spot_img
Sunday, February 8, 2026
HomeCinemaనయనతారకు రూ.10 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన విగ్నేష్

నయనతారకు రూ.10 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన విగ్నేష్

-

లక్ష్మి సినిమాలో టాలీవుడ్ అరంగేట్రం చేసిన నటి నయనతార.. లేడీ సూపర్ స్టార్‌గా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ.. కుర్ర హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ఒకరైన నయనతార.. పుట్టిన రోజు సందర్భంగా తన భర్త నుంచి ఖరీదైన కారును గిఫ్ట్‌గా పొందింది. ఈ ఖరీదైన గిఫ్ట్ గురించి ఈ కథనంలో..

నయనతార 41వ పుట్టిన రోజు (నవంబర్ 18) సందర్భంగా.. ఆమె భర్త విగ్నేష్ శివన్.. రూ. 10కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో తన భార్య, తన కవల పిల్లల (ఉయిర్ & ఉలాగ్)తో ఉండటం చూడవచ్చు. ఫోటోలు షేర్ చేస్తూ.. భార్యకు పుట్టిన శుభాకాంక్షలు చెబుతూ ”ఉప్పొంగే హృదయం, ప్రేమతో నిండిన జీవితం అందించిన.. సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు కూడా నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఖరీదైన గిఫ్ట్ విషయానికి వస్తే..

నయనతారకు తన భర్త ప్రతి ఏటా ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ సారికూడా రూ. 10 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ఇచ్చారు. అంతకంటే ముందు.. అంటే 2024లో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ 600 (సుమారు రూ. 5కోట్లు), 2023లో కూడా రూ. 3కోట్ల ఖరీదైన ఓ మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్ ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే విగ్నేష్ శివన్.. ఖరీదైన కార్లను తన భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వడం ఆనవాయితీ పెట్టుకున్నట్లు అనిపిస్తోంది.

రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ఒకటి. ఇది ఎలక్ట్రిక్ కూపే మోడల్. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ కారు చాలావరకు బ్లాక్‌‌మెటల్ ఫినిషింగ్ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్, విండో ట్రిమ్ అన్నీ కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఇందులోని 102 కిలోవాట్ బ్యాటరీ 493 కిమీ నుంచి 510 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాగా ఎలక్ట్రిక్ మోటారు 659 హార్స్ పవర్, 1075 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అంతే కాకుండా ఇది.. 4.1 సెకన్లలో 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుందని సమాచారం. లగ్జరీ అనుభవం కావాలనుకునే వాళ్లు ఎక్కువగా.. ఇలాంటి కార్లను కొనుగోలు చేస్తుంటారు.

నయనతార & నటిస్తున్న సినిమాలు

నటి నయనతార.. ప్రస్తుతం చిరంజీవి సరసన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించింది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాగా బాలకృష్ణ సరసన కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

నయనతార, విగ్నేష్ శివన్ జూన్ 2022లో చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అట్లీ వంటివాటితో పాటు.. సినిమా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా అదే ఏడాది వీరు సరోగసీ విధానం ద్వారా.. కవలపిల్లలకు జన్మనిచ్చారు. వీరి పేర్లు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్, ఉలాగ్ దైవాగ్ ఎన్ శివన్. ప్రస్తుతం ఈ జంట తమ పిల్లలతో చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నారు.

Sourya Vardan
Sourya Vardan
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts