చిత్ర సీమలో పెద్దగా పరిచయం అవసరం లేని పేర్లలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. దర్శకురాలిగా మొదటి చిత్రం సరస్వతిని తెరకెక్కించింది. ఈ సినిమా శుక్రవారం (మార్చి 6)న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే వరలక్ష్మి తనకు సంబంధించిన చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
అద్దె ఇంట్లో ఉంటున్నాను
సినిమాల్లో నటిస్తూ.. ప్రస్తుతం దర్శకురాలిగా పరిచయం అయినప్పటికీ.. నాకంటూ పెద్దగా ఆస్తులు లేదు. నేను సంపాదించిన డబ్బుతోనే ఒక చిన్న కారు కొనుక్కున్నాను. ప్రస్తుతం నాకు చిన్న ఇల్లు ఉంది. కానీ నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను అని వరలక్ష్మి పేర్కొన్నారు. నాకు ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజం కాదు. నాకు ఎక్కువ ఆస్తులు ఉండి ఉంటే ఇక్కడెందుకు ఉంటాను అని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తా!
నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం. యువత రాజకీయాల్లో ఉండాలని నేను కోరుకుంటాను. భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తాను. అయితే తమిళ రాజకీయాల్లోకి వస్తానా?, తెలుగు రాజకీయాల్లోకి వస్తానా? అనేది తెలియదు. కానీ తప్పకుండా రాజకీయంలో ప్రవేశిస్తానను వరలక్ష్మి వెల్లడించారు.
పెళ్లికి రూ. 800 కోట్లు?
నా పెళ్లికి రూ. 800 కోట్లు ఖర్చు అయినట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. నిజానికి పెళ్లిని నేను అంత ఖర్చుపెట్టలేదు. అంత డబ్బు ఉంటే నేను ఇక్కడెందుకు ఉంటానని వరలక్ష్మి వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు చాలా ఎక్కువైపోయాయి. ఇలాంటి వార్తలు చూసినప్పుడు నవ్వుకుంటానని అన్నారు.
చిత్ర బృందానికి ఒక్కో గోల్డ్ కాయిన్!
సరస్వతి సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో వరలక్ష్మి మాత్రమే కాకుండా, ప్రియమణి, ప్రకాష్ రాజ్, సప్తగిరి మొదలైనవారు నటించారు. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ మంచి స్పందన పొందింది. సినిమా గురించి తెలుసుకోవాలంటే మార్చి 6వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత.. డైరెక్టర్ వరలక్ష్మి యూనిట్ అందరికి ఒక్కో బంగారు నాణెం ఇచ్చినట్లు సమాచారం.
వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి
1985 మార్చి 5న బెంగళూరులో జన్మించిన వరలక్ష్మి శరత్‌కుమార్.. నటుడు శరత్‌కుమార్, ఛాయ దంపతుల కుమార్తె. నటి రాధికా ఈమెకు సవతి తల్లి. వరలక్ష్మి తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు సరస్వతి సినిమాతో దర్శకురాలిగా మారింది.
తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తరువాత రవితేజ క్రాక్ సినిమాలో కనిపించారు. హనుమాన్ సినిమాలో.. కోట బొమ్మాలి పీ.ఎస్ సినిమాల్లో సైతం వరలక్ష్మి కనిపించారు.కాగా ఈమె 2014 లో నికోలాయి సచ్‌దేవ్ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈమె దర్శకత్వంతో తెరపైకి వస్తున్న సరస్వతి సినిమా మంచి సక్సెస్ సాధించాలని ఆశిద్దాం. ఈమె దర్శకత్వంలో మరిన్ని సినిమాలు తెరకెక్కాలని కోరుకుందాం.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.