సుధీర్ ఆనంద్ (సుడిగాలి సుధీర్), దివ్య భారతి జంటగా నటించిన సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. మహాతేజ క్రియేషన్స్ & జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ సంయుక్తగా నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్ లాంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా చిత్ర బృందం మూవిలోని మూడో పాటని విడుదల చేసి.. సుధీర్ అభిమానులకి కొత్త వార్తని అందించారు. ఆ విశేషాలు ఈ కథనంలో..
విమర్శలకు చెక్!
గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)ఈ పేరు తమిళంలో రిలీజ్ అయిన యాక్టర్ తలపతి విజయ్ సినిమాను పోలి ఉంది అనే విమర్శలు ఉన్నాయి. అయితే కథ, కథనం, నేపథ్యం, ఇతర సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఆ చిత్రానికి.. ఈ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. దీంతో ఆ ఆరోపణలు వాస్తవాలు కాదని తెలుస్తోంది.
ఈ సినిమా పూర్తిగా సుధీర్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌లోనే ఉంటుందట. కథ ఏమిటి, ఎలా ఉండబోతుంది అనేదానికి సంబంధించిన వివరాలను మూవీ టీమ్ ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే.. కథ కామెడీ, రొమాన్స్ మరియు డ్రామా జోనర్లో సాగుతుందని అర్థమవుతోంది. అంతేకాకుండా క్రికెట్ ఆట నేపథ్యంలో కథ నడుస్తుందని సమాచారం.
మూడో పాట రిలీజ్!
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశారు. మొదటి రెండు పాటలు కూడా మిలయన్స్ వ్యూస్‌తో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాటగా మంచి రొమాంటిక్ మెలోడీని నిన్న సాయంత్రం (నవంబర్ 19) రిలీజ్ చేశారు. “హమ్మ హమ్మా హమ్మ ఇంత అందం ఏంటమ్మా, ముద్దు గుమ్మా గుమ్మా మత్తు ఎక్కుతున్నదే, మంచు బొమ్మా బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా” అనే పదాలతో పాట మొదలవుతుంది. కానీ ఓహడియమ్మా యమ్మా అనే టైటిల్‌తో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. పాట అయితే సూపర్‌గా వచ్చింది. సుధీర్, దివ్య బారతి యాక్టింగ్ బాగా చేశారు. వీడియోలో విజువల్స్ అందరినీ మెప్పిస్తున్నాయి.
సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. కెమెరా రసూల్ ఎల్లోరే, సాహిత్యం సురేష్ బానిశెట్టి రాశారు. సుధీర్ తన సినీ జీవితంలో ఇప్పటి దాకా అనేక సినిమాల్లో నటించాడు. చాలా సినిమాల్లో హీరోకి ఫ్రెండ్‌గా, లేదా ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ చేశాడు.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
సుధీర్ కథానాయకుడుగా కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడు. అందులో ఒకటి సాఫ్ట్వేర్ సుధీర్. ఈ సినిమా తనకు మొదటి మూవీ అయినప్పటికీ.. యావరేజ్ టాక్ వచ్చింది. రెండోది గాలోడు. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ ఇచ్చింది. ఇదే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మూడో సినిమా ‘గోట్’. ఇది మంచి హిట్ సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. గ్లింప్స్, సాంగ్స్ వంటి వాటిని చూస్తే.. మనకు కూడా అదే అర్థమవుతుంది. హీరోయిన్‌కు మాత్రం ఇది తెలుగులో డెబ్యూ సినిమా. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.