Illegal gambling ban India: భారత్‌లో అక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా నడుస్తున్న 300కి పైగా గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లను నిషేధించింది. ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, కేసినో గేమ్స్, సట్టా నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కేంద్రం కఠిన చర్యలు
ఇటీవలి కాలంలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని పలు ప్లాట్‌ఫామ్స్ ఆకర్షణీయ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిలో చాలా వరకు చట్టవిరుద్ధంగా పనిచేస్తుండటంతో ఆర్థిక నష్టాలు, మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ నిర్ణయం దేశంలో డిజిటల్ భద్రత, ఆర్థిక క్రమశిక్షణను కాపాడేందుకు కీలకంగా మారనుంది. అక్రమ డబ్బు లావాదేవీలను అరికట్టడం, వినియోగదారులను మోసాల నుంచి రక్షించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఏఏ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం?
నిషేధిత సైట్లు, యాప్‌లలో ప్రధానంగా.. ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్, ఆన్లైన్ కేసినో గేమ్స్ (స్లాట్స్, లైవ్ డీలర్ టేబుల్స్), పీర్-టు-పీర్ (P2P) బెట్టింగ్ సర్వీసులు, రియల్ మనీ కార్డ్ గేమ్స్, సట్టా, మట్కా గ్యాంబ్లింగ్ నెట్వర్క్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లపై నిషేధం విధించారు. ఇవి ఎక్కువగా విదేశీ సర్వర్ల ద్వారా నడుస్తున్నట్లు గుర్తించారు.
ఎంతమంది సైట్లు ఇంకా యాక్టివ్‌లో ఉన్నాయి?
అధికారుల సమాచారం ప్రకారం.. మొత్తం అక్రమ గ్యాంబ్లింగ్ సైట్లు సుమారు 8,400 కాగా, ఇప్పటివరకు బ్లాక్ చేసినవి 4,900 మాత్రమే. అయితే తాజాగా నిషేధించినవి సైట్లు 300. ఇవన్నీ పోగా.. ఇంకా మిగిలిన సైట్లపై కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం?
ఈ చర్యల వెనుక ప్రధాన కారణాలు.. వినియోగదారుల ఆర్థిక భద్రత, మోసాలను అరికట్టడం, అక్రమ డబ్బు లావాదేవీల నియంత్రణ, యువతను గ్యాంబ్లింగ్ వ్యసనాల నుంచి రక్షించడం అని తెలుస్తోంది. ప్రత్యేకంగా యువతలో ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పెరుగుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది.
ప్రభుత్వం హెచ్చరికలు
ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో అక్రమ గ్యాంబ్లింగ్ సైట్లు ఉపయోగించవద్దు, తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దు, డబ్బు పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి అని మాత్రమే కాకుండా.. ఇలాంటి సైట్లను ప్రోత్సహించే ప్రకటనలపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు?
కేంద్రం ఇప్పటికే వేలాది సైట్లను బ్లాక్ చేయగా, మిగిలిన వాటిపై కూడా చర్యలు కొనసాగనున్నాయి. డిజిటల్ స్పేస్‌లో అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు సాంకేతిక పద్ధతులను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also read:Whatsapp: వాట్సాప్ కొత్త ఫీచర్.. యూజర్‌నేమ్‌తో కనెక్ట్!
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.