Ugadi 2026: కొత్త ఏడాది 12 రాశుల ఫలితాలు ఇలా..

పాఠకులకు ముందుగా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకంక్షాలు. ఉగాది అంటే ప్రపంచంలోని తెలుగు ప్రజలకు కొత్త సంవత్సర ఆరంభం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతున్న ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ రోజు అమావాస్య ఉదయం 7:05 వరకు ఉండగా, అనంతరం చైత్ర శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం తరువాత రేవతి నక్షత్రం కొనసాగుతుంది.

ఈ పుణ్యకాలంలో వర్జ్యం మధ్యాహ్నం 2:56 నుండి 4:31 వరకు ఉండగా, దుర్ముహూర్తం రెండు సమయాల్లో ఉంది. అమృత ఘడియలు రాత్రి 12:21 నుండి 1:55 వరకు ఉండటం శుభప్రదంగా భావిస్తున్నారు. వసంత ఋతువు ప్రారంభంతో ప్రకృతి సోయగాలు మరింత మెరుస్తున్నాయి.

ఉగాది ప్రాముఖ్యత

ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు, జీవితంలో కొత్త ఆరంభాలకు సంకేతం. ఈ రోజున పంచాంగం ఆధారంగా భవిష్యత్తు ఫలితాలను తెలుసుకోవడం, ఆచారాలు పాటించడం సంప్రదాయం. ముఖ్యంగా రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు తమ నిర్ణయాలను ఈ రోజున తీసుకోవడం విశేషం.

ఇది ఆధ్యాత్మికంగా కూడా ముఖ్యమైన రోజు. ఆలయ దర్శనాలు, పూజలు, దానం వంటి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతాయి. వసంత నవరాత్రుల ప్రారంభం కావడం వల్ల దేవీ ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్యమైన సమయాలు

సూర్యోదయం: ఉదయం 6:09
సూర్యాస్తమయం: సాయంత్రం 6:06
రాహుకాలం: మధ్యాహ్నం 1:30 – 3:00
యమగండం: ఉదయం 6:00 – 7:30

రాశుల వారీగా ఫలితాలు

మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించకపోవచ్చు. బంధువులతో ఆస్తి వివాదాలు, కుటుంబ ఒత్తిడులు కనిపిస్తాయి.
వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ అవకాశాలు సానుకూలంగా ఉంటాయి.
మిథున రాశి వారు కొత్త పనులు చేపడతారు. విద్య, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది.
కర్కాటక రాశి వారికి కుటుంబంలో విభేదాలు, అనారోగ్యం వంటి సమస్యలు ఎదురవుతాయి.
సింహ రాశి వారు పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.
కన్య రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక ప్రగతి, వృత్తిలో విజయాలు లభిస్తాయి.
తుల రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ధనుస్సు రాశి వారికి ఆర్థిక గందరగోళం, ఒత్తిడులు ఉంటాయి.
మకర రాశి వారికి శుభకార్యాలు, ధనలాభం, విందువినోదాలు ఉంటాయి.
కుంభ రాశి వారు శ్రమాధిక్యం, కుటుంబ విభేదాలు ఎదుర్కొంటారు.
మీన రాశి వారికి శుభవార్తలు, ఆస్తి వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.

ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి

ఉగాది పండుగ తెలుగు ప్రజల నూతన సంవత్సర ఆరంభాన్ని సూచించే ముఖ్యమైన పండుగ. ఈ రోజున ఉదయం తొందరగా లేచి ఇంటిని శుభ్రం చేసి, మామిడి తోరణాలతో అలంకరించడం ఆనవాయితీ. కుటుంబ సభ్యులు నూనెతో స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, శుభముహూర్తాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా ఉగాది పచ్చడి తయారు చేయడం ఈ పండుగలో ప్రత్యేకం. ఇందులో ఉన్న తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులు జీవితం లోని వివిధ అనుభవాలను సూచిస్తాయి.

అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి సంతోషంగా గడుపుతారు. ఇంట్లో పులిహోర, బొబ్బట్లు, పాయసం వంటి వంటకాలు తయారు చేసి పరస్పరం పంచుకుంటారు. పెద్దలను ఆశీర్వాదాలు తీసుకోవడం, చిన్నవారికి ఆశీస్సులు ఇవ్వడం సంప్రదాయం. కొంతమంది దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉగాది మన జీవితంలో కొత్త ఆశలు, లక్ష్యాలు మొదలయ్యే సమయం కావడంతో సానుకూల ఆలోచనలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం ఈ పండుగ యొక్క ప్రధాన సందేశం.

Also Read: ఉగాది 2026 స్పెషల్.. పచ్చి కొబ్బరి పాయసం రెసిపీ