టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. ఇటీవల లంబోర్ఘిని కంపెనీకి చెందిన ఉరుస్ ఎస్ఈ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ కారుకు ధర ఎంత?, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.
రూ.4.57 కోట్లు!
హార్దిక్ పాండ్య కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ కారు ధర సుమారు రూ. 4.57 కోట్లు (ఎక్స్ షోరూమ్). ముదురు బూడిద రంగులో ఉండే ఈ కారు.. 21 ఇంచెస్ మెటల్ వీల్స్.. 22 ఇంచెస్ మల్టీ స్పోక్ యూనిట్లను పొందుతుంది. ఇందులో 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ఉంటుంది. కాగా ఇది 25.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కూడా పొందుతుంది. రెండూ కలిపి 800 హార్స్ పవర్.. 950 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.
312 కిమీ టాప్ స్పీడ్!
లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ కారు 4 వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉండటం వల్ల.. ఇంటిగ్రేటెడ్ డిఫరెన్షియల్ అండ్ ఎలక్ట్రానిక్ రియర్ డిఫరెన్షియల్‌తో టార్క్ వెక్టరింగ్ అందిస్తుంది. కాగా ఇందులోని బ్యాటరీ 60 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 130 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 312 కిమీ కావడం గమనార్హం. ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) కావడానికి పట్టే సమయం 3.2 సెకన్లు మాత్రమే.
చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో లంబోర్ఘినికి చెందిన ఉరుస్ ఎస్ఈ ఒకటి. ఈ మోడల్ కారును రామ్ కపూర్, రణ్‌వీర్ సింగ్, అదార్ పూనావాలా, రోహిత్ శెట్టి మొదలైన ప్రముఖులు కలిగి ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జానియర్ ఎన్టీఆర్, ప్రభాస్ దగ్గర లంబోర్ఘిని కార్లు ఉన్నాయి.
హార్దిక్ పాండ్య దగ్గర ఉన్న ఇతర కార్లు
క్రికెటర్ హార్దిక్ పాండ్య దగ్గర లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ కారు మాత్రమే కాకుండా.. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ, మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, లంబోర్ఘిని హురాకాన్ ఈవీఓ, లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ అల్ట్రా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
- రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ: హార్దిక్ పాండ్య దగ్గర ఉన్న ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ ధర రూ. 3.09 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది డీప్ మెటాలిక్ శాటిన్ రెడ్ క్లాసీ షేడ్‌లో ఉంది.
- మెర్సిడెస్ జీ63 ఏఎంజీ: ఈ కారు ధర సుమారు రూ. 3 కోట్లు వరకు ఉంటుంది. బెంజ్ జీ63 ఏఎంజీ కారును కలిగి ఉన్న తొలి ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్య కావడం గమనార్హం. ఈయన కార్లకు వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ 1234 ఉండటం చాలా వీడియోలలో.. ఫోటోలలో చాలా సందర్భాల్లో కనిపించింది.
- లంబోర్ఘిని హురకాన్ ఏవీఓ: రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఈ లంబోర్ఘిని హురాకాన్ ఈవీఓ కూడా హార్దిక్ పాండ్య గ్యారేజిలో ఉంది. ఇది నారింజ రంగులో చాలా ప్రత్యేకంగా ఉంది.
- లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ అల్ట్రా లగ్జరీ: బెంజ్, లంబోర్ఘిని, రేంజ్ రోవర్ కార్లు మాత్రమే కాకుండా.. హార్దిక్ పాండ్య గ్యారేజిలో లెక్సస్ కంపెనీకి చెందిన ఎల్ఎమ్ 350హెచ్ అల్ట్రా లగ్జరీ కారు కూడా ఉంది. దీని ధర కూడా రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని సమాచారం. ఇది తెలుపు రంగులో ఉండటం చూడవచ్చు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.