డబ్బు పోగు చేయడం లేదా పొదుపు చేయడం అనేది చెప్పాడని ఈజీగానే ఉంటుంది. కానీ.. ఆచరణలో పెట్టడం అంత సులభమైన పనేమీ కాదు. ఈ రోజు మనం డబ్బున్నవాళ్ల గురించి మాట్లాడుకుంటున్నామంటే.. వారి ఎన్నెన్ని కష్టాలు పడ్డారో బాహ్య ప్రపంచానికి తెలియకపొవచ్చు. కానీ వాళ్లలో ఒక అంతర్యుద్ధం జరిగి ఉంటుంది. ఎన్నో త్యాగాలు, అంతకు మించిన కష్టాలు. చివరికి వరించిన విజయం మాత్రమే ప్రజల కళ్లకు కనిపిస్తుంది.
ధనవంతులు కావడం అంటే.. కేవలం తెలివితేటలు, అదృష్టం వల్ల మాత్రమే సాధ్యం కాదు. క్రమశిక్షణ, ఏ పని చేయాలి?, ఏ పని చేయకూడదు అనే క్లారిటీ కూడా అవసరమే. ముఖ్యంగా ధనవంతులు ఎప్పుడూ కొన్ని విషయాలకు దూరంగా ఉంటారు, అలాంటివి సాధారణ ప్రజలు పాటిస్తే.. తప్పకుండా సంపన్నులు కావొచ్చు!.
ప్రాధమిక అంశం
నిజానికి సంపద సృష్టి అనేది.. పెట్టుబడితోనే ప్రారంభమవుతుందనుకోవడం తప్పు. నిజం ఏమిటంటే సంపద అనేది నియంత్రణతో మొదలవుతుంది. వినడానికి ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించినా నమ్మాల్సిన నిజం ఇదే.
సంపన్నులు నగదు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో నిశితంగా పరిశీలిస్తారు. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఆదాయం పెరిగే కొద్దీ డబ్బును మరింత పొదుపుచేయడం అలవాటు చేసుకుంటారు. అంటే.. డబ్బును సంపాదించడం గొప్ప విషయం కాదు, దానిని ఎప్పుడు, ఎలా? ఖర్చు చేస్తున్నామన్నదే ముఖ్యం. ఆర్ధిక క్రమశిక్షణ తప్పకుండా ధనవంతులను చేస్తుంది.
పెట్టుబడులపై క్లారిటీ!
డబ్బు వేరు, భావోద్వేగాలు వేరు. అంటే భయానికి లోనైనప్పుడు విచ్చలవిడిగా కొనుగోలు చేయడం, లేదా అమ్మేయడం జరగదు. సంపన్నులు ట్రెండ్స్ వెనుక లేదా తొందరగా రాబడులు తెచ్చేవాటి వెనుక పడరు. వీరు దీర్ఘకాలిక పెట్టుబడులపై ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ హెచ్చుతగ్గులలో ఉన్నప్పుడు కూడా నిశ్చలంగా ఉంటారు. దీన్నిబట్టి చూస్తే.. పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, దాన్ని ఎప్పుడు తీసుకోవాలనే ప్రణాళిక కూడా వాళ్లకు ఉంటుంది. అంటే పెట్టుబడులపై వాళ్లకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట.
పెట్టే ప్రతి రూపాయికి ఒక అర్థం!
సంపన్నులు ఖర్చు చేస్తున్నారంటే.. అందులో ప్రతి రూపాయలు ఒక ఉద్దేశం ఉంటుంది. కాగా వీరు ఉత్పతులను కొనుగోలు చేయరు. పైగా ఫలితాలను కూడా పెద్దగా పట్టించుకోరు. వారు కేవలం వృద్ధి, స్థిరత్వం, ప్రత్యామ్నాయం మీద మాత్రమే దృష్టిపెడతారు. ఈ క్లారిటీ ఉన్నప్పుడు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.
ఆదాయంపై ఆధారపడొద్దు!
సంపన్నులు ఎప్పడూ జీవితాన్ని అంతిమ లక్ష్యంగా కాకుండా.. ఒక ప్రారంభ బిందువుగానే చూస్తారు. వీరు ఆదాయంపై ఆధారపడరు. పైగా డివిడెంట్స్, అద్దె, వ్యాపారం వంటి ఎన్నో మార్గాలను అనుసరిస్తుంటారు. డబ్బును పెట్టుబడిగా పెట్టినప్పుడు.. ఆదాయం కోసం ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు.
అప్పు కూడా ఉపయోగమే!
ఈ రోజుల్లో కూడా అప్పు అంటే చాలామంది భయపడుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తప్పుడు పనుల కోసం అప్పు చేస్తే భారమవుతోంది. అప్పును కూడా సవ్యంగా ఖర్చుపెడితే.. అదే మీకు పెట్టుబడి అవుతుంది. అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విలువ తగ్గే ఆస్తుల కోసం ఎప్పుడూ అప్పు చేయకూడదు. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
రిస్క్ – ప్రొటెక్షన్
డబ్బున్నవాళ్లు బీమా గురించి తగు ఏర్పాట్లు చేసుకుంటారు. డబ్బుంది కదా మనకెందుకులే అనుకోరు. ఎందుకంటే ఒకసారి అనారోగ్యం వస్తే.. లేదా ఒక ఊహించని ఘటన ఎంత ఖర్చు చేయిస్తుందో, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ముందుగా ఊహించడం చాలా కష్టం. కాబట్టి బీమా అనేది ఆర్ధిక ప్రణాళికకు ప్రారంభ బిందువు. ఒక ఊహించని
మార్కెట్ అస్థిరతలో
సంపన్నులు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా నిశ్చలంగానే ఉంటారు. భయానికి గురికాకుండా ఉంటారు. తప్పకుండా మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని అంచనా వేస్తారు. పెట్టుబడిదారుడు ఎప్పడూ కూడా ప్రతిచర్యలపై కాకుండా.. తమ ప్రణాళికకు కట్టుబడి ఉంటారు.
నిపుణుల సలహాలు ముఖ్యమే!
సంపద పెరిగేకొద్దీ.. సంక్లిష్టత కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలోనే కొందరు సలహాలను విస్మరిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎంత గొప్పవారికైనా.. సరైన సమయంలో సరైన సలహాలు అవసరం అవుతాయి. పెట్టుబడుల విషయంలో మరీ ముఖ్యంగా ఇలాంటి సలహాలు చాలా అవసరం అవుతాయి.
ఆవేశంతో కొనుగోలు చేయకు!
డబ్బు ఉంది కదా అని.. ఏది పడితే దానిని కొనుగోలు చేయకూడదు. ఒక వస్తువు కొనాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. తప్పకుండా అవసరం అవుతుంది అన్నప్పుడే కొనుగోలు చేయాలి. విలాసాలకు పోయి ఏదైనా కొనుగోలు చేస్తే.. ఆర్ధిక స్థితి దెబ్బ తింటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కూడా ఆలోచన ఉండాలి.
సంపద సృష్టి అనేది.. శబ్దం చేయని సత్యం. కాబట్టి వేచి చూడాలి. తొందరపాటు వద్దు. ఒకేదానిపై ఎప్పుడూ ఆధారపడొద్దు. దీర్ఘకాలిక పొదుపులో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి పెట్టాలి. ఇలాంటివన్నీ సరిగ్గా పాటిస్తే.. సంపన్నులు కావడం చాలా కష్టమేమీ కాదు. ట్రై చేయండి.. కానీ జాగ్రత్తగా ఉండటం మర్చిపోవద్దు!.
Also Read:

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, బిజినెస్, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
