇటీవల కొన్ని విషయాలు జరుగుతున్నాయి. మీరు వాటిపై స్పందిస్తూ బాధపడుతున్నారు. మీరు బాధపడటం చూస్తే నాకు కూడా బాధగా ఉంటుంది. వాటిని నేను చూసుకుంటాను. మనం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి” అని అన్నారు.

మౌనంగానే త్రిష

ఇప్పటి వరకు Trisha Krishnan ఈ వివాదాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఆమెపై వస్తున్న వార్తలు, అలాగే R Parthiban చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారాయి. ఈ అంశంపై మరిన్ని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది.

Also Read: మళ్లీ బరిలోకి విజయ్ & రష్మిక.. ముచ్చటగా మూడోసారి!