26.2 C
Hyderabad
Tuesday, March 18, 2025
Home Blog Page 23

సేఫ్టీలో 5 స్టార్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందిన సూపర్ స్టార్: ఇదిగో సరికొత్త టాటా పంచ్

0

2024 Tata Punch Launched in India: ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ‘టాటా మోటార్స్’ (Tata Motors) యొక్క ‘పంచ్’ (Punch) మైక్రో ఎస్‌యూవీ ఇప్పుడు ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్‌యూవీ.. ఇప్పటికే విక్రయానికి ఉన్న స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఆధునిక అప్డేట్స్ పొందుతుంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ అప్డేటెడ్ టాటా పంచ్ గురించి మొత్తం వివరాలు ఇక్కడ చూసేద్దాం..

ప్రారంభ ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 10.20 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ మరియు మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ఈ అప్డేటెడ్ టాటా పంచ్ వాహన వినియోగదారులు తప్పకుండా ఆకర్శించగలదని భావిస్తున్నాము.

కొత్త అప్డేట్స్

కొత్త టాటా పంచ్ ఇప్పుడు అనేక అప్డేట్స్ పొందుతుంది. ఇందులో చెప్పుకోదగ్గది 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్.. ఇది మాత్రమే కాకుండా వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ టాప్ వేరియంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.సెంటర్ కన్సోల్ ఇప్పుడు అప్డేట్ చేయబడిన కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పొందుతుంది.

అప్డేటెడ్ టాటా పంచ్ యొక్క బేస్ వేరియంట్ దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ టాప్ వేరియంట్ మాత్రం ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు చూడవచ్చు. కాబట్టి ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఫ్రంట్ పవర్ విండోస్ మొదలైనవి ఉన్నాయి. ఈ కొత్త కారులో ప్యూర్ రిథమ్ ప్యాక్ లేదు, కాబటికి దాని స్థానాల్లో రియర్ పవర్ విండోస్, పవర్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్ ఉంటాయి.

టాటా పంచ్ అడ్వెంచర్ ట్రిమ్.. మునుపటి మాదిరిగానే అదే 3.5 ఇంచెస్ డిస్‌ప్లేతో కూడిన ఆడియో సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, యాంటీ గ్లేర్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్, పార్సెల్ ట్రే మరియు ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. రిథమ్ ప్యాక్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ అందిస్తుంది. ఇందులో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది.

కొత్త టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ మరియు అడ్వెంచర్ ప్లస్ ఎస్ వేరియంట్ల విషయానికి వస్తే.. ఈ రెండు వేరియంట్లు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ పొందుతాయి. రియర్ ఏసీ వెంట్స్, ఆటో హెడ్‌ల్యాంప్, అప్డేటెడ్ సెంటర్ కన్సోల్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి వాటితో పాటు కీలెస్ ఎంట్రీ, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్నీ కూడా ఈ వేరియంట్లలో ఉన్నాయి.

ఇక అకాంప్లిష్డ్ మరియు అకాంప్లిష్డ్ ప్లస్ విషయానికి వస్తే.. ఇవి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీస్ పొందుతాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, టెయిల్ లాంప్, ఫాగ్ లాంప్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్, హైపర్ స్టైల్ వీల్స్, రియర్ వైపర్, డీఫాగర్ మరియు కూల్డ్ గ్లోవ్‌బాక్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి.

టాప్ స్పెక్ క్రియేటివ్ ప్లస్ వేరియంట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆటో హెడ్‌ల్యాంప్ మరియు వైపర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, సన్‌రూఫ్ మొదలైనవి పొందుతాయి. మొత్తం మీద అప్డేటెడ్ పంచ్ ఆధునిక డిజైన్ మాత్రమే కాకుండా అధునాతన ఫీచర్స్ పొందుతాయి.

Don’t Miss: కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన Revolt.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ఇంజిన్ వివరాలు

టాటా పంచ్ అప్డేటెడ్ మోడల్ అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ బై-ఫ్యూయెల్ సీఎన్‌జీ ఇంజిన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 86.5 Bhp మరియు 115 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. సీఎన్‌జీ మోడల్ 72.5 Bhp మరియు 103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది. ఇంజిన్ ఎటువంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి పనితీరులో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది.

ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల విమానం ఇదే!.. ఫోటోలు వైరల్

0

Mukesh Ambani New Boeing BBJ 737 MAX 9: భారతీయ కుబేరుడు.. దిగ్గజ పారిశ్రామికవేత్త ‘ముకేశ్ అంబానీ‘ (Mukesh Ambani) ఖరీదైన కార్లను.. విలాసవంతమైన భవనం కలిగి ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే వీరికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన విమానం ఒకటుందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అంబానీ వద్ద ఉన్న ఈ ఖరీదైన విమానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. భారతదేశపు మొట్టమొదటి ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ (Boeing BBJ 737 Max 9) సొంతం చేసుకున్నారు. ఇది అల్ట్రా లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్. దీని ధర రూ. 1000 కోట్లు. ప్రస్తుతం ఇంత ఖరీదైన జెట్ ఏ వ్యాపారవేత్త దగ్గర లేకపోవడం గమనార్హం.

బోయింగ్ 737 మ్యాక్స్ 9

ఈ విలాసవంతమైన విమానం మాత్రమే కాకుండా.. అంబానీ ఫ్యామిలీ అధీనంలో ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన విమానం అనేక మార్పులు చేసిన తరువాత భారతదేశానికి (ఢిల్లీ) చేరుకుంది. ఇది స్విట్జర్లాండ్‌లోని యూరో ఎయిర్‌పోర్ట్ బాసెల్ మాల్హౌస్ ప్రీబర్గ్ వద్ద మార్పులు, ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ పొందింది. ఈ విమానం అత్యంత విలాసవంతమైన మెటీరియన్స్ పొందినట్లు సమాచారం.

