రష్మిక మందన్న & విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఎన్ని పుకార్లు పుట్టినా.. దీనిపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు తాజాగా ఆ వార్తలు నిజమే అని తెలిసిపోయింది. అటు విజయ్, ఇటు రష్మిక సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు.
వెడ్డింగ్ ఆఫ్ విరోష్!
అభిమానులు ఇప్పటికే రష్మిక, విజయ్ జంటలకు విరోష్ అని పేరుకూడా పెట్టుకున్నారు. ఈ పేరుతోనే వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని ఒక పోస్ట్ షేర్ చేశారు. మేము ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ముందే, అభిమానులు వాటిని చేస్తున్నారు. అభిమానుల కోసం వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టుకుంటున్నట్లు రష్మిక, విజయ్ ఇద్దరూ వెల్లడించారు.
పెళ్లి ఎప్పుడంటే?
రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. కాగా వీరి పెళ్లి తరువాత మర్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వీరి పెళ్లికి ఎవెరెవరు హాజరవుతారనే విషయం కూడా ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడికాలేదు.
ఇప్పటికే నిశ్చితార్థం
ప్రారంభం నుంచే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి విషయం చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే జరిగిన వీరి నిశ్చితార్థం విషయం కూడా ఇన్ని రోజులు బయటపెట్టనేలేదు. ఎన్ని వార్తలు తెరమీదకు వచ్చినప్పటికీ.. మాకేం సంబంధం లేదు అన్నట్టుగానే ఉన్నారు. మొత్తానికి ఇప్పటికి వీరి పెళ్లి గురించి ప్రస్తావించారు. వీరిరువురి పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
వెండితెర నుంచి మూడుముళ్ల బంధం!
గీత గోవిందం సినిమాతో కలిసి వెండితెరపై కనిపించిన ఈ జంట.. త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. గీత గోవిందం సినిమా వీరిద్దరికీ మంచి హిట్ ఇచ్చింది. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. అయితే రష్మిక మందన్న మాత్రం చాలా సినిమాల్లో.. అగ్ర కథానాయకుల సరసన నటించి బాగా ఫేమస్ అయింది. విజయ్ దేవరకొండ కూడా చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే సాధించలేకపోయారు. ఇక పోతే మళ్లీ రష్మిక మందన్న, విజయ్ జంటగా రణబలి సినిమాలో కనిపించనున్నారు.
రణబలి సినిమా గురించి
విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న మరోసారి జంటగా కనిపించనున్న చిత్రం రణబలి. ఇది 2026 సెప్టెంబర్ 11న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 19వ శతాబ్దానికి చెందిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటివరకు వచ్చిన విజయ్ దేవరకొండ అన్ని సినిమాల కంటే ఇది చాలా భిన్నగంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే.. రష్మిక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తుందా?, సినిమాలకు పులుస్టాప్ పెడుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.