spot_img
Sunday, February 8, 2026
HomeAutomobileఇప్పటివరకు.. మీరెప్పుడూ చూడని స్కోడా కారు: దీని గురించి తెలుసా?

ఇప్పటివరకు.. మీరెప్పుడూ చూడని స్కోడా కారు: దీని గురించి తెలుసా?

-

ప్రపంచ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త టెక్నాలజీలతో సరికొత్త కార్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు లాంచ్ అవుతున్న కార్లు.. గతంలో విక్రయించబడిన కార్ల కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో.. చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఓ సరికొత్త కారు (విజన్ O ఎలక్ట్రిక్ కాన్సెప్ట్)ను ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్కోడా కార్ల కంటే భిన్నంగా ఉంది.

మొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్

స్కోడా తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును 2025 మ్యూనిచ్ మోటార్ షోలో ఆవిష్కరించింది. ఇది మోడ్రన్ సాలిడ్ డిజైన్ పొందుతుంది. భవిష్యత్తులో రాబోయే కార్లు ఇలాగే ఉంటాయేమో అని ఈ కారును చూడగానే ఓ ఆలోచన వచ్చేస్తుంది. ఈ కారు అప్డేటెడ్ ఆటోమేటెడ్ టెక్నాలజీని పొందుతుంది. చూడటానికి పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ కారు.. బ్రాండ్ యొక్క మొట్టమొదటి కాన్సెప్ట్ మోడల్. ఇది 1.2 మీటర్లు వెడల్పుతో హారిజన్ డిస్‌ప్లే పొందుతుంది.

ఎక్కువ స్టోరేజ్ స్పేస్

న్యాచురల్ హెచ్ఎమ్ఐ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. బయో అడాప్టివ్ లైటింగ్ పొందుతుంది. అంతే కాకుండా కస్టమర్ సెంట్రిక్ ఇంటీరియర్ కూడా పొందుతుంది. ఈ కారు ఏకంగా 650 కంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగి.. ఓ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్, ఇంటిగ్రేటెడ్ ఫ్రిజ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్ వంటివి కూడా పొందుతుంది.

విజన్ O ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును స్కోడా.. ఇప్పటికే ఐరోపా మార్కెట్లో అమ్ముడవుతున్న ఆక్టావియా, సూపర్బ్ కార్లకు వారసత్వంగా తీసుకొస్తోంది. ఈ కారు యొక్క ఇంటీరియర్ అక్రోమాటిక్ కలర్ స్కీమ్ పొందుతుంది. కారులోని సీటు కవర్లు 100 శాతం రీసైకిల్ చేసిన ఫాబ్రిక్‌లతోనే తయారయ్యాయి. ఇంటీరియర్ మెటీరియల్స్ కూడా రీసైక్లింగ్ చేయవచ్చు.

అటానమస్ డ్రైవింగ్

స్కోడా లాంచ్ చేయనున్న విజన్ O ఎలక్ట్రిక్ కాన్సెప్ట్.. అటానమస్ డ్రైవింగ్ కెపాసిటీ పొందుతుంది. కాబట్టి డ్రైవింగ్ వంటివి సొంతంగానే నిర్వహించుకోగలుగుతుంది. అయితే భారీ వర్షం, తక్కువ దృశ్యమానత ఉన్నప్పుడు డ్రైవర్ హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అటానమస్ మోడ్‌లో ఉన్నప్పుడు కారులో ‘ట్రాంక్విల్ మోడ్‘ ఆన్ అవుతుంది. అప్పుడు లోపల ఉండే సీతాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల కొంత ఎక్కువ స్పేస్ లభిస్తుంది.

కొత్త విజన్ O ఎలక్ట్రిక్ కారులో కొత్తగా లారా అనే వర్చువల్ అసిస్టెంట్ కూడా ఉంది. అంతే కాకుండా ఇందులోని ఏఐ బేస్డ్ డిజిటల్ అసిస్టెంట్ వాహనాల విధులను నిర్వహించడమే కాకుండా.. ఇంటరాక్టివ్‌గా కూడా ఉంటుంది. ఇది రూట్ సూచనల వంటి సమాచారంతో పాటు.. విందులు ప్లాన్ చేసుకోవడం మొదలైనవి రోజువారీ పనులకు సహాయపడుతుంది. విజన్ O మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

స్కోడా విజన్ O అనేది ఒక కాన్సెప్ట్. కాబట్టి కంపెనీ దీనికి సంబంధించిన టెక్నికల్ వివరాలను వెల్లడించలేదు. డిజైన్, ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలతో పాటు ధరలు కూడా భవిష్యత్తులో వెళ్ళడావుతాయి. అయితే దీనిని భారతదేశంలో లాంచ్ చేస్తారా?, లేదా? అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. బహుశా ఈ కారు మార్కెట్లో లాంచ్ కావడానికి మరో పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Latest posts