అంబానీ కొనుగోలు చేసిన ఈ విమానం భారతదేశానికి రావడానికి ముందు.. బాసెల్, జెనీవా మరియు లండన్ మధ్య ప్రయాణించించినట్లు (పరీక్షించే క్రమంలో) సమాచారం. ఎందుకంటే మార్పుల తరువాత ఈ విమానం సజావుగా ప్రయాణిస్తుందా? లేదా? అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయడం జరిగింది. 2024 ఆగష్టు 27న ఇది ఢిల్లీకి చేరుకుంది. ఈ ప్రయాణం సుమారు 6234 కిలోమీటర్లు తొమ్మిది గంటలు సాగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన విమానాల జాబితాలో ఒకటిగా నిలిచింది.

బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం రెండు సీఎఫ్ఎమ్ఐ ఎల్ఈఏపీ-1బీ ఇంజిన్స్ పొందుతుంది. ఎమ్ఎస్ఎన్ 8401 అనే నెంబర్ కలిగిన ఈ విమానం ఒకసారికి 11770 కిమీ ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విమానం ధర కొంత తక్కువే అయినప్పటికీ.. క్యాబిన్ రెట్రోఫిట్టింగ్ మరియు ఇంటీరియర్ డిజైన్స్ కారణంగా దీని ధర రూ. 1000 కోట్లకు చేరింది.

భారతదేశానికి అంబానీ కొనుగోలు చేసిన విమానం వచ్చిన తరువాత.. ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలోని మెయింటెనెన్స్ అఫ్రాన్ వద్ద పార్క్ చేయబడింది. అయితే దీనిని ఎందుకు కొనుగోలు చేశారు. ఎప్పుడు ఉపయోగిస్తారు? ఢిల్లీ నుంచి ముంబైకు ఎప్పుడు వెళ్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ప్రారంభంలో చెప్పుకున్నట్లు ముకేశ్ అంబానీ ప్రస్తుతం 10 ప్రైవేట్ జెట్ విమానాలను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో ఎయిర్‌బస్ ఏ319 ఏసీజే కూడా ఉంది. దీనిని సుమారు 18 సంవత్సరాలుగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా రెండు బొంబార్డియర్ గ్లోబల్ 5000లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఒక బొంబార్డియర్ గ్లోబల్ 6000, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900లు, ఎంబ్రేయర్ ఈఆర్జే-135 మరియు డౌఫిన్ & సైకోర్స్కి ఎస్76 అనే రెండు హెలికాఫ్టర్లు ఉన్నాయి. వీటిని అంబానీ ఫ్యామిలీ తక్కువ దూరాలకు ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

అంబానీ గ్యారేజిలోని కార్లు

ముకేశ్ అంబానీ గ్యారేజిలో ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లు, మెర్సిడెస్ బెంజ్ కార్లు, బెంట్లీ బెంటాయేగ, బీఎండబ్ల్యూ, ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ మొదలైన ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆఖరికి వీరి ఇంట్లోని కుక్క కోసం కూడా చాలా ఖరీదైన కారునే ఉపయోగిస్తారని సమాచారం.

Don’t Miss: భారత్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!.. అనంత్ అంబానీకి అరుదైన కారు గిఫ్ట్

ఇటీవల ముకేశ్ అంబానీ కొడుకు ‘అనంత్ అంబానీ’ పెళ్లి సందర్బంగా డార్జ్ కారును పెళ్లి కానుకగా పొందారు. ఇది చూడటానికి చాలా అద్బుతంగా కనిపించే అరుదైన మోడల్. చూడటానికి చాలా కఠినమైన డిజైన్ కలిగిన ఈ కారు అద్భుతమైన ఆఫ్-రోడర్. ఇది ఇసుక వంటి ఎడారి ప్రాంతాల్లో కూడా హుందాగా ముందుకు సాగిపోతుందని తెలుస్తోంది. బహుశా ఇలాంటి కారు భారతదేశంలో మరెక్కడా లేదని తెలుస్తోంది.

కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన Revolt.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

0

Revolt RV1 Launched in India: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన శకం నడుస్తోంది. ఎక్కువమంది వాహన ప్రేమికులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో వాహన తయారీ సంస్థలు కూడా ఈ బాటలోనే పరుగులు పెడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ బైక్ తయారీ సంస్థ ‘రివోల్ట్ మోటార్స్’ (Revolt Motors) కంపెనీ తన మూడవ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఆర్‌వీ1’ (RV1) లాంచ్ చేసింది. ఈ బైక్ ధర ఎంత, కలర్ ఆప్షన్స్, డిజైన్, బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Price)

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకునే క్రమంలో రివోల్ట్ మోటార్ కంపెనీ ఆర్‌వీ1 బైకును రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. బేస్ వేరియంట్ ఆర్‌వీ1 ధర రూ.84990 కాగా.. ఆర్‌వీ1 ప్లస్ ధర రూ. 99990 (ధరలు ఎక్స్ షోరూమ్). ఇప్పటికే ఆర్‌వీ400 మరియు ఆర్‌వీ400 బీఆర్జెడ్ బైకులను కలిగి ఉన్న కంపెనీ ముచ్చటగా మూడో బైకును ఆర్‌వీ1 పేరుతో లాంచ్ చేసింది.

కలర్ ఆప్షన్స్ అండ్ బుకింగ్స్ (Colour Options and Bookings)

కంపెనీ లాంచ్ చేసిన కొత్త రివోల్ట్ ఆర్‌వీ1 మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఆసక్తి కలిగిన కష్టమర్లు కేవలం రూ. 499 మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

డిజైన్ (Design)

చూడటానికి ఒక సింపుల్ స్ట్రీట్ బైక్ మాదిరిగా ఉండే రివోల్ట్స్ ఆర్‌వీ1 బైక్ వాహనం వినియోగదారులకు చాలా మంది రైడింగ్ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు3. ఈ బైక్ స్మోక్డ్ విండ్‌స్క్రీన్ కలిగి రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ మీద బ్రాండ్ లోగోస్, గ్రాబ్ రైల్, సింగిల్ పీస్ సీటు వంటివి ఇందులో ఉన్నాయి.

ఫీచర్స్ (Features)

కొత్త రివోల్ట్ ఆర్‌వీ1 బైక్ సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇంధ్యులో 6 ఇంచెస్ డిజిటల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ స్టేటస్, స్పీడ్ వంటివన్నీ కూడా చూడవచ్చు. ఈ బైక్ యొక్క పేలోడ్ కెపాసిటీ 250 కేజీల వరకు ఉంది. ఛార్జింగ్ ఆప్షన్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ అండ్ రేంజ్ (Battery and Range)

కొత్త రివోల్ట్ ఆర్‌వీ1 బైక్ యొక్క బేస్ వేరియంట్ లేదా ఆర్‌వీ1.. 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక ఆర్‌వీ1 ప్లస్ వేరియంట్ 3.24 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది సింగిల్ చార్జితో 160 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ రెండు బ్యాటరీలు 2.8 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతాయి. పవర్ అనేది బెల్ట్ డ్రైవ్ మాదిరిగా కాకుండా.. చైన్ డ్రైవ్ ద్వారా పంపిస్తుంది.

రివోల్ట్ ఆర్‌వీ1 ప్లస్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 1.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ బైక్ రివర్స్ మోడ్ కూడా పొందుతుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ సెటప్ ఉంటుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

కంపెనీ ఈ బైకును లాంచ్ చేసిన సందర్భంగా.. రట్టన్ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్ పర్సన్ శ్రీమతి అంజలి రట్టన మాట్లాడుతూ.. తక్కువ ధరలోనే మంచి నాణ్యమైన బైక్ అందించాలనే తపన ఈ బైకును లాంచ్ చేసేలా చేసింది. కంపెనీ బైకును డైజిన్ చేసేటప్పుడు నాణ్యతలో గానీ.. ఫీచర్స్ విషయంలో గానీ.. భద్రత విషయంలో గానే ఏ మాత్రం రాజీ పడలేదని పేర్కొన్నారు. మంచి స్టైల్.. ప్రాక్టికాలిటీ అందించే ఈ బైక్ తప్పకుండా బైక్ ప్రేమికులను ఆకర్షిస్తుందని ఆమె అన్నారు.

Don’t Miss: భారత్‌లో ‘రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్స్’ లాంచ్: వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఇప్పటికే రివోల్ట్ కంపెనీ రెండు బైకులను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసి అత్యుత్తమ అమ్మకాలను పొందుతోంది. కస్టమర్లకు చేరుగా ఉండేందుకు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో డీలర్షిప్లను ప్రారంభించి.. వీటి ద్వారా బ్రాండ్ బైకులను విక్రయిస్తోంది. దేశంలో మొత్తం 163 రివోల్ట్ డీలర్షిప్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని భావిస్తున్నాము.

భారత్‌లో ‘రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్స్’ లాంచ్: వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

0

Renault Night and Day Editions Launched in India: ఆధునిక భారతదేశంలో కొత్త వాహనాలు లాంచ్ అవుతున్న తరుణంలో ‘రెనాల్ట్’ (Renault) కంపెనీ కూడా సరికొత్త ‘నైట్ అండ్ డే’ స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేసింది. ఇందులో క్విడ్, ట్రైబర్ మరియు కైగర్ ఉన్నాయి. ఇవన్నీ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తాయి. రెనాల్ట్ లాంచ్ చేసిన ఈ సైట్ అండ్ డే ఎడిషన్స్ గురించి పూర్తి వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

ధరలు & బుకింగ్స్

రెనాల్ట్ సంస్థ లాంచ్ చేసిన నైట్ అండ్ డే (Night & Day) ఎడిషన్స్ మూడు మోడళ్లలో లభిస్తాయి. కంపెనీ ఈ కార్ల కోసం ఈ రోజు (సెప్టెంబర్ 17) నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ కార్లను పరిమిత సంఖ్యలో (కేవలం 1600 యూనిట్లు) మాత్రమే విక్రయిస్తుంది. కాబట్టి వీటిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం.

  • క్విడ్ ఎంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 5 లక్షలు
  • కైగర్ ఏఎంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 7.25 లక్షలు
  • కైగర్ ఏంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 6.75 లక్షలు
  • ట్రైబర్ ఏంటీ నైట్ అండ్ డే ఎడిషన్: రూ. 7 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)

డిజైన్

రెనాల్ట్ కంపెనీ లాంచ్ చేసిన ఈ నైట్ అండ్ డే ఎడిషన్ అన్నీ కూడా ఎంట్రీ లెవెల్ ఆర్ఎక్స్ఎల్ (ఓ) మరియు ఆర్ఎక్స్ఎల్ ఆధారంగా రూపొందించడం జరిగింది. నైట్ అండ్ డే ఎడిషన్స్ యొక్క రూప్ బ్లాక్ కలర్ పొందుతాయి. రూప్ కాకుండా మిగిలిన చాలా భాగం పెర్ల్ వైట్ కలర్ స్కీమ్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని వీల్ కవర్లు, గ్రిల్ ఇన్సర్ట్స్, బ్యాడ్జింగ్స్ మరియు టెయిల్ గేట్ అన్నీ కూడా పియానో బ్లాక్ కలర్ పొందుతాయి.

కంపెనీ లాంచ్ చేసిన ఈ మూడు నైట్ అండ్ డే ఎడిషన్స్ కేవలం 1600 మందికి మాత్రమే విక్రయిస్తారు. అంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి పరిమిత సంఖ్యలోనే విక్రయాలు ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినా అనేక కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది.

ఫీచర్స్

కొత్త రెనాల్ట్ నైట్ అండ్ డే స్పెషల్ ఎడిషన్స్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులోని ఫీచర్స్ దాదాపు స్టాండర్డ్ మోడల్లోని మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కాబట్టి ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ రేప్లికేషన్, రియర్ వ్యూ కెమెరా మరియు 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్స్ ఉంటాయి. ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్స్ వెనుక పవర్ విండోస్ పొందుతాయి. కాబట్టి ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ డ్రైవింగ్ అనుభవాన్నే అందిస్తాయని భావిస్తున్నాము.

ఇంజిన్ వివరాలు

రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్స్ డిజైన్ మరియు ఫీచర్లలో కొంత అప్డేట్స్ ఉన్నప్పటికీ ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.

ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్ 72 హార్స్ పవర్ అందించే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కైగర్ స్పెషల్ ఎడిషన్ 72 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 68 హార్స్ పవర్ డెలివరీ చేసే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇవి రెండూ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి.

Don’t Miss: రైడింగ్‌కు సిద్దమైపోండి.. 2024 అపాచీ ఆర్ఆర్ 310 వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త రెనాల్ట్ నైట్ అండ్ డే స్పెషల్ ఎడిషన్స్ ధరలు దాని ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ల కంటే రూ. 20000 ఎక్కువ. అయితే ఈ ధరకు తగిన ఫీచర్స్ పొందవచ్చు. ఇవి స్పెషల్ ఎడిషన్స్.. దేశీయ విఫణిలో వీటికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కాబట్టి ఇవి ఉత్తమ అమ్మకాలను పొందుతాయని భావిస్తున్నాము.

రైడింగ్‌కు సిద్దమైపోండి.. 2024 అపాచీ ఆర్ఆర్ 310 వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

0

2024 TVS Apache RR 310 Launched in India: భారతదేశంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థగా విరాజిల్లుతున్న ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) కంపెనీ ఎట్టకేలకు తన 2024 అపాచీ ఆర్ఆర్ 310 (2024 Apache RR 310) బైక్ లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

ప్రైస్

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ ప్రారంభా ధర రూ. 2.75 లక్షలు.. కాగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 2.97 లక్షలు (ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ బైక్ కొనుగోలు చేసేవారు ‘బిల్డ్ టు ఆర్డర్’ (BTO) ప్రోగ్రాం కింద డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ రెపికా ఎంచుకోవచ్చు. ఇవి బైకును మరింత హుందాగా చేస్తాయి. బైక్ ధరలు మీరు ఎంచుకునే రంగును బట్టి మారుతూ ఉంటాయి.

  • రెడ్ (క్విక్‌షిఫ్టర్ లేకుండా): రూ. 275000
  • రెడ్ (క్విక్‌షిఫ్టర్‌తో): రూ. 292000
  • బాంబర్ గ్రే: రూ. 297000

బీటీఓ కిట్ ధరలు

  1. డైనమిక్ కిట్: రూ. 18000
  2. డైనమిక్ ప్రో కిట్: రూ. 16000
  3. రేస్ రెప్లికా కలర్: రూ. 7000

డిజైన్

ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే.. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 బైక్ స్పోర్టీ లుక్ పొందుతుంది. ఏరో డైనమిక్ వింగ్‌లెట్స్, మెకానికల్స్ వంటి వాటిని బహిర్గతం చేసే పారదర్శక క్లచ్ కవర్స్ పొందుతుంది. ఫ్రంట్ డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. మొత్తం మీద డిజైన్ బైక్ ప్రేమికులను ఒక్క చూపుతో ఆకర్శించేలా ఉంది.

ఫీచర్స్

2024 అపాచీ ఆర్ఆర్ 310 బైక్ టీఎఫ్‌టీ కలర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్ పొందుతుంది. నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని కూడా పొందుతుంది. అంతే కాకుండా క్రూయిజ్ కంట్రోల్స్, రేస్ ట్యూన్డ్ లీనియర్ స్టెబిలిటీ కంట్రోల్ (RT-DSE) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.

కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు విలీ కంట్రోల్‌తో రైడర్ ఎయిడ్‌లను మరింత మెరుగుపరుస్తుంది. క్విక్ గేర్ షిఫ్ట్ కోసం బై-డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్ ఎంచుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ వివరాలు

2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ 312.2 సీసీ సింగిల్ సిలిండర్ రివర్స్ ఇంక్లైన్డ్ లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది.ఇది 37.48 Bhp పవర్ మరియు 29 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ సిక్స్ స్పీడ్ మెష్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో జతచేయబడుతుంది. ఈ బైక్ గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం కావడానికి 2.82 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అయితే 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 6.74 సెకన్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 164 కిమీ (స్పోర్ట్ అండ్ ట్రాక్ మోడ్‌లో)

కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బైక్ యొక్క ముందు భాగంలో USD ఫోర్క్ సెటప్, వెనుక ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. కస్టమర్లు బీటీఓ ఎంచుకోవడం ద్వారా అడ్జస్టబుల్ సెటప్ ఎంచుకోవచ్చు. ఈ బైక్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ప్రామాణికంగా లభిస్తుంది.

బుకింగ్స్ అండ్ డెలివరీలు

2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఆసక్తికలిగిన కస్టమర్లు కంపెనీ అధీకృత డీలర్షిప్ వద్ద లేకుండా అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. అయితే ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది తెలియాల్సి ఉంది.

Don’t Miss: దుమ్ములేపే దమ్ముతో వచ్చేసింది.. ‘హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్’: ధర ఎంతంటే..

ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి అమ్మకాల పరంగా ఏ కొత్త బైక్ అయిన కొంత పోటీ ఎదుర్కోక తప్పదు. కాబట్టి టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ కూడా.. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న కేటీఎమ్ ఆర్సీ390, ఏప్రిలియా ఆర్ఎస్ 457, యమహా వైజెడ్ఎఫ్ ఆర్3, కవాసకి నింజా 300, కీవే కే300ఆర్ మరియు బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త అపాచీ బైక్ అమ్మకాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

దుమ్ములేపే దమ్ముతో వచ్చేసింది.. ‘హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్’: ధర ఎంతంటే..

0

Hyundai Venue Adventure Edition Launched in India: ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ భారతీయ మార్కెట్లో కొత్త వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇప్పటికే భారీ అమ్మకాలతో దూసుకెళ్తున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో లాంచ్ అవ్వడం వాహన ప్రేమికులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఈ కొత్త ఎడిషన్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & కలర్ ఆప్షన్స్

కొత్త హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ (Hyundai Venue Adventure Edition) ప్రారంభ ధర రూ. 10.15 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ రేంజర్ ఖాకీ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఈ ఎడిషన్ ఎస్(ఓ) ప్లస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్(ఓ) అనే మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కొత్త ఎడిషన్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 15000 ఎక్కువ. వేరియంట్ వారీగా ధరలను కింద గమనించవచ్చు.

  • 1.2 లీటర్ పెట్రోల్ ఏంటీ ఎస్(ఓ) ప్లస్: రూ. 10.15 లక్షలు
  • 1.2 లీటర్ పెట్రోల్ ఏంటీ ఎస్ఎక్స్: రూ. 11.21 లక్షలు
  • 1.0 టర్బో పెట్రోల్ డీసీటీ ఎస్ఎక్స్(ఓ): రూ. 13.38 లక్షలు

డిజైన్

చూడటానికి దాదాపు సాధారణ హ్యుందాయ్ వెన్యూ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఈ కొత్త అడ్వెంచర్ ఎడిషన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్స్, వింగ్ మిర్రర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటిని బ్లాక్ కలర్ పొందుతాయి. డోర్ మీద అడిషినల్ సైడ్ క్లాడింగ్ చూడవచ్చు. బ్రేక్ కాలిపర్స్ రెడ్ కలర్ పొందుతుంది. ఫ్రంట్ పెండర్ మీద అడ్వెంచర్ ఎడిషన్ చిహ్నం, మరియు గ్రిల్ మీద హ్యుందాయ్ లోగో వంటివి బ్లాక్ కలర్ పొందుతాయి.

నిజానికి హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ రేంజర్ ఖాకీ కలర్ ఆప్షన్లో మాత్రమే కాకుండా.. అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే అనే రంగులలో లభిస్తుంది. ఇవన్నీ కూడా డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్ పొందుతాయి. అంటే రూప్ నలుపు రంగులో ఉంటుంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్స్

కొత్త హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ డ్యూయెల్ టోన్ (గ్రే అండ్ బ్లాక్) కలర్ ఆప్షన్ పొందుతుంది. క్యాబిన్ మొత్తం కూడా బ్లాక్ కలర్ పొందుతుంది. అక్కడక్కగా.. సేజ్ గ్రీన్ కలర్ ఇన్సర్ట్‌లు మరియు కాంట్రాస్ట్ చూడవచ్చు. సీట్లు కూడా గ్రీన్ హైలెట్స్ పొందుతాయి. కొత్త 3డీ మ్యాట్స్, స్పోర్టీగా కనిపించే పెడల్స్ కూడా ఈ కొత్త ఎడిషన్ పొందుతుంది. డ్యూయెల్ కెమెరాతో కూడిన డాష్‌క్యామ్‌ను కూడా ఇక్కడ చూడవచ్చు.

ఇంజిన్ వివరాలు

హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. రెండో ఇంజిన్ అయిన 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్. ఇది 120 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ కొత్త ఎడిషన్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందదు. కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో మాత్రమే ఈ ఎడిషన్ లభిస్తుంది.

కొత్త వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ అండ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. వెన్యూలో కొత్త మోడల్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. మా కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.

Don’t Miss: ‘ఆషు రెడ్డి’ ఉపయోగించే లగ్జరీ కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

కొత్త ఎడిషన్ లాంచ్ చేయడానికి కారణం

ఆధునిక కాలంలో వాహన ప్రియులు కొత్త వాహనాలను లేదా అప్డేటెడ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి దీనిని కంపెనీలు దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు వాహనాలను లాంచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంపెనీ ఎప్పుడైతే అప్డేటెడ్ లేదా కొత్త వాహనాలను లాంచ్ చేయడం ఆపేస్తుందే.. మార్కెట్లో ప్రత్యర్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తరువాత ఆ సంస్థ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి హ్యుందాయ్ ఈ కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది.

ఈ కారు కోసం 6 నెలలు వెయిట్ చేయాల్సిందే.. అట్లుంటది మహీంద్రా అంటే

0

Mahindra XUV 3XO Waiting Period: భారతదేశంలో మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంచుకంటే థార్ 3 డోర్ వెర్షన్, స్కార్పియో ఎన్ మరియు ఎక్స్‌యూవీ700 వంటి మోడల్ దేశీయ విఫణిలో లాంఛ్ అయిన వెంటనే ఎలాంటి అమ్మకాలు పొందాయో కూడా అందరికి తెలుసు. ఇప్పుడు ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra 3XO) కూడా గొప్ప బుకింగ్స్ పొందుతోంది. ఈ కారును డెలివరీ చేసుకోవాలంటే కనీసం ఆరు నెలలు వేచి ఉండాల్సిందే అంటూ గణాంకాలు చెబుతున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారుకు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అయిన 3ఎక్స్ఓ ప్రతి నెల సగటున 9000 నుంచి 10000 యూనిట్ల బుకింగ్స్ పొందుతోంది. దీంతో వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది. ఏ వేరియంట్ బుక్ చేస్తే.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనే వివరాలను ఈ కింద గమనించవచ్చు.

పెట్రోల్ వేరియంట్స్ వెయిటింగ్ పీరియడ్

ఎమ్ఎక్స్1 – 6 నెలలు
ఎమ్ఎక్స్2/ఎమ్ఎక్స్2 ప్రో – 3 నెలల నుంచి 4 నెలలు
ఎమ్ఎక్స్3/ఎమ్ఎక్స్3 ప్రో – 3 నుంచి 4 నెలలు
ఏఎక్స్5 – 4 నెలలు
ఏఎక్స్5 ఎల్ – 2 నెలల నుంచి 3 నెలలు
ఏఎక్స్7 – 2 నెలల నుంచి 3 నెలలు
ఏఎక్స్7 ఎల్ – 2 నెలల నుంచి 3 నెలలు

డీజిల్ వేరియంట్స్ వెయిటింగ్ పీరియడ్

ఎమ్ఎక్స్2/ఎమ్ఎక్స్2 ప్రో – 1 నెల
ఎమ్ఎక్స్3/ఎమ్ఎక్స్3 ప్రో – 1 నెల
ఏఎక్స్5 – 1 నెల
ఏఎక్స్7 – 1 నెల
ఏఎక్స్7 ఎల్ – 1 నెల

నివేదికల ప్రకారం మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ యొక్క బేస్ వేరియంట్ ఎమ్ఎక్స్1 బుక్ చేసుకుంటే.. డెలివరీ పొందటానికి కనీసం 6 నెలలు వేచి చూడాల్సి ఉంది. అదే సమయంలో ఎమ్ఎక్స్2 లేదా ఎమ్ఎక్స్2 ప్రో మరియు ఎమ్ఎక్స్3 లేదా ఎమ్ఎక్స్3 ప్రో అనే పెట్రోల్ మోడల్స్ బుక్ చేసుకుంటే 3 నెలల నుంచి 4 నెలల సమయం వేచి చూడాలి. ఇందులో డీజిల్ వెర్షన్ బుక్ చేసుకుంటే ఒక నెల రోజులు ఎదురు చూడాల్సి ఉంది.

ఏఎక్స్5 పెట్రోల్ వేరియంట్ కోసం నాలుగు నెలలు, ఏఎక్స్5 ఎల్ పెట్రోల్ మోడల్ కోసం 2 నుంచి 3 నెలలు వేచి చూడాలి. అదే సమయంలో ఏఎక్స్7 డీజిల్ మోడల్ కోసం 1 నెల.. పెట్రోల్ మోడల్ కోసం గరిష్టంగా 2 నుంచి 3 నెలలు వేచి చూడాలి. టాప్ వేరియంట్ అయిన ఏఎక్స్7 ఎల్ పెట్రోల్ కోసం కూడా 2 నుంచి 3 నెలలు.. డీజిల్ వేరియంట్ కోడం 1 నెల రోజులు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఎక్స్‌యూవీ 3ఎక్స్0 బేస్ మోడల్ బుక్ చేసుకున్నవారు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ గురించి

ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు తొమ్మిది వేరియంట్లలో.. పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. ఇవి మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి పనితీరు పరంగా ఈ కారు అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు ప్రారంభ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 7.49 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధరలు రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు.. వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇందులో డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 111 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 131 హార్స్ పవర్ అందించే 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ మరియు 117 హార్స్ పవర్ విడుదల చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్ కలిగి ఉంటే.. డీజిల్ ఇంజిన్ మాత్రం 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఎంపికలను పొందుతుంది.

Don’t Miss: ‘ఆషు రెడ్డి’ ఉపయోగించే లగ్జరీ కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

భారతదేశంలో అమ్మకానికి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులను ప్రమాద సమయంలో కొంత సురక్షితంగా ఉంచడానికి పనికొస్తాయి.

‘ఆషు రెడ్డి’ ఉపయోగించే లగ్జరీ కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

0

Actress Ashu Reddy Car Collection: సోషల్ మీడియా ద్వారా పరిచయమై బిగ్‌బాస్ సీజన్ 3లో మరింత పాపులర్ అయిన ‘ఆషు రెడ్డి’ (Ashu Reddy) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ఎంతోమంది ఫాలోవర్లను ఆకట్టుకున్న ఆషు రెడ్డి ఆ తరువాత చల్ మోహన రంగా సినిమాతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.

నటి ఆషు రెడ్డి.. డైరెక్టర్ రాం గోపాల్ వర్మను ఉంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ తరువాత కొత్త కారు కొనుగోలు చేసి వెనుస్వామితో పూజ చేయించుకుని మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆషు రెడ్డి సినిమాల గురించి.. ఇతరత్రా విషయాలు తెలిసిన చాలామందికి.. ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది. వాటి ధర ఎంతవరకు ఉండవచ్చు అనే వివరాలు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఈ వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం..

ఆషు రెడ్డి దగ్గర రెండు ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్‌సీ300డీ, మరొకటి రేంజ్ రోవర్.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ300డీ

అషు రెడ్డి ఉపయోగించే ఈ బెంజ్ కారును 2022లో తన పుట్టిన రోజుకు సందర్భంగా ఆమె తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు రేటు ఏకంగా రూ. 70 లక్షల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. నిజానికి ఇదే ఆషు రెడ్డి మొదటి ఖరీదైన లగ్జరీ కారు. ఆషు రెడ్డి ఈ కారు ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ300డీ అనేది భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసిన లగ్జరీ కార్లలో ఒకటి. ఇది మంచి డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఈ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్, డీఆర్ఎల్ మరియు ఫాగ్‌లైట్ వంటివి పొందుతుంది. కాబట్టి ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

బెంజ్ జీఎల్‌సీ300డీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులోని 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ కంట్రోల్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు అనుకూలమైన సీటింగ్ వంటివి పొందుతుంది. ఈ కారులోని 1993 సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 4200 ఆర్‌పీఎమ్ వద్ద 261 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 1800 ఆర్‌పీఎమ్ వద్ద 550 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 20.3 కిమీ మైలేజ్ అందిస్తుంది.

రేంజ్ రోవర్ (Range Rover)

ఆషు రెడ్డి ఉపయోగించే మరోకారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ అని తెలుస్తోంది. దీనిని స్వయంగా ఈమె కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 75 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారుకు జ్యోతిష్కుడు వెనుస్వామి చేత పూజలు చేయించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నిజానికి సినీ పరిశ్రమలో చాలామంది ఉపయోగించే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లే ఉన్నాయి. ఈ జాబితాలో అషు రెడ్డి కూడా ఒకరు. ఈ కారు విలాసవంతమైన డిజైన్, వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. దీనిని ఎక్కువమంది సెలబ్రిటీలు కొనుగోలు చేస్తూ ఉంటారు.

Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రూ.3.5 కోట్ల కారు ఇదే!.. మొన్న ఫెరారీ.. ఇప్పుడు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ అనే మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఆషు రెడ్డి కొనుగోలు చేసిన కారు ఏ ఇంజిన్ కలిగి ఉందనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఏ ఇంజిన్ అయినా ఈ కారు పర్ఫామెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని మాత్రం చెప్పవచ్చు.

ఇప్పటికే 3 లక్షలు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓలా ఎలక్ట్రిక్

0

Ola Electric Crossed 3 Lakh Scooter Sales in India: గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం మారుతున్న ప్రజల మనస్తత్వం కావొచ్చు, మెయినెన్స్ ఖర్చులు తగ్గించుకోవడానికి కావొచ్చు, లేదా పర్యావరణాన్ని కాపాడదామనే ఆలోచన కూడా కావొచ్చు. ఏదైతే ఏం? ఈవీల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుపైన ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టూ-వీలర్ ఈవీ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన హవా చూపుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ 3 లక్షల కంటే ఎక్కువైనట్లు సమాచారం.

2024లో భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 వరకు కంపెనీ ఏకంగా 304393 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. కాబట్టి 2024 చివరి నాటికి కంపెనీ 4 లక్షల యూనిట్ల సేల్స్ సాధిస్తుందని సమాచారం.

జనవరి 2024 ప్రారంభం నుంచి ఆగష్టు మధ్య కాలంలో ఓలా ఎలక్ట్రిక్ నెలకు సగటున 37220 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 41 శాతంగా ఉంది. ఇది అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి అనే చెప్పాలి. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ప్రత్యర్థుల కంటే ముందుగా 1 లక్ష, 2 లక్షలు మరియు 3 లక్షల యూనిట్లు విక్రయించిన ఘనత కూడా ఓలా ఎలక్ట్రిక్ సొంతం అనటంలో ఎటువంటి సందేహం లేదు.

2023లో కంపెనీ సేల్స్ 267365 యూనిట్లు. ఇది టీవీఎస్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలకంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. 2023లో టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్ 166579 యూనిట్లు. ఇక 2024 మొదటి ఎనిమిది నెలల.. తొమ్మిది రోజుల్లోనే 2023 మొత్తం అమ్మకాల కంటే 37028 యూనిట్లు ఎక్కువ సేల్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ మరియు ఎస్1 ఎక్స్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ వరుసగా 180 కిమీ, 151 కిమీ మరియు 190 కిమీ. ఎస్1 ప్రో టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ కాగా.. ఎస్1 ఎయిర్ గరిష్ట వేగం 90 కిమీ/గం. అదే సమయంలో ఎస్1 ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ వరకు ఉంది. ఎస్1 ఎక్స్ అనేది కంపెనీ యొక్క లేటెస్ట్ స్కూటర్ ఇది 2 కిలోవాట్, 3 కిలోవాట్ మరియు 4 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ఎంపికలను పొందుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ బైకులు

ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాకుండా ఓలా ఎలక్ట్రిక్ 2024 ఆగష్టు 15న తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సిరీస్ (రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ మరియు రోడ్‌స్టర్ ప్రో) లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఈ బైకుల డెలివరీలను 2025లో ప్రారంభించనున్నట్లు సమాచారం. కంపెనీ యొక్క ఈ మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు జెన్ 3 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైకుల రేంజ్ మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రత్యర్థుల అమ్మకాలు

ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ అగ్రగామిగా ఉంది. ఆ తరువాత టీవీఎస్, బజాజ్ ఆటో మరియు ఏథర్ ఎనర్జీ ఉన్నాయి. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 9వరకు టీవీఎస్ కంపెనీ 132078 ఐక్యూబ్ స్కూటర్లను విక్రయించింది. బజాజ్ ఆటో యొక్క చేతక్ ఈవీ సేల్స్ 105680 యూనిట్లు. ఈ రెండు కంపెనీలో అమ్మకాల్లో చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో వీటి మధ్య బలమైన పోటీ ఏర్పడింది.

బజాజ్ ఆటో మరియు టీవీఎస్ మోటార్ కంపెనీ రెండూ కూడా తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను 2020 జనవరిలో లాంచ్ చేశాయి. అప్పటి నుంచే వీటి మధ్య పోటీ ఏర్పడింది. 2023లో టీవీఎస్ కంపెనీ బజాజ్ కంటే కూడా 94642 యూనిట్ల ఎక్కువ స్కూటర్లను విక్రయించింది. 2023 కంటే కూడా 2024లో ఈ కంపెనీల సేల్స్ కొంత తక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రూ.3.5 కోట్ల కారు ఇదే!.. మొన్న ఫెరారీ.. ఇప్పుడు

అమ్మకాల్లో అగ్రగామిగా ఎలక్ట్రిక్ టూ-వీలర్స్

భారతదేశంలో ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కూడా చాలా జోరుగా దూసుకెళ్తోంది. మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో టూ వీలర్స్ మార్కెట్‌ 57 శాతంగా ఉంది. ఈ ఏడాది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023లో మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు 9,48,444 యూనిట్లు. ఒక మిలియన్ సేల్స్ సాధించడానికి ఇంకా 2,01,181 యూనిట్ల సేల్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఈ రికార్డ్ సాధ్యమవుతుందని సమాచారం.

హీరో ‘అజిత్ కుమార్’ రూ.3.5 కోట్ల కారు ఇదే!.. మొన్న ఫెరారీ.. ఇప్పుడు

0

Famous Actor Ajith Kumar Buys Porsche GT3 RS: సాధారణ ప్రజలతో పోలిస్తే.. సెలబ్రిటీల కార్ కలెక్షన్ భారీగానే ఉంటుంది. ఇందులో అధికంగా హీరోలే ఉన్నాయి. కొన్ని రోజులకు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య పోర్స్చే కంపెనీకి చెందిన ‘911 జీటీ3 ఆర్ఎస్’ కారును కొనుగోలు చేసారని చదువుకున్నాం. ఇప్పుడు ఇలాంటి కారునే నటుడు ‘అజిత్ కుమార్’ (Ajith Kumar) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అజిత్ భార్య ‘షాలిని’ తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది.

ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో అజిత్ కుమార్.. కారు వెనుక భాగంలో నిలబడి ఉండటం చూడవచ్చు.

పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ (Porsche 911 GT3 RS)

భారతదేశంలో ఈ కారును కొనుగోలు చేసిన సెలబ్రిటీల సంఖ్య చాలా తక్కువ. ఈ జాబితాలోకి ఇప్పుడు హీరో అజిత్ కూడా చేరారు. ఈ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 3.50 కోట్లు. దేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన పోర్స్చే కారు ఇదే. చక్కని డిజైన్ కలిగిన ఈ కారు ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పొందుతుంది.

అజిత్ కుమార్ కొనుగోలు చేసిన పోర్స్చే కారు రెడ్ వీల్స్ కలిగి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఈ కారు 3996 సీసీ సిక్స్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 518 Bhp పవర్ మరియు 468 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 296 కిమీ/గం.

ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్

నటుడు అజిత్ కుమార్ పోర్స్చే కారు కొనుగోలు చేయడానికంటే ముందు.. సుమారు రూ. 9 కోట్ల విలువైన ఓ ఫెరారీ కారును కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని పేరు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్ (Ferrari SF90 Stradale). ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన మొట్ట మొదటి మిడ్ ఇంజిన్ ఫెరారీ. దీనిని కంపెనీ ఈ మధ్య కాలంలోనే లాంచ్ చేసింది. ఇది బ్రాండ్ యొక్క మొదటి హైబ్రిడ్ సిరీస్ అని తెలుస్తోంది. ఇది లంబోర్ఘిని యొక్క రెవెల్టో కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇది 986 హార్స్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది 7.9 కిలోవాట్ బ్యాటరీతో జతచేయబడి ఉంటుంది. ఇది 217 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులోని బ్యాటరీ ఫుల్ చార్జితో 26 కిమీ రేంజ్ అందిస్తుంది.

ప్రస్తుతం అజిత్ సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఈయన కేవలం తమిళ ప్రజలకు మాత్రమే కాకుండా తెలుగువారికి కూడా సుపరిచయమే. కాబట్టి ఈయనకు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా అజిత్ ఒక ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన కార్లు మరియు బైకులు ఉన్నాయి.

అజిత్ గ్యారేజిలోని కార్లు, బైకులు (Ajith Kumar Car and Bike Collection)

హీరో అజిత్ కుమార్ గ్యారేజిలో ఖరీదైన లంబోర్ఘిని, ల్యాండ్ రోవర్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ మొదలైన కార్లు ఉన్నాయి. బైకుల విషయానికి వస్తే.. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ కే 1300 ఎస్, ఏప్రిలియా మరియు కవాసకి నింజా జెడ్ఎక్స్-145 వంటి ఖరీదైన బైకులు ఉన్నాయి.

Don’t Miss: రూ.3.5 కోట్ల కారు కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!

అజిత్ కుమార్ 2003 ఫార్ములా బీఎండబ్ల్యూ ఆసియా ఛాంపియన్‌షిప్ మరియు 2010 ఎఫ్ఐఏ ఫార్ములా టూ ఛాంపియన్‌షిప్ వంటి అనేక అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్‌లలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఈయన అప్పుడప్పుడు తన బీఎండబ్ల్యూ బైకులో లాంగ్ రైడ్ కూడా చేస్తుంటారు. అజిత్ బైక్ రైడింగ్ చేసిన చిత్రాలు ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.