Home Blog Page 868

నారా లోకేష్‌కు అరుదైన గౌరవం: నరేంద్ర మోదీ తరువాత..

0

ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కార్ సారథ్యంలో అభివృద్ధి మార్గం వైపు నడుస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన రీతిలో పరిపాలన చేస్తుంటే.. ఐటీ మినిస్టర్ ‘నారా లోకేష్’ కూడా కేంద్రమంత్రులను కలుసుకోవడం.. ప్రజల క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలనీ, కావలసిన నిధులను విడుదల చేసి.. రాష్ట్రాభివృద్ధిలో మాకు తోడుగా ఉండాలని చెబుతున్నారు. ప్రజాపాలనలో పాలు పంచుకుంటున్న నారా లోకేష్‌ను తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది.

ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం

విద్యారంగంలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి.. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ (హెచ్ఆర్డీ) అండ్ ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మంత్రి నారా లోకేష్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ‘స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్’ (SVP)లో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమీషన్ ఫిలిప్ గ్రీన్.. మంత్రికి ఆహ్వాన లేఖను అధికారికంగా పంపించారు.

ఆంధ్రప్రదేశ్.. మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థిక రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని.. దీనిని ఆస్ట్రేలియా ప్రభుత్వం అభినందిస్తూ.. అక్కడి జరగబోయే ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరు కావాలని కోరింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ కార్యక్రమానికి గత 20 సంవత్సరాలుగా.. అనేకమంది భారతదేశంలోని రాజకీయ నాయకులు హాజరయ్యారు. 2001లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కార్యక్రమానికి.. ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, విద్యా నిపుణులు హాజరవుతారు. కాబట్టి నారా లోకేష్ వీరందరిని కలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు.. ఇతర మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన చర్చలు కూడా సులభతరం అవుతాయని తెలుస్తోంది.

ఇప్పటికే లోకేష్ పాల్గొన్న విదేశీ కార్యక్రమాలు

నిజానికి నారా లోకేష్ ఇప్పటికే చాలా విదేశీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2018లో చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ కార్యక్రమంలో భారత ప్రతినిధిగా ఆహ్వానం పొందారు. 2024 అక్టోబర్ 25 నుంచి.. సుమారు ఒక వారం రోజులు అమెరికాలో పర్యటించి.. మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, యాపిల్, గూగుల్ మొదలైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2025 జనవరిలో డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సంస్థల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో జరగబోయే కార్యక్రమానికి హాజరవుతారు.

నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ఇలా..

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ (ఎంబీఏ) పూర్తి చేసిన నారా లోకేష్.. 2009 తరువాత తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వ్యూహాలను రూపొందించి.. యువతను ఆకట్టుకున్న ఈయన 2013లో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో ఎంఎల్సీగా నియమితులయ్యారు. అదే ఏడాదిలో ఏపీ ఐటీ మంత్రిగా కేకల బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలైనప్పటికీ.. 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి.. రాష్ట్రాభివృద్ధికి తనదైన రీతిలో కృషి చేస్తూనే ముందుకు సాగుతున్నారు.

2025లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ – ఇదిగో జాబితా..

0

సౌత్ ఇండియా సినీ పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఏడాదికి వందలాది సినిమాలను రిలీజ్ చేస్తూ.. కొత్త హీరోలను, హీరోయిన్లను పరిచయం చేస్తోంది. అయితే చాలామంది మదిలో మెదిలే ఓ ప్రశ్న.. 2025లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి ఎవరు?, తరువాత జాబితాలో ఎవరున్నారు అనే. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం..

మొదటి స్థానంలో..

సౌత్ ఇండియా సినిమా ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ‘సాయి పల్లవి‘ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో నటించిన తండేల్ సినిమాకు ఈమె రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ. 3కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఖచ్చితంగా చెప్పలేము. కాగా రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న.. నితేశ్ కుమార్ రామాయణ త్రయం (మూడు సినిమాలు) కోసం ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెండో స్థానంలో..

ఇక రెండో స్థానంలో నేషనల్ క్రష్, పుష్ప నటి రష్మిక మందన్న ఉన్నారు. ఈమె పుష్ప 2 సినిమాకు పారితోషికంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు టాక్. చావా సినిమాకు రూ. 4కోట్లు, సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాకు రూ. 12 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు చెబుతారు.

మూడో స్థానంలో..

మన జాబితాలో మూడో స్థానంలో.. నయనతార ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో.. నయనతార కూడా ఉన్నారు. 2018లో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ జాబితాలో ఈమె కూడా చోటు దక్కించుకుంది. నయనతార ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 12 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం.

నాలుగో స్థానంలో..

దక్షిణాది హీరోయిన్లలో చెప్పుకోదగ్గ వ్యక్తి త్రిష. తరగని అందంతో.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళం సినిమాల్లో నటిస్తుంది. ఈమె కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే కథానాయకిల జాబితాలో ఒకరుగా ఉన్నారు. త్రిష ఒక్కో సినిమాకు.. రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా విశ్వంభర సినిమా కోసం ఈమె రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

ఐదో స్థానంలో..

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ పేరును సొంతం చేసుకున్న స్వీటీ (అనుష్క శెట్టి).. కూడా ఎక్కువ పారితోషికం తీసుకునే వారిలో ఐదో స్థానంలో ఉంది. అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు.. రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు పారితోషికం తీసుకుంటుందని చెబుతారు.

ఆరో స్థానంలో..

ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో మిల్కి బ్యూటీ తమన్నా కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా.. స్పెషల్ సాంగ్‌లలో కూడా కనిపించే ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది. ఈమె సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సైమా అవార్డులు, కలైమామణి అవార్డు వంటి అనేక అవార్డులను సొంతం చేసుకుంది.

ఏడేళ్ల తరువాత చైనాలో అడుగుపెట్టిన మోదీ.. జపాన్ పర్యటన హైలెట్స్ ఇవే!

0

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలను ప్రకటించిన సంగతి అందరికి తెలుసు. మిత్ర దేశంగా ఉన్న యూఎస్ఏ.. ప్రస్తుతం ఇండియాపై ప్రతీకార సుంకాలను విధించి చోద్యం చూస్తోంది. ఈ తరుణంలో భారత్ ఏ మాత్రం తలదించకుండా.. అమెరికాకు గట్టి సమాధానం ఇస్తోంది. జపాన్, చైనా దేశాలతో సత్సంబంధాలను కలుపుకోవడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కదిలి వెళ్లారు.

మోదీ జపాన్ పర్యటన

అమెరికా ప్రతీకార సుంకాలను ప్రవేశపెట్టిన తరువాత.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 29, 30వ తేదీలలో జపాన్ పర్యటన చేశారు. రెండు రోజుల ఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సమయంలో మోదీ.. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాకు ప్రత్యేకమైన రాతితో తయారు చేసిన బౌల్ గిఫ్ట్ ఇచ్చారు. చిన్న బౌల్ మాత్రమే కాకుండా నాలుగు చిన్న బౌల్స్.. జపాన్ సంప్రదాయంతో తినడానికి ఉపయోగించే రెండు చిన్న స్టిక్స్ ఉన్నాయి. ఈ స్టిక్స్ చివర వెండి కవచం ఉంది.

జపాన్ ప్రధాని భార్య ‘యోషికో ఇషిబా‘కు కాశ్మిరీ శాలువను బహూకరించారు. నాణ్యమైన ఉన్నితో తయారు చేసిన ఈ శాలువాను ఒకప్పుడు కాశ్మీరీ రాజులూ చాలా ఇష్టంగా ఉపయోగించేవారు. దీనిని కాశ్మిరీలు ప్రత్యేకంగా రూపొందించారు. తెల్లని అంచు కలిగిన ఈ శాలువా గులాబీ.. ఎరుపు రంగులతో చాలా సుందరంగా ఉంది.

నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తరువాత.. జపాన్ సందర్శించడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే మోదీ.. ప్రపంచంలోని చాలా దేశాలను చుట్టి వస్తుంటారు. ఈ సారి పర్యటన మాత్రం.. చాలా ప్రత్యేకం అని నిపుణులు చెబుతున్నారు.

చైనా పర్యటనలో మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనను ముగించుకుని.. చైనా పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 30న తియాంజిన్‌కు చేరుకున్న మోదీ.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న అక్కడ జరిగే శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు. సుమారు ఏడేళ్ల తరువాత మోదీ చైనాలో కాలుపెట్టారు. చైనా పర్యటన.. భారత ఆర్ధిక వృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.

ఊహకందని రీతిలో జీడీపీ వృద్ధి

2026 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ ఊహకందని రీతిలో ఏకంగా 7.8 శాతానికి ఎగబాకింది. ఇది దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. భారత ఆర్ధిక వ్యవస్థ నిర్జీవమైపోయింది అని.. మన దేశాన్ని కించపరిచిన ‘డొనాల్డ్ ట్రంప్’కు ఇది సరైన సమాధానం అని నిపుణులు చెబుతున్నారు.

2047 వికసిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆర్ధిక సంస్కరణలు చేస్తున్నారు. పరిశ్రమలకు కూడా చేయూతనిస్తున్నారు. ఇటీవల వెల్లడైన జీడీపీ.. అంతకుముందు జీడీపీ కంటే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. అనుకున్న సమయానికి వికసిత భారత్ తప్పకుండా సాధ్యమవుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి వ్యవసాయ పరిశ్రమ, ఆటోమొబైల్ పరిశ్రమలు చాలా దోహదపడ్డాయని తెలుస్తోంది.

ఇది డల్‌గా ఉండే మూమెంట్ కాదు.. చిన్న పిల్లలా చిందులేసిన సమంత

0

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల జాబితాలో నటి ‘సమంత‘ కూడా ఒకరు. ఆరోగ్యానికి సంబంధించిన లేదా ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా తాను పికిల్‌బాల్ అడుగుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఒక ఇండోర్ స్టేడియంలో సమంత పికిల్‌బాల్ గేమ్ అడుగుతూ.. చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఆటలో గెలుపొందిన తరువాత చిన్న పిల్లలా గెంతుతూ వెళ్తుంది. నటి సమంత చాలా సంతోషంగా ఉండటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ”పికిల్‌బాల్ ఆడుతున్నప్పుడు డల్‌గా ఉండకండి” అని సమంత వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో చాలామంది నెటిజన్లను ఆకట్టుకుంది. సమంత ఆనందంగా ఉండటం చూసి.. అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. చివర్లో డ్యాన్స్ మాత్రం చాలా క్యూట్ మేడం అని ఒకరు కామెంట్ చేస్తే.. మై సూపర్ ఛాంపియన్ సమంత అని ఇంకొకరు అన్నారు.

పికిల్‌బాల్ గేమ్ గురించి

చాలామందికి పికిల్‌బాల్ గేమ్ గురించి తెలుసుండకపోవచ్చు. ఇది సమంత ఫేవరెట్ గేమ్ కూడా. దీనికి ఇండియాలో పెద్దగా ఆదరణ లేదు. కానీ అమెరికాలో పికిల్‌బాల్ ఆడేవాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది.

పికిల్‌బాల్ గేమ్ విషయానికి వస్తే.. ఇది టేబుల్ టెన్నిస్, బ్యాట్మింటన్ మాదిరిగానే ఉంటుంది. తూట్లు పడిన ఒక బాల్‌ను చిన్న బ్యాట్‌తో కొడతారు. ఈ ఆటను ఇండోర్ లేదా అవుట్‌డోర్‌లలో ఎక్కడైనా ఆడుకోవచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు ఆడతారు. ఈ గేమ్​కు ప్రపంచంలోని చాలా దేశాల్లో పెద్ద టోర్నీలు జరుగుతున్నాయి.

ఆటకు పికిల్‌బాల్ అనే వచ్చింది

నిజానికి పికిల్‌బాల్ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పడానికి కొన్ని వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తన కుటుంబంతో కలిసి ఈ గేమ్ ఆడారట, ఈ ఆట గురించి ఆయన భార్య జోన్, ఒక సందర్భంలో మాట్లాడుతూ.. రోయింగ్‌లో పికిల్‌బాల్ ఎలా ఉంటుందో.. ఆట కూడా ఆలా ఉంటుందని అన్నారు. ఈ కారణంగానే ఆటకు పికిల్‌బాల్ అని పేరొచ్చిందని చెబుతారు.

ప్రిట్చర్డ్ అనే వ్యక్తికి పికిల్స్ అనే పేరు కలిగిన పెంపుడు శునకం ఉండేది. తన యజమాని ఆట ఆడుకుంటున్నప్పుడు, బాల్ అందిస్తూ ఉండేది. ఈ శునకం పేరునే.. ఆ తరువాత పికిల్‌బాల్ ఆటకు పెట్టినట్లు కొందరు చెబుతారు. అయితే ఈ ఆటకు ఈ పేరు ఎలా వచ్చిందనే విషయం మీద మాత్రం ఎలాంటి ఖచ్చితమైన క్లారిటీ లేదు.

సమంత ఫిట్‌నెస్ గురించి

ప్రముఖ నటి సమంత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పాపులర్ సెలబ్రిటీలలో ఒకరైన ఈమె ఎప్పుడూ ఆరోగ్యం మీద శ్రద్ద తీసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ వ్యాయాయం వంటివి.. క్రమం తప్పకుండా చేస్తుంటారు. సరైన డైట్ పాటిస్తూ.. ఎప్పుడూ ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునే సమంత.. అప్పుడప్పుడు తనకు ఇష్టమైన పికిల్‌బాల్ గేమ్ కూడా ఆడుతుంటారు. నిజానికి పికిల్‌బాల్ గేమ్ ఒకటి ఉందని.. సమంత వల్లనే చాలామందికి తెలిసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

భారీ వర్షాలు: ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు.. పరీక్షలు రద్దు!

0

భాగ్యనగరాన్ని (హైదరాబాద్) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు స్తంభించిపోయాయి, ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం అయ్యాయి. రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం.. మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

స్కూళ్లకు సెలవు.. పరీక్షలు రద్దు

శుక్రవారం కూడా వర్షాలు పడుతున్న కారణంగా.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ, డీఈఓ ఉత్తర్వులు జారీ చేసారు. సెలవు కారణంగా.. కాకతీయ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలు.. మళ్ళీ ఎప్పుడు నిర్వహించనున్నారు అనే విషయాన్ని త్వరలోనే చెబుతారు. కాగా మిగిలిన పరీక్షలన్నీ కూడా యధావిధిగా జరుగుతాయి.

కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు మాత్రమే కాకుండా.. హైదరాబాద్ జేఎన్‌టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఈ రోజు, రేపు (శుక్ర, శనివారం) జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల తేదీలను సంబంధిత అధికారులు త్యరలోనే వెల్లడిస్తారు. వర్షాల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదని వర్సిటీ యాజమాన్యం పరీక్షలను వాయిదా వేసింది.

రానున్న 24 గంటల్లో వర్షాలు!

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వర్షం సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అవసరమైతే తప్పా.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటం మంచిది. వర్షం కారణంగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైతే.. ప్రయాణం కష్టమవుతుంది. కాబట్టి ప్రజలు వర్షం సమయంలో బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తోంది.

వర్షాలు ఇలాగే కొనసాగితే.. రేపు కూడా సెలవు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఈ రోజు, రేపు, ఎల్లుండి (శుక్ర, శని, ఆదివారం) బడికి సెలవు. ఆ తరువాత సోమవారం పాఠశాల యధావిధిగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా వెల్లడించల్సి ఉంది.

ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షం ఎక్కువైపోయింది. వర్షంలో ఆఫీసులకు వెళ్లాలన్నా, తిరిగి ఇళ్లకు రావాలన్నా.. ఉద్యోగులకు కష్టమవుతోంది. అయితే ఈ వర్షాలు ఇలాగె కొనసాగితే.. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ సదుపాయాన్ని కల్పించే అవకాశం ఉంది. నగరం నడిబొడ్డున వర్షపు నీరు ఎక్కువ కావడం వల్ల.. వాహనాలు కూడా అందులోనే కొట్టుకుపోతున్నాయి. ఇది వాహనదారులకు తీరని నష్టం కలిగిస్తోంది.

పొంగుతున్న చెరువులు

నగరంలో వర్షపాతం ఎక్కువవడంతో.. చెరువులన్నీ నిండుకుండలా మారిపోయాయి. మూసి నదీ నిండిపోయింది. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా నీటితో కళకళలాడుతోంది. వర్షం నగర వాసులకు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ.. రైతన్నకు మేలే చేస్తుంది. పంటలకు కావాల్సిన నీరు అందుబాటులో ఉంటుంది. నీటి కొరత లేకుండా పంటలు పండించుకోవచ్చు. తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాగా ప్రస్తుతం అన్నదాత యూరియా కొరతను ఎదుర్కొంటున్నాడు. దీనిని ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలి.

టీవీఎస్ కొత్త స్కూటర్ లాంచ్: ధర రూ.లక్ష కంటే తక్కువే

0

ఎంతోమంది వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరికొత్త మరియు సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఆర్బిటర్‘ను టీవీఎస్ మోటార్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ స్కూటర్ ధర, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్ ధర రూ. 99,900 (ఎక్స్ షోరూం, బెంగళూరు). ఇది మొత్తం ఆరు పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. అవి నియాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం మరియు మార్టిన్ కాపర్ కలర్స్. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల.. వినియోగదారుడు తనకు నచ్చిన కలర్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు.

డిజైన్ అండ్ ఫీచర్స్

చూడటానికి కొత్తగా కనిపించే కొత్త టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ఫ్లోయింగ్ లైన్లతో మినిమలిస్ట్ అండ్ బాక్సీ డిజైన్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద సైడ్ ప్యానెల్ ముందు అఫ్రాన్ వద్ద ప్రారంభమై వెనుకవైపుకు చిన్నదిగా విస్తరిస్తుంది. ముందు భాగంలో హ్యాండిల్‌బార్.. మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇది ఆప్రాన్ అంతటా రోబోక్యాప్ మాదిరిగా ఉండే ఎల్ఈడీ లైట్ స్ట్రిప్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇలాంటి డిజైన్ టీవీఎస్ జూపిటర్‌లో కనిపిస్తుంది.

టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజిని పొందుతుంది. ఇందులో సులభంగా రెండు హెల్మెట్‌లను ఉంచుకోవచ్చు. ఈ స్కూటర్ 290 మిమీ ప్లాట్ ఫ్లోర్‌బోర్డ్ కూడా పొందుతుంది. కాబట్టి రైడర్లకు ఇది రైడింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బ్యాటరీ అండ్ రేంజ్ వివరాలు

సరికొత్త టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 158 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఇది 120 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 68 కిమీ కావడం గమనార్హం. ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణానికి లేదా నగర ప్రయాణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ముందు భాగంలో 14 ఇంచెస్ వీల్, వెనుక 12 ఇంచెస్ వీల్ పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. టెక్ విషయానికి వస్తే.. ఈ లేటెస్ట్ స్కూటర్ యాప్ ద్వారా కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని పొందుతుంది. దీనిద్వారా టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్, యాంటీ థెఫ్ట్, క్రాష్ అండ్ జియో ఫెన్సింగ్ నోటిఫికేషన్ వంటివి తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్ ఎకో మరియు పవర్ మోడ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ కూడా పొందుతుంది. మొత్తం మీద కొంత తక్కువ ధరలో.. అత్యాధునిక ఫీచర్లతో టీవీఎస్ చెప్పినట్లే రూ. లక్ష కంటే తక్కువ ధరలోనే లాంచ్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న ‘ఏథర్ రిజ్టా‘కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

సంజయ్ దత్ కొత్త కారు చూశారా?.. ధర తెలిస్తే అవాక్కవ్వడం పక్కా!

0

భారతదేశంలోని మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకరైన ‘సంజయ్ దత్‘ గణేష్ చతుర్థి సందర్భంగా.. ఓ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ సంజయ్ దత్ కొన్న కారు ఏది?, దాని ధర ఎంత? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

సంజయ్ దత్ కొత్త కారు

నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేసిన కొత్త కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్. దీని ధర రూ. 3.39 కోట్లు (ఎక్స్ షోరూం). ఇది భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు అత్యాధునిక డిజైన్, సరికొత్త ఫీచర్స్ పొందుతుంది.

సంజయ్ దత్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు డ్యూయెల్ టోన్ కలర్ పెయింట్ స్కీమ్ పొందింది. ఇది అబ్సిడియన్ బ్లాక్ & రూబెల్లైట్ కలయికలో చాలా అద్భుతంగా ఉంది. ఈ స్పెషల్ పెయింట్ స్కీమ్ ధర రూ. 18.64 లక్షలు. దీన్నిబట్టి చూస్తే ఎంచుకునే రంగును బట్టి కారు ధర ఉంటుందని స్పష్టమవుతోంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ గురించి

కొత్త బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు వాహన వినియోగదారులకు కావలసిన అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రిక్లైనింగ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 27 స్పీకర్ సౌండ్ సిస్టం, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్.. 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడిన 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్, 730 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా హైబ్రిడ్ ఇంజిన్ 250 ఎన్ఎమ్ టార్క్, 22 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ రావరకు వేగవంతం అవుతుంది.

బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కలిగిన సెలబ్రిటీలు

ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారును కలిగిన సెలబ్రిటీల జాబితాలో.. రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, కృతి సనన్, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, శిల్పా శెట్టి, షాహిద్ కపూర్, రామ్ చరణ్, టాప్సీ పన్ను మొదలైనవారు ఉన్నారు.

సంజయ్ దత్ కార్ కలెక్షన్

నటుడు సంజయ్ దత్ ఇప్పటికే ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఫెరారీ 599 జీటీబీ, రేంజ్ రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, రోల్స్ రాయిస్ ఘోస్ట్ వంటి కార్లను కలిగి ఉన్నారు. ఇప్పుడు తాజాగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు ఈయన గ్యారేజిలో చేరింది.

సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే సంజయ్ దత్ ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు అత్యధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఎక్కువమంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

ఈ20 పెట్రోల్ మంచిదా.. కాదా!.. వాహనాల్లో సమస్యలు తప్పవా?

0

గత కొన్ని రోజులుగా ‘ఈ20 పెట్రోల్‘ (ఒక లీటరు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం) గురించి దేశం మొత్తం మీద చర్చలు మొదలయ్యాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని మంత్రులు చెబుతుంటే.. వాహనాలపై అవగాహన ఉన్న కొందరు ఇంజిన్ పనితీరు తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇంతకీ ఇందులో నిజమెంత?, ఇథనాల్ ఉపయోగిస్తే నిజంగానే ఇంజిన్ పనితీరు తగ్గిపోతుందా?, కేంద్రమంత్రులు ఎందుకు ఇథనాల్ ఉపయోగించాలని చెబుతున్నారు అనే విషయాలను కూలంకషంగా తెలుసుకుందాం.

ఇథనాల్

నిజానికి భారతదేశంలో పెట్రోల్ కొరత ఉంది. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఇథనాల్ అనేది.. సాధారణ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, కాలుష్య కారకాల శాతం కూడా తగ్గుతుంది. దీనిని పూర్తిగా మనదేశంలోనే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది.

ఇథనాల్ ఉపయోగంపై నితిన్ గడ్కరీ

నిజానికి వాహన రంగంలో కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తులలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒకరు. దీనికి నిదర్శనం ఆయన వినియోగానికి హైడ్రోజన్ కారును ఉపయోగించడమే. ఇప్పుడు దేశంలో ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించాలని చెబుతున్నారు. జపాన్ వంటి దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మనం కూడా ఇథనాల్ వాడకాన్ని పెంచితే.. పెట్రోల్ దిగుమతి కొంత తగ్గుతుంది. ఇది దేశాన్ని ఆర్థికంగా కూడా కొంత బలపరుస్తుందని గడ్కరీ చెబుతున్నారు.

ఇథనాల్ వినియోగం వల్ల ఇంజిన్ పనితీరులో సమస్యలు వస్తాయనే మాట పూర్తిగా అబద్దమని ఇటీవలే గడ్కరీ స్పష్టం చేసారు. ఇతర దేశాల్లో ఇథనాల్ ఉపయోగిస్తున్నారు. అక్కడ ఇంజిన్ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు రాలేదని అన్నారు. ఈ తప్పుడు ప్రచారాలను పెట్రోల్ లాబీలే చేస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ ఇంధనం ఇథనాల్ అని ఈయన స్పష్టం చేశారు. ఇది పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడుతుందని ఆయన అన్నారు.

ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందిలా..

భారతదేశంలో ఇథనాల్ వాడకం పెరిగితే.. ఇథనాల్ ఉత్పత్తి పెంచాలి. దీనిని మొలాసిస్ (చెరుకు పిప్పి), మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. కాబట్టి దీనివల్ల రైతులు లాభాలను గడించవచ్చు. ఇది వారి ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. ఇథనాల్ ఉపయోగం.. పెట్రోల్ దిగుమతి తగ్గిస్తుంది. దీని వల్ల దేశం కూడా ఆర్థికంగా ఓ అడుగు ముందుకు వేస్తుంది.

ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల నష్టమా?

భారతదేశంలో ఒకప్పుడు డీజిల్ కార్లు మాత్రమే ఉండేవి, ఆ తరువాత పెట్రోల్ కార్లు, ఇప్పుడు ఎలక్ట్రిక్.. సీఎన్‌జీ కార్లు ఉన్నాయి. అయితే గడ్కరీ.. ఒక లీటరు పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్.. మిగిలిన 20 శాతం ఇథనాల్ ఉపయోగించుకోవడం వల్ల సమస్య ఉండదని చెబుతున్నారు. ప్రస్తుతం పాత వాహనాలలో ఈ20 పెట్రోల్ ఉపయోగించి పరీక్షిస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన కొంతమంది.. వాహన రంగానికి చెందిన ఇంజినీర్లు సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఇథనాల్ ఉపయోగించడం వల్ల.. తక్షణం ప్రభావం కనిపించదు. కానీ భవిష్యత్తులో ఇంజిన్ భాగాలు దెబ్బతింటాయి. గ్యాస్కెట్లు, ఫ్యూయెల్ ఫిల్టర్స్, పైపులు కోతకు గురవుతాయని చెబుతున్నారు.

బాలీవుడ్‌కు గుడ్‌బై చెబుతున్నారా?: జానియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

0

తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్, కియారా అద్వానీలతో కలిసి ‘వార్ 2‘తో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ప్రారంభంలో ఈ సినిమా మంచి టాక్ పొందింది, కానీ ఆ తరువాత నెమ్మదించింది. కాగా ఈ మూవీ 10 రోజుల్లో రూ. 215 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్‌కు దూరంగా ఉండాలా అన్నట్లు ఆలోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు సినిమాలపై ఫోకస్

వార్ 2 సినిమా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుగు సినిమాల మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్‌తో మల్టి ఫిల్మ్ డీల్ ఒప్పందం మీద సంతకం చేసినట్లు.. అందులో ఒక సోలో ప్రాజెక్ట్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ తెలుగు సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల అది ఆగిపోయినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమాలపై ద్రుష్టి పెట్టడం వల్ల.. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2‘లో కనిపించనున్నారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ.. షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్‘ సినిమాలో కూడా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమాను చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఇది 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతుందని సమాచారం.

దేవర పార్ట్ 2

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’లో కనిపించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో దేవర పార్ట్ 2 సినిమా కోసం అంత సిద్ధమవుతోంది. అయితే ఈ పార్ట్ 2 సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలియాల్సి ఉంది.

బాలీవుడ్‌కు గుడ్‌బై చెబుతున్నాడా?

వార్ 2 సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే ఒప్పుకున్నా కొన్ని తెలుగు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ కారణంగానే బాలీవుడ్‌కు కొంత విరామం ఇచ్చే అవకాశం ఉంది. 2026 మొత్తం ఎన్టీఆర్ టాలీవుడ్ సినిమాలకే తన సమయాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

వైఆర్ఎఫ్ అధినేత ఆదిత్య చోప్రా.. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది షారుక్ ఖాన్ పఠాన్, సల్మాన్ ఖాన్ టైగర్ సినిమాల మాదిరిగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కూడా 2026 తరువాత వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్ర సీమలో ఎన్టీఆర్ ఓ మంచి క్రేజ్ తెచుకుంటున్నారు.

తెలంగాణాలో ఎరువుల సమస్య.. అప్రమత్తమైన చంద్రబాబు: అధికారులకు కీలక సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో యూరియా కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఈ సమస్య రాజకీయమైంపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. యూరియా కొరత ఏర్పడుతుందని మేము చెప్పామని బీఆర్ఎస్ చెబుతోంది. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లనే.. యూరియా సరఫరా చేయలేకపోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఢిల్లీలో కూడా వినిపించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు.

ఎరువులు పక్కదారి పడితే

రాష్ట్రంలో వ్యవసాయేతర పనులకు యూరియా విక్రయించకూడదని ఏపీ సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా ఎరువుల ధరలను పెంచి అమ్మినట్లయితే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల సరఫరాను తగ్గించాలని.. రైతులకు అందుబాటు ధరలో అందించడానికి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా విక్రయించాలని ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడటమే కాకుండా.. రైతులకు అందేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎరువుల లభ్యత, సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యతను తెలుసుకుంటూ ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు.

తెలంగాణాలో యూరియా సమస్యకు కారణం ఏంటి?

ఇటీవల కాలంలో తెలంగాణ రైతులు ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కోసం వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోతోంది. అసలే వర్షాకాలం, ఈ సమయంలో దాదాపు రైతులందరూ.. వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. పంట ఏపుగా రావాలంటే తప్పకుండా ఎరువులు అవసరం. దీంతో రైతులకు ఎరువుల అవసరం ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన స్థాయిలో ఎరువులను పంపించకపోవడం వల్లనే రైతులకు అవసరమైనంత ఎరువులను అందించలేకపోయినట్లు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. 2025 ఏప్రిల్ నుంచి కూడా ఎరువుల సరఫరా అంతంత మాత్రంగానే ఉందని, దీనికి సంబంధించిన గణాంకాలను కూడా వారు విడుదల చేశారు. మొతం 8.30 లక్షల టన్నుల ఎరువులు అవసరం అయితే.. ఇందులో కేంద్రం 5.12 లక్షల టన్నుల యూరియాను మాత్రమే పంపించినట్లు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

కేద్రం స్పందన

తెలంగాణాలో తలెత్తిన యూరియా సమస్యపై కేంద్రం స్పందించింది. కర్ణాటక నుంచి 10 వేల టన్నుల యూరియాను కొనుగోలు చేసి.. మొత్తం 50 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి పంపించే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం మీద త్వరలోనే తెలంగాణ రైతన్నల సమస్య తీరనుంది.

రైతు దేశానికి వెన్నెముక.. వారు పంట పండిస్తేనే, అందరికీ ఆహారం సరఫరా అవుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంది. వారి అవసరాలను ముందుగానే గ్రహించి, దానికి అవసరమైన ప్రణాళికలను ఏర్పాటు చేయాలి. లేకుంటే రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి.. ఒక రకంగా ప్రభుత్వమే కారణం అవుతుంది.