Royal Enfield Shotgun 650 Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) మార్కెట్లో తన కొత్త ‘షాట్‌గన్ 650’ (Shotgun 650) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధరలు రూ. 3.59 లక్షల నుంచి రూ. 3.73 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
మార్కెట్లో విడుదలైన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ఇంటర్‌సెప్టర్ 650’ (రూ. 3.03 లక్షల నుంచి రూ. 3.31 లక్షలు) కంటే ఎక్కువ ధరను కలిగి ఉంది. అయితే ఇది కంపెనీ యొక్క ‘సూపర్ మీటియోర్ 650’ (రూ. 3.64 లక్షల నుంచి రూ. 3.94 లక్షలు) కు దగ్గర ధరను కలిగి ఉంటుంది.
ధరలు & కలర్ ఆప్షన్స్ (Shotgun 650 Price And Colours)
- షీట్‌మెటల్ గ్రే – రూ. 3.59 లక్షలు
- ప్లాస్మా బ్లూ – రూ. 3.701 లక్షలు
- డ్రిల్ గ్రీన్ – రూ. 3.70 లక్షలు
- స్టెన్సిల్ వైట్ – రూ. 3.73 లక్షలు
నిజానికి కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కస్టమ్ బైక్ బిల్డింగ్ స్పేస్ నుంచి ప్రేరణ పొందటం వల్ల.. ఇతర సాధారణ బైకుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇది సూపర్ మీటియోర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ చాలా తేడాలను గమనించవచ్చు.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బైక్ 18 ఇంచెస్ వీల్స్ మరియు 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అయితే మీటియోర్ మాత్రం 19 ఇంచెస్ మరియు 16 ఇంచెస్ వీల్స్ కలిగి ఉన్నాయి. సీటు 740 మిమీ వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.8 లీటర్ల వరకు ఉంటుంది. కావున లాంచ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇంజిన్ (Shotgun 650 Engine)
షాట్‌గన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 648 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 హార్స్ పవర్ మరియు 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మొత్తం గ్లోస్ బ్లాక్‌లో పెయింట్ చేయబడి ఉండటం గమనించవచ్చు. ఇది కంపెనీ బైకులతో చెప్పుకోదగ్గ అప్డేట్ అని తెలుస్తోంది.
ఇక్కడ కనిపించే చిత్రాలలో గమనించినట్లైతే.. బైకులో ఒకే సీటు ఉండటం గమనించవచ్చు, కానీ రైడర్ తనకు కావాలనుకుంటే రెండవ సీటుని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వెనుక ర్యాక్‌లో లగేజీ కోసం కూడా అమర్చుకోవచ్చు.
ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులో దాదాపు అన్ని భాగాలు మెటల్‌తో తయారు చేయబడ్డాయి. ఈ కారణంగానే ఈ బైక్ బరువు 240 కేజీల వరకు ఉంటుంది. దీంతో భారతీయ మార్కెట్లో అత్యంత బరువైన రెండవ బైకుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 నిలిచింది. అయితే ఇప్పటికే మీటియోర్ ఎక్కువ బరువున్న బైకుగా ప్రధమ స్థానంలో నిలిచింది. మీటియోర్ బరువు 241 కేజీలు కావడం గమనార్హం. షాట్‌గన్ 650 బైక్ 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 300 మీమీ రియర్ డిస్క్ పొందుతుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ప్రామాణికంగా లభిస్తుంది.
Don’t Miss: Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై మనసుపడ్డ సెలబ్రిటీలు వీరే – ఇక్కడ చూడండి
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు దేశీయ మార్కెట్లో ఉన్న ప్రధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా గొప్ప ప్రజాదరణ పొందున్న ఈ బ్రాండ్ క్రమంగా ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లాంచ్ చేసింది. ఈ బైక్ ఒక్క చూపుతోనే వాహన ప్రేమికుల మనసు దోచేలా రూపొందించబడి ఉంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తప్పకుండా మార్కెట్లో తన హవా చూపిస్తుందని భావిస్తున్నాము.