ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే.. బ్యాటర్స్ ఒక వంద, లేదా అతి కష్టం మీద నూట ఇరవై నుంచి నూట యాభై లోపు పరుగులు కొడితే.. జట్టు అద్భుతమైన బౌలింగ్‌తో ఆ స్కోరును కాపాడుకునేవారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఈరోజు ఐపీల్ చరిత్రలో ఎప్పుడు ఎవరూ సాధించని ఘనతని సృష్టించారు. 287, 286, 278, 277 ఈ విధంగా వరుసగా నాలుగు స్థానాల్లో కూడా అత్యధిక పరుగులు చేసిన ఐపీల్ క్రికెట్ జట్టుగా 2024, 2025 సంవత్సరాలలో రికార్డులు తిరగరాసారు. వేరే ఏ జట్టు ఈ విధమైన పరుగులు నెలకొల్పలేక పోయింది. అలాంటి బ్యాటింగ్ ట్రాక్ రికార్డు ఉన్న సన్ రైజర్స్ కప్ గెలవడంలో ఎక్కడో తప్పిదం జరుగుతున్నది అన్నది వాస్తవం.
జట్టు పునఃనిర్మాణం
కొన్ని సమయాల్లో బ్యాటింగ్ విఫలం అయితే, ఇంకొన్నిసార్లు బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వంటివాటితో లోపాలు కనబడుతాయి. 2024లో మాత్రం ఫైనల్ వరకు బాగా ఆడిన వాళ్లు కప్ గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ అంత చతికిలబడింది. అయితే ఈసారి ఆ పొరపాట్లు అన్నింటిని చక్కదిద్దుకుని జట్టులో అన్ని విభాగాలను మరింత బలంగా పునఃనిర్మించుకుని ముందుకు వస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్.
రైజర్స్‌ను అడ్డుకోవడం ఎవరితరం కాదు!
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈ ఇద్దరు ఎస్ఆర్‌హెచ్‌లో భయంకరమైన ఓపెనర్లు. వీళ్లు మొదటి ఆరు ఓవర్లు అయిన పవర్‌ప్లే వరకు నిలబడితే చాలు ఇంక పరుగులు 200 దాటాల్సిందే. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ కచ్చితంగా గెలిచి తీరుతుంది. తరువాత అభిమానులు ముద్దుగా పిలుచుకునే కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ సిక్సుల మోత మోగిస్తాడు. తను ఉన్నంతవరకు స్టేడియంలో ఫాన్స్ కేరింతలతో నిండిపోతుంది. ఇక హిట్టర్ ఇషాన్ కిషన్ ఎలాగూ ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండీస్, అనికేత్ వర్మ, మిడిల్ ఆర్డర్ ఇంకా చివరి వరకు వరుసగా మంచి నైపుణ్యం ఉన్న వాల్లే ఉన్నారు. వీళ్లంతా ఫామ్‌లోకి వచ్చారంటే ప్రత్యర్థి జట్టు బౌలింగ్ విభాగం ఎంత ప్రయత్నం చేసినా రైజర్స్‌ను అడ్డుకోవడం ఎవరితరం కాదు.
ఇంగ్లాండ్ ప్లేయర్ కోసం రూ.13 కోట్లు
ఇంత అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ వచ్చాడు. కావ్య మారన్ ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ కోసం దాదాపు రూ. 13 కోట్లు ఖర్చు పెట్టింది. ఇతని రాకతో జట్టులో బ్యాటింగ్ & బౌలింగ్ బలం మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఆల్ రౌండర్ అయినప్పటికీ తనను ఎక్కువగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కోసమే తీసుకుంటారు.
2019లో ఐపీల్ అరంగేట్రం చేసిన లివింగ్ స్టోన్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీలకు ఆడాడు. తన ఐపీల్ కెరీర్‌లో 1000 పరుగులుపైన వరకు చేశాడు. 94 అత్యధిక స్కోర్ కాగా.. 7 హాఫ్ సెంచిరీలు స్టోన్ ఖాతాలో ఉన్నాయి. జట్టుకు అవసరమైనప్పుడు తన బ్యాట్‌తో నేను ఉన్నాను అనే సందేశాన్ని ప్రత్యర్థి టీమ్‌కు తెలిసేలా చేస్తాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు సన్ రైజర్స్‌లో ఉండటం కారణంగా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా తయారయ్యింది. ఇది అభిమానులకు అత్యంత ఉత్సహన్ని ఇచ్చే అంశం. 2026లో మార్చి నుంచి ప్రారంభమయ్యే ఐపీల్ మ్యాచ్ ఒక రేంజ్‌లో ఉండనుందని అర్థమవుతున్నది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






