యూట్యూబ్ నుంచి.. 2025లో వీళ్లకే ఎక్కువ డబ్బు!

సొంతంగా డబ్బు సంపాదించడానికి ఉన్న అనేక మార్గాల్లో ఉత్తమమైనది యూట్యూబ్. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా.. నచ్చిన అంశం తీసుకుని వీడియోలు చేస్తూ లెక్కకు మించిన డబ్బును సంపాదిస్తున్నారు. అయితే 2025లో ఏ యూట్యూబ్ రంగం (కేటగిరి) ఎక్కువ డబ్బును సంపాదించింది అనే విషయాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

పర్సనల్ ఫైనాన్స్ & ఇన్వెస్టింగ్

ఆధునిక కాలంలో జాబ్ చేసేవారికైనా.. లేక ఇతర బిజినెస్ చేసేవారికైనా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, లోన్స్, ఇన్సూరెన్స్ వంటి విషయాలను వెల్లడించే యూట్యూబ్ ఛానళ్లు ఈ ఏడాది ఎక్కువ రెవెన్యూ (డబ్బు) పొందినట్లు తెలుస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వీడియోలను క్రియేట్ చేసేటప్పుడు.. బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీకు యాడ్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తాయి. దీనివల్ల అలాంటి యాడ్స్ వీడియోలలో కనిపించడం వల్ల ఇతర రంగాల కంటే కొంత ఎక్కువ రెవెన్యూ లభిస్తుంది. వీడియోలు తక్కువగా ఉన్నా.. వ్యూస్ తక్కువగా ఉన్నా.. రెవెన్యూ మాత్రం బాగానే ఉంటుంది.

బిజినెస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్

పర్సనల్ ఫైనాన్స్ రంగం తరువాత.. ఈ ఏడాది ఎక్కువ డబ్బు సంపాదించినా యూట్యూబ్ కేటగిరి బిజినెస్ & డిజిటల్ మార్కెటింగ్ అనే చెప్పాలి. ఆన్‌లైన్ బిజినెస్ ఐడియాలు, స్టార్టప్స్ గురించి, డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీలాన్సర్ వంటి విషయాలకు సంబంధించిన వీడియోలకు రెవెన్యూ బాగానే ఉంటుంది.

బిజినెస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రంగాల యూట్యూబ్ వీడియోలకు.. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కొన్ని స్టార్టప్స్ కంపెనీలు స్పాన్సర్‌షిప్స్ ఇస్తాయి. అంతే కాకుండా.. కొన్ని కోర్సులు, కన్సల్టింగ్ ద్వారా కూడా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఈ రంగం ఎంచుకున్నవారు యూట్యూబ్ ద్వారా కంటే కూడా.. కోర్సుల ద్వారానే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

టెక్నాలజీ, ఆటోమొబైల్ & గ్యాడ్జెట్స్

ఎక్కువ డబ్బు సంపాదించిన యూట్యూబ్ కేటగిరీల జాబితాలో.. మూడో స్థానంలో టెక్నాలజీ, ఆటోమొబైల్ & గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అంటే ఏఐ టూల్స్, మొబైల్స్ రివ్యూస్, కార్స్ రివ్యూస్, బైక్స్ రివ్యూస్, ల్యాప్‌టాప్ వంటి అన్‌బాక్సింగ్స్ వంటివాటికి ప్రస్తుతం ఆదరణ ఎక్కువ. కాబట్టి వీటికి వ్యూస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని టెక్ కంపెనీల స్పాన్సర్‌షిప్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్

ఈ రోజుల్లో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ అనేది చాలా అవసరం. స్కూల్, కాలేజ్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, ఇతర లాంగ్వేజెస్, పోటీ పరీక్షలకు కావలసిన సమాచారం, ప్రోగ్రమింగ్ వంటి అంశాలు చూసేవారి సంఖ్య ఎక్కువ. కాబట్టి ఈ రంగంలో కూడా మంచిగా ఆదాయం సంపాదించుకోవచ్చు. సిలబస్ అనేది చాలావరకు అందరికీ అవసరం, కాబట్టి ఎక్కువ రోజులు వ్యూస్ వస్తూనే ఉంటాయి. ప్రమోషన్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించావచ్చు. ఈ రంగం 2025లో ఎక్కువ డబ్బు సంపాదించి 4వ స్థానంలో నిలిచింది.

హెల్త్, ఫిట్‌నెస్ & పర్సనల్ డెవలప్‌మెంట్

ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం, ఫిట్‌నెస్, పర్సనల్ డెవలప్‌మెంట్ అంశాలపై ఆసక్తి కనపరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి వీడియోలకు డిమాండ్ ఎక్కువ, కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. యోగా, మెడిటేషన్, మోటివేషన్, ఫిట్‌నెస్ టిప్స్ వంటి అంశాలకు సంబంధించిన వీడియోల ద్వారా మీరు ఎక్కువమందికి ఆకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ మాత్రమే కాకుండా.. కొన్ని హెల్త్ బ్రాండ్స్ స్పాన్సర్‌షిప్స్, యాప్ ప్రమోషన్స్ ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఈ రంగం డబ్బు సంపాదనలో 5వ స్థానంలో ఉంది.

యూట్యూబ్ అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. ఈ రోజు వంట చేయడం దగ్గర నుంచి ఐఏఎస్ వంటి ఉన్నత చదువుకు కావలసిన సమాచారం కోసమైనా.. యూట్యూబ్ చూడాల్సిందే. అయితే బెస్ట్ కంటెంట్ ఇస్తూ.. ఎక్కువ వ్యూస్ పొందే వీడియోలకు గూగుల్ డబ్బు కూడా బాగా ఇస్తుంది. కాబట్టి ఆసక్తి కలిగిన ఎవరైనా.. యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి?, ఎలా డబ్బు సంపాదించాలి?, అనే విషయాలను తెలుసుకుని.. సంపాదించడం మొదలుపెట్టవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి?, డబ్బు ఎలా సంపాదించేలనే విషయాలు కూడా యూట్యూబ్‏లోనే కోకొల్లలుగా అందుబాటులో ఉన్నాయి.