Hyundai Exter 2026: భారత ఆటోమొబైర్కెట్లో ల్ మాకాంపాక్ట్ SUV సెగ్మెంట్ రోజురోజుకూ పోటీగా మారుతోంది. ఈ నేపథ్యంలో Hyundai Motor India తన ప్రాచుర్యం పొందిన Hyundai Exter 2026ను కొత్త అప్డేట్స్తో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసింది. ఈ మోడల్ టాటా పంచ్ వంటి వాహనాలకు నేరుగా పోటీ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). బుకింగ్‌లు రూ. 11,000తో ప్రారంభమయ్యాయి.
ఈ కొత్త ఎక్స్టర్ మోడల్లో ప్రధానంగా డిజైన్, ఇంటీరియర్, మరియు ఫీచర్లలో మార్పులు చేశారు. అయితే మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా, పాత మోడల్లో ఉన్న అదే ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది ధరను నియంత్రించడంలో మాత్రమే కాకుండా.. విశ్వసనీయతను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఈ వాహనం ముఖ్యంగా నగర వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. అధునాతన ఫీచర్లు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మరియు కాంపాక్ట్ సైజ్ వల్ల ఇది యువత మరియు ఫ్యామిలీ యూజర్లకు ఆకర్షణీయంగా మారుతోంది.
డిజైన్‌లో కొత్తదనం
Hyundai Exter 2026 డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసినప్పటికీ, అవి గమనించదగినవే. ముందుభాగంలో కొత్త గ్రిల్ డిజైన్‌తో పాటు డార్క్ ఫినిష్ ఇచ్చారు. అలాగే కొత్త సెంటర్ గార్నిష్ కూడా జోడించారు. 15-ఇంచ్ అలాయ్ వీల్స్‌కు కొత్త డిజైన్ ఇచ్చారు. వెనుక భాగంలో కొత్త రియర్ స్పాయిలర్, టెయిల్‌గేట్, మరియు C-పిల్లర్ గార్నిష్ కూడా అందించారు. 1,643 మిమీ ఎత్తుతో, ఈ సెగ్మెంట్లోనే అత్యంత ఎత్తైన కారుగా కంపెనీ పేర్కొంటోంది.
రంగుల పరంగా కూడా వినియోగదారులకు విస్తృత ఎంపికలు ఉన్నాయి. మొత్తం 7 మోనోటోన్, 1 డ్యూయల్ టోన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా గోల్డెన్ బ్రాంజ్ మరియు టైటానియం బ్లాక్ మ్యాట్ రంగులను జోడించారు.
ఇంటీరియర్‌లో మార్పులు
ఇంటీరియర్ విషయంలో కంపెనీ కొత్త డ్యూయల్ టోన్ నేవీ మరియు గ్రే థీమ్‌ను ప్రవేశపెట్టింది. కార్బన్ ప్యాటర్న్ డ్యాష్‌బోర్డ్‌కు 3D ఫినిష్ ఇచ్చి ప్రీమియం ఫీల్‌ను పెంచింది. D-కట్ స్టీరింగ్ వీల్ కూడా స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. అదనంగా మెటల్ పెడల్స్, డ్రైవర్‌కు ఫోల్డింగ్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు జోడించారు. బూట్ స్పేస్ మాత్రం 391 లీటర్లుగా యథాతథంగా కొనసాగింది, ఇది ఫ్యామిలీ యూజ్‌కు సరిపడే స్థాయిలో ఉంది.
ఫీచర్లలో అప్డేట్స్
ఈ SUVలో పలు ఆధునిక ఫీచర్లు అందించారు. ముఖ్యంగా సెగ్మెంట్లో మొదటిసారి డ్యాష్‌క్యామ్‌ను అందించడం ప్రత్యేకత. అలాగే వైర్లెస్ Android Auto మరియు Apple CarPlay సపోర్ట్ కూడా ఉంది. ఇవి కాకుండా.. రియర్ ప్యాసింజర్ల కోసం Type-C USB పోర్ట్, 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లతో Bluelink, ఇంటర్నెట్ లేకుండా పనిచేసే 300కిపైగా వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ రోజువారీ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత పెందుతాయి.
ఇంజిన్ & పనితీరు
Hyundai Exter 2026 ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది 1.2 లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాన్యువల్ (MT) మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ (AMT) ఉన్నాయి. CNG వేరియంట్లో 225 లీటర్ల డ్యూయల్ సిలిండర్ సెటప్ ఇవ్వడం ప్రత్యేకత.
Also read:పండగవేళ భారత్‌లో ఆడి SQ8 లాంచ్: ధర, ఇతర వివరాలు
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.