ప్రపంచ యుద్దాలు జరిగినప్పుడు చాలా కంపెనీలు సైనికుల అవసరాలను తీర్చడానికి కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే యుద్దభూమికి తగిన విధంగా, కఠిన పరిస్థితులను తట్టుకునే విధంగా వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత యుద్దాలు కనుమరుగయ్యాయి. సంస్థలు ప్రజల వినియోగార్థం వాహనాలను రూపొందించడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలోకి చెప్పుకోదగ్గ 5 కంపెనీల గురించి వివరంగా తెలుసుకుందాం.
రోల్స్ రాయిస్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను విక్రయించే రోల్స్ రాయిస్ కంపెనీ ఒకప్పుడు సైనికులకు అవసరమైన వాహనాలను ఉత్పత్తి చేసిన ప్రముఖ కంపెనీ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రాండ్ సిల్వర్ గోస్ట్ కారు.. యుద్దభూమికి సరిపోయేలా నిలిచింది. ప్రత్యేకంగా నిర్మయించిన ఈ కారు ముందు భాగంలో మెషిన్ గన్‌లను అమర్చారు. అంతే కాకుండా ఈ కంపెనీ విమానాలను సంబంధించిన ఇంజిన్‌లను అభివృద్ధి చేయడంలో కూడా దోహదపడింది.
రెనాల్ట్
1914లో జరిగిన మొదటి మార్నే యుద్ధ సమయంలో.. రెనాల్ట్ కంపెనీ పారిస్ ట్యాక్సీ క్యాబ్‌లను దళాల రవాణాకు వినియోగించింది. ఇది ఫ్రెంచ్ దళాలకు జర్మన్ పురోగతిని ఎదుర్కోవడానికి చాలా ఉపయోగపడింది. అంతే కాకుండా సంస్థ ఎఫ్టీ లైట్ ట్యాంక్ కూడా అభివృద్ధి చేసింది. ఇది సైనికులకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ ట్యాంక్ డిజైన్ భవిష్యత్ ట్యాంక్ డిజైన్‌లను ప్రభావితం చేసింది.
ఫోర్డ్
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన వాహనాలు విస్తృతంగా కనిపించాయి. అప్పట్లో అందుబాటులో ఉన్న మోడల్ టీ ట్రక్కులు లాజిస్టిక్స్‌కు చాలా ఉపయోగపడ్డాయి. కాగా బ్రిటీష్ కర్మాగారాలు, అంబులెన్సులను ఉత్పత్తి చేశాయి. మొత్తం మీద యుద్ధం సమయంలో సైనికులకు ఈ కంపెనీ చాలా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్లో ఫోర్డ్ ట్రక్కులకు మంచి డిమాండ్ ఉంది.
డాడ్జ్
రెండో ప్రపంచ యుద్ధంలో డాడ్జ్ కంపెనీ సుమారు నాలుగు లక్షల ట్రక్కులను తయారు చేసింది. యుద్ధభూమిలో వివిధ రకాల పనులను చేయడానికి, బరువును మోయడానికి ఇవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. కఠినమైన భూభాగాల్లో సైతం.. ఎక్కువ లోడ్ సామర్థ్యం కలిగి ఉండటం వల్ల మంచి పనితీరును అందించాయి. సామాగ్రిని రవాణా చేయడానికి, ఫిరంగులను లాగడానికి కూడా డాడ్జ్ వాహనాలను ఉపయోగపడ్డాయి.
షెవ్రోలెట్
జనరల్ మోటార్స్ ఆధ్వర్యంలోని షెవ్రొలెట్ కంపెనీ క్లాస్ 110, 135 మోడల్స్ వంటి అగ్నిమాపక ట్రక్కులను రూపొందించింది. అంతే కాకుండా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ సైనిక దళాలకు సరఫరా చేసిన స్టాఘౌండ్ ఆర్మర్డ్ కార్లపై కూడా ద్రుష్టి పెట్టింది. ఈ సమయంలో కంపెనీ 4.5 లక్షల వాహనాలను డెలివరీ చేసింది.
పైన చెప్పుకున్న అన్ని కంపెనీలు.. ఒకప్పుడు యుద్దాల సమయంలో సైనికుల అవసరాలను తీర్చడంలో చాలా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు యుద్ధ వాహనాలను అరుదుగా తయారు చేస్తున్నాయి. తయారు చేయడంలో తమవంతు పాత్ర వహిస్తున్నాయి. అయితే చాలా వరకు ప్రజలకు ఉపయోగపడే వాహనాలను తయారు చేసి.. మార్కెట్లో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కాగా ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోర్డ్ కంపెనీ మాత్రం భారతదేశంలో.. తన ఉత్పత్తిని ప్రస్తుతం పూర్తిగా ఆపేసింది. బహుశా.. రాబోయే రోజుల్లో మళ్లీ మన దేశంలో వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.