EPFO auto settlement: ఉద్యోగులకు శుభవార్త.. EPFO ఆటోమేటిక్‌ సెటిల్!

EPFO auto settlement: భారతదేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఏళ్లుగా వాడకంలో లేని ఇనాక్టివ్ PF ఖాతాల్లోని నగదును ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే ‘EPFO Auto-Settlement’ విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండానే వారి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులు ఉద్యోగ మార్పులు లేదా ఇతర కారణాల […]

EPFO auto settlement: భారతదేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఏళ్లుగా వాడకంలో లేని ఇనాక్టివ్ PF ఖాతాల్లోని నగదును ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే ‘EPFO Auto-Settlement’ విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండానే వారి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.

దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులు ఉద్యోగ మార్పులు లేదా ఇతర కారణాల వల్ల తమ PF ఖాతాలను వాడకుండా వదిలేస్తున్నారు. ఇలాంటి ఖాతాలు సంవత్సరాల పాటు మూతపడిపోవడంతో అందులో ఉన్న డబ్బులు క్లెయిమ్ కాకుండా మిగిలిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు EPFO Auto-Settlement విధానాన్ని తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా తమ PF ఖాతాలను మర్చిపోయిన లేదా క్లెయిమ్ చేయలేకపోయిన వారికి EPFO Auto-Settlement పెద్ద ఊరటగా మారనుంది. దీనివల్ల ఖాతాదారులు ఎలాంటి అప్లికేషన్ ప్రక్రియ లేకుండా తమ డబ్బును పొందే అవకాశం ఉంటుంది.

ఇనాక్టివ్ PF ఖాతాలపై దృష్టి

ప్రస్తుతం భారతదేశంలో సుమారు 31 లక్షల ఇనాక్టివ్ PF ఖాతాలు ఉన్నట్లు EPFO అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో దాదాపు రూ.10,181 కోట్ల నిధులు క్లెయిమ్ చేయకుండా ఉన్నట్లు సమాచారం. వీటిలో చాలా ఖాతాలు 10 నుంచి 20 సంవత్సరాల మధ్యకాలంగా వాడకంలో లేవు.

నివేదికల ప్రకారం, ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకపోతే ఆ ఖాతాను ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాల్లో వడ్డీ కూడా ఆగిపోతుంది. దీంతో డబ్బు అలాగే నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో EPFO Auto-Settlement విధానం ద్వారా ఇలాంటి ఖాతాలను ప్రాసెస్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

తొలి దశలో భారీ ప్రాసెసింగ్

EPFO ప్రణాళిక ప్రకారం.. తొలి దశలో ఆధార్ వెరిఫై అయిన సుమారు 8 లక్షల ఇనాక్టివ్ ఖాతాలను ప్రాసెస్ చేయనున్నారు. ఈ ఖాతాల్లో దాదాపు రూ.5,200 కోట్ల నిధులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో సుమారు 14 వేల ఖాతాల్లో రూ.5 లక్షలకుపైగా బ్యాలెన్స్ ఉంది. 38 వేల ఖాతాల్లో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య డబ్బు ఉంది ఈ మొత్తాన్ని EPFO Auto-Settlement ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అధికారుల ప్రకారం.. “ఈ విధానం అమల్లోకి వస్తే ఖాతాదారులు ఎలాంటి క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆధార్ లింక్ ఉన్న ఖాతాల్లోకి డబ్బు నేరుగా జమ అవుతుంది” అని తెలిపారు.

ఇప్పటికే అమల్లో ఉన్న చర్యలు

ఇప్పటికే రూ.1,000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. తాజా EPFO Auto-Settlement ప్రతిపాదన దీనికి కొనసాగింపుగా భావిస్తున్నారు.

అయితే.. ఈ కొత్త విధానంపై EPFO నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అధికారికంగా అమలులోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్యతో పాత PF ఖాతాల్లో నిలిచిపోయిన డబ్బు వినియోగదారులకు చేరడంతో పాటు వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.

Also read:PAN Card New Rules 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!.. PAN కార్డు కోసం అప్లై చేయాలంటే..

Giribabu
Giribabu
గిరిబాబు - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, బిజినెస్, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles