శాంసంగ్ కంపెనీ తన గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీనితో పాటు ఎస్26ప్లస్, ఎస్26 అల్ట్రా మోడల్స్ కూడా లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధరలు ఎలా ఉన్నాయి?, డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.
వేరియంట్స్ వారీగా ధరలు
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.1,39,999 (12జీబీ + 256జీబీ). 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర 1,59,999 రూపాయలు, టాప్ వేరియంట్ ధర రూ.1,89,999 (16జీబీ + 1టీబీ). బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉండే ఈ ఫోన్ అమెజాన్, శాంసంగ్ ఇండియా వంటి ఆన్లైన్ స్టోర్లలో అమ్మకానికి రానుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్సెట్
శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 అల్ట్రా 6.9 ఇంచెస్ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లేను 3120 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ & 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. రంగు ఖచ్చితత్వం కోసం 10 బిట్ కలర్ అవుట్‌పుట్ లభిస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్ పొందుతుంది. కాగా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ 8.5తో వస్తుంది.
ఏఐ ఫీచర్స్
గ్యాలక్సీ ఎస్26 అల్ట్రా అనేది అప్డేటెడ్ గ్యాలక్సీ ఏఐ ఫీచర్స్ పొందుతుంది. నౌ అసిస్ట్ ఆన్ స్క్రీన్ యాక్టివిటీ ఆధారంగా పనిచేస్తుంది. ఇమేజ్ (ఫొటోస్) ఎడిటింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్రియేటివ్ స్టూడియో కంటెంట్ వంటి వాటికీ మద్దతు ఇస్తుంది. వాయిస్ అసిస్ట్ సెట్టింగ్ అడ్జస్ట్ సెట్టింగుకు అనుమతిస్తుంది. కాగా గోప్యతకు సంబంధించిన హెచ్చరికలు, యాప్ డేటా యాక్సెస్ గురించి యూజర్లకు తెలియజేస్తుంది.
కెమెరా వివరాలు
ఫొటోగ్రఫీ కోసం శాంసంగ్ ప్రత్యేకంగా .. తన గ్యాలక్సీ ఎస్26 అల్ట్రాలో ఎఫ్/1.4 అపెర్చర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ సెన్సార్ ద్వారా క్వాడ్ రియర్ కెమెరా పొందుతుంది. ఇది కాకుండా ఎఫ్/2.9 అపెర్చర్ అండ్ 5x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఎఫ్/1.9 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైట్ యాంగిల్ లెన్స్ అండ్ ఎఫ్/2.4 అపెర్చర్ అండ్ 3x ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా కలిగి ఉంటుంది.
రియర్ కెమెరా సిస్టం విషయానికి వస్తే.. ఇది 8కే వీడియో రికార్డింగ్, హెచ్డీఆర్10ప్లస్ క్యాప్చర్ & 360 డిగ్రీ హారిజాంటల్ లాక్ స్టెబిలైజేషన్‌తో సూపర్ స్టెడీ వీడియోకు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో ఎఫ్/2.2 అపెర్చర్ & 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
సరికొత్త ఫీచర్స్
ఫీచర్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 అల్ట్రాలోని కనెక్టివిటీ ఎంపికలలో 5జీ, వైపై 7, బ్లూటూత్ 6, ఎన్ఎఫ్సీ & యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ వంటివి ఉన్నాయి. హ్యాండ్సెట్ నానో సిమ్, ఈసిమ్ ఎంపికలతో డ్యూయల్ సిమ్ ఆప్షన్స్ ఉన్నాయి. శాటిలైట్ న్యావిగేషన్ సిస్టమ్‌లలో జీపీఎస్, గ్లోనస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బీడీఎస్ వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, బేరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇది 60 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ & 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ వివరాలు
శాంసంగ్ గ్యాలక్సీ ఎస్26 అల్ట్రా మొబైల్ 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఈ ఫోన్ మొత్తం బరువు 214గ్రామ్స్. కాగా ఇది ఇప్పవరకు శాంసంగ్ లాంచ్ చేసిన వాటిలో అత్యంత సన్నని మోడల్. ఇది 6.9 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లే పొందుతుంది. ప్రైవసీ డిస్ప్లే ఫీచర్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్ఓసీ వంటివి పొందుతుంది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.