ఎన్నో కష్టాలు పడి హీరోగా ఎదిగిన సంపూర్ణేష్ బాబు అనగానే.. తప్పకుండా హృదయ కాలేయం సినిమా గుర్తొస్తుంది. ఆ తరువాత కొబ్బరిమట్ట, క్యాలీఫ్లవర్ వంటి సినిమాల్లో నటించి బాగా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు నానై హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో కూడా కనిపించనున్నారు. ఇక విషయానికి వస్తే.. సంపూర్ణేష్ బాబు తాజాగా ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో కనిపించారు.
సైకిల్ మీద తన ప్రయాణించి.. స్పోర్ట్స్ కారులో తిరిగే వరకు సంపూర్ణేష్ బాబు ఎదగడం చాలామందికి సంతోషం కలిగిస్తోంది. అయితే కొందరు.. ఆ కారు గురించి ఆరా తీస్తున్నారు.
సైబర్‌స్టర్ కారులో
సంపూర్ణేష్ బాబు కనిపించిన ఈ కారు ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన సైబర్‌స్టర్. గత ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ. 74.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 77 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 580 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 0 నుంచి 100 కిమీ/గం వేగవంతం కావడానికి పట్టే సమయం 3.2 సెకన్లు మాత్రమే. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
లేటెస్ట్ స్పార్ట్స్ కారు
ఎంజీ సైబర్‌స్టర్ చూడటానికి.. ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ చేసిన ఇతర కార్లకు భిన్నంగా ఉంటుంది. లంబోర్ఘిని, మెక్లారెన్ బ్రాండ్ కార్లలో కనిపించే సీతాకోక చిలుక రెక్కల మాదిరిగా ఉండే డోర్స్ సైబర్‌స్టర్ కారులో కనిపిస్తున్నాయి. లాంగ్ బానెట్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బాణం మాదిరిగా ఉండే టెయిల్ లాంప్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫోల్డ్ చేయడానికి అనుకూలంగా ఉండే సాఫ్ట్ టాప్ కూడా ఈ కారులో ఉన్నాయి.
సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.. 3 స్పోక్ ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ వెనుక 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, రెండు 7 అంగుళాల స్క్రీన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా.. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, మంచి సౌండ్ సిస్టం, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
ప్యారడైజ్ సినిమా పారితోషికంతో..
ఇకపోతే.. నటుడు సంపూర్ణేష్ బాబు ప్యారడైజ్ సినిమా రెమ్యునరేషన్ ద్వారా ఎంజీ సైబర్‌స్టర్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. సంపూర్ణేష్ బాబు కారును కొనుగోలు చేశారా?, లేక సరదాగా డ్రైవ్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
సంపూర్ణేష్ బాబు గురించి
నిజానికి సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. సిద్ధిపేట దగ్గర్లో ఉన్న మిట్టపల్లెకు చెందిన ఈయనది విశ్వబ్రాహ్మణ కుటుంబం. ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. తిండికి ఇబ్బందులు పడుతున్న రోజుల్లో సంపూర్ణేష్ బాబు తండ్రి కాలం చేశారు. ఆ తరువాత కుటుంబ పోషణకు అన్న చేసే పనికి సహాయం చేశారు. చిన్నప్పటి నుంచే నటనపై అమితమైన ఆసక్తి ఉండటంతో.. కాలక్రమంలో కస్టపడి నటుడిగా ఎదిగారు.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.