31.2 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 28

మాయం కానున్న టోల్ ప్లాజాలు!.. అంతా GNSS సిస్టం: ఇదెలా పనిచేస్తుందో తెలుసా?

0

Explain of GNSS System and How Work it in Highway: ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) విధానం ప్రవేశపెట్టిన తరువాత టోల్ వసూలు విప్లవాత్మకంగా మారింది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ‘గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (GNSS) ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అంటే ఫాస్ట్‌ట్యాగ్ విధానం కనుమరుగయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జీఎన్ఎస్ఎస్ సిస్టం ఎలా పని చేస్తుంది? టోల్ వసూలు ఎలా జరుగుతుంది? ఇది దేశంలో సాధ్యమవుతుందా? అనే వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.

FASTag ప్రవేశపెట్టడానికి కారణం?

ఫాస్ట్‌ట్యాగ్ ప్రవేశపెట్టడానికి ముందు సాధారణ టోల్ కలెక్షన్ సిస్టం ఉండేది. ఇది వాహన దారులకు కొంత ఇబ్బందిగా.. అంటే టోల్ గేట్ దగ్గర వేచి ఉండాల్సిన సమయాన్ని పెంచేది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానం వాహనదారులను టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని బాగా తగ్గించింది. అంతే కాకుండా టోల్ కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగాయి.

జీఎన్ఎస్ఎస్ సిస్టం ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు?

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ శాటిలైట్ టోల్ కలెక్షన్ సిస్టం వైపు మొగ్గు చూపుతోంది. ఇది పూర్తిగా శాటిలైట్ సిస్టం. ఈ విధానంలో వాహనదారుడు టోల్ గేట్ దగ్గర ఆగి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేయడం అనేది జీఎన్ఎస్ఎస్ సిస్టంలో సాధ్యమవుతుంది.

జీఎన్ఎస్ఎస్ సిస్టం ఎలా పనిచేస్తుంది?

మనం ఇప్పటికే చెప్పుకున్నట్లు జీఎన్ఎస్ఎస్ అనేది పూర్తిగా శాటిలైట్ విధానం. టోల్ కలెక్షన్ కోసం కేంద్రం వేస్తున్న ఓ అడుగు అనే చెప్పాలి. టోల్ చార్జీలను వసూలు చేయడానికి ఈ కొత్త విధానం అద్భుతంగా పనిచేస్తుంది. వాహనం రోడ్డుపైన ప్రయాణించిన దూరాన్ని ఇది ఖచ్చితంగా లెక్కిస్తుంది. దానికయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్ విధానం ద్వారా టోల్ వసూలు చేసుకుంటుంది. అంటే వాహనం హైవేపైకి వచినప్పటి నుంచి.. హైవే నుంచి బయటకు వెళ్లే వరకు ప్రయాణించిన దూరాన్ని ఈ సిస్టం లెక్కిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణించిన దూరానికి ఫీజు చెల్లించడం అన్న మాట.

జీఎన్ఎస్ఎస్ ద్వారా ఉపయోగాలు

గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంటే వాహనదారులకు సమయం మిగులుతుంది. టోల్ బూత్‌లు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ విధానంలో ఎదుర్కుంటున్న చిన్న చిన్న సమస్యలు కూడా ఈ జీఎన్ఎస్ఎస్ విధానంలో తలెత్తే అవకాశం లేదు.

టోల్ గేట్ అనేది ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్మించబడి ఉంటుంది. ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే జీఎన్ఎస్ఎస్ విధానం దీనికి పూర్తిగా మంగళం పాడనుంది. ఒక వ్యక్తి హైవేమీద ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాడు అనుకుంటే.. ఆ నాలుగు కిలోమీటర్లకు ఎంత ఛార్జ్ అవుతుందో అంతే చెల్లించాల్సి ఉంటుంది.

మనదేశంలో జీఎన్ఎస్ఎస్ సిస్టం సాధ్యమవుతుందా?

టెక్నాలజీ విషయంలో భారత్ ఏ మాత్రం వెనుకపడలేదు. దిగ్గజ దేశాలకు సైతం ఇండియా గట్టి పోటీ ఇస్తోంది. కాబట్టి జీఎన్ఎస్ఎస్ విధానం తప్పకుండా సాధ్యమవుతుంది. అయితే ఫాస్ట్‌ట్యాగ్ నుంచి జీఎన్ఎస్ఎస్ విధానానికి మారడం అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. కాబట్టి మెల్ల మెల్లగా ప్రాంతాల వారిగా ఈ విధానం అమలు చేసే యోజనలో కేంద్రం ఉంది. అయితే మొత్తానికి ఈ జీఎన్ఎస్ఎస్ విధానం త్వరలోనే అమలులోకి రానుందనేది మాత్రం వాస్తవం.

భారత ప్రభుత్వం ప్రారంభంలో కొన్ని టోల్ ప్లాజాలను ఎంచుకుని అక్కడ మాత్రమే జీఎన్ఎస్ఎస్ సిస్టం అమలు చేస్తుంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరు – మైసూర్ జాతీయ రహదారి NH-275 మరియు హర్యానాలోని పానిపట్ – హిసార్ జాతీయ రహదారి NH-709లలో ఈ జీఎన్ఎస్ఎస్ విధానం అమలు చేసి టెస్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు.

జీఎన్ఎస్ఎస్ టోల్ కలెక్షన్

ఇక చివరగా జీఎన్ఎస్ఎస్ ద్వారా టోల్ ఫీజు ఎలా వసూలు చేస్తారు అనే విషయానికి వస్తే.. ఇది పూర్తిగా శాటిలైట్ విధానం. కాబట్టి శాటిలైట్ వాహనదూరాన్ని ట్రాక్ చేస్తుంది. దీంతో వాహనం హైవే ఎక్కినప్పటి నుంచి, బయటకు వచ్చే వరకు ఎంత దూరం ప్రయాణించింది.. అనే దూరాన్ని బట్టి టోల్ ఫీజు కలెక్ట్ చేసుకుంటుంది. దీనికోసం వెహికల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ చేయబడిన వాలెట్ నుంచి టోల్ ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

Don’t Miss: ఉక్రెయిన్‌లో మోదీ 20 గంటకు ప్రయాణించిన ట్రైన్‌ ఇదే.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆటోమాటిక్ టోల్ కలెక్షన్ అనేది ఇప్పటికే అనేక యూరోపియన్ దేశాల్లో వాడుకలో ఉంది. ఇది వాహనదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా టోల్ వసూలు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కూడా గణనీయంగా పెంచడానికి తోడ్పడుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఏకంగా రూ. 40000 కోట్లు టోల్ ఫీజులను వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఉక్రెయిన్‌లో మోదీ 20 గంటలు ప్రయాణించిన ట్రైన్‌ ఇదే.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

0

Details of PM Narendra Modi Travelled Train Force One in Ukraine: అలనాడు భారతదేశ కీర్తి ప్రతిష్టలను స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఈ నాడు దేశ ప్రధాని ‘నరేంద్ర మోదీ’ ఆ బాధ్యత తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దేశమైన, ఏ ఖండమైన దేశ ఖ్యాతిని తెలియజేయడానికి.. ఆర్థిక పరమైన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఓ సమర్ధవంతమైన నాయకుడు ఎవరు అంటే? దీనికి సమాధానం తప్పకుండా ‘మోదీ’ అనే చెప్పాలి.

గతంలో కూడా భారత ప్రధానులు తమదైన రీతిలో దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నించారన్న విషయం కూడా మనం మరచిపోకూడదు. అయితే నేడు ఆధునిక ప్రపంచం పరుగులు పెడుతున్న వేళ భారత్ ఎదుగుదలకు అలుపెరుగని శ్రామికుడై మోదీ శ్రమిస్తున్నారు. ఇది అందరికి తెలిసిన నిజం.

దేశం అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మరో దేశం కష్టాల్లో ఉందంటే కూడా వారికి మొదట గుర్తొచ్చేది భారత్. బర్మా ప్రధాని కష్టంలో ఉన్నప్పుడు ఇండియా ఆశ్రయమిచ్చింది. ఉక్రెయిన్ దేశంలో శాంతి కొరవడిన సందర్భంలో ప్రధానమంత్రి కదలి వెళ్లారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన తరువాత ఆ దేశంలో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ కావడం గమనించదగ్గ విషయం మరియు గర్వించదగ్గ విషయం.

రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి మోదీ కదలి వెళ్లారు. నిజానికి ఒక దేశ ప్రధాని మరో దేశం వెళ్లారు అంటే.. అక్కడ దాదాపు విమానాల్లో లేదా హెలికాఫ్టర్లలో తిరుగుతారు. కానీ మోదీ రైలులో (ట్రైన్) ప్రయాణించారు. మోదీ ప్రయాణించిన రైలు పేరు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ (Train Force One).

”ట్రైన్ ఫోర్స్ వన్” విశేషాలు

శాంతి నెలకొల్పడానికి ఉక్రెయిన్ వెళ్లిన మోదీ ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రయాణించారు. ఈ రైలులో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటివారు కూడా ప్రయాణించారు. దేశాధ్యక్షులు ప్రయాణానికి కేటాయించే ఈ ట్రైన్ విలాసవంతంగా ఉంటుంది.

ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో పెద్ద టేబుల్స్, ఖరీదైన సోఫా, వాల్ మౌంటెడ్ టీవీ వంటి వాటితో పాటు.. నిద్రపోవడానికి కూడా కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో రష్యా యుద్ధం ప్రారంభమైన తరువాత.. భారతదేశం నుంచి వెళ్లిన ఓ సీనియర్ నాయకుడు నరేంద్ర మోదీ. ఈ రైలులో మోదీ ప్రయాణం 20 గంటలు కావడం గమనించదగ్గ విషయం. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అంతర్జాతీయ దౌత్య పర్యటనకు ఎక్కువగా ఈ రైలునే ఉపయోగిస్తారని తెలుస్తోంది.

వాస్తవానికి క్రిమియాలోని పర్యాటకుల కోసం 2014లో ఈ రైలును నిర్మించారు. ఆ తరువాత దీనిని వీఐపీల కోసం కేటాయించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తరువాత విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఈ ట్రైన్ డీజిల్ ఇంజిన్ ద్వారా నడుస్తోంది. దీనిని కేవలం దేశాధినేతల ఉపయోగానికి మాత్రమే ప్రత్యేకించి ఏర్పాటు చేశారు.

మోదీ ఉక్రెయిన్ పర్యటనలో కీలక విషయం

నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనలో.. ఆ దేశ ప్రధానిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. యుద్ధం విషయం భారత్ ఎప్పుడూ తటస్థంగా ఉండదని.. ఇండియా ఎప్పుడూ శాంతి వైపు ఉంటుందని మోదీ ప్రకటించారు. మోదీ చేసిన వ్యాక్యలు ప్రపంచ దేశాలను ఆకర్శించాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం నరేంద్ర మోదీని కొనియాడింది.

భారతదేశంలో ప్రధాని కోసం ఉపయోగించే కారు

మన దేశంలో ప్రధాన మంత్రి ప్రయాణించడానికి కట్టుదిట్టమైన భద్రతలతో కూడిన వాహనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. శత్రువుల భారీ నుంచి ప్రధాన మంత్రిని కాపాడటానికి, బాంబులు వంటి వాటి నుంచి కూడా రక్షించబడటానికి కారులో కావలసిన అన్ని సౌకర్యాలు ఆ కార్లలో ఉంటాయి.

Don’t Miss: నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!

ఇక విమానాల విషయానికి వస్తే.. ప్రధాన మంత్రి ప్రయాణించడానికి ప్రత్యేక విమానాలు కూడా ఉంటాయి. దీన్నిబట్టి చూస్తే దేశ ప్రధానికి ఎంత రక్షణ కల్పిస్తారనేది స్పష్టంగా అర్థమైపోతుంది. మన దేశంలో మాత్రమే కాకుండా దేశాధినేతలకు విదేశాల్లో కూడా పటిష్టమైన భద్రత అందిస్తారు. ఎందుకంటే దేశాధినేతల బాధ్యత మొత్తం ఆ దేశం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రధానమంత్రులకు భద్రత చాలా అవసరం, కల్పిస్తారు కూడా.

67 లక్షల మంది కొనేశారు.. ఈ స్కూటర్‌కు ఎందుకంత డిమాండ్

0

TVS Jupiter 67 Lakh Sales in India Market: భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న స్కూటర్ల జాబితాలో ‘టీవీఎస్ మోటార్’ యొక్క ‘జుపీటర్’ ఒకటి. సెప్టెంబర్ 2013లో ప్రారంభమైన టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) వచ్చే నెలలో (2024 సెప్టెంబర్) తన 11వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రారంభంలో 110 సీసీ మోడల్‌గా పరిచమైన జుపీటర్ ఆ తరువాత 125 సీసీ రూపంలో కూడా లాంచ్ అయింది. ఈ రెండు వేరియంట్‌లు (110 సీసీ, 125 సీసీ) జులై 2024 నాటికి దేశీయ మార్కెట్లో (ఒక్క ఇండియాలో మాత్రమే) ఏకంగా 67,39,254 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

అత్యధిక అమ్మకాలు

టీవీఎస్ జుపీటర్ సాధించిన అమ్మకాలను న భూతో న భవిష్యతి అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క స్కూటర్ దాదాపు 68 లక్షల మంది కస్టమర్లను ఆకర్శించడం అనేది అనన్య సామాన్యం. మొత్తం మీద కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు చేపట్టిన స్కూటర్‌గా జుపీటర్ చరిత్ర సృష్టించింది.

2024 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ 844863 యూనిట్ల అమ్మకాలను పొందింది. అంతకంటే ముందు 2018 ఆర్థిక సంవత్సరంలో 810916 యూనిట్ల సేల్స్ సాధించింది. ఆ సమయంలో టీవీఎస్ రైడర్ మరియు ఎక్స్ఎల్100 మోపెడ్ సేల్స్ వరుసగా 478443 యూనిట్లు మరియు 481803 యూనిట్లు. అపాచీ మరియు ఎన్‌టార్క్ 125 అమ్మకాలు వరుసగా 378112 యూనిట్లు, 3,31,865 యూనిట్లు. అంతకు ముందు అమ్మకాల కంటే కూడా ఈ సేల్స్ చాలా ఎక్కువని తెలుస్తోంది.

పెరిగిన డిమాండ్

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో టీవీఎస్ భారతదేశంలో అన్ని షోరూమ్‌లకు 299689 యూనిట్ల జుపీటర్ స్కూటర్‌లను పంపింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ షోరూమ్‌లకు పంపిన స్కూటర్ల సంఖ్య 247972 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే జుపీటర్ స్కూటర్ యొక్క డిమాండ్ క్రమంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.

2024 ఆర్థిక సంవత్సరంలో కూడా టీవీఎస్ జుపీటర్ సేల్స్.. ఎన్‌టార్క్ 125, రైడర్, అపాచీ, ఎక్స్ఎల్100 మోపెడ్ వంటి వాటికంటే ఎక్కువని తెలుస్తోంది. దేశీయ అమ్మకాలు మాత్రమే కాకుండా జుపీటర్ ఎగుమతులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కంపెనీ జుపీటర్ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి 80000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

యాక్టివాకు ప్రత్యర్థి

భారతదేశంలో టీవీఎస్ జుపీటర్.. మార్కెట్లో హోండా యాక్టివాకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరిస్తోంది. ప్రారంభంలోని మొదటి రెండేళ్లలో జుపీటర్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. 2016లో 10 లక్షలు లేదా 1 మిలియన్ యూనిట్ల సేల్స్.. 2017లో 2 మిలియన్ (20 లక్షలు) యూనిట్లు, 2021 ప్రారంభంలో 4 మిలియన్స్ (40 లక్షలు) సేల్స్, 2022లో 50 లక్షల (5 మిలియన్) యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. ఈ సందర్భంగా కంపెనీ జుపీటర్ 110 క్లాసిక్ పేరుతో ఓ స్కూటర్ లాంచ్ చేసింది.

టీవీఎస్ జుపీటర్ అక్టోబర్ 2023లో 60 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకుని.. అమ్మకాల్లోనే అరుదైన రికార్డ్ సృష్టించింది. టీవీఎస్ అమ్మకాలు గణనీయంగా పెరగటానికి జుపీటర్ ప్రధాన కారణమైంది. దీంతో కంపెనీ మార్కెట్ వాటా కూడా బాగా పెరిగింది. మార్కెట్ వాట్ 2015 ఆర్థిక సంవత్సరంలో 12.68 శాతం నుంచి 15.19 శాతానికి, 2018 ఆర్థిక సంవత్సరంలో 16.36 శాతానికి పెరిగింది. ఆ తరువాత కాలంలో కంపెనీ ఎన్‌టార్క్ 125 లాంచ్ చేసింది. ఇది కూడా మంచి అమ్మకాలను పొందగలిగింది.

25 శాతం మార్కెట్ వాటా

జుపీటర్ మరియు ఎన్‌టార్క్ 125 రెండూ కలిసి గణనీయమైన అమ్మకాలను పొందగలిగాయి. దీంతో మార్కెట్ వాటా 25 శాతానికి పెరిగిపోయింది. హోండా మార్కెట్ వాటా (43 శాతం) తరువాత స్థానంలో టీవీఎస్ నిలిచింది. భవిష్యత్తులో ఈ శాతాన్ని దాటడానికి సన్నద్ధమవుతోంది.

Don’t Miss: కొత్త పెళ్లి కొడుకు ‘కిరణ్ అబ్బవరం’ ఖరీదైన కారు – దీని రేటెంతో తెలిస్తే..

టీవీఎస్ మోటార్ యొక్క అమమకాలు పెరగటానికి ప్రధాన కారణం జుపీటర్. 2014 ఆర్ధిక సంవత్సరం నుంచి 2024 జులై వరకు టీవీఎస్ 10.8 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్ సేల్స్ 6.73 మిలియన్స్ కావడం విశేషం. అమ్మకాల్లో జుపీటర్ వాటా 62 శాతం కావడం గమనార్హం. మొత్తం మీద టీవీఎస్ యొక్క జుపీటర్ 67 లక్షల మంది కస్టమర్లను విజయవంతంగా ఆకర్శించి సక్సెస్ సాధించింది.

కొత్త పెళ్లి కొడుకు ‘కిరణ్ అబ్బవరం’ ఖరీదైన కారు – దీని రేటెంతో తెలిస్తే..

0

Actor Kiran Abbavaram Expensive Range Rover: టాలీవుడ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’ (Kiran Abbavarm) ఓ ఇంటివాడయ్యాడు. తన మొదటి చిత్రం ‘రాజా వారు రాణి గారు’ సినిమాలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించిన ‘రహస్య గోరఖ్’ను (Rahasya Gorak) ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కర్నాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్ట్‌లో అతి తక్కువ మంది మధ్య జరిగింది. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కూడా కిరణ్ అబ్బవరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

మూడు ముళ్ళు, ఏడడుగులు, బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన కిరణ్ అబ్బవరం.. ఓ ఖరీదైన కారును కూడా కలిగి ఉన్నారు. బహుశా ఈ కారు గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో కిరణ్ అబ్బవరం యొక్క ఖరీదైన కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నటుడు కిరణ్ అబ్బవరం ఉపయోగించే కారు రేంజ్ రోవర్ బ్రాండ్ కారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను గతంలో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారును యితడు 2020లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నలుపురంగులో అద్భుతంగా కనిపించే ఈ కారు పక్కన కిరణ్ అబ్బవరం నిలబడి ఉన్న ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

రేంజ్ రోవర్ (Range Rover)

కిరణ్ అబ్బవరం కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ అని తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 1 కోటి కంటే ఎక్కువే. ఇప్పటికే ఈ కారును చాలామంది ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు తమ గ్యారేజిలో చేర్చారు, రోజువారీ వినియోగానికి కూడా ఉపయోగిస్తున్నారు.

ఎక్కువమంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. దాని డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాదు. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందించడం కూడా అని తెలుస్తోంది. విశాలమైన ఫ్రంట్, ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్, ముందు భాగంలో బ్రాండ్ లోగో, ఆకర్షణీయమైన సైడ్ ప్రొఫైల్, టెయిల్ లైట్స్ వంటివన్నీ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

విశాలమైన క్యాబిన్.. సెంటర్ కన్సోల్‌లో 13 ఇంచెస్ స్క్రిన్, సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ప్రీమియం 23 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ఏఐ వాయిస్ కమాండ్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్ స్పోర్ట్ కారు డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. కానీ కిరణ్ అబ్బవరం వద్ద ఉన్న కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉందనేది స్పష్టంగా తెలియదు. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 225 కిమీ నుంచి 290 కిమీ వరకు ఉంటుంది. ఈ కారు రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

రేంజ్ రోవర్ కార్లు పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతాయి. కాబట్టి రేంజ్ రోవర్ స్పోర్ట్ కారులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, అండర్ కార్ వ్యూ, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ కండిషన్ మానిటర్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారు ఎంత సురక్షితమైనదో అర్థం చేసుకోవచ్చు.

Don’t Miss: జాన్ అబ్రహంకు షారుక్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఇదే!.. ధర రూ.17 లక్షలు

రేంజ్ రోవర్ కార్లు కలిగి ఉన్న ఇతర సెలబ్రిటీలు

భారతదేశంలో రేంజ్ రోవర్ బ్రాండ్ కార్లు చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. ఈ జాబితాలో సోనమ్ కపూర్, రణబీర్ కపూర్ & అలియా భట్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, మహేష్ బాబు, అల్లు అర్జున్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మపూజ హెగ్డే, అమితాబ్ బచ్చన్, అంబానీ ఫ్యామిలీ మొదలైన వారు ఉన్నారు.

జాన్ అబ్రహంకు షారుక్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఇదే!.. ధర రూ.17 లక్షలు

0

Shahrukh Khan Gifted To John Abraham A New Suzuki Hayabusa: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలు ఖరీదైన బైకులు మరియు కార్లను కొనుగోలు చేస్తారని అందరికి తెలుసు. బైక్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘జాన్ అబ్రహం’ (John Abraham). ధూమ్ సినిమాలో కనిపించిన ఈ నటుడికి బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే తన గ్యారేజిలో లెక్కకు మించిన ఖరీదైన బైకులను కలిగి ఉన్నారు. ఈయన గ్యారేజిలోని ‘సుజుకి హయబుసా’ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

బైకులంటే విపరీతంగా ఇష్టపడే జాన్ అబ్రహంకు నటుడు షారుక్ ఖాన్ ఖరీదైన సుజుకి హయబుసా బైక్ గిఫ్ట్ ఇచ్చారు. గత ఏడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాక షారుక్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జాన్‌కు బహుమతిగా హయాబుసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా షారుక్ ఇచ్చిన బైక్ జాన్ అబ్రహం గ్యారేజిలో చేరింది.

సుజుకి హయబుసా (Suzuki Hayabusa)

భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకులలో సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి చెందిన ‘హయబుసా’ ఒకటి. ఈ బైక్ ధర రూ. 16.91 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధర అనేది నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ బైక్ చూడటానికి చాలా హుందాగా ఉంటుంది. అత్యద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది.

సుజుకి హయబుసా బైక్ 1340 సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 పీఎస్ పవర్ మరియు 150 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇప్పటికే ఎక్కువ మంది సెలబ్రిటీలను ఆకర్శించిన ఈ బైక్ ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ మరియు ఫీచర్స్ పొందుతుంది. మార్కెట్లో విక్రయానికి ఉన్న ఈ బైక్ కంప్లీట్ నాక్డ్ డౌన్ (సీకేడీ) యూనిట్‌గా ఇండియాకు దిగుమతి అవుతుంది.

జాన్ అబ్రహం అనేక సందర్భాల్లో సుజుకి హయబుసా రైడ్ చేసిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ అండ్ క్యాండీ డేరింగ్ రెడ్ కలర్ ఆప్షన్ పొందింది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రైడింగ్ చేసేవారికి ఈ బైక్ అత్యుత్తమ ఎంపిక అనే చెప్పాలి. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఈ బైకును ఎక్కువమంది సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేరు.

నటుడు జాన్ అబ్రహం గ్యారేజిలోని బైకులు

జాన్ అబ్రహం గ్యారేజిలో సుజుకి హయబుసా బైక్ మాత్రమే కాకుండా.. యమహా వీ-మ్యాక్స్, హోండా సీబీఆర్1000ఆర్ఆర్-ఆర్, యమహా వైజెడ్ఎఫ్-ఆర్1, డుకాటీ పానిగేల్, ఎంవీ అగస్టా ఎఫ్3 800, బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్, ఏప్రిలియా, ఆర్ఎస్వీ4 మరియు సుజుకి జీఎస్ఎక్స్-1000ఆర్ బైక్స్ ఉన్నాయి.

యమహా ఆర్డీ350, కేటీఎమ్ 390 డ్యూక్, రాజ్‌పుతానా కస్టమ్స్ లైట్‌ఫుట్, బుల్ సిటీ కస్టమ్స్ అకుమా మరియు యమహా ఎఫ్‌జెడ్ వీ2 బైకులు కూడా జాన్ అబ్రహం గ్యారేజిలో ఉన్నాయి. ఇవన్నీ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి. రైడింగ్ చేయడానికి ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది.

బైకులు మాత్రమే కాకుండా జాన్ అబ్రహం గ్యారేజిలో ఇసుజు వీ-క్రాస్, నిస్సాన్ జీటీ-ఆర్ వంటి కార్లు కూడా ఉన్నాయి. జాన్ అబ్రహం తన బాంద్రా నివాసం చుట్టూ బైకులు రైడ్ చేస్తూ చాలాసార్లు కనిపించారు. అంతే కాకుండా జాన్ అబ్రహం ఏప్రిలియా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఇందులో భాగంగా ఈయన ఏప్రిలియా ఆర్ఎస్457 బైక్ కూడా కొనుగోలు చేశారు. గతంలో జాన్ అబ్రహం జపాన్ బ్రాండ్ యమహా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించారు.

Don’t Miss: పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!

1972 జనవరి 17న జన్మించిన జాన్ అబ్రహం నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పటికే నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా అబ్రహం 2017 నుంచి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నారు. ప్రారంభంలో ఈయన మోడలింగ్ కెరీర్ ప్రారంభించిన తరువాత 2003 జిస్మ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు.

వచ్చేసింది కొత్త ‘హీరో గ్లామర్ 125’ బైక్.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ ఆప్షన్ గురూ!!

0

2024 Hero Glamour 125 Launched in India: దేశీయ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూల ఏదో ఓ వాహనం లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో సరసమైన వాహనాలు మాత్రమే కాకుండా ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనికి దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్స్ వంటి కంపెనీలు ఈ విభాగంలో బైకులను లాంచ్ చేస్తూ ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) అప్డేటెడ్ గ్లామర్ 125 బైక్ లాంచ్ చేసింది.

రేటు (Price)

భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 2024 గ్లామర్ 125 (2024 Glamour 125) లాంచ్ చేసింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ బ్రేక్ వేరియంట్ (రూ. 83598), రెండు డిస్క్ బ్రేక్ వేరియంట్ (రూ. 87598) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్.

కలర్ ఆప్షన్స్ (Colour Options)

కొత్త 2024 హీరో గ్లామర్ 125 కమ్యూటర్ బైక్ ఇప్పుడు కొత్త బ్లాక్ మెటాలిక్ సిల్వర్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. అయితే ఈ కలర్ బైక్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ – బ్లాక్, స్పోర్ట్ రెడ్ బ్లాక్ వంటి పెయింట్ స్కీమ్ కలిగిన బైకుల ధర కంటే రూ. 1000 ఎక్కువ ఖరీదైనది.

డిజైన్ (Design)

2024 హీరో గ్లామర్ 125 బైక్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ బైకు మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది కొత్త కలర్ ఆప్షన్ పొందింది కాబట్టి ఫ్రంట్ కౌల్, ఫ్యూయెల్ ట్యాంక్ మీద చెక్డ్ గ్రాఫిక్స్ డిజైన్ పొందుతుంది. కాబట్టి చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇక ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు గ్రాబ్ రెయిల్ అన్నీ కూడా సాధారణ మోడల్ మాదిరిగానే ఉన్నాయి.

ఫీచర్స్ (Features)

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో స్టాండర్డ్ బైకులోని అదే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు.. హీరో మోటోకార్ప్ యొక్క ఐ3ఎస్ సిస్టం ఉంటాయి. ఈ సిస్టం (i3S) వల్ల బైక్ స్థిరంగా ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. తద్వారా ఇంధనం (ఫ్యూయెల్) ఆదా అవుతుంది. తద్వారా రైడర్ ఇంకొంత ఎక్కువ మైలేజ్ పొందవచ్చు.

ఇంజిన్ (Engine)

2024 హీరో గ్లామర్ బైక్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో అదే 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 10.3 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 10.4 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరులో కూడా ఎటువంటి మార్పు లేదు.

సస్పెన్షన్ & బ్రేకింగ్ సిస్టం (Suspension & Braking System)

కొత్త హీరో గ్లామర్ 125 బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. అయితే డిస్క్ వేరియంట్ మాత్రం ముందు భాగంలో డిస్క్ బ్రేక్ పొందుతుంది. కాబట్టి రైడింగ్ సమయంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Don’t Miss: భారత్‌లో లాంచ్ అయిన ‘ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్’ ఇదే.. ధర ఎంతో తెలుసా?

హీరో గ్లామర్ 125 మైలేజ్ (Hero Glamour 125 Mileage)

కొత్త హీరో గ్లామర్ 125 బైక్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే.. ఇది 55 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. హీరో మోటకార్ప్ లాంచ్ చేసిన ఈ బైక్ కేవలం అప్డేటెడ్ వెర్షన్ మాత్రమే. అంటే ఇప్పటికే ఈ బైక్ దేశీయ విఫణిలో గొప్ప అమ్మకాలను పొందుతుతూ ఎంతో మంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధించింది. 2024 గ్లామర్ 125 బైక్ కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

భారత్‌లో లాంచ్ అయిన ‘ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్’ ఇదే.. ధర ఎంతో తెలుసా?

0

Audi Q8 Facelift Launched in India: జర్మన్ బ్రాండ్ అయినప్పటికీ దేశీయ విఫణిలో ఆడి కార్లకు మంచి డిమాండ్ ఉంది. చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కార్లను కొనుగోవులు చేయడానికి తెగ ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆడి ఇండియా క్యూ8 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు అప్డేటెడ్ మోడల్.

ధర

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్’ (Audi Q8 Facelift) ప్రారంభ ధర రూ. 1.17 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది అప్డేటెడ్ మోడల్ కాబట్టి దాని మునుపటి మోడల్స్ కంటే కొంత తక్కువ ధర వద్ద లభిస్తుంది. ఆడి క్యూ8 స్టాండర్డ్ మోడల్ ధర రూ. 1.43 కోట్లు, సెలబ్రేషన్ వేరియంట్ ధర రూ. 1.07 కోట్లు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

డిజైన్

ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ అనేది అప్డేటెడ్ మోడల్. కాబట్టి చిన్నపాటి కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కానీ యాంత్రికంగా ఎటువంటి మార్పు చెందదు. అంటే క్యూ 8 స్టాండర్డ్ మోడల్ యొక్క అదే ఇంజిన్ పొందుతుందని స్పష్టమవుతోంది. ఇందులో చెప్పుకోదగ్గ అతిపెద్ద మార్పు ఏమిటంటే.. హై బీమ్ మరియు కాన్ఫిగర్ చేయదగిన హెచ్డీ మాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్. అంతే కాకుండా బంపర్‌లోని ఎయిర్ ఇన్‌టేక్‌లు కూడా రీడిజైన్ చేయబడి ఉండటం గమనించవచ్చు. రియర్ ఫ్రొపైల్ పెద్దగా మారలేదు.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

ఎక్స్టీరియర్ డిజైన్ మాదిరిగానే.. ఇంటీరియర్ డిజైన్ కూడా చెప్పుకోదగ్గ అప్డేట్స్ పొందలేదు. కాబట్టి ఇంటీరియర్ డిజైన్ స్టాండర్డ్ మోడల్‌కు సమానంగా ఉంటుంది. అదే అపోల్స్ట్రే, కలర్ స్కీమ్ స్టిచ్చింగ్ కూడా చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్‌లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, హీట్ అండ్ వెంటిలేషన్ మసాజ్ సీట్లు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఈ కారులో ఉంటాయని స్పష్టమవుతోంది.

ఇంజిన్

మొదట్లో చెప్పుకున్న విధంగా ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ అనేది స్టాండర్డ్ మోడల్ యొక్క అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ 340 హార్స్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పవర్ అనేది నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.

ప్రత్యర్థులు

ఆడి కంపెనీ లాంచ్ చేసిన కొత్త క్యూ8 ఫేస్‌లిఫ్ట్ మోడల్ దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మరియు బీఎండబ్ల్యు ఎక్స్5 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము.

ఆడి కార్లకు ఎందుకంత డిమాండ్

భారతదేశంలో లగ్జరీ కార్ల విభాగంలో చెప్పుకోదగ్గ బ్రాండ్లలో ఒకటి ఆడి. ఆడి కార్లు చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగి, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా అత్యుత్తమ పనితీరును అందిస్తూ.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతాయి. అయితే ఈ బ్రాండ్ కార్ల ధరలు అధికంగా ఉండటం వల్ల వీటిని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు వంటి వారు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

Don’t Miss: కొత్త జుపీటర్ 110 స్కూటర్: రూ. 74 వేలు మాత్రమే & ఫిదా చేసే ఫీచర్స్

ప్రస్తుతం ఆడి కంపెనీ కేవలం ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లను కూడా భారతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని కార్లను లాంచ్ చేసిన విక్రయించే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. మొత్తం మీద ఆడి కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉందనేది మాత్రం అందరికీ తెలిసిన విషయం.

కొత్త జుపీటర్ 110 స్కూటర్: రూ. 74 వేలు మాత్రమే & ఫిదా చేసే ఫీచర్స్

0

TVS Jupiter 110 Launched in India: ఆధునిక భారతదేశంలో కొత్త వాహనాలను డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) కంపెనీ తాజాగా సరికొత్త ‘జుపీటర్ 110’ (Jupiter 110) స్కూటర్ లాంచ్ చేసింది. 2013 నుంచి అత్యధిక అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తున్న టీవీఎస్ జుపీటర్ ఇండియాలో అత్యధిక అమ్మకాలు పొందిన రెండవ స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా కంపెనీ దీనిని జుపీటర్ 110 పేరుతో లాంచ్ చేసింది. ఇది చూడటానికి కొంతవరకు స్టాండర్డ్ జుపీటర్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు.

ధరలు (Price)

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ ప్రారంభ ధర రూ. 73700 (ఎక్స్ షోరూమ్). కంపెనీ తన జుపీటర్ స్కూటర్ లాంచ్ చేసిన సుమారు 11 సంవత్సరాల తరువాత ఈ జుపీటర్ 110 లాంచ్ చేసింది. ఇది దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే తక్కువ ధర, అధిక ఫీచర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం.

వేరియంట్స్ (Variants)

కొత్త టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టీల్ వీల్స్‌తో కూడిన డ్రమ్ బ్రేక్ (రూ. 73700), అల్లాయ్ వీల్స్‌తో కూడిన డ్రమ్ బ్రేక్ (రూ. 79200), స్మార్ట్‌ఎక్స్‌నెక్ట్ యాప్ ఇంటిగ్రేషన్‌తో కూడిన డ్రమ్ బ్రేక్ (రూ. 83250), ఒక స్మార్ట్‌ఎక్స్‌నెక్ట్ ఇంటిగ్రేషన్‌తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెర్షన్ (రూ. 87250) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ.

డిజైన్ (Design)

ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే 2024 టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ దాని స్టాండర్డ్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో ఇన్ఫినిటీ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఆఫ్రాన్ కూడా కొంత పెద్దదిగా ఉండటం చూడవచ్చు. ఇండీగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా డీఆర్ఎల్ డిజైన్ మాదిరిగా ఉంటుంది.

డైమెన్షన్స్ లేదా కొలతలు (Dimensions)

కొత్త జుపీటర్ 110 దాని మునుపటి మోడల్ కంటే కూడా పొడవుగా ఉంటుంది. వీల్‌బేస్ మునుపటి మాదిరిగానే 1275 మిమీ వద్ద ఉంటుంది. సీటు ఎత్తు 770 మిమీ మాత్రమే. గ్రౌండ్ క్లియరెన్స్ 163 మిమీ, ఈ స్కూటర్ మొత్తం బరువు (కర్బ్) 105 కేజీలు మాత్రమే. అంటే ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా తేలికగా ఉంటుంది.

2024 జుపీటర్ 110 స్కూటర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ ఇప్పుడు ఫ్లోర్‌బోర్డ్‌లో ఉంది. ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ ముందు భాగంలో ఉంటుంది, అయితే ఇది స్టాండర్డ్ స్కూటర్ కంటే చిన్నదిగా ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ 33 లీటర్ల వరకు ఉంటుంది. సీటు కూడా కొంత పొడవుగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

టీవీఎస్ జుపీటర్ యొక్క 110 స్కూటర్ ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది హై స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఎంట్రీ లెవెల్ మోడల్స్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతాయి. కలర్ ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ క్లస్టర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు మ్యాప్ మై ఇండియా బేస్డ్ టర్న్ బై టర్న్ న్యావిగేషన్ ఉంటాయి. వీటితో పాటి టాప్ వేరియంట్ స్మార్ట్‌ఎక్స్‌నెక్ట్ మొబైల్ యాప్ ద్వారా ‘ఫైండ్ మీ’ ఫంక్షన్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

ఇంజిన్ (Engine)

ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఇంజిన్.. టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ 109.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 9.2 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ఇంటిగ్రేటెడ్ స్టార్ – స్టాప్ సిస్టం పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ అనేది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.

Don’t Miss: కార్ల వినియోగంలో కూడా మెగాస్టారే.. చిరంజీవి గ్యారేజిలోని కార్లు చూశారా?

టీవీఎస్ కొత్త జుపీటర్ 110 స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు మోనోషాక్ సెటప్ పొందుతుంది. టాప్ వేరియంట్ 220 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. కానీ మిగిలిన అన్ని వేరియంట్లు డ్రమ్ రియర్ బ్రేక్ పొందుతాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఆఫర్‌లో లేదు. ఇది 12 ఇంచెస్ వీల్స్ మరియు 90/90 సెక్షన్ టైర్స్ పొందుతుంది.

ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం: ఇదిగో టాప్ 5 బెస్ట్ సైకిల్స్

0

Best Affordable Cycles Under Rs.10000 in India: ఆధునిక కాలంలో కార్లు మరియు బైకులను మాత్రమే కాకుండా ‘సైకిల్స్’కు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణం ఆరోగ్యం మీద శ్రద్ద చూపడమనే తెలుస్తోంది. మెకానికల్ లైఫ్ గడిపేస్తున్న చాలామంది సైక్లింగ్ ద్వారా కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సైకిల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు మార్కెట్లో ఖరీదైన సైకిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఎన్నెన్ని లేటెస్ట్ సైకిల్స్ మార్కెట్లో లాంచ్ అయినా.. తక్కువ ధర వద్ద లభించే వాటిని కొనుగోలు చేయడానికే చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10వేలు కంటే తక్కువ ధర వద్ద మార్కెట్లో లభిస్తున్న ఉత్తమ సైకిల్స్ గురించి తెలుసుకుందాం.

అర్బన్ టెర్రైన్ మల్టీస్పీడ్ సైకిల్

రూ. 7499 ధర వద్ద లభించే ఈ అర్బన్ టెర్రైన్ మల్టీస్పీడ్ సైకిల్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది హై పర్ఫామెన్స్ సైకిల్. మంచి ఫ్రేమ్, షార్ప్ బ్రేక్స్ కలిగి పట్టణ ప్రయాణానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సైకిల్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కొత్తగా సైకిల్ నేర్చుకునేవారికి మాత్రమే కాకుండా.. సైక్లింగ్ చేసేవారికి కూడా ఇది ఉత్తమ ఎంపిక.

అర్బన్ టెర్రైన్ బోల్ట్ సైకిల్

రూ. 6500 వద్ద లభించే ఈ సైకిల్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ లేదా సైకిల్ అడ్వెంచర్ చేయాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. హై పర్ఫామెన్స్ కలిగిన ఈ సైకిల్ రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. మంచి ఫ్రేమ్ సెటప్ కలిగి, ఉత్తమ బ్రేకింగ్ సిస్టం పొందిన ఈ సైకిల్ డిజైన్ పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ ధరలో ఓ మంచి సైకిల్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

లీడర్ బీస్ట్ 26టీ మౌంటైన్ సైకిల్

నిజానికి లీడర్ బెస్ట్ 26టీ మౌంటైన్ సైకిల్ అనేది ప్రత్యేకించి పురుషుల కోసం రూపొందించబడిన మోడల్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 8150 అని తెలుస్తోంది. దృఢమైన ఫ్రేమ్ మరియు మంచి యాక్ససరీస్ కలిగిన ఈ సైకిల్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ కలిగిన లీడర్ బీస్ట్ సైకిల్ సౌకర్యవంతమైన రైడింగ్ అందిస్తుంది. పర్వత మార్గాల వంటి కఠినమైన భూభాగాల్లో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

అర్బన్ టెర్రైన్ బోల్ట్ స్టీల్ సైకిల్

రూ. 6699 వద్ద లభించే అర్బన్ టెర్రైన్ బోల్ట్ స్టీల్ సైకిల్ మంచి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. రోజు వారీ వినియోగానికి / పట్టణ వినియోగానికి లేదా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఈ సైకిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీక్ ఎండ్ సమయంలో అడ్వెంచర్ వంటివి చేయడానికి కూడా ఈ సైకిల్ పనికొస్తుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్ కలిగిన ఈ సైకిల్ కఠినమైన భూభాగాల్లో కూడా సజావుగా ముందుకు సాగుతుంది. మన్నికైన ఫ్రేమ్ మరియు స్మూత్ రైడ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

Don’t Miss: పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!

అర్బన్ టెర్రైన్ యూటీ1000ఎస్26 సైకిల్

మన జాబితాలో రూ. 10000 కంటే తక్కువ ధర వద్ద లభించే మరో బెస్ట్ సైకిల్ ఈ ‘అర్బన్ టెర్రైన్ యూటీ1000ఎస్26 సైకిల్’. దీని ధర రూ. 9499 మాత్రమే. అడ్జస్టబుల్ సస్పెన్షన్, మన్నికైన ఫ్రేమ్, స్మూత్ రైడింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ సైకిల్ సులభంగా రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లి సైకిల్. ఇది కూడా రోజువారీ వినియోగానికి లేదా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

Note: పైన వెల్లడించిన ఐదు సైకిల్స్ ధరలు కేవలం సూచన ప్రాయం మాత్రమే. నగరాన్ని బట్టి లేదా డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పు ఏర్పడవచ్చు. అంటే ధరలు తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. కాబట్టి ఈ సైకిల్ కొనాలనుకునే వారు సమీపంలోని షోరూమ్స్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లను సందర్సించి ఖచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!

0

Top 5 Cars Under Rs.10 Lakh in Indian Market: పండుగ సీజన్ వచ్చేస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారు ఈ తరుణం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. వర్షాకాలంలో పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లా కార్లు, బైకులు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఎన్ని కార్లు, ఎన్ని బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టయినా.. సరసమైన కార్లను కొనుగోలు చేయడానికే చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే అత్యుత్తమ కార్లు గురించి వివరంగా తెలుసుకుందాం..

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)

ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్శించడానికి ఆధునిక వాహనాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ గత ఏడాది ఎక్స్‌టర్ కారును లాంచ్ చేసింది. ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. ఆధునిక కాలంలో వాహనదారులు వినియోగానికి కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.

దేశీయ విఫణిలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో హ్యుందాయ్ యొక్క ఎక్స్‌టర్ కూడా చెప్పుకోదగ్గ మోడల్. దీని ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధరలు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్ వంటి వాటికి లోనై ఉంటాయి. కాబట్టి నగరాన్ని బట్టి కూడా ధరలలో మార్పు ఉంటుంది. ఎక్స్‌టర్ కారు అత్యాధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఎక్స్‌టర్ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ కూడా పొందుతుంది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.23 లక్షలు (ఎక్స్ షోరూమ్).

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

భారతదేశంలో హ్యుందాయ్ అంటే అందరికీ గుర్తొచ్చే కారు వెన్యూ. దీన్ని బట్టి మార్కెట్లో ఈ కారుకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడగానే ఆకర్షించబడే డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 9.36 లక్షలు (ఎక్స్ షోరూమ్).

హ్యుందాయ్ వెన్యూ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ వేరియంట్ ధరలు రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అనేది నేడు ఎక్కువమంది కోరుకునే ఫీచర్. కాబట్టి కంపెనీ ఈ ఫీచర్ కూడా వెన్యూ కారులో అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వెన్యూ లైనప్ ఎస్ ప్లస్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.

టాటా పంచ్ (Tata Punch)

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు టాటా మోటార్స్ యొక్క పంచ్, ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను పొందుతోంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ ఫ్యూయెల్ మోడల్ మాత్రమే కాకుండా CNG మరియు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా అత్యద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇవి వాహన వినియోగదారుల యొక్క భద్రతకు పెద్దపీట వేస్తాయి.

దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 6.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ వేరియంట్ ధర రూ. 8.34 లక్షలు 9ఎక్స్ షోరూమ్). ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందాలనుకునే కస్టమర్లకు టాటా పంచ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది 5 స్టార్ రేటింగ్ కటింగ్ ఉత్తమ కారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)

గత కొన్ని రోజులకు ముందు మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా పొందుతుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలామంది వాహన తయారీదారులు తమ కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తున్నాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే ఈ కారు ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.

Don’t Miss: కార్ల వినియోగంలో కూడా మెగాస్టారే.. చిరంజీవి గ్యారేజిలోని కార్లు చూశారా?

కియా సోనెట్ (Kia Sonet)

సౌత్ కొరియా బ్రాండ్ అయినప్పటికీ.. కియా మోటార్స్ దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటి నుంచి, ఇప్పటి వరకు ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచుకోవడంలో సక్సెస్ సాధించింది. కియా మోటార్ యొక్క సోనెట్ కారు రూ. 8.19 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే సరసమైన మరియు అత్యుత్తమ కారు. ఇటీవలే కంపెనీ సోనెట్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ పరిచయం చేసింది